Latest Updates
-
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే! -
కెమికల్స్ ఉన్న కూరగాయలను ఎలా గుర్తించాలి? -
నేడు వ్యతీపాత యోగం: ఈ తప్పులు చేస్తే భారీ నష్టాలు తప్పవు.. జాగ్రత్త! -
లలితా సహస్రనామం స్త్రీలు ఎందుకు ఈ పారాయణం చేయాలి? శుక్రవారం మహత్యం -
చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం: ఈ రాశుల వారికి క్రమశిక్షణతో పాటు అదృష్టం, సంపద రెట్టింపు! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 21 నుండి 27 జూన్ 2026 వరకు -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. భారీ లాభాలు! - ఆదివారం, 21 జూన్ 2026 -
ఫాదర్స్ డే స్పెషల్.. నాన్న కోసం లక్నో నవాబీ స్టైల్ కిమామి సేమియా'.. ఈ రుచి అస్సలు మర్చిపోరు! -
Chanakya niti: స్త్రీకి ఈ 4 గుణాలు ఉంటే ఇల్లు స్వర్గమే! -
మీ నాన్న ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఈ 3 రకాల గింజలు ఇవ్వండి
వ్యాధులకు దూరంగా ఉంటూ, హెల్తీగా ఉండాలంటే.. ఈ ఫుడ్స్ వద్దు..!!
ఒక కాయిన్ రెండు దిశలు ఎలా ఉంటాయో.. హెల్త్, ఫుడ్ కూడా అలాంటివే. ఇవి రెండూ చాలా దగ్గర సంబంధం కలిగి ఉంటాయి. ఒక వ్యక్తి ఆరోగ్యం.. వాళ్ల తీసుకునే డైట్ మీద ఆధారపడి ఉంటుంది. హెల్తీ డైట్ ఫాలో అయ్యే వాళ్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పోషకాహారం తీసుకునేవాళ్లకు వ్యాధులు ఖచ్చితంగా దూరంగా ఉంటాయి.
మీరు ఏం తింటున్నారు అనేది గమనించకుండా.. ఫ్యాట్, షుగర్ ఎక్కువగా ఉన్న ఆహారాలను రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే.. మీ ఆరోగ్యాన్ని రిస్క్ లో పెట్టినట్టే. మనలో చాలామంది హైక్యాలరీ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల మెటబాలిక్ డిజార్డర్స్ అయిన ఒబేసిటీ, డయాబెటిస్, హై కొలెస్ట్రాల్, కార్డియోవాస్కులర్ డిసీజ్ లు వచ్చే ముప్పు ఉంటుంది.
మరీ తరచుగా తినడం వల్ల కూడా.. అనేక అనారోగ్య సమస్యలు, ఫుడ్ పాయిజననింగ్, డయేరియా, ఇతర బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మీరు తరచుగా అనారోగ్యం పాలవుతున్నారంటే.. ముఖ్యమైన డైలీ యాక్టివిటీస్ ని మిస్ అవుతున్నారంటే.. మీ ఇమ్యునిటీ బలహీనంగా ఉందని గ్రహించాలి.
మీకు తెలుసా.. కొన్ని న్యాచురల్ పదార్థాలు, ఆహారాలు కూడా.. మిమ్మల్ని అనారోగ్యానికి గురిచేస్తాయి. కాబట్టి కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండటం వల్ల వ్యాధులకు దూరంగా ఉంటూ, హెల్తీగా ఉంటారు. మరి ఆ లిస్ట్ ఏంటో చూసేద్దాం..

ఆకుకూరలు
స్పినాచ్, బచ్చలి, పుదినా వంటి ఆకుకూరల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కానీ... మైడ్రోబ్స్, టాక్సిక్ పెప్టిసైడ్స్ ఎక్కువగా ఉంటాయి. అవి ఆరోగ్యానికి హాని చేస్తాయి. కాబట్టి.. వాటిని తీసుకోవడానికి ముందు.. బాగా శుభ్రం చేసుకోవాలి.

ఎగ్స్
కోడిగుడ్లు కూడా చాలా హెల్తీ ఫుడ్. కానీ వీటిల్లో కూడా సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉంటుంది. ఇది.. చాలా హానికరం.

ట్యూనా ఫిష్
సరిగ్గా శుభ్రం చేయని ట్యూనా ఫిష్ లో హానికారక స్కోంబ్రోటాక్సిన్ ఉంటుంది. ఇది.. తలనొప్పి, క్రాంప్స్ కి కారణమవుతుంది.

ఓయ్ స్టర్స్
ఈ ఎక్సోటిక్ ఫుడ్ లో నోరోవైరస్ ఉంటుంది. ఇది జ్వరం, చలి, గ్యాస్ట్రిక్, స్కిన్ బ్లిస్టర్స్ కి కారణమవుతాయి.

బంగాళదుంప
బంగాళదుంపను పూర్తీగా కడగక ముందు చూడ్డానికి హానికరమైన ఆహారం కాదనిపిస్తుంది. కానీ.. ఇందులో విటమిన్ ఈ, కొలి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థకు హాని చేస్తుంది. అలాగే ఇమ్యునిటీపైనా దుష్ర్పభావం చూపుతుంది.

బెర్రీస్
బెర్రీస్ టేస్టీ, హెల్తీగా ఉంటాయి. వీటిలో సిక్లోస్పోరా అనే పారాసైట్ ఉంటుంది. ఇవి పొట్టనొప్పి, డయేరియా, డీహైడ్రేషన్ కి కారణమవుతుంది.

పీనట్ బట్టర్
హెల్తీ, ప్రొటీన్ రిచ్ ఫుడ్ అయిన పీనట్ బట్టర్ లో సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది అనేక రకాల జీర్ణసంబంధ సమస్యలకు కారణమవుతుంది. సరిగ్గా నిల్వ ఉంచకుండా.. తరచుగా తీసుకోవడం వల్ల హాని కలుగుతుంది.



Click it and Unblock the Notifications