Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చలికాలంలో వెచ్చగా.. రుచిగా అనిపించే స్పైసీ ఫుడ్ హెల్తీయేనా ?
చలికాలంలో.. వెచ్చగా ఉండటానికి పెద్ద దుప్పట్లు, స్వెట్టర్లు ఉపయోగిస్తాం. అలాగే తీసుకునే ఆహారంలో కూడా కాస్త ఘాటుగా ఉండాలని కోరుకుంటాం. ఏదైనా స్పైసీగా తినడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. రుచిగా, ఘాటుగా ఉండే ఫుడ్ తీసుకోవాలని మసాలాలు ఎక్కువగా చేర్చుకోవడం లేదా.. బయట స్పైసీ ఫుడ్ తినడం చేస్తుంటారు.
READ MORE: మిగిలిపోయిన ఆహారాలను వేడిచేస్తున్నారా ? ఐతే జాగ్రత్త
చలికాలంలో స్పైసీ ఫుడ్ తినడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాం. అయితే స్పైసీ ఫుడ్ లో వాడే మసాలాలు కొన్ని మేలు చేస్తాయి. మరికొన్ని అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి. కానీ స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల నర్వ్స్ పనితీరు సక్రమంగా ఉంటుంది. అలాగే ఆకలి కూడా తగ్గుతుంది.

అంతేకాదు స్పైసీ ఫుడ్ వల్ల బరువు కూడా తగ్గుతారని మీకు తెలుసా ? ఎందుకంటే.. ఘాటుగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల అవి శరీరంలో కొలెస్ర్టాల్ కరిగిస్తాయి. శరీరంలో వేడిగా.. వెచ్చగా అనిపిస్తుంది. దీనివల్ల శరీరంలో పేరుకున్న కొవ్వు తగ్గి.. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
READ MORE: గర్భాధారణ సమయంలో తినకూడని.. తినవల్సిన ఆహారాలు...!
చలికాలంలో ఎక్కువగా ఇబ్బందిపెట్టే తలనొప్పి, జలువు, తుమ్ములు, దగ్గు వంటి సమస్యలకు కూడా స్పైసీ ఫుడ్ చెక్ పెడుతుంది. కొన్ని రకాల దినుసులైన మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి ఎక్కువగా వంటకాల్లో ఉపయోగిస్తే.. వాటి ఘాటు ద్వారా జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు.

కొంతమందికి స్పైసీ ఫుడ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మరీ ఎక్కువ మోతాదులో ఘాటు పదార్థాలు తీసుకోవడం వల్ల దుర్వాసన, చెమట వేధిస్తాయి. కాబట్టి రోజులో ఏదో ఒకసారి.. అలవాటు లేనివాళ్లైతే.. అప్పుడప్పుడు తీసుకోవడం మంచిది. మోతాదుకు మించి తీసుకోకూడదు. అలాగే.. బయట దొరికే స్పైసీ ఫుడ్ కి దూరంగా ఉండటమే మంచిది.
అయితే స్పైసీ ఫుడ్ చలికాలంలో మంచిది కదా అని.. పలుమార్లు దానినే ఎంచుకుంటే ప్రమాదం. అది కూడా ఇంట్లో తయారు చేసుకున్నవైతే ఎలాంటి సమస్యా ఉండదు. కానీ.. స్పైసీ ఫుడ్ తినాలనిపించినప్పుడల్లా.. బయట దొరికే ఫుడ్స్ తింటే.. అల్సర్ వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి ఎక్కువ స్పైసీ తినే అలవాటు లేకపోతే.. నోటిపూత కూడా ఇబ్బందిపెట్టవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications