For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్ట్రోక్, హార్ట్ అటాక్ రిస్క్ నుండి కాపాడే అద్భుత ఆహారాలు..!

|

అన్ని అవయవాలూ బాగా ఉండి కూడా అకస్మాత్తుగా వైకల్యాన్ని తెచ్చిపెట్టే సమస్య స్ట్రోక్(పక్షవాతం). ఇంగ్లిష్‌లో బ్రెయిన్‌ స్ట్రోక్‌గా చెప్పే ఆ వ్యాధిని రాకముందూ, వచ్చాక కూడా నివారించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురైన 20 శాతం మందిలో కాలూచేయిని ఆడకుండా చేసి మరొకరిపై ఆధారపడేలా చేస్తుందది. ప్రపంచవ్యాప్తంగా ఏటా రెండు కోట్ల మంది పక్షవాతానికి గురవుతున్నారు. అందులో 50 లక్షల మంది మృత్యువు బారిన పడుతున్నారు. దాని గురించి తెలుసుకుంటే నివారణ ఒకింత సులువవుతుంది.

పక్షవాతం పేరు వింటేనే వెన్నులో చలి మొదలవుతుంది చాలా మందికి. తలచుకోవడానికే భయపడే ఈ సమస్య మెదడుకు రక్త సరఫరా తగ్గడం వల్ల కానీ, రక్తనాళం చిట్లడం వల్ల కానీ వచ్చే అవకాశం ఉంటుంది. స్మోకింగ్, ఎక్కువగా డ్రింక్ చేయడం, వ్యాయామలోపం మరియు సరిగా ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ తినకుండా పోవడం వల్ల అనారోగ్యానకి గురిచేస్తుంది. అనారోగ్యానికి మాత్రమే కాదు, క్రమంగా స్ట్రోక్ కు కారణమవుతుంది. స్ట్రోక్ రాకుండా నివారించుకోవడానికి కొన్ని సింపుల్ ఎఫెక్టివ్ టిప్స్ ఉన్నాయి.

ఆహారంలో ఉప్పు పూర్తిగా తగ్గించడం. అన్ని పోషకాలు సమపాళ్లలో ఉండే సమతుల ఆహారం. కొవ్వు తక్కువగా ఉండే ఆహారం. ఆహార వ్యవహారాల్లో మార్పులు, వ్యాయామం, బరువు నియంత్రణ, పొగతాగడం మానివేయడం, ఆల్కహాల్ తీసుకునేవారైతే పరిమితంగా తీసుకోవడం వంటి మార్పులను చేసుకోవాలి. జీవనశైలిలో మార్పులు అంటే... (లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్)గా డాక్టర్లు చెబుతుంటారు. స్ట్రోక్ నివారణకు ఇవి ముఖ్యం. మరి ముఖ్యంగా పక్షవాతం రాకుండా కాపాడే కొన్ని అద్భుతమై ఆహారాలు ఈ క్రింది విధంగా:

కాఫీ, గ్రీన్ టీ:

కాఫీ, గ్రీన్ టీ:

రీసెంట్ గా జరిపిన పరిశోధనల్లో కాఫీ మరియు గ్రీన్ టీ తాగేవారిలో స్ట్రోక్ రిస్క్ చాలా వరకూ తగ్గుతుందని కనుగొన్నారు. రోజుకు కనీసం ఒక కప్పు కాఫీ తాగడం వల్ల 20శాతం తగ్గినట్లు, రోజుకు మూడు కప్పులు గ్రీన్ టీ తాగే వారిలో 14శాతం స్ట్రోక్ రిస్క్ తగ్గినట్లు కనుగొన్నారు.

స్మోకింగ్ పూర్తిగా నిలిపివేయాలి:

స్మోకింగ్ పూర్తిగా నిలిపివేయాలి:

ప్రతి పది మందిలో ముగ్గరు స్ట్రోక్ కరాణంగానే మరణిస్తున్నారు. కాబట్టి, స్మోకింగ్ పూర్తిగా నిలిపివేయడం వల్ల స్ట్రోక్ రిస్క్ నుండి బయటపడబచ్చు. అలాగే ఆల్కహాల్ (వైన్ )పరిమితంగా తీసుకోవడం మంచిది.

పెయిన్ కిల్లర్స్ తో జాగ్రత్త:

పెయిన్ కిల్లర్స్ తో జాగ్రత్త:

డిక్లోఫినాక్ నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్, అంటే ఐబ్రూఫిన్ వంటిది. ఇవి 40శాతం హార్ట్ అటాక్ మరియు స్ట్రోక్ కు కారణమవుతాయని రీసెంట్ గా జరిపిన పరిశోధనలల్లో వెల్లడి చేశాయి . సర్జరీ తర్వాత ఆర్థెరెరిటిక్ పెయిన్ తగ్గించుకోవడానికి వీటిని డాక్టర్లు సూచిస్తుంటారు .

మెడీటేషన్ :

మెడీటేషన్ :

గ్రీస్, స్పెయిన్ మరియు ఇటలీ వంటి ప్రదేశంలో హార్ట్ సమస్యలు మరియు స్ట్రోక్ వల్ల ఎక్కువ ప్రజలు మరణిస్తున్నట్లు చెబుతుంటారు. రెగ్యులర్ డైట్ లో ఎక్స్ ట్రా వర్జీన్ ఆలివ్ ఆయిల్ ను లేదా నట్స్ ను రెగ్యులర్ గా చేర్చుకోవడం వల్ల దాదాపు 30శాతం స్ట్రోక్ రిస్క్ తగ్గించుకోవచ్చని పరిశోధనల ద్వారా వెల్లడి చేస్తున్నారు. రోజుకు 5లేదా 6 పండ్లు మరియు వెజిటేబుల్స్ తినే వారిలో చాలా వరకూ ఈ ప్రమాధం తగ్గుతుందని సూచిస్తున్నారు.

నడక :

నడక :

ప్రతి రోజూ కనీ 30 నిముషాలు నడవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ప్రతి రోజూ వాక్ చేయడం వల్ల హార్ట్ అటాక్ లేదా స్ట్రోక్ వంటి సమస్యలను నివారించుకోవచ్చు.

ఫిజ్జీడ్రింక్స్ :

ఫిజ్జీడ్రింక్స్ :

కొన్ని కార్బోనేటెడ్ డ్రింక్స్ రెగ్యులర్ గా తాగడం వల్ల హార్ట్ మరియు స్ట్రోక్ రిస్క్ ఉంటుంది రీసెంట్ గా జరిపిన పరిశోధనల్లో వెల్లడైనది. రెగ్యులర్ గా షుగర్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్స్ ఏర్పడే అవకాశాలున్నాయి . కాబట్టి, వీటకి ఖచ్చితంగా దూరంగా ఉండాలి.

ప్రతి సాండ్విచ్ లో టమోటోలు జోడించాలి:

ప్రతి సాండ్విచ్ లో టమోటోలు జోడించాలి:

టమోటోల్లో ఉండే లైకోపిన్, కెరోటినాయిడ్స్ స్ట్రోక్ రిస్క్ ను తగ్గిస్తుంది. టమోటోల్లోని అత్యధిక లైకోపిన్ లెవల్స్ 55శాతం వరకూ స్ట్రోక్ ను తగ్గిస్తాయి.

బాగా నిద్రపోవాలి:

బాగా నిద్రపోవాలి:

రెగ్యులర్ గా సరైన నిద్రను పొందడం వల్ల ఎలాంటి సమస్యలుండవు. ముఖ్యంగా, ప్రతి రోజూ 7నుండి 8 గంటలు నిద్రపోయే వారికి స్ట్రోక్ మరియు హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

ఒక శాతం పాలు:

ఒక శాతం పాలు:

లోఫ్యాట్ మిల్క్, పెరుగు మరియు చీజ్ వంటివి తీసుకోవడం వల్ల స్ట్రోక్ ను నివారిస్తుందని, రీసెంట్ గా జరిపిన పరిశోధనల్లో వెల్లడి చేశారు . లోఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల లోఫాట్ మరియు ఫ్యాట్ ఫ్రీ డైరీ ఫుడ్స్ లో అధిక శాతంలో పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం అధికంగా కలిగి బ్లెడ్ ప్రెజర్ ను తగ్గిస్తాయి. దాంతో పక్షవాతం రాకుండా కాపాడుకోవచ్చు.

బ్లడ్ ప్రెజర్ వెల్స్ కంట్రోల్లో ఉంచుకోవాలి:

బ్లడ్ ప్రెజర్ వెల్స్ కంట్రోల్లో ఉంచుకోవాలి:

బీపీ సాధారణంగా 140 /80 కంటే తక్కువగా ఉండాలి. అయితే షుగర్‌తో పాటు మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవారు బీపీని 130 / 80 లోపే ఉండేలా చూసుకోవాలి. అందుకే బీపీ ఉన్నవారు తరచూ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. లేని వాళ్లు కూడా రెండేళ్లకోసారి బీపీ చెక్ చేయించుకోవాలి. అయితే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే మాత్రం మరింత తరచూ బీపీ చెక్ చేయిస్తూ ఉండాలి.

బీన్స్ మరియు ఫోలేట్ ఉన్న ఇతర ఆహారాలు:

బీన్స్ మరియు ఫోలేట్ ఉన్న ఇతర ఆహారాలు:

బీన్స్ గుండె ఆరోగ్యానికి మాత్రమే కాదు మెదడుకు రక్షణ కల్పిస్తుంది. ఎందుకంటే బీన్స్ లో బి విటమిన్ ఫోలెట్(ఎ.కె.ఎ ఫోలిక్ యాసిడ్). అధికంగా కలిగి ఉండటం చేత.

ఓట్స -బాదాం-సోయా:

ఓట్స -బాదాం-సోయా:

సోయా మిల్క్, సోయాబీన్స్ సలాడ్స్, సూప్స్ లో ఉపయోగించి తీసుకొన్నట్లైతే అతితక్కువ కొలెస్ట్రాల్ ను కలిగి ఉంటుంది. ఈ మూడు ఆహార పదార్థాలు లోశాచురేటెడ్ కొలెస్ట్రాల్ ను కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. దాంతో పక్షవాతం దరిచేరదు.

యాంటీఆక్సిడెంట్స్:

యాంటీఆక్సిడెంట్స్:

పండ్లు, గ్రీన్ వెజిటేబుల్స్ ను అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ స్ట్రోక్ కు వ్యతిరేకంగా పనిచేస్తాయి. అంతే కాదు ధమనులలో రక్తం గడ్డకట్టకుండా సాఫీగా రక్త ప్రసరణ జరగడానికి బాగా ఉపయోగపడుతాయి.

పొటాషియం అధికంగా ఉన్న ఆహారాలు:

పొటాషియం అధికంగా ఉన్న ఆహారాలు:

మీ తీసుకొనే డైయట్ ఫుడ్ లో తప్పని సరిగా అరటిపండు ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఇందులో పొటాషియం అధిక శాతంలో ఉండి అత్యధికంగా శరీరానికి కావలసినన్ని మినిరల్స్ ను అంధిస్తుంది. ఇది స్ట్రోక్ రాకుండా అడ్డుకుంటుంది.

బార్లీ -కార్నమీల్:

బార్లీ -కార్నమీల్:

పొటాషియం ఎలా స్ట్రోక్ (పక్షవాతాని)రాకుండా కాపాడుతుందో. అలాగే మెగ్నీషియం అధికంగా ఉన్న ఫుడ్ ను తీసుకోవడం వల్ల కూడా 30శాతం పక్షవాతం రాకుండా కాపాడుతుంది.

సాల్మన్:

సాల్మన్:

గుండె ఆరోగ్యానికి సాల్మన్ మరియు ఇతర ఫ్యాటీ ఫిష్ లు ఎలా ఉపయోగకరమో... అదేవిధంగా పక్షవాతం బారీన పడకుండా ఉండాలంటే కూడా సాల్మన్ ఫిష్ లేదా ఇతర ఫ్యాటీ ఫిష్ లను డైయట్ చేర్చుకోవడం మంచిది. సాల్మన్ మరయు తున, మెకెరేలా వంటి ఫిష్ లో ఉన్న ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. శరీరంలో ఎటువంటి స్ట్రోక్ సోకకుండా కాపాడుతుంది.

English summary

Reduce your stroke risk: Eat tomatoes, drink coffee and 16 other tips

A massive study of thousands of women, called the Nurses Health Study, showed that eating the typical Western-style diet increased stroke risk by 58 percent, whereas consuming more whole grains, fruits, vegetables, and fish — the same foods that guard against so many other diseases — lowered that risk by 30 per cent. Here's where to start.
Story first published: Thursday, July 21, 2016, 16:07 [IST]
Desktop Bottom Promotion