Latest Updates
-
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా.. ఈ వడను తిన్నారంటే మినప గారెలను మరిచిపోతారు.! -
బుధాదిత్య యోగం.. ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం ఇంటి ముంగిటే.! -
గంటల తరబడి ఫ్రిజ్‌లో పెట్టాల్సిన పనిలేదు.. అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టంట్ ఫిష్ ఫ్రై.! -
రెస్టారెంట్ స్టైల్ తవా చికెన్..వేళ్లు నాకుతూ తినడం గ్యారెంటీ..ఈజీగా చేసుకోండిలా.. -
35 ఏళ్లకే కోరికలు తగ్గిపోయాయా.. దాంపత్య సుఖం కోసం తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన టిప్స్.! -
తెలంగాణలో వైభవోపేతంగా ఆషాఢ బోనాలు.. రంగంలో భవిష్యవాణి చెప్పిన సంగతులివే.! -
హస్తసాముద్రికం: మీ చేతిలో ఈ రేఖ ఉంటే కోటీశ్వరులు అవ్వడం పక్కా! -
రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ మసాలా దోశ ఇంట్లోనే.. ఈ రెండు సీక్రెట్స్ తెలిస్తే చాలు! -
కొందరు అందంగా లేకపోయినా ఎందుకు అందరినీ ఆకర్షిస్తారో తెలుసా.? -
మందు తాగేటప్పుడు స్టఫ్ గా ఏది తినడం ఆరోగ్యానికి మంచిదో తెలుసా?
తరచూ తలనొప్పితో బాధపడుతున్నారా... ఐతే ఈ ఫుడ్స్ వద్దే వద్దు...
ప్రస్తుత రోజుల్లో తలనొప్పి ప్రతి ఒక్కరికీ చాలా సాధారణ సమస్యగా మారిపోయింది. మనందరం ఏదో ఒక సందర్భంలో తలనొప్పికి గురైఉంటాము. ఈ తలనొప్పికి వివిధ రకాల కారణాలుండవచ్చు. వాటిలో ఆహారం కూడా ఒకటి ఎందుకు కాకూడదు . ఇది వినడానికి అసాధారణంగా అనిపించవచ్చు. కానీ ఇది వాస్తవం.
కెఫిన్ త్రాగడం వల్ల క్రమంగా తొలనొప్పికి దారిస్తుంది. అదే విధంగా, కెఫిన్ తీసుకొనే మోతాదును బట్టి, ఒక్కొక్కరిలో ఒకవిధంగా ఉంటుంది . వివిధ రకాల ఆహారాలు ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా పనిచేసి తలనొప్పికి దారి తీస్తుంది. తలనొప్పి వచ్చే విధానం కూడా వ్యక్తికి మరో వ్యక్తికి డిఫరెంట్ గా ఉండవచ్చు.
డైటరీ ఫ్యాక్ట్స్ ఒక్కొక్కరిలో ఒక్కోవిధంగా పనిచేస్తుంది. ఉపవాసం, డీహైడ్రేషన్ మరియు భోజనాలు స్కిప్ చేయడం....ఇలాంటివెన్నో తలనొప్పికి ఇండైరెక్ట్ గా కారణం అవుతున్నాయి . అందువల్ల మీరు తీసుకొనే ఆహారాల మీద ఓ కన్నేసి ఉండటం, తలనొప్పికి ఎలాంటి ఆహారాలు కారణం అవుతున్నాయో గుర్తించడం మంచిది.
కొంత మంది కెఫిన్ కి చాలా సెన్సిటివ్ గా ఉంటారు. మరికొందరు చాక్లెట్స్ కు మరియు ఐక్రీమ్ లకు సెన్సిటివ్ గా ఉంటారు. వీటితో పాటు మరికొన్ని సెన్సిటివ్ ఫుడ్స్ ను...అందులోనూ తలనొప్పికి గురిచేసే ఆహారాలను ఈ క్రింది లిస్ట్ లో అందిస్తున్నాము. ఇది వరికే మీరు తలనొప్పితో బాధపడుతున్నట్లైతే...లేదా రెగ్యులర్ గా తలనొప్పి వస్తున్నా ఈ క్రింది లిస్ట్ లో ఆహారాలకు దూరంగా ఉండటం వల్ల రెగ్యులర్ గా బాధించే తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు...

ప్రొసెస్డ్ మీట్:
కొన్ని రకాల ప్రిజర్వేటివ్స్ ను హాట్ డాగ్స్ మరియు బేకాన్ లో ఉపయోగించే నైట్రేట్ మరియు నైట్రైట్స్ తలనొప్పికి కారణం అవుతాయని కొన్ని పరిశోధనల ద్వారా నిర్ధారించడం జరిగింది. కాబట్టి, ఈ అనారోగ్యకరమైన ప్రొసెస్డ్ ఫుడ్స్ ను తినకుండా నివారించడం వల్ల తలనొప్పిని తగ్గించుకోవచ్చు.

చిల్లీపెప్పర్:
చిల్లీపెప్పర్లో క్యాప్ససిన్ అనే ఎంజైమ్ ఉండటం వల్ల, మైగ్రేన్ హెడ్ ఏక్ కు కారణం అవుతుందని కొన్ని పరిశోధనల ద్వారా కనుగొనడం జరిగింది. ఈ అన్ హెల్తీ ప్రొసెస్డ్ ఫుడ్స్ కు దూరంగా ఉండటం వల్ల మైగ్రేన్ తలనొప్పికి దూరంగా ఉండవచ్చు.

సిట్రస్ ఫ్రూట్స్:
సిట్రస్ ఫ్రూట్స్ మరియు కివి టైరమిన్ మరియు హిస్టమిన్ అనే కాంబినేషన్ కెమికల్స్ ఉండటం వల్ల ఇది తలనొప్పి రావాడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు.

కాఫీ:
కాఫీ మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది మరియు అలసటను తగ్గిస్తుంది. అదే విధంగా కాఫీకి అలవాటు పడితే కెఫిన్ బాడీలో నిల్వచేరడం వల్ల నిద్రలేమికి గురి చేస్తుంది మరియు తలనొప్పికి కారణం అవుతుంది. కాబట్టి కాఫీకి దూరంగా ఉండటం మంచిది.

ఐస్ క్రీమ్స్ :
ఐస్ క్రీమ్స్ అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టం. కానీ కొంతమందికి ఐస్ క్రీమ్స్ అలర్జీకి గురిచేస్తాయి . అంతే కాదు తలనొప్పికి దారితీస్తాయి . ఐస్ క్రీమ్ వంటి కోల్డ్ ఫుడ్స్ తలనొప్పికి దారితీస్తాయి . తరచూ ఐస్ క్రీమ్స్ తినే వారు తలనొప్పికి గురి అవుతారని కొన్ని పరిశోధనల ద్వారా వెల్లడైనది.

ఆల్కహాల్:
మీరు ఇదివరికే మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్నట్లైతే, మీరు ఎలాంటి ఆల్కహాల్ కైనా దూరంగా ఉండాల్సిందే . రెడ్ వైన్ లో ఆల్కహాల్ ఉండటం వల్ల ఇది మైగ్రేన్ తలనొప్పికి దారితీస్తుంది. మెదడుకు రక్తప్రసరణను పెంచుతుంది మరియు డీహైడ్రేషన్ కు గురిచేస్తుంది.

స్పైసీ ఫుడ్స్:
స్పైసీ ఫుడ్స్ తినడం వల్ల, అందులో ఉండే మసాలాలు, క్యాప్సిసిన్ వల్ల సడెన్ గా తలనొప్పికి గురిచేస్తుంది.



Click it and Unblock the Notifications