Latest Updates
-
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే
దాల్చిన చెక్క, తేనెతో చాలా ఉపయోగాలు
దాల్చిన చెక్క మనకు జీవితాంతం మేలు చేస్తూనే ఉంటుంది. దీని నిత్యం తీసుకుంటే చాలా ప్రయోజనాలున్నాయి. వాస్తవానికి, దాల్చిన చెక్క ఇప్పుడు మాత్రమే మంచి ఉపయోగంలో ఉందనుకుంటే పొరపాటే. కొన్ని వేల సంవత్సరాల క్రితమే దీన్ని మన భారతీయులు, చైనీయులు ఔషధంగా వినియోగించేవారు. ఇక దాల్చినచెక్కతో పాటు తేనెను కూడా కలుపుకుని తీసుకుంటే బోలెడన్నీ ప్రయోజనాలున్నాయి. దాల్చిన చెక్కను మనం పూర్వం నుంచి మసాలా దినుసుగా ఉపయోగిస్తున్నాం. ఇందులో ఇన్ల్ఫమేషన్ తగ్గించే గుణం, ఇమ్యునిటీని మెరుగుపరిచే సత్తా ఉంటాయి. . ఇక చాలా సహజసిద్ధంగా లభించే తేనెలోనూ ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి. మరి ఈ రెండింటినీ తీసుకుంటే చాలా ప్రయోజనాలుంటాయి. తేనెలో యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలుంటాయి. అలాగే అనేక పోషకాలు, ఎమినో యాసిడ్ ఉంటుంది. అనేక వ్యాధుల నివారణకు ఈ రెండూ బాగా పని చేస్తాయి. ఈ రెండింటిని ప్రతిరోజూ తీసుకునేవాళ్లలో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉండవు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మరి.. ఈ రెండింటిని వేర్వేరుగా లేదా కలిపి తీసుకోవడం వల్ల వచ్చే లాభాలు ఏమిటో ఒక్కసారి చూద్దామా.

# 1 . అధిక యాంటీఆక్సిడెంట్స్
దాల్చిన చెక్కలో అధిక ఆమ్లజనకాలు ఉంటాయి. ఇప్పటి వరకు ఇందులో 41 రకాల ఔషధ గుణాలున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు, సినామిక్ యాసిడ్, సినామల్ డీహైడ్ సినామెట్ తదితర రకాల గుణాలు ఇందులో ఉంటాయి. ఇతర మూలికలతో పోలిస్తే దాల్చిన చెక్కలో అధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ అమ్లజనకాలు శరీరానికి చాలా ఉపయోగపడతాయి. రక్తంలో నైట్రిక్ ఆక్సైడ్ మెరుగుపడేందుకు, గుండె, మెదడు, ఇతర అవయవాలకు సంబంధిచిన వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు యాంటీ ఆక్సిడెంట్స్ సహాయపడతాయి.

# 2. పొటెంట్ యాంటీ ఇన్ల్ఫాంమెటరీగా పని చేస్తుంది
దాల్చినచెక్కలో ఫ్లేవానాయిడ్లు అధికంగా ఉంటాయి. కలిగి ఉంటుంది. అవి శరీరం లోపల మంటను తగ్గిస్తాయి. అయితే మీరు దీనికి తేనె కూడా కలుపుకుని తాగితే ఫలితం బాగుంటుంది. రెండు టీ స్పూన్ల తేనెలో సగం టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిన కలుపుకోవాలి. దీన్ని తీసుకోవడం ద్వారా చాలా ప్రయోజనాలున్నాయి. కండరాల నొప్పి, శరీరంపై వాపులు, అలెర్జీలు తగ్గించడానికి ఇది బాగా పని చేస్తుంది. అలాగే మహిళల్లో రుతుక్రమం సమయంలో వచ్చే నొప్పిని కూడాఇది తగ్గించగలుతుంది.

# 3 గుండె సంబంధిత వ్యాధుల నివారణకు బాగా పని చేస్తుంది
దాల్చిన చెక్క వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు దూరం అవుతాయని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. అలాగే ఎల్ డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచగలుతుంది. రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను కూడా అదుపులో ఉంచుతుంది. పలు రకాల గుండె సంబంధిత వ్యాధులు కూడా తగ్గుతాయి. హైపర్టెన్షివ్ రోగుల్లో అధిక రక్తపోటును కూడా దాల్చిన చెక్క తగ్గిస్తుంది.

# 4 మధుమేహాన్ని తగ్గించేందుకు పని చేస్తుంది
శరీరంలోని ఎంజైమ్ అలినైన్ ను ఎదుర్కొనే శక్తి దాల్చినచెక్కలో అధికంగా ఉందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అందువల్ల డయాబెటిక్ ను అదుపులో ఉంచేందుకు ఇది బాగా పని చేస్తుంది. టైప్ - 2 డయాబెటిక్స్ ను అదుపులో ఉంచేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. శరీరంలో ఇన్స్ లిన్ సెన్సివిటినీ కూడా ఇది మెరుగుపరుస్తుంది.

# 5 మెదడుకు కూడా చాలా మంచిది
మెదడుకు సంబంధించిన పలు వ్యాధులకు దాల్చిన చెక్క మంచి ఔషధంలాగా పని చేస్తుంది. మతిమరుపు, పార్కిన్సన్స్ వంటి వ్యాధుల నివారణకు ఇది బాగా పని చేస్తుంది. దాల్చిన చెక్క మీ మెదడు పని తీరును మెరుగుపరుస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల రెగ్యులర్ గా దాల్చిన చెక్కను తీసుకుంటే బ్రెయిన్ సంబంధించిన రోగాల బారిన పడకుండా ఉంటారు.

# 6 క్యాన్సర్ వ్యతిరేకంగా పోరాడుతుంది
సినామల్ డీహైడ్ అనే శక్తివంతమైన పదార్థం దాల్చిన చెక్కలో ఉంటుంది. ఇది క్యాన్సర్ ప్రారంభ దశలో ఉన్నప్పుడు దాంతో పోరాడే గుణాలు కలిగి ఉంటుంది. మీ శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలను రక్షించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. పెద్దప్రేగుకు వచ్చే క్యాన్సర్ ను తగ్గించే గుణం దాల్చిన చెక్కకు ఉంటుందని క్లినికల్ అధ్యయనాల్లో తేలింది.

# 7 యాంటీ మెక్రోబయోల్ ఏజెంట్ లా పని చేస్తుంది
బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వైరస్లు, పరాన్నజీవులకు వ్యతిరేకంగా పోరాడే శక్తి దాల్చిన చెక్కకు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దాల్చినచెక్క నూనెను ఎక్కువగా చర్మ సంరక్షణకు ఉపయోగిస్తుంటారు. మెటిమలు తగ్గడానికి, పలు రకాల చర్మ వ్యాధుల నివారణకు ఇది బాగా పని చేస్తుంది. అంతేకాకుండా ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

# 8 చెడు వాసన రాకుండా చేస్తుంది
దాల్చిన చెక్కలో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు నోటి నుంచి చెడ్డ వాసన రాకుండా చేస్తాయి. అలాగే పలు నోటి సమస్యల నివారణకు కూడా ఇది బాగా పని చేస్తుంది. గమ్ డిసీజ్ నివారణకు, చిగుళ్ల సంరక్షనకు దాల్చిన చెక్క బాగా పని చేస్తుంది. అంతేకాకుండా ఇది మంచి మౌత్ ప్రెషర్ లాగా పని చేస్తుంది.

# 9 క్యాన్డిడల్ ఇన్ఫెక్షన్స్ కు వ్యతిరేకంగా పోరాడుతుంది
కాన్డిడ అనేది అనేక శిలీంధ్ర జాతుల సమూహం. ఇది బాడీలో ప్రవేశిస్తే అనేక రోగాల బారిన పడాల్సి వస్తుంది. మీ శరీరంలో పలు చోట్ల అలర్జీ ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. అయితే దీని నివారణకు దాల్చిన చెక్క బాగా పని చేస్తుంది. అందువల్ల వీలైనంత వరకు దాల్చిన చెక్కను అధికంగా ఉపయోగించండి.

# 10. చర్మానికి బాగా ఉపయోగపడుతుంది
దాల్చినచెక్క మీ చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి సాయపడుతుంది. అలాగే మీ చర్మం మృదువుగా, సున్నితంగా మారేందుకు కూడా బాగా పని చేస్తుంది. అలాగే మీ చర్మానికి అవసరమయ్యే రక్తం అందేందుకు కూడా ఉపయోగపడుతుంది. దీంతో మీలో త్వరగా వృద్ధాప్య ఛాయలు ఏర్పడవు.

# 11. తేనెలో ఆమ్లజనకాలు అధికంగా ఉంటాయి
ఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్, ఆర్గానిక్ యాసిడ్స్, డైజెస్టిక్ ఎంజైమ్స్ తేనేలో ఎక్కువగా ఉంటాయి. తేనెలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. స్ట్రోక్, క్యాన్సర్, న్యూరోడెజెనరేటివ్ వ్యాధుల తగ్గించే గుణాలు తేనెకు అధికంగా ఉంటాయి. అందువల్ల తేనెను కూడా అధికంగా తీసుకోవాలి.

# 12. చక్కెర కంటే చాలా మేలు
తేనెలో ఎక్కువగా ఫ్రూక్టోజ్, గ్లూకోజ్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఇది చక్కెర కంటే మంచిది. చక్కెరలాగా హానికరం కూడా కాదు. చక్కెర బదులు తేనె ఉపయోగిస్తే చాలా ప్రయోజనాలుంటాయి. డయాబెటిక్ పేషెంట్స్ ఒకవేళ చక్కెర తీసుకోకూడదని భావిస్తే తేనె దానికంటే చాలా మేలు.

# 13. అధిక రక్తపోటును నియంత్రిస్తుంది
హై బ్లడ్ ప్రెజర్ అనేది గుండె జబ్బులకు కారణం అవుతుంది. అలాగే స్ట్రోక్ కూడా వచ్చే అవకాశం ఉంది. మీ రక్తపోటు అదుపులో ఉండాలంటే మీరు కచ్చితంగా రోజూ తేనె తీసుకుంటూ ఉండాలి. అధిక రక్తపోటుతో బాధపడేవారు తేనె వల్ల చాలా ప్రయోజనాలు పొందుతారు.

# 14. తేనె ఎల్ డీఎల్ కొలెస్ట్రాలును తగ్గించగలదు
తేనె రక్తంలోని ఎల్ డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. చాలామందిలో బ్యాడ్ కొలెస్ట్రాల్స్ ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారు తేనెను ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రయోజనాలు పొందుతారు.

# 15. గాయాలు మానడానికి బాగా పని చేస్తుంది
కాలిన ప్రాంతాలపై, లేదా గాయాలున్న చోట, డయాబెటిక్ పూతల విషయంలో తేనె బాగా పని చేస్తుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. తేనె అనేది నేచరల్ యాంటీ మైక్రోబయోల్ ఏజెంట్ గా పని చేస్తుంది. గాయాలు లేదా కాలిన ప్రాంతాల్లో తేనెను పూస్తే చాలు త్వరితగతిన కోలుకోవొచ్చు.

# 16. గొంతుకు కూడా చాలా మంచిది
గొంతుకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి తేనె బాగా పని చేస్తుంది. దగ్గు, గొంతులో మంట, శ్వాసకోశ వ్యాధుల నుంచి తేనె ద్వారా ఉపశమనం పొందొచ్చు. అలాగే తేనెను వాడటం వలన చిన్న పిల్లలలో రాత్రి సమయంలో వచ్చే దగ్గు తగ్గిపోతుంది. పడుకోటానికి కొద్దిగా ముందు రెండు చెంచాల తేనెను తాగితే చాలా మంచిది.

# 17. అలెర్జీని తగ్గిస్తుంది
అలెర్జీలను తగ్గించే గుణాలు తేనెలో ఎక్కువగా ఉంటాయి. తేనెలో పుప్పొడి రేణువులుంటాయి. అందువల్ల అలెర్జీ నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తి కూడా తేనెలో ఎక్కువగా ఉటుంది. వీలైనంత వరకు తేనెను ఎక్కువగా తీసుకుంటే అలెర్జీ నుంచి ఉపశమనంన కలుగుతుంది.

# 18. మంచి ఎనర్జీ ఇస్తుంది
తేనె శరీరానికి అవసరైమైన గ్లూకోజ్ ను తక్షణమే ఇవ్వగలదు. మీ రక్తానికి కావాల్సిన చక్కెరలను అందిస్తుంది. అలాగే మీ మెదడును పనితీరు చురుగ్గా కొనసాగేలా చేస్తుంది. ఇందులో ఫ్రూక్టోజ్, గ్లూకోజ్ ఎక్కువగా ఉంటాయి. తేనె తీసుకోవడం వల్ల మీ శరీరానికి కావాల్సిన శక్తి వెంటనే అందుతుంది.

# 19. జ్ఞాపకశక్తిని పెంచుతుంది
తేనెలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. మీ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తగ్గించుకోవడానికి కూడా తేనె ఉపయోగపడుతుంది. ఫ్రీ రాడికల్స్ అనేవి వృద్ధాప్యం ఏర్పడడానికి, నరాలకు సంబంధించిన వ్యాధులు రావడానికి కారణం అవుతాయి. అయితే తేనెను నిత్యం తీసుకోవడం వల్ల మీలో మెమరీ పెరగడమేకాకుండా ఇతర సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.

# 20. మీరు బాగా నిద్ర పోవొచ్చు
తేనెలో ఫ్రూక్టోజ్, గ్లూకోజ్ అధికంగా ఉంటుంది. నిద్రలేమికి ప్రధాన కారణం ఒత్తిడి, హార్మోన్ల స్థాయిల్లో హెచ్చు-తగ్గులు. కొద్దిగా ఉప్పు కలిపిన తేనె మిశ్రమం తాగటం వలన దీని నుంచి ఉపశమనం పొందుతారు అని చెప్పవచ్చు. కావున రాత్రి పడుకునే ముందు ఒక చెంచా తేనెలో కొద్దిగా ఉప్పును కలిపి తాగితే మంచిది. అలాగే తేనె, దాల్చిన చెక్క కలిపి తీసుకోవడం వల్ల మీకు కొన్ని ప్రయోజనాలుంటాయి. ఒక స్పూన్ తేనెలో సగం స్పూన్ దాల్చిన చెక్క పొడి కలపండి. ఈ మిశ్రమాన్నిఒక గ్లాసు పాలలో కలిపి తాగండి. మంచి ఫలితాలు పొందుతారు.



Click it and Unblock the Notifications











