Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
కొబ్బరి నూనెలో దాగున్న అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు..
కొబ్బరి నూనెను మన ఇండియాలో కేరళ రాష్ట్రంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వంటల్లో కూడా దీని వాడకం ఎక్కువగా ఉంది . ముఖ్యంగా కొబ్బరి నూనెను ఆరోమాటిక్ బాత్ ప్రొడక్ట్స్ లో కూడా ఉపయోగిస్తున్నారు . మార్కెట్లో చాలా విలువైన, ఎక్కువ ఉపయోగకరమైన ప్రొడక్ట్స్ లో కొబ్బరి నూనె కూడా ఒకటి. కొబ్బరి నూనె అద్భుతమైన సువాసనను కలిగి ఉండటం మాత్రమే కాదు , ఇందులో అనేకు ప్రయోజనాలు మనల్ని ఆహ్వానిస్తున్నది. ముఖ్యంగా కాస్మోటిక్స్ మరియు మెడిసినల్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యకరమైన జీవనశైలికి కొబ్బరి నూనె చాలా అద్భుతమైనటువంటిది. ఎందుకంటే ఇందులో న్యూట్రీషియన్స్ మరియు మినిరల్స్ అధికంగా ఉన్నాయి . కాబట్టి, ఇది అత్యంత ప్రయోజనకారిగి నిరూపింపబడినది. కొబ్బరి నూనెలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు .
ముఖ్యంగా అన్ రిఫైయిండ్ లేదా ఆర్గానిక్ ప్యాక్ కలిగిన నూనెను ఉపయోగించడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అన్ రిఫైండ్ అంటే, బ్యాక్టీరియాను తొలగించడం కోసం నూనెను బ్లీచ్ లేదా ఇతర కెమికల్ ప్రొసెస్ తో తయారుచేయకపోవడం. కొబ్బరి నూనె చాలా సువాసన కలిగి ఉంటుంది. అన్ రిఫైండ్ కోకనట్ ఆయిల్ లో హానికరం కలిగించే ట్రాన్స్ ఫ్యాట్స్ కలిగి ఉండవు. రిఫైండ్ కోకనట్ ఆయిల్ ను ఎంపిక చేసుకోవడం వల్ల అందులో కెమికల్ ప్రొసెస్ చేయడం వల్ల, మరియు కొన్ని సందర్భాల్లో హైడ్రోజనేషన్ ను ఫలితాన్ని పొంది ఉంటుంది.రీసెంట్ గా జరిపిన పరిశోధనల్లో కొబ్బరి నూనెలో హెల్తీ శ్యాచురేటెడ్ ఫ్యాట్స్, ఫ్యాటీ యాసిడ్స్ మరియు కొన్ని ముఖ్యమైన న్యూట్రీషియన్స్ ఉన్నట్లు కనుగొన్నారు.
రిఫైండ్ కోకనట్ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల అంతగా ఉపయోగం ఉండదు., అన్ రిఫైండ్ కోకనట్ ఆయిల్ నేచురల్ ఎలిమెంట్స్ కు చాలా దగ్గరగా ఉంటుంది. ఇది హార్ట్ కూడా మంచిది. ఇది మెమరీ పవర్ ను మెరుగుపరచడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కొబ్బరి నూనెలో మెడిసినల్, థెరఫిటిక్ లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల చాల మంది కొబ్బరి నూనెను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం జరిగింది. అయితే ఇప్పటి వరకూ అలవాటు లేని వారు మాత్రం రెగ్యుల్ డైట్ లో కొబ్బరి నూనెను చేర్చుకోవడానికి ముందుగా డాక్టర్ ను సంప్రదించడం మంచిది. అలాగే ఏదైనా వ్యాధులతో బాధపడే వారు డైటీషియన్ సలహాలు తీసుకోవడం మంచిది. మరి కొబ్బరి నూనెను రెగ్యులర్ డైట్ లో ఉపయోగించడం వల్ల పొందే కొన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం...

బరువు తగ్గిస్తుంది:
ఆబ్డామినల్ ఫ్యాట్ కరిగించడంలో కొబ్బరి నూనె గ్రేట్ గా సహాయపడుతుంది. . కేవలం ఒక స్పూన్ కొబ్బరి నూనెలో కొన్ని ప్రత్యేకమైన ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఇవి బెల్లీ ఫ్యాట్ ను కరిగిస్తాయి. బరువు తగ్గించుకోవాలని కోరుకునే వారు, రెగ్యులర్ డైట్ లో కొబ్బరి నూనెను చేర్చుకోవడం మంచిది.

ఇమ్యూనిటి పెంచుతుంది:
ఇమ్యూనిటి పెంచడంలో కొబ్బరి నూనె గ్రేట్ గా సహాయపడుతుంది. కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . బ్యాక్టీరియా కారణంగా సోకిన ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది. రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇమ్యూనిటి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్స్ దూరం చేస్తుంది.

హార్ట్ సమస్యను నివారిస్తుంది:
కొబ్బరి నూనెలో 50శాతం ల్యూరిక్ యాసిడ్ ఉంటుంది. ఇది హార్ట్ హెల్త్ కు తప్పనిసరిగా అవసరం అవుతుంది. లూరిక్ యాసిడ్ హైబ్లడ్ ప్రెజర్ మరియు హైకొలెస్ట్రాల్ వంటి సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయడపుతుంది. ఈ యాసిడ్ ఎల్ డి ఎల్ కొలెస్ట్రాల్(బ్యాడ్ కొలెస్ట్రాల్ ) లెవల్స్ ను తగ్గిస్తుంది. బ్లాక్ అయిన ధమనులను తెరచుకొనేలా చేస్తుంది. హార్ట్ టాక్ ను రాకుండా పోరాడుతుంది

మజిల్స్ బిల్డ్ చేయడానికి సహాయపడుతుంది:
మజిల్స్ బిల్డ్ చేయడంలో కొబ్బరి నూనె గ్రేట్ గా సహాయపడుతుంది. ఫ్యాట్ బర్న్ చేయడంతో పాటు, మజిల్స్ త్వరగా బిల్డ్ అవ్వడానికి సహాయపడుతుంది.

దంత క్షయం నివారిస్తుంది:
దంతక్షయం లేదా ఓరల్ సమస్యలను నివారించుకోవడానికి ఆయిల్ పుల్లింగ్ వంటివి చేస్తుంటారు. ఇతర హోం రెమెడీస్ ను ఉపయోగిస్తుంటారు. కొబ్బరి నూనెను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల ఓరల్ హెల్త్ ను ప్రోత్సహిస్తుంది. ఇన్ఫెక్షన్స్ ను దూరం చేస్తుంది.

బ్రెయిన్ మెమరీ అండ్ ఫంక్షన్ ను మెరుగుపరుస్తుంది:
కొబ్బరి నూనెలో న్యూట్రీషియన్స్ మరియు ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్నాయి. ఇది మెమరీ పెంచుతుంది మరియు బ్రెయిన్ ఫంక్షన్స్ ను మెరుగుపరుస్తుంది.

ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది:
కొబ్బరి నూనెలో ఉండే యాంటీ ఫంగల్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, ఈస్ట్ ఇన్ఫెక్షన్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇంకా ఇందులో ప్రోటీన్స్ అధికంగా ఉండటం త్వరగా నయం చేస్తుంది. ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది.



Click it and Unblock the Notifications
