లైంగిక శక్తిని పెంచే రుచి వంటగదిలోనే ఉంది..!

By: Y. Bharath Kumar Reddy
Subscribe to Boldsky

సెక్స్‌ అనేది దాంపత్య జీవితానికి ఎంతో బెస్ట్. ఒకరినొకరరు మరింత ప్రేమించుకునేందుకు ఇది ఎంతో దోహదం చేస్తుంది. అలాగే అందులో పాల్గొనడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు. రోజూ సెక్స్ లో పాల్గొనాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఒక్కోసారి దానికి బ్రేక్ పడుతుంది కూడా. అందుకు కొన్ని కారణాలుంటాయి.

సెక్స్ వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. గుండె సంబంధిత వ్యాధులు దరి చేరవు. మానసిక ఒత్తిళ్లు కూడా మటుమాయం అవుతాయి. అయితే ప్రస్తుతం చాలామంది పురుషులకు అందులో పాల్గొనాలని ఉన్నా శరీరం మాత్రం సహకరించదు. రోజంతా ఆఫీస్ లో పని చేసి రావడమే అందుకు కారణం. దీంతో నైట్ టైమ్ వారు ఆ పనిపై అంత ఇంట్రెస్ట్ చూపరు.

20 Aphrodisiac Foods To Last Longer In Bed

ఇక మహిళలు కూడా ఇంటా బయట అంటూ పనులు చేసి బాటా అలసి పోయి ఉంటారు. దీంతో ఇద్దరిలో ఆ కోరికలున్నా అందులో పాల్గొనే శక్తి లేక దానికి బ్రేక్ వేయాల్సి వస్తోంది.

ఉదయం చేసే రతి క్రీడతో ఆరోగ్యప్రయోజనాలు ఎక్కువా?

కానీ సెక్స్ స్టామినా పెంచడానికి, అలాగే బూస్ట్ ఇచ్చే కొన్ని ఫుడ్స్ ఉన్నాయి. వీటిని నిత్యం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటే ఇక మళ్లీ అందులో ఉత్తేజంగా పాల్గొంటారు. ప్రతిరోజూ సెక్స్‌ను తనివితీరా అనుభవించొచ్చు. రోజంతా కోల్పోయిన శక్తిని తిరిగి అందిస్తాయి. భాగస్వామితో అందులో పాల్గొనేందుకు కావాల్సిన హార్మోనులను ఇవి ప్రేరేపిస్తాయి. మరి ఆ ఆహార పదార్థాలు ఏమిటో మీరూ తెలుసుకోండి.

ఓయిస్ట్రెస్

ఓయిస్ట్రెస్

ఓయిస్ట్రెస్ అనేవి కాస్త డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి. అలాగే ఇవి చూడటానికి కూడా కాస్త విచిత్రంగా ఉంటాయి. వీటిలో మోనోసాచురేటెడ్ ఆయిల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిలో జింక్ అధికంగా ఉంటుంది. వీటిని తరచుగా తీసుకోవడం మంచిది. దీంతో మీరు సెక్స్ లైఫ్ ను మరింత ఆనందమయం చేసుకోవొచ్చు. ఆరోగ్యకరమైన లైంగిక జీవితానికి ఇవి బాగా సహాయపడుతాయి. ఓయిస్ట్రెస్ పురుషులు, మహిళల్లో లిబిడోను పెంచే డోపామైన్ స్థాయిలు మెరుగుపరుస్తాయి. అలాగే వీర్య కణాల సంఖ్యను పెంచడానికి కూడా ఇవి తోడ్పడుతాయి.

వాటర్ మిలాన్ (పుచ్చకాయ)

వాటర్ మిలాన్ (పుచ్చకాయ)

సెక్స్ సామర్థ్యాన్ని పెంచేందుకు వాటర్ మిలాన్ లేదా పుచ్చకాయ సూపర్ గా పని చేస్తుంది. ఇందులో అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణకు బాగా ఉపయోగపడతాయి. అలాగే లైంగిక వాంఛలను పెంచుతాయి. పుచ్చకాయలను బాగా తింటే మగ, ఆడవారిలో ఆ అవయవాలకు రక్తప్రసరణ బాగా అందుంతుంది. పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది. వీర్యం వృద్ధి చెందుతుంది. శుక్ర క‌ణాల్లో బాగా క‌ద‌లిక వ‌స్తుంది.

కొంతమంది పుచ్చకాయను కొత్త వయాగ్రా అని కూడా అంటారు. పుచ్చకాయ తినడం వల్ల రక్తనాళాలపై వయాగ్రా-లాంటి ప్రభావాలను చూపిస్తుంది. లిబిడోను పెంచుతుంది. ఈ పండులో సిట్రిక్లైన్ అమైనో ఆమ్లం ఉంటుంది. సిట్రినైన్ సెక్స్ లైఫ్ కు ఎంతో మేలు చేస్తోంది. ఇంకెందుకు ఆలస్యం రోజూ పుచ్చకాయలు తినండి. ఆ సమయంలో రెచ్చిపోండి.

చాక్లెట్స్ లేదా కోకో

చాక్లెట్స్ లేదా కోకో

దాదాపు అన్ని చాక్లెట్స్ తయారీలో కాకో బీన్స్ ఉపయోగిస్తారు. దీన్నే మనం కోకో అని పిలుస్తాం. అయితే రా కాకా గ్రీన్ టీ లేదా రెడ్ వైన్ కంటే ఎక్కువ యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. అలాగే ఇది పెనీలెత్లామైన్ అనే రసాయనం కూడా ఇందులో పుష్కలంగా ఉంటుంది. ఈ రసాయనం ఆ సమయంలో ఉత్సాహం రేపుతుంది. ఇక డార్క్ చాక్లెట్స్ తినడానికి రుచిగా ఉండడమే కాదు సెక్స్ వల్ లైఫ్ కు కూడా బాగా మేలు చేస్తాయి. చాక్లెట్ లో ఉండే ఫోనోఫినాయిల్స్ మెదడులోని ఎండోర్ఫిన్ ఉత్పత్తికి బాగా సహాయపడుతుంది. లైంగిక జీవితానికి చాక్లెట్స్ బాగా ఉపయోగపడతాయి.

ఆస్పరాగస్

ఆస్పరాగస్

ఆస్పరాగస్ అనేది ఒక సహజ కామోద్దీపన ఆహారం. ఇందులో బి మిటమిన్, ఫోలేట్ ఎక్కువగా ఉంటాయి. ఇవి హిస్టామైన్ ఉత్పత్తిని పెంచేందుకు సహాయపడతాయి. పురుషులు, స్త్రీలకు సెక్స్ వల్ లైఫ్ లో హిస్టామిన్ చాలా అవసరం. అలాగే ఇందులో పొటాషియం, థైమిన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, విటమిన్ సి విటమిన్ ఇలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీకు తగినంత శక్తిని అందిస్తాయి. ఆస్పరాగస్ బాగా తియ్యగా ఉంటుంది. ఇది దాదాపు స్థానిక రైతు మార్కెట్లలో లభిస్తుంది. వీటిని పిల్లితీగలు అని పిలుస్తారు. మీరు సెక్స్ లో ఫుల్ ఎంజాయ్ చేయాలంటే ఈ సారి మార్కెటుకు వెళ్లినప్పుడు పిల్లి తీగల్ని కొనడం మర్చిపోకండి మరి.

అవోకాడో

అవోకాడో

అవకాడోలు బాగా తింటే శృంగారంలో మీరు రాజులే. వీటిలో మోనో సాచురేటెడ్ ఫ్యాట్స్ పుల్ గా ఉంటాయి. ఇవి మగవారిలో టెస్టోస్టిరాన్ ఉత్పత్తికి బాగా ఉపయోగపడుతాయి. లైంగిక జీవితానికి కావాల్సిన ఎనర్జీని ఇస్తాయి. ఇవి చూడడానికి కూడా మగవారి వృషణాల మాదిరిగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఇక నుంచి రోజూ అవొకాడోలు తినండి. మీ సెక్స్ జీవితాన్ని మరింత ఉత్సాహంగా మార్చుకోండి.

ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఆశ్చర్యపరిచే సెక్స్ రూల్స్

మకా

మకా

మకాన చాలామంది న్యాచ్ రల్ వయాగ్రా అంటూ ఉంటారు. మాకా అనేది సెక్స్ పవర్ ను పెంచుతుంది. అలాగే సంతానోత్పత్తికి ఉపయోగపడుతుంది. లిబిడోలను పెంచుతుంది. అందువల్ల మీరు శృంగారంలో బాగా ఎంజాయ్ చేయాలంటే మాత్రం కచ్చితంగా మకాను ఉపయోగిస్తూ ఉండండి.

గుమ్మడికాయ విత్తనాలు

గుమ్మడికాయ విత్తనాలు

వీటిలో విటమిన్‌ ఇ, జింక్‌, మాంగనీస్‌ పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా కొన్ని రకాల యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఒక సింగల్‌ టేబుల్‌ స్పూన్‌ సీడ్స్‌లో 4.7 గ్రాముల హెల్దీ ఫ్యాట్‌ ఉంటుంది. వీటిని సూప్స్‌, సలాడ్స్‌, నూడుల్స్‌తో కలిపి తీసుకోవచ్చు. ఈ విత్తనాలు ఆరోగ్యకరమైన స్పెర్మ్ ఉత్పత్తికి, పురుషుల్లో టెస్టోస్టెరోన్ లోపం నివారించడానికి ఉపయోగపడతాయి. అలాగే విటమిన్ బి, సి, డి, కె, కాల్షియం, పొటాషియం, నియాసిన్, ఫాస్పరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. మీరు సెక్స్ లైఫ్ ను ఫుల్ ఎంజాయ్ చేయాలంటే గుమ్మడికాయవిత్తనాలను తీసుకోవడం మరిచపోకండి.

సెలెరీ

సెలెరీ

సెలెరి కాండము , ఆకులు ,వేర్లను తినొచ్చు. ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. దీనిలో యాండ్రోస్టెరాన్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది సెక్స్ కోరికలను రేకెత్తిస్తుంది. సెక్స్ వల్ లైఫ్ హ్యాపీగా ఉండాలంటే మీరు కచ్చితంగా దీన్ని తీసుకోవాలి. దీంతో మీరు శృంగార జీవితాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది.

మిరప

మిరప

మిరపకాయలను కారం కోసం వాడతారు. మిరప లేకుండా వంటే లేదు మనకు. మిర్చి కారం రుచినే కాదు సెక్స్ శక్తిని కూడా పెంచుతుంది. కారం ఎక్కువైతే నోరు మండుతుంది. మిరపలో ఉన్న కాస్పియాసిన్ అనేది శరీరంలో మార్పులను తెస్తుంది. దీని వలన మర్మాంగాల దగ్గర ఒక రకమైన అలజడి సున్నితంగా మొదలవుతుంది. సెక్స్‌లో మంచి ఆనందం పొందాలంటే మీరు ఆహారంలో కచ్చితంగా మిరప తీసుకోవాలి. దాదాపు ఎర్ర మిరపకాయలో ఈ లక్షణాుల ఎక్కువగా ఉంటాయి.

అత్తిపండ్లు

అత్తిపండ్లు

అత్తింపండు, అంజీరపండు, ఫిగ్స్ అని పిలువబడే ఈ పండు సెక్స్ లైఫ్ కు బాగా దోహదం చేస్తుంది. లేత ఆకుపచ్చ రంగులో ఉండి , పక్వానికి వచ్చాక తియ్యగా ఉండే ఈ పళ్లు మూడు నాలుగు రోజులకి మించి నిల్వ ఉండవు. అందుకే వీటిని ఎండబెడతారు. ఎండిన కొద్దీ తియ్యగా ఉంటాయి. పోషక విలువలు కూడా పెరుగుతాయి. ఎ,ఇ,కె విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి తినడం వల్ల తొందరగా బలం పుంజుకుంటారు. అత్తిపళ్లు తరచు తింటూ ఉంటే మీరు ఆ సమయంలో రెచ్చిపోవొచ్చు.

వెల్లుల్లి

వెల్లుల్లి

వెల్లుల్లి స్త్రీ పురుషులిద్దరిలోనూ లైంగిక వాంఛంలు పెంచేందుకు సహాయపడుతుంది. లైంగిక అవయవాల పని తీరును మెరుగుపరుస్తుంది. వెల్లుల్లిలో ఎల్లిసిన్ ఉంటుంది. ఇది సెక్స్యువల్ ఆర్గాన్స్ కు రక్త ప్రసరణ అంధించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. వెల్లుల్లిన ఆహారంలో రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల లిబిడో సమస్యలను దూరమవుతారు. ఇక లైంగిక జీవితం ప్రతి క్షణం ఆనందమయమే.

తులసి

తులసి

ఇది మంచి సువాసన కలిగి ఉంటుంది. తులసి ఆకులు రుచికి చేదుగా, వగరుగా ఉన్నప్పటికీ వీటి వల్ల లాభాలు చాలా ఉన్నాయి. తులసిలో శ్రీతులసి, కృష్ణతులసి అనే రెండు రకాలున్నాయి. ఈ రెండింటిలోనూ సమానమైన ఔషధ గుణాలున్నాయి. తులసి ఆకులు, వేర్లు, విత్తనాలు అన్నింటిలోనూ ఒక్కో ఔషధ గుణం ఉంటుంది. ఇక ఆడవారు మగవారిని ఆకర్శించేందుకు తమ ఒంటిపై తులసి పొడి, నూనెను పూసుకుంటాను. అలాగే ఇది రక్త ప్రసరణకు బాగా ఉపయోగపడుతుంది. తులసి ఉపయోగించడం వల్ల మీలో ఆ సామర్థ్యం పెరిగి ఆ సమయంలో బాగా పార్టిసిపేట్ చేస్తారు.

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క మీలో కామ కోరికలు పెంచుతుంది. లైంగిక శక్తి సామర్థ్యాన్ని పెంచుతుంది. కాఫీ, పెరుగు లేదా పాలలో దాల్చిన చెక్క పొడిని కలుపుకుని తాగితే ఇక మిమ్మల్ని ఆ సమయంలో ఆపే వారే ఉండరు. మరి ఇప్పటి నుంచి మీరు తీసుకునే ఫుడ్ లో దాల్చిన చెక్క ఉండేలా చూసుకోండి. సెక్స్ లో పాల్గొన్నప్పుడు మీ పార్టనర్ తో కలిసి రెచ్చిపోవొచ్చు.

యాలకులు

యాలకులు

యాలకులను మనం ఎక్కువగా వంటల్లో వేస్తాం. అయితే యాలకులు కేవలం వంటలకే కాదు, వీటి వల్ల లైంగిక వాంఛలు కూడా పెరుగుతాయి. శృంగార సామర్థ్యం పెరగాలంటే రోజూ యాలకులను తినాలి. ఇవి పురుషులకు ఉండే శీఘ్ర స్కలన సమస్యను నివారిస్తాయి. శృంగారంలో యాక్టివ్‌గా ఉండేలా చేస్తాయి. సంతాన సాఫల్యత అవకాశాలను పెంచుతాయి. కండరాలు బాగా పని చేసేలా చేస్తాయి.

బాదంపప్పు

బాదంపప్పు

బాదంపప్పులో మోనో శ్యాచురేటెడ్ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. విటమిన్ E, మెగ్నీషియం మరియు పొటాషియం ఉంటాయి. రోజుకి 4 నుంచి 7 బాదంపప్పులు తినడం వల్ల అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అలాగే వీటిలో సెలీనియం, జింక్ అధికంగా ఉంటుంది. ఈ రెండూ మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. మీ సెక్స్ సామర్థ్యం పెరుుగుతుంది. అలాగే బాదం లో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు రక్త ప్రసరణ పెంచడానికి ఉపయోగడపతాయి.

అల్లం

అల్లం

అల్లం లైంగిక అవయవాలలో రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. రోజూ టీ లేదా సూప్, స్మూతీస్ ల్లో అల్లం తీసుకుంటే మీ సెక్స్ స్టామినా పెరుగుతుంది.

చిలగడదుంపలు

చిలగడదుంపలు

దుంపల్లో చిలగడ దుంపలు ఒకటి. వీటిని ఉడకబెట్టి లేదా నిప్పులపై కాల్చుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. ఇందులో ఫైబర్, విటమిన్లు ఎ,సి,డి, కాల్షియం, పొటాషియం, ఐరన్‌లు పుష్కలంగా లభిస్తాయి. కెరొటినాయిడ్లు, బీటా కెరొటిన్లు, విటమిన్‌ ఎ అధికంగా లభిస్తాయి. ప్రతి రోజూ కూరలు, పులుసు, సలాడ్లు.. ఇలా ఏదో ఒక రూపంలో వీటిని తీసుకుంటే మీలో లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుంది. దీంతో మీరూ ఆ సమయంలో ఎక్కువ సేపు పార్టిసిపేట్ చేయొచ్చు. చిలగడ దుంపల్లో విటమిన్‌ బి6 సమృద్ధిగా లభిస్తుంది.

కొబ్బరి నీళ్లు

కొబ్బరి నీళ్లు

సాధారణంగా ఒంట్లో కాస్త నీరసంగా ఉంటే కొబ్బరి నీళ్లు తాగుతాం. కొబ్బరి నీలల్లో ఉండే పోషకాలు శరీరానికి వెంటనే శక్తినిస్తాయి. కొబ్బరి నీరు రక్తంలోని ఎలెక్ట్రోలైట్స్ ను అదే స్థాయిలో ఉంచేలా చేస్తాయి. దీంతో రక్త ప్రసరణ మెరుగవుతోంది. ఇది మీలో లైంగిక సామర్థ్యం పెంచేందుకు కూడా ఉపయోగపడుతుంది. కొబ్బరి నీళ్లను నేరుగా తాగితే వాటిలో పోషకాలన్నీ మీ ఒంటబడతాయి.

దానిమ్మపండు

దానిమ్మపండు

రక్త ప్రసరణ మెరుగవుతే సెక్స్ స్టామినా ఆటోమేటిక్ గా పెరుగుతుంది. ఇందుకు దానిమ్మ పండు బాగా ఉపయోగపడుతుంది. మీరు శృంగారంలో పాల్గొనబోయే ముందు ఒక్కసారి దానిమ్మ పండుకానీ, లేదా దానిమ్మ జ్యూస్ గానీ తీసుకోండి. ఇక మీరు తర్వాత ఆ పనికి ఉపక్రమంచండి. దీంతో మీరు ఇక రెచ్చిపోతారు.

గుడ్లు:

గుడ్లు:

గుడ్లలో విటమిన్ బి6 మరియు విటమిన్ బి5 పుష్కలంగా ఉంటాయి. ఇవి హార్మోనుల లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తాయి. ఒత్తిడితో పోరాడుతాయి. అధిక లైంగిక వాంఛను కలిగిస్తాయి.

English summary

20 Aphrodisiac Foods To Last Longer In Bed

If you always want your partner to have sex when you have sex, then they will not be a boring sex that ends soon. Your partner may not be dissatisfied with you either. To do this, you will also be bringing several types of products from the market that enhance your sexual arousal.
Story first published: Saturday, October 28, 2017, 16:24 [IST]
Subscribe Newsletter