Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
రాత్రి భోజనం తర్వాత ఎట్టి పరిస్థితిలో ఈ పనులు చేయకండి..చేస్తే ఇక అంతే..
రాత్రి పూట భోజనం చేసిన వెంటనే కొందరు నిద్రిస్తారు. ఇంకా కొందరు స్నానం చేస్తారు. మరి కొందరైతే స్మోకింగ్ చేస్తారు. అయితే వాస్తవంగా చెప్పాలంటే రాత్రి పూట భోజనం తరువాత ఈ పనులను అస్సలు చేయకూడదు.
ఇవే కాదు, ఇంకా ఇలాంటివే కొన్ని పనులను రాత్రి పూట డిన్నర్ అవగానే చేయరాదు. అలా చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

వాకింగ్ చేయడం...
రాత్రి పూట డిన్నర్ చేసిన వెంటనే కొంత సేపు వాకింగ్ చేయాలని చెబుతారు. అలా చేస్తే ఆరోగ్యానికి మంచిదని కూడా అంటారు. కానీ అది ఎంత మాత్రం నిజం కాదు. ఎందుకంటే తిన్న వెంటనే నడవడం వల్ల రక్తం చేతులకు, కాళ్లకు వెళ్తుంది. దీంతో జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. కనుక తిన్న వెంటనే వాకింగ్ చేయరాదు. అంతగా చేయాలనిపిస్తే ఒక గంట లేదా గంటన్నర పాటు వేచి ఉన్నాక చేయవచ్చు.

నీరు తాగడం...
మన శరీరానికి నీరు అవసరమే. కానీ దాన్ని తగిన సమయంలోనే తాగాలి. ప్రధానంగా రాత్రి పూట డిన్నర్ చేసిన వెంటనే నీటిని అస్సలు తాగరాదు. కనీసం 30 నుంచి 60 నిమిషాల పాటు వేచి ఉండాలి. లేదంటే జీర్ణవ్యవస్థ పనికి ఆ నీరు అడ్డు పడుతుంది. దీంతో మలబద్దకం సమస్య వస్తుంది.

పండ్లు తినడం...
రాత్రి పూట భోజనం చేసిన వెంటనే పండ్లను తినడం చాలా మందికి అలవాటు. అయితే అలా చేయకూడదు. ఎందుకంటే రాత్రి పూట డిన్నర్ తరువాత పండ్లను తింటే దాంతో పొట్ట ఉబ్బరంగా తయారవుతుంది. గ్యాస్ సమస్యలు వస్తాయి. దీంతోపాటు తిన్నది కూడా సరిగ్గా జీర్ణమవదు.

పళ్లు తోముకోవడం...
డిన్నర్ చేసిన వెంటనే దంతాలను తోముకోవడం కూడా చాలా మందికి అలవాటు. అయితే అలా చేయకూడదు. ఎందుకంటే దంతాల మీద ఉన్న ఎనామిల్ పొర తొలగిపోతుంది. అప్పుడు దంతాలు తమ సహజ కాంతిని కోల్పోతాయి. కాబట్టి డిన్నర్ చేసిన వెంటనే పళ్లు తోముకోరాదు. కనీసం 30 నిమిషాల పాటు అయినా వేచి ఉండాలి. ఆ తరువాతే ఆ పని చేయాలి.

పొగ తాగడం...
డిన్నర్ చేసిన వెంటనే కాదు, అసలు ఏ సమయంలోనూ, ఎప్పుడూ కూడా స్మోకింగ్ చేయరాదు. దాంతో క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. అయితే ఆ అలవాటును మానలేం అనే వారు, కనీసం డిన్నర్ చేశాకైనా మానేయడం మంచిది. ఎందుకంటే డిన్నర్ చేసిన వెంటనే స్మోకింగ్ చేస్తే సాధారణ సమయంలో చేసిన స్మోకింగ్ కన్నా క్యాన్సర్ వచ్చే రిస్క్‌ను మరింతగా పెంచుతుంది.

టీ, కాఫీ తాగడం...
చాలా మంది డిన్నర్ చేసిన వెంటనే టీ లేదా కాఫీ తాగుతారు. నైట్ షిఫ్ట్ చేసే వారైతే అలా తాగేవారు ఇంకా ఎక్కువగానే ఉంటారు. నిజానికి అలా డిన్నర్ అయిన వెంటనే టీ, కాఫీ వంటివి తాగితే జీర్ణ క్రియకు ఆటంకం ఏర్పడుతుంది. గ్యాస్, అసిడిటీ సమస్యలు వస్తాయి. తిన్న ఆహారంలో ఉండే పోషకాలు శరీరానికి అందవు. ప్రధానంగా ఐరన్‌ను శరీరం ఏమాత్రం గ్రహించలేదు. కనుక తిన్న వెంటనే కాఫీ, టీ తాగరాదు.

స్నానం చేయడం...
తిన్న వెంటనే స్నానం చేసినా అప్పుడు కూడా రక్త ప్రసరణ శరీరంలోని ఇతర భాగాలకు జరుగుతుందే తప్ప జీర్ణ వ్యవస్థకు సరిగ్గా జరగదు. దీంతో జీర్ణక్రియ సాఫీగా జరగదు.

నిద్రించడం...
డిన్నర్ చేసిన వెంటనే నిద్రించరాదు. అలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. గ్యాస్, అసిడిటీ పెరగడంతోపాటు తిన్న ఆహారం కొవ్వుగా మారుతుంది. అప్పుడు అధికంగా బరువు పెరుగుతారు. కాబట్టి నిద్రించడానికి రెండు గంటల ముందే భోజనం చేయాలి.



Click it and Unblock the Notifications