Latest Updates
-
అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే.. -
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.!
ఎసిడిటీ, పొట్టసమస్యలు నివారించే పవర్ ఫుల్ హోంమేడ్ డ్రింక్..!
జీర్ణసమస్యలు ప్రస్తుతం చాలా కామన్ గా వినిపిస్తోంది. చిన్న వయసు వాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు ఆహారం జీర్ణమవడం లేదని, పొట్టలో సమస్యలు ఏర్పడుతున్నాయని చెబుతుంటారు. బ్లోటింగ్, ఇన్ డైజెషన్, ఎసిడిటీ, హార్ట్ బర్న్, జీర్ణ సమస్యలు శరీరానికి చాలా ఇబ్బందికి గురిచేస్తాయి.
ఆహారపు అలవాట్లు, అన్ బ్యాలెన్స్డ్ డైట్ జీర్ణసంబంధ సమస్యలకు కారణమవుతాయి. కొన్ని సందర్భాల్లో జీర్ణసమస్యలు పెద్ద అనారోగ్యంగా మారుతుంది. చాలావరకు డైజెషన్ ప్రాబ్లమ్స్ చెడు అలవాట్ల వల్ల వస్తాయి. అలాంటి సమస్యతో బాధపడేవాళ్లు పవర్ ఫుల్ హోంమేడ్ డ్రింక్ ఎసిడిటీ, పొట్టసమస్యల నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా.. జీర్ణ సమస్యలు ఎదురవకుండా నివారిస్తుంది.

హెల్తీ, హ్యాపీ టమ్మీ పొందడానికి ఒకే ఒక్క డ్రింక్ చాలు. పొట్ట సమస్యలు ఎదురయినప్పుడు ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల శరీరానికి హాని కలిగిస్తుంది. కాబట్టి కేవలం 4 పదార్థాలు అది కూడా ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతో.. హోంమేడ్ డ్రింక్ తయారు చేసుకుని తీసుకుంటే.. ఇన్ డైజెషన్ నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు.
తాజా అల్లం, నీళ్లు, నిమ్మరసం, తేనెలతో ఈ డ్రింక్ తయారు చేసుకోవచ్చు. అల్లం సరైన జీర్ణక్రియకు సహాయపడుతుంది. అల్లంలోని గుణాలు జీర్ణవ్యవస్థకు ఉపశమనం కలిగిస్తాయి. తేనె, నిమ్మరసంలో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి.

కావాల్సిన పదార్థాలు
3 నుంచి 4 అల్లం ముక్కలు
1 కప్పు వేడి నీళ్లు
2 టీ స్పూన్ల నిమ్మరసం
2 నుంచి 3 టీ స్పూన్ల తేనె
తయారు చేసే విధానం
మరుగుతున్న నీటిలో అల్లం వేయాలి. 7 నిమిషాలు మరిగిన తర్వాత వడకట్టాలి. ఇప్పుడు తేనె కలిపి, నిమ్మరసం కలపాలి. ఈ హోంమేడ్ డ్రింక్ తయారు చేయడం చాలా తేలిక. అలాగే దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. ఇంకెందుకు ఆలస్యం మీకు జీర్ణసమస్యలు ఉంటే.. వెంటనే ఈ డ్రింక్ తాగడం మొదలుపెట్టండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
