Latest Updates
-
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి! -
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026
చేతితో తినడం వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటి ?
పూర్వపు పద్ధతులన్నీ చాలా ఓల్డ్ గా అనిపిస్తాయి. కానీ.. మన పూర్వీకులు చదువుకోకపోయినా.. సైన్స్ బాగా తెలుసుకున్నారు. వాళ్ల పద్ధతులన్నింటి వెనక ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ తప్పకుండా ఉంటుంది. కానీ.. వాళ్ల అలవాట్లు పద్ధతులు నేటి తరం వాళ్లకు చాలా చీప్ గా, పాత స్టైల్ లా అనిపిస్తుంది.
మన పూర్వీకులు రాగి పాత్రలనే ఎందుకు వాడేవాళ్లు ?
ఎలాంటి ఆహారం తీసుకున్నా.. అప్పట్లో చేతులకే ప్రాధాన్యమిస్తారు. చక్కగా.. చేత్తో అన్నం తింటూ ఆస్వాదించేవాళ్లు. కానీ.. ఇప్పుడు మోడ్రన్ కల్చర్ మాయలో పడిలో చేత్తో తింటే కలిగే ప్రయోజనాలను మరుగున పడేస్తున్నారు. పుట్టిన పసికందు నుంచి అందరికీ స్పూన్ తో తినే అలవాటు నేర్పిస్తున్నారు. ఏ పని చేసినా.. చేతులకు మట్టి అంటుకోకుండా.. చేయాలనుకుంటారు నేటి జనరేషన్ వాళ్లు.

అమ్మచేతి గోరుముద్దలు కూడా కరువుయ్యాయి. స్పూన్స్, ఫోర్క్స్ ఇవే.. అన్నం తినిపించే అమ్మలు. కానీ చేతితో ఆహారం తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చట. అందుకే మోడ్రన్ కల్చర్ కి అలవాటు అయిన వాళ్లు తప్ప అనేక ప్రాంతాలు, పల్లెల్లో ఇప్పటికీ చేత్తో తింటూ ఉంటారు. ఈ పద్థతి పూర్వకాలం నుంచి అలవాటుగా ఉంది. ఇలా తినడం వెనక ఉన్న కారణం, సైంటిఫిక్ రీజన్స్ ని ఇప్పటికి చాలా మంది గుర్తించలేకపోతున్నారు.
ఎర్లీ మార్నింగ్ కాపర్ (రాగి) పాత్రలోని నీళ్ళ త్రాగడం వల్ల పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్
జీర్ణశక్తి:
చేతిస్పర్శ శరీరానికి చాలా బలాన్ని చేకూరుస్తుంది. చేతివేళ్లతో ఆహారాన్ని ముట్టుకోవడం వల్ల మిలియన్ల కొద్దీ నరాలు బ్రెయిన్ కి సిగ్నల్స్ పంపిస్తాయి. మనం ఆహారం తినబోతున్నామనే సంకేతం మెదడుకు చేరడం వల్ల అది పొట్టని అలర్ట్ చేస్తుంది. ఇలా పొట్టలో జీర్ణరసాలు, ఎంజైమ్స్ విడుదలవుతాయి. దీనివల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది.
అటెన్షన్:
మనం ఎలాంటి ఆహారం తింటున్నాం.. ఎంత చక్కగా తింటున్నాం.. అనేదానిపై అటెన్షన్ క్రియేట్ చేస్తుంది చేయి. కాబట్టి.. చేతులతో తినడం వల్ల పరధ్యానాన్ని వదిలి.. పోషకాలు కావాల్సినంత పరిమాణంలో పొందేలా జాగ్రత్త పడతామని అధ్యయనాలు చెబుతున్నాయి. చేత్తో ఆహారం తినడం వల్ల మనం మరింత ఆరోగ్యవంతంగా ఉంటాం.

వేద జ్ఞానం:
చేతులతో తినే ప్రక్రియ ముద్ర ప్రయోగం ద్వారా మొదలైంది. ముద్ర అనేది హిందూ సంప్రదాయంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ధ్యానం చేసేటప్పుడు, శాస్ర్తీయ నృత్యం చేసేటప్పుడు, భరతనాట్యం చేసేటప్పుడు ముద్రను ఉపయోగిస్తారు. ఎప్పుడైతే మనం చేత్తో తింటామో అప్పుడు అన్ని వేళ్లకు కలుపుతాము. ఈ ప్రక్రియనే ముద్రగా పిలుస్తాం. అలాగే ఆయుర్వేదంలో ఒక్కో వేలికి ఒక్కో అర్థముంది. బొటనవేలు ఆకాశం, చూపుడువేలు గాలిని, మధ్యవేలు అగ్నిని, ఉంగరపు వేలు నీటిని, చివరి వేలు భూమిని సూచిస్తుంది. వీటిలో ఏ ఒక్కటి మన జీవితంలో కనుమరుగైనా.. మనం అనారోగ్యం పాలవుతామని అర్థం. ఇలా అన్ని వేళ్లతో ఆహారం తీసుకోవడం వల్ల మన జీవితం, ఆరోగ్యం బ్యాలెన్స్ గా ఉంటుందని అర్ధం. పూర్వీకులు ఏ పద్ధతి ఫాలో అయినా.. దానికి ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ కంపల్సరీ ఉంటుంది. కాబట్టి.. ఇలాంటి అలవాట్లను తీసిపారేయకుండా.. అలవాటు చేసుకోవడం మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











