Latest Updates
-
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
30 ఏళ్ళలో వచ్చే హార్ట్ డిసీజ్ లకు కొన్ని హెచ్చరిక సంకేతాలు
గతంలో వయస్సైన వారిలో హార్ట్ అటాక్, క్యాన్సర్, కిడ్నీ సమస్యలు వంటి వివిధ రకాల జబ్బులు ఎదుర్కొంటున్నారు. అయితే ప్రస్తుత కాలంలో ఆహారపు, ఆరోగ్యపు అలవాట్లలో , జీవనశైలిలో మార్పుల వల్ల చిన్న వయస్సులో అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత రోజుల్లో హార్ట్ డిసీజెస్ చాలా సాధారణ జబ్బుగా మారిపోయింది. పుట్టే పిల్లల్ల నుండి ముదసి వరకూ అన్ని రకాల ఏజ్ గ్రూప్ లలో హార్ట్ డిసీజెస్ పెరుగుతున్నాయి .
మనం నిత్యం చూస్తున్న వ్యక్తులు కూడా చూడటానికి హెల్తీగా మరియు ఫిట్ గా పైకి కనిపించినా, ఏదో ఒక రోజు హార్ట్ వ్యాధితో బాధపడుతున్నారన్న విషయం ఎక్కువగా బాధిస్తుంది. అందుకు ముఖ్య కారణం గుండెకు సంబంధించిన పరికరాలు అనేకం ఉన్నాయి. గుండె నుండే రక్తం అన్ని అవయవాలకు సప్లై అవుతుంది. ముఖ్యంగా రక్తం సరఫరా చేసేవి కొన్ని, తిరిగి గుండెకు రక్తన్నా సరఫరా చేసేవి కొన్ని ఉన్నాయి. దమనులు, సిరలు, కణాలు, కణజాలాలు ఇలా గుండె పరికాలు చాలానే ఉన్నాయి.
పురుషుల కొరకు ప్రత్యేకమైన 15 హార్ట్ హెల్తీ ఫుడ్స్!
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేస్తూ, యాక్టివ్ గా ఉండటం మాత్రమే సరిపోదు. హార్ట్ హెల్తీగా ఉండాలన్నా, లేదా హార్ట్ డిసీజ్ వెనుక కొన్ని రహస్యాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా యంగ్ ఏజ్ లో వచ్చే హార్ట్ డిసీజ్ లకు కొన్ని వార్నింగ్ లక్షణాలు కూడా ఉన్నాయి, వీటిని ఎర్లీగా గుర్తించినట్లైతే, జీవితంలో ముందు ముందు తిరిగి రాకుండా నివారించుకోవచ్చు.
సాధారణంగా 30ఏళ్ళలో లైఫ్ సెటిల్ డౌన్ అవుతుంది. మరియు క్రమంగా జీవిత కాలం పెరుగుతుంటుంది . అప్పటి నుండి ఆరోగ్య మీద ఎక్కువ శ్రద్ద తీసుకోవడం, కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో ఉండటం చాలా మంచిది . ముఖ్యంగా పిల్లల్లో ఇలాంటి జబ్బు పట్లు మరింత ఎక్కువ కేర్ తీసుకోవాలి .
గుండె ఆరోగ్యానికి సులువైన మార్గాలు..
కొన్ని సందర్భాల్లో హార్ట్ ఎలిమెంట్స్, మనకు తెలియకుండానే మన కంట్రోల్ తప్పుతుంటాయి . కాబట్టి, హార్ట్ కు సంబంధించిన ఏ ఒక్క లక్షణం కనిపించినా వెంటనే చికిత్స చేయించుకోవడం వల్ల ప్రాణానికి ఎలాంటి హాని ఉండదు. 30 ఏళ్ళలో వచ్చే హార్ట్ డిసీజ్ లకు కొన్ని హెచ్చరిక సంకేతాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. వీటిని ఎట్టి పరిస్థితిలోనూ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స తీసుకోవడం మంచిది.

తరచూ అలసటకు గురి అవుతుండటం:
ఎప్పుడు చూసిన అలసటకు గురి అవుతుంటే తగినంత విశ్రాంతి తీసుకోవాలి . తగిన విశ్రాంతి తీసుకోలేదంటే ఇక ఆరోజంతా ఏపని చేయాలన్నా ఏకాగ్రత ఉండదు . ఇలా తరచూ అలసటకు గురి అవుతుంటే నిర్లక్ష్యం చేయకుండా చెకప్ చేయించుకోవడం మంచిది.

శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు:
శ్వాత తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటే అది సడెన్ గా శారీరకంగా అలసిపోయినట్లు తేలికగా తీసుకోకూడదు. కొన్ని సందర్భాల్లో అధిక వ్యాయామాలు లేదా శారీరక శ్రమ వల్ల కూడా శ్వాసలో ఇబ్బందులు ఎదుర్కుంటుంటారు. అయితే ఇది రెగ్యులర్ గా ఇలాగే కంటిన్యూ అయితే హార్ట్ డిసీజ్ కు హెచ్చరిక సంకేతంగా గుర్తించాలి.

చెస్ట్ పెయిన్ :
యంగ్ ఏజ్ 30ఏళ్ళలోనే హార్ట్ సమస్యలుంటాయంటే నమ్మసక్యం కాదు. చూడటానికి ఈ వయస్సులో అసాధ్యం అని చెబుతుంటారు. చెస్ట్ పెయిన్ హార్ట్ బర్న్, ఎసిడిటి వల్ల కూడా చెస్ట్ పెయిన్ వస్తుంటుంది. అయితే ఇలాంటి నొప్పి తరచూ బాధిస్తుంటే మాత్రం తప్పనిసరిగా గుర్తించి డాక్టర్ ను సంప్రధించడం మంచిది. చెస్ట్ లోపలగా ఏదో సూదితో గుచ్చినట్లు, గాలి పీలుస్తున్నప్పుడు ఏదైనా ఇబ్బందిగా ఉన్నట్లు అనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రధించాలి. చెస్ట్ పెయిన్ తో పాటు ఎడమ చేయి , భుజం, చంక బాగాల్లో నొప్పిని గమనించాలి. ఇలాంటి లక్షనాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా డాక్టర్ ను కలవాలి.

ఊబకాయం:
జీవన శైలిలో మార్పులు మరియు ఫుడ్ హ్యాబిట్ మార్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది . ముఖ్యంగా ఆరోగ్య పరంగా సమస్యలు ఎక్కువ అవుతాయి. రెడిమేడ్ మీల్స్, రెడీ టు కుక్ ప్యాకెట్స్ మరియు వ్యాయామ లోపం వల్ల చిన్న వయస్సులోనే ఓబేసిటికి దారితీస్తుంది. ఇది క్రమంగా టైప్ 2 డయాబెటిస్, హైబ్లడ్ ప్రెజర్ మరియు ఇతర అనారోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది . జీవన శైలిని కంట్రోల్ చేసుకొని, హార్ట్ డిసీజ్ లకు దూరంగా ఉండాలి.

ఆందోళన :
చిన్న చిన్న విషయాల్లో ఆందోళన చెంచడం లేదా చిన్న విషయాలను పెద్దగా ఆలోచించడం, అదొక సమస్యగా తీసుకోవడం. తరచూ ఆందోళన చెందుతుండటం వల్ల కొన్ని సందర్భాల్లో హార్ట్ ఎలిమెంట్స్ కు ఎఫెక్ట్ అవుతుంది. . . కాబట్టి, సాధ్యమైనంత వరకూ ఆందోళ తగ్గించుకొని ఆనందంగా జీవితంలో ముందుకు సాగాలి.

నిద్ర సమస్యలు:
జీవితంలో సమస్యలు, బాధ్యతలు, వర్క్ ప్రెజర్, మొదలగుని మన ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. ఇలాంటి పరిస్థితులను సున్నితంగా ఎదుర్కోవాలి తప్ప ప్రతి విషయాన్ని సీరియస్ గా తీసుకోకూడదు . ఒత్తిడి వల్ల నిద్రలేమి సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. మరియు ఇది ఇలాగే కంటిన్యూ అయితే హార్ట్ సమస్యలకు దారితీస్తుంది.

దంతాల మీద పాచి:
చిన్న వయస్సులో దంత సమస్యలు, ముఖ్యంగా దంతాల మీద పాచీ వంటి లక్షణాలు హార్ట్ సమస్యలకు సంకేతం . కాబట్టి ఓరల్ హెల్త్ చాలా ముఖ్యం. మంచి నోటి ఆరోగ్య విషయంలో మంచి అలవాట్లను కలిగి ఉండాలి .



Click it and Unblock the Notifications











