Latest Updates
-
మరో పది రోజుల్లో మంగళ గోచారం.. వీరికి దీనికి మించిన మంచి సమయం ఉండదు.! -
హైదరాబాద్ వాసులకు బంపరాఫర్.. ఇక బస్సు, మెట్రోకు ఒకే పాస్! -
రీసెర్చ్ ప్రకారం వారానికి ఎన్ని రోజులు కలిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసా.? -
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.! -
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ! -
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.! -
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.!
రెగ్యులర్ గా పసుపు వాటర్ తాగితే.. పొందే పవర్ ఫుల్ బెన్పిట్స్
ఉదయాన్నే రకరకాల నీళ్లు తాగారు. నిమ్మరసం, వేడినీళ్లు, వెజిటబుల్ జ్యూస్, ఫ్రూట్ జ్యూస్ ఇలా రకరకాల జ్యూస్ లు తాగి బోర్ కొట్టిందా ? అవన్నీ హెల్తీ హ్యాబిట్స్. అయితే.. ఎప్పుడూ ఒకేరకమైన రెసిపీ ఫాలో అవడం అంటే.. కష్టం. కాబట్టి.. ఇప్పుడు పసుపు వాటర్ ట్రై చేయండి.
గోరువెచ్చని పసుపు వాటర్ తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల దీన్ని రెగ్యులర్ గా ఉదయాన్నే తాగడం చాలా మంచిది. మరి ఈ పసుపు నీళ్లు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక కప్పు గోరువెచ్చని నీళ్లకు ఒక టీ స్పూన్ పసుపు, అర స్పూన్ పెప్పర్ పౌడర్ కలపాలి. ఈ మూడింటిని బాగా మిక్స్ చేయాలి. దీన్ని ప్రతి రోజూ ఉదయాన్నే తాగాలి. రెగ్యులర్ గా ఈ నీళ్లు తాగడం వల్ల పొందే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..

అనారోగ్య సమస్యలు
రెగ్యులర్ ఈ పసుపు వాటర్ తాగడం వల్ల.. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే పసుపు ఎలాంటి అనారోగ్య సమస్య దరిచేరకుండా కాపాడుతుంది.

డయాబెటిస్
గోరువెచ్చని పసుపు నీళ్లు తాగడం వల్ల టైప్ టు డయాబెటిస్ ని నివారిస్తుందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి.

కాలేయానికి
పసుపు కాలేయానికి మంచిది. లివర్ ని డ్యామేజ్ చేసే టాక్సిన్స్ తొలగించడంలో.. పసుపు సహాయపడుతుంది.

ఏజింగ్
పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీరాడికల్ డ్యామేజ్ నివారించి.. ఏజింగ్ ని నెమ్మదిగా తగ్గిస్తుంది.

జీర్ణశక్తి
పసుపు నీళ్లు రెగ్యులర్ గా, ఉదయాన్నే తీసుకోవడం వల్ల.. జీర్ణక్రియ సజావుగా సాగుతుంది.

ఇన్ల్ఫమేషన్
యాంటీ ఇన్ఫ్లమేటరీగా పసుపు పనిచేస్తుంది. కాబట్టి పసుపు నీళ్లను రెగ్యులర్ గా తీసుకుంటే.. ఇన్ల్ఫమేటరీని తగ్గిస్తుంది.

గుండె ఆరోగ్యానికి
పసుపులో కర్కూమిన్ ఉంటుంది. బ్లడ్ క్లాట్స్ నివారిస్తుంది. కాబట్టి ఇది గుండె ఆరోగ్యానికి మంచిది.

క్యాన్సర్
పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాణాంతక క్యాన్సర్ ని నివారిస్తాయి. కాబట్టి రెగ్యులర్ గా పసుపు నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి.

జాయింట్ పెయిన్
పసుపులో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు పుష్కలంగా ఉండటం వల్ల.. వాపులు, కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది.



Click it and Unblock the Notifications
