మీ బాడీ షేప్ ని బట్టి.. మీరు ఎంతటి ఆరోగ్యవంతులో తెలుసుకోండి..!!

By Swathi

మీకు తెలుసా ? కొన్ని రకాల వ్యాధులు, హెల్త్ కండిషన్ మీ శరీరం రూపుపై ఆధారపడి ఉంటుందని. ఒకవేళ ఏదైనా వ్యాధి వచ్చిందని మీరు గ్రహించకపోయినా.. మీ శరీరంలోని మార్పులే వాటిని సూచిస్తాయి. వాటినైనా గుర్తించగలగాలి. అయితే ప్రస్తుతమున్న హెల్త్ కండిషన్ ని మాత్రమే కాదు.. ఫ్యూచర్ లో వచ్చే అనారోగ్య సమస్యలను కూడా మీ బాడీ షేప్ ని బట్టి అంచనా వేయవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.

కొంతమంది ఇలాంటి వన్నీ ఎవరు నమ్ముతారులే అని కొట్టిపారేస్తుంటారు. కానీ.. శరీరంలోని అవయవాలు ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి. కాబట్టి.. ఏ చిన్న లోపం కనిపించినా.. ఏదో ఒక రూపంలో అది తెలుస్తుంది.

Your Body Shape Reveals Your Predisposition For Certain Disease

అందుకే బరువు ఎక్కువగా ఉంటే.. హార్ట్ డిసీజ్, కొలెస్ట్రాల్ వంటి రకరకాల సమస్యలు వస్తాయి. ఇలా ఏ చిన్న సమస్య వచ్చినా.. అది కొన్ని సార్లు ప్రాణాంతకంగా మారుతుంది.

కాబట్టి.. మీ పర్సనాలిటీని, మీ శరీరంలోని భాగాలను బట్టి.. మీ హెల్త్ కండిషన్, మీకు ఫ్యూచర్ లో వచ్చే డిసీజ్ ల గురించి అంచనా వేయవచ్చని స్టడీస్ తేల్చాయి. అయితే ఎలాంటి డిసీజ్ వస్తుంది.. దాన్ని ఎలా నివారించాలి అనేది కూడా వివరించాయి ఈ అధ్యయనాలు. మరి మీ బాడీ షేప్ ని బట్టి మీరు ఎంతటి ఆరోగ్యవంతులో, మీకు రాబోయే వ్యాధి, దాన్ని నిరోధించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకోండి.

సైజ్

సైజ్

నడుము సైజ్ ని, కాళ్లు, చేతుల పొడవుని, బాడీ పార్ట్స్ ఎంత ఉన్నాయనే దాన్ని బట్టి.. మీ హెల్త్ కండిషన్ తెలుసుకోవచ్చు.

వేళ్ల పొడవు

వేళ్ల పొడవు

మహిళల చూపుడు వేలు, ఉండరం వేలు కంటే పొడవు తక్కువగా ఉంటే.. వాళ్లలో వయసు పెరిగిన తర్వాత కీళ్ల నొప్పులకు ఎక్కువ అవకాశం ఉంటుంది.

మగవాళ్లు

మగవాళ్లు

మగవాళ్లలో ఈ రెండు వేళ్లు దాదాపు ఒకే సైజ్ ఉంటాయి. మహిళల్లో ఇలాంటి సైజులో వేళ్లు ఉంటే.. ఈస్ట్రోజెన్ లెవెల్స్ తగ్గి, ఎముకల వ్యాధి వచ్చే రిస్క్ ని తగ్గిస్తాయి.

జాగ్రత్తలు

జాగ్రత్తలు

ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్లు ఈ వ్యాధిని నిరోధించడానికి రెగ్యులర్ గా ఎక్సర్ సైజ్ చేయడంతోపాటు క్యాల్షియం రోజూ తీసుకుంటూ ఉండాలని ఈ స్టడీస్ చెబుతున్నాయి. అప్పుడు ఈ సమస్యకు దూరంగా ఉండవచ్చు.

బ్రా సైజ్

బ్రా సైజ్

20లలో మహిళల బ్రా సైజ్ డి కలిగిన వాళ్లకు చిన్న సైజు బ్రా ఉపయోగించే వాళ్లతో పోల్చితే టైప్ టు డయాబెటిస్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. రొమ్ములలో ఉండే ఫ్యాట్ టిష్యూ చాలా సెన్సిటివ్ గా ఉండటం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పై ప్రభావం చూపుతాయి.

జాగ్రత్తలు

జాగ్రత్తలు

లక్కీ కొద్దీ డయాబెటిస్ ని నిరోధించవచ్చు. కాబట్టి.. హెల్తీ వెయిట్, బ్యాలెన్స్డ్ డైట్, క్రమంతప్పకుండా వ్యాయామం చేయడం వల్ల డయాబెటిస్ రిస్క్ కి దూరంగా ఉండవచ్చు.

కాళ్ల పొడవు

కాళ్ల పొడవు

కాళ్లు పొట్టిగా ఉన్నవాళ్లు.. లివర్ హెల్త్ గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి.

మహిళలు

మహిళలు

మహిళల కాళ్లు 50 నుంచి 73 సెంటీమీటర్ల పొడవు ఉన్నవాళ్లలో లివర్ ఎంజైమ్స్ ఎక్కువగా ఉంటాయి.. ఇవి లివర్ డిజార్డర్ కి కారణమవుతాయి.

జాగ్రత్తలు

జాగ్రత్తలు

కాలేయ వ్యాధులను కూడా.. కొన్ని జాగ్రత్తల వల్ల రాకుండా నిరోధించవచ్చు. ఆల్కహాల్ కి దూరంగా ఉండటం, లివర్ లో టాక్సిన్స్ ఏర్పడకుండా జాగ్రత్త పడటం వల్ల.. ఈ డిసీజ్ కి దూరంగా ఉండవచ్చు.

Desktop Bottom Promotion