Latest Updates
-
ఒక్క ముద్దలో లెక్కలేనన్ని ప్రయోజనాలు.. వయసు మళ్లినవారు తప్పనిసరిగా తినాల్సిన హెల్తీ కుర్మా.! -
చర్మ అలెర్జీలకు గుడ్ బై!.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని బెస్ట్ న్యాచురల్ రెమెడీస్ ఇవే! -
పైసా లేదని పెళ్లిళ్లు చేసుకోరు, కానీ పిల్లల్ని కంటారు.. ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా.? -
తమిళుల ఆరోగ్య రహస్యం.. ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే తంజావూర్ అడై.. ఒక్కటి తిన్నా చాలు.! -
లాభ దృష్టి యోగం: సెప్టెంబర్ 15 తర్వాత ఈ నాలుగు రాశుల ఇళ్లలో ధనలక్ష్మి తిష్ట! -
కొవిడ్ ఇచ్చిన కిక్.. డిగ్రీ పట్టా లేదు, వ్యాపారం కాదు.. కానీ 20 ఏళ్లకే నెలకు రూ. లక్షల్లో ఆదాయం.! -
పచ్చిమిర్చి ఊరగాయ ఇలా చేస్తే..ఒక్క ముద్ద తినేవాళ్లు నాలుగు ముద్దలు లాగించేస్తారు! -
కౌమార దశలో బాలికలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏంటో తెలుసా.? -
చికెన్ బిర్యానీ తిన్నా షుగర్, బరువు పెరగకుండా ఉండాలంటే ఇలా చేయండి! -
డా. మంతెన ఆరోగ్య చిట్కాలు.. అన్ని విటమిన్లనూ ఒకే కప్పులో అందించే ప్రకృతి రహస్యం ఇదే.!
మీరు నిద్రపోయే విధానం మీ ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతుంది ?
నిద్రపోయేటప్పుడు రకరకాల వంపులు తిరుగుతూ, మెలికలు తిరుగుతూ పడుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. అలాగే కొంతమంది.. ఎలా పడుకుంటే.. ఉదయం నిద్రలేచే వరకు కదలకుండా.. అదే పొజిషన్ లో నిద్రపోయేవాళ్లూ ఉంటారు. అయితే.. ఇలా నిద్రపోయే భంగిమ వాళ్ల ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
మీరు నిద్రపోయే భంగిమ మీ ప్రవర్తనను డిసైడ్ చేస్తుందా ?
నెక్ పై పడుకోవడం వల్ల.. ఉదయం నిద్రలేచేసరికి.. తలనొప్పి, బ్యాక్ పెయిన్ ఇలాంటి సమస్యలు ఫేస్ చేస్తుంటాం. కానీ.. మీకు తెలుసా ? కొన్ని రకాల నిద్రపోయే భంగిమలు.. ఆరోగ్యంపై దుష్ర్పభావం చూపుతాయి. కొన్ని రకాల వ్యాధుల రిస్క్ ని కొన్ని స్లీపింగ్ పొజిషన్స్ పెంచితే, మరికొన్ని తగ్గిస్తాయి.
మరి మీరు నిద్రపోయే భంగిమ మీ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

పొట్టపై పడుకోవడం
అంటే.. బోర్లా పడుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. ఇలా పడుకోవడం వల్ల.. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కానీ.. ఇలా నిద్రపోవడం వల్ల ఎలాంటి సపోర్ట్ ఉండక బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది.

గురకపోవడానికి
ఒకవేళ మీకు గురక పెట్టే అలవాటు ఉండి, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ లేకపోతే.. పొట్టపై ( బోర్లా ) పడుకోవచ్చు. కానీ పలుచటి దిండు ఉపయోగించడం మంచిది.

గర్భస్థ శిశువు పొజిషన్
ఈ పొజిషన్ లో నిద్రపోవడం వల్ల 60 శాతం మందికి.. మంచే జరుగుతుంది. కానీ అప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ భంగిమ వెన్నెముక, మెడకు మంచిది కాదు. అలాగే శ్వాస సంబంధ సమస్యలు కూడా ఎదుర్కొంటారు.

గర్భిణీలకు
అయితే.. గర్భస్థ శిశువు పొజిషన్ లో పడుకునే విధానం.. గురకపెట్టేవాళ్లకు, గర్భిణీ స్త్రీలకు చాలామంచిది.

స్ట్రెయిట్ గా పడుకోవడం
స్ట్రెయిట్ గా పడుకుని, చేతులను స్ట్రెయిట్ గా పెట్టుకుని పడుకుంటే.. వెన్నెముకకు చాలా మంచిది. ఈ సమయంలో వెన్నెముక న్యాచురల్ పొజిషన్ లో ఉంటుంది. ఇలా పడుకోవడం వల్ల బ్యాక్ పెయిన్ తగ్గుతుంది.

చర్మంపై దుష్ర్పభావం
ఇలా స్ట్రెయిట్ గా పడుకోవడం వల్ల.. చర్మంలో త్వరగా వయసు ఛాయలు కనిపిస్తాయి. చెస్ట్ పై ముడతలు త్వరగా కనిపిస్తాయి.

ఒకవైపు తిరిగి పడుకోవడం
ఒకవైపు తిరిగి పడుకుని, చేతులను అలాగే సైడ్ కి పెట్టుకుని పడుకోవడం వల్ల వెన్నెముకకు మంచిదే. కానీ.. భుజాలు, చేతుల నొప్పికి కారణమవుతాయి.

ఎడమ వైపు లేదా కుడి వైపు
ఇలా ఎడమ లేదా కుడివైపు తిరిగి పడుకోవడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. కుడివైపు తిరిగి పడుకునే అలవాటు ఉంటే.. హార్ట్ బర్న్ సమస్యతో పోరాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఎడమవైపు
ఎడమ వైపు తిరిగి నిద్రపోవడం వల్ల.. కాలేయంపై ప్రెజర్ పెరుగుతుంది. అలాగే ఊపిరితిత్తులు, పొట్టపై కూడా ఒత్తిడి పెరుగుతుంది.

గర్భిణీలు
గర్భిణీలు ఎడమవైపు తిరిగి పడుకోవాలని డాక్టర్లు సూచిస్తారు. ఎందుకంటే.. ఎడమవైపు పడుకోవడం వల్ల.. కడుపులోని బిడ్డకు బ్లడ్ సర్క్యులేషన్ సజావుగా అందుతుంది.

భుజాలపై ఎక్కువ ఒత్తిడి పెంచి పడుకోవడం
భుజాల సపోర్ట్ తో ఎక్కువ ఒత్తిడి పెంచి పడుకోవడం వల్ల.. వెన్నెముక, మెడ ఆరోగ్యానికి మంచిది. కానీ.. ఈ పొజిషన్ వల్ల.. గురక సమస్య వచ్చే అవకాశం ఉంది.

దిండును పట్టుకుని పడుకోవడం
ఎలాంటి పొజిషన్ లో అయినా.. దిండుని పట్టుకుని పడుకున్నారంటే.. తక్కువ నొప్పితో ఉదయం నిద్రలేస్తారు.
చూశారుగా.. మీరు నిద్రపోయే భంగిమ మీ ఆరోగ్యాన్ని ఎలా చెబుతోందో. కాబట్టి మీ ఆరోగ్యాన్ని బట్టి.. వీటిలో మీరు ఒక స్లీపింగ్ పొజిషన్ ని ఎంచుకుని హ్యాపీగా నిద్రపోండి..



Click it and Unblock the Notifications
