Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
అల్కలైన్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల వ్యాధులకు దూరం..
జీర్ణ వ్యవస్థ అసిడిక్ కు గురైందంటే, శరీరంలో వ్యాధులు ఎక్కువుతాయి. శరీరంలో పిహెచ్ లెవల్స్ 7 కంటే తక్కువగా ఉన్నప్పుడు, దీన్ని అసిడిక్ అని పిలుస్తారు. పిహెచ్ లెవల్ 7 కంటే ఎక్కువ ఉంటే అది ఆల్కలైన్ అని పిలుస్తారు.
శరీరంలో ఆల్కలైన్ ఎక్కువైతే, జీవక్రియలు చాలా చురుకుగా పనిచేస్తాయి. దాంతో రోజంతా చాలా చురుకుగా కనిపిస్తారు. ఈ పరిస్థితిలో చాలా వరకూ ఆరోగ్య సమస్యలను తగ్గించుకోగలుగుతారు.
ఆల్కలైన్ ఎక్కువైనప్పుడు శరీరంలో అసిడిక్ లెవల్స్ తగ్గుతాయి, కాబట్టి, ఆల్కలైన్ పెంచుకోవడానికి హెల్తీ ఫ్రుడ్స్ ను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఆల్కలైన్ ఫుడ్స్ అంటే ఏంటి ? పిహెచ్ విలువలు ఎక్కువగా ఉన్నఆహారాలే అల్కలైన్ ఆహారాలు..

వెజిటబుల్స్ :
స్పినాచ్, పీస్, ఉల్లిపాయలు, లెట్యూస్, కేల్, కీరకాయ, సెలరీ, బ్రొకోలీ మరియు బీటర్ రూట్ వంటి హెల్తీ ఆల్కలైనిక్ వెజిటేబుల్స్ ను ఎక్కువగా తీసుకోవాలి.

నట్స్ :
నట్స్ లో బాదం, చెస్ట్ నట్స్ లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరం లోపల ఆల్కలైనిక్ ఎఫెక్ట్స్ ను ఎక్కువగా కలిగి ఉండటం వల్ల జీవక్రియలు చురుకుగా పనిచేస్తాయి.

మిర్చి
మిర్చిలో ఆల్కలైన్ విలువలు 8.5! ఇది బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. శరీరంను డిటాక్సిఫై చేస్తుంది.

కొన్ని రకాల పండ్లు :
పియర్స్(బేరిపండ్లు), పీచెస్, ఆరెంజ్, లెమన్స్, గ్రేప్స్, బెర్రీస్, అరటి, పైనాపిల్ వంటి పండ్లలో ఆల్కలైన్ విలువలు ఎక్కవగా ఉండటం వల్ల వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిది.

అవకాడో
అవకాడోలో ఆల్కలైన్ విలువలు 8.0. దీన్ని బెస్ట్ న్యూట్రలైజర్ గా తీసుకోవచ్చు

స్పైసెస్
దాల్చిన చెక్క, అల్లం, సీసాల్ట్ వంటి ఆల్కలైజింగ్ ఏజెంట్స్ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వివిధ రకాల వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి.

వెల్లుల్లి:
వెల్లుల్లి ఒక మంచి న్యూట్రలైజింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. శరీరంలో అసిడిక్ లెవల్స్ ను తగ్గిస్తుంది.

వాటర్ మెలాన్
వాటర్ మెలోన్ లో పిహెచ్ లెవల్స్ 9.0 ఉంటుంది. ఇంకా వాటర్ కంటెంట్, మినిరల్స్, మరియు విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి ఆల్కలైన్ ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల అసిడిక్ లెవల్స్ ను క్రమబద్దం చేస్తుంది . వ్యాధులను దూరం చేస్తుంది.



Click it and Unblock the Notifications