Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే! -
కెమికల్స్ ఉన్న కూరగాయలను ఎలా గుర్తించాలి? -
నేడు వ్యతీపాత యోగం: ఈ తప్పులు చేస్తే భారీ నష్టాలు తప్పవు.. జాగ్రత్త! -
లలితా సహస్రనామం స్త్రీలు ఎందుకు ఈ పారాయణం చేయాలి? శుక్రవారం మహత్యం -
చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం: ఈ రాశుల వారికి క్రమశిక్షణతో పాటు అదృష్టం, సంపద రెట్టింపు! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 21 నుండి 27 జూన్ 2026 వరకు -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. భారీ లాభాలు! - ఆదివారం, 21 జూన్ 2026 -
ఫాదర్స్ డే స్పెషల్.. నాన్న కోసం లక్నో నవాబీ స్టైల్ కిమామి సేమియా'.. ఈ రుచి అస్సలు మర్చిపోరు! -
Chanakya niti: స్త్రీకి ఈ 4 గుణాలు ఉంటే ఇల్లు స్వర్గమే!
దంపతుల్లో ఇన్ యాక్టివ్ సెక్స్ లైఫ్ వల్ల కొన్ని సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ..!!
జంటల వివాహ జీవితంలో కామేచ్ఛ తగ్గిందంటే ఎన్నో సమస్యలు వచ్చిపడతాయి. నాలో కామేచ్ఛ తగ్గిపోయింది డార్లింగ్...అంటూ తన పార్టనర్ కు ఎవరూ చెప్పుకోలేరు. అది వారి అహాన్ని దెబ్బతీస్తుంది. కాని కోరిక తగ్గిపోవటం అనే సమస్యలు తీవ్ర శారీరక, మానసిక సమస్యలు తెచ్చిపెడుతుంది.
అంగస్తంభన సమస్య కావచ్చు లేదా హార్మోన్ల ప్రభావం కావచ్చు కొంతమందిలో కామ వాంఛలు తగ్గిపోతాయి. అందుకుగాను వారు ఎంతో ఖరీదైన మందుల వాడకం, మానసిక వైద్యం వంటివి చేయిస్తూ వుంటారు. తమ లైంగిక జీవితం మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తారు.
ప్రస్తుత రోజుల్లో చాలా మంది లైంగిక సమస్యలతో బాధపడుతున్నారని పరిశోధనల ద్వారా వెల్లడైనది. పని ఒత్తిడి మనసు ఎక్కడా కాసేపు నిలకడగా ఉండనీయడంలేదు. ప్రతిక్షణం ఉద్యోగ వ్యాపారాల ధ్యాసే. వేగవంతమైన జీవితం, కలుషిత వాతావరణం, సమయపాలనా లేని ఆహారం. వీటి వల్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ కరువై ఇతర అనారోగ్య సమస్యలతోపాటు 'లైంగికపరమైన' సమస్యలను ఎదుర్కొంటున్నారు.
దాంపత్య జీవితంలో సెక్స్ లైఫ్ అత్యంత ముఖ్యమైనది. ఇద్దరి మద్య సంబంధం మరింత స్ట్రాంగ్ గా ఉండాలంటే, సెక్స్ లైఫ్ గ్రేట్ గా సహాయపడుతుంది. సెక్స్ లైఫ్ యాక్టివ్ గా ఉండటం వల్ల కేవలం ఇద్దరి వ్యక్తుల మద్య సంబంధం మాత్రమే కాదు, ఆరోగ్య బలపడుతుంది. అనేక ప్రయోజనాలు పొందుతారు.
దాంపత్య జీవితంలో రెగ్యులర్ సెక్స్ లైఫ్ వల్ల అనేక ఆరోగ్య సమస్యలను నివారించుకోవచ్చు. అంతే కాదు జీవితంలో బాధలను దూరం చేసుకోవచ్చు. అయితే కొంత మంది సెక్స్ లైఫ్ కు దూరంగా ఉండటం వల్ల జీవితంలో సంతోషంతో పాటు, ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు. దాంపత్య జీవితంలో సెక్స్ లైఫ్ కొరవడం వల్ల శరీరంలో చురుకుదనం ఉండదు, సంతోషంగా ఫీలవ్వరు. శరీరంలో ఆర్గాన్స్ చురుకుగా పనిచేయవు. వీటితో పాటు ఇతర సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి.
ఇన్ యాక్టివ్ సెక్స్ లైఫ్ వల్ల దంపతులు ఎదుర్కొనే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఈ క్రింది విధంగా..

సైడ్ ఎఫెక్ట్స్ #1 :
దాంపత్య జీవితంలో శ్రుంగారం అనేది కార్డియో వ్యాస్కులర్(గుండుకు సంబంధించిన) ఆరోగ్యానికి వ్యాయామం వంటిది. దంపతులో రతిలో పాల్గొనడం వల్ల శరీరంలో అదనపు క్యాలరీలు కరిగుతాయి. దాంతో శరీరంలో హెల్తీగా మారుతుంది. రెగ్యులర్ గా సెక్స్ లో పాల్గొనకపోవడం లేదా ఇన్ యాక్టివ్ సెక్స్ లైఫ్ వల్ల హార్ట్ కు సంబంధించిన సమస్యలు పెరగవచ్చు.

సైడ్ ఎఫెక్ట్స్ #2 :
నిత్య జీవితంలో యాక్టివ్ సెక్స్ లైఫ్ వల్ల మరింత యాక్టివ్ గా పనిచేస్తారు. కెరీర్ పరంగా హ్యాపి లైఫ్ ను ఎంజాయ్ చేస్తారు. దంపతుల్లో రొమాన్స్ లేకపోతే, రిలేషన్ షిప్ పాడవ్వడమే కాదు, శరీరంలో ఉత్సాహం కూడా కోల్పోతారు.

సైడ్ ఎఫెక్ట్స్ # 3 :
ఇన్ యాక్టివ్ సెక్స్ లైఫ్ వల్ల ఇన్ సెక్యురిటీగా ఫీలవుతారు. కొంత మందిలో నమ్మకాన్ని కోల్పోతుంటారు. ఒకరి మీద ఒకరికి అనుమానాలు పెరుగుతాయి. ఎదుటి వ్యక్తిలోని శక్తిసామర్థ్యాలను అంచనా వేస్తారు, క్వాలిటీ, క్యారెక్టర్ , ఇలా ప్రతి ఒక్కటీ భూతద్దంలో చూడటం ప్రారంభిస్తారు .

సైడ్ ఎఫెక్ట్స్ # 4 :
దాంపత్య జీవితంలో ఇన్ యాక్టివ్ సెక్స్ లైఫ్ వల్ల అసౌకర్యంగా భావిస్తారు. ఎప్పుడూ చిరాకుగా, ఇద్దరి మద్య ఫైటింగ్స్ జరుగుతుంటాయి. పనిలో ఏకాగ్రత కోల్పోతారు. రోజంతా స్ట్రెస్ గా ఫీలవుతారు.

సైడ్ ఎఫెక్ట్స్ # 5:
దాంపత్య జీవితంలో ఇన్ యాక్టివ్ సెక్స్ లైఫ్ వల్ల నిద్రలేమి సమస్యలు మరియు రెస్ట్ లెస్ నెస్ గా ఫీలవుతారు. దాంతో రోజంతా నిరుత్సాహంగా కనబడుతుంటారు.

సైడ్ ఎఫెక్ట్స్ # 6:
దంపతుల్లో శ్రుంగార జీవితం యాక్టివ్ గా ఉన్నప్పుడు, శరీరంలో ఎండోర్ఫిన్స్ అనే హ్యాపి హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. ఇవి మూడ్ ను మెరుగుపరుస్తాయి . కాబట్టి, సెక్స్ ఇష్టపడని వారు, సెక్స్ పట్ల నిర్లక్ష్యం చూపే వారు డిప్రెషన్ కు చేరుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి . వారు ఒంటరిగా జీవించడం వల్ల మనస్సులో అనవసర ఆలోచనలో గందరగోళం వల్ల డిప్రెషన్ కు కారణమవుతుంది.

సైడ్ ఎఫెక్ట్స్ # 7 :
రెగ్యలర్ లైఫ్ లో పార్ట్నర్స్ ఇద్దరి మద్య ఆ సుఖం లేనప్పుడు, ఇద్దరి మద్య వ్యతిరేకతలు పెరుగుతాయి. ఇష్టం లేకుండా కాంప్రమైజ్ అయ్ జీవించాల్సి ఉంటుంది. రోజూ సెక్స్ లో పాల్గొనడం వల్ల శరీరంలో ఆక్సిటోసిన్ శ్రవిస్తుంది. ఇవి భావోద్వేగాలను తగ్గిస్తుంది.



Click it and Unblock the Notifications