కాకరకాయ బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుందా..?

Posted By:
Subscribe to Boldsky

కాకరకాయ బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గిస్తుందా? షుగర్ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా దాడి చేస్తోంది. మనదేశంలో అత్యధిక మందిని వేధిస్తున్న వ్యాధుల జాబితాలో మొదటి స్థానానికి చేరింది. అయితే దానిని అదుపులో ఉంచేందుకు మనకు సహజ సిద్ధంగా దొరికే అనేక పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. అందులో కాకరకాయ జ్యూస్ ప్రధానమైంది. కాకర జ్యూస్ లో లో క్యాలరీలతో పాటు విటమిన్- సి, విటమిన్- ఏ అధికంగా ఉంటాయి. ఈ ప్రత్యేక గుణాలే షుగర్ ను కంట్రోల్ చేస్తాయి.

కాకరకాయ జ్యూస్‌ షుగర్‌ లెవెల్స్‌ను సరియైన స్థాయిలో ఉంచేందుకు సహాయపడుతుంది. ఇందులో ఉండే కుకుర్‌బిటేన్‌ టైటెర్‌పెనాయిడ్స్‌ ఒక ఎంజైమ్‌ను యాక్టివేట్‌ చేస్తుంది. ఇది మజిల్‌సెల్స్‌ బ్లడ్‌షుగర్‌ను గ్రహించేలా చేస్తుంది. ఇండియన్ బిట్టర్ గార్డ్ గా పిలుచుకునే కాకరకాయ చేదుగా ఉండటం వల్ల చాలా మంది దీన్ని ఇష్టపడరు. నిజానికి చెప్పాలంటే కాకరకాయను రెగ్యులర్ గా తింనడం వల్ల శరీరం శుభ్రపడుతుంది. కాకరకాయను రెగ్యులర్ గా తినడం వల్ల శరీరానికి కావల్సిన ఫైబర్ అందుతుంది, దాంతో మలబద్దక సమస్య ఉండదు.

కాకరకాయ బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుందా..?

కాకరకాయ జ్యూస్ వల్ల హ్యాంగోవర్ లక్షణాలు దూరం అవుతాయి. వ్యాధినిరోధకత పెంచుతుంది. మరి అయితే, బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుందా? ఖచ్చితంగా అవునని అంటున్నారు అనుభవజ్జులు. బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడంలో కాకరకాయ జ్యూస్ గ్రేట్ గా సహాయపడుతుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడంలో కాకరకాయ ఏవిధంగా ఉపయోగపడుతుందో తెలుసుకోవడానికి కొన్ని రీజన్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి..

కాకరకాయ చేదైనా...సౌందర్యాన్ని పెంచడంలో మాత్రం తీపే..!

కాకరకాయ బ్లడ్ షుగర్ ను తగ్గిస్తుందా ?

కాకరకాయ బ్లడ్ షుగర్ ను తగ్గిస్తుందా ?

కాకరకాయ రసం ఆల్ఫా గ్లూకోసైడ్స్ ను తగ్గించడంలో సహాయపడుతుందని కొన్ని పరిశోధనల్లో గుర్గించారు. భోజనం తిన్న తర్వాత బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగకుండా కంట్రోల్ చేస్తుంది.

బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడానికి కాకరకాయను ఏవిధంగా ఉపయోగించాలి?

బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడానికి కాకరకాయను ఏవిధంగా ఉపయోగించాలి?

కాకరకాయ జ్యూస్ ను ప్రతి రోజూ ఉదయం తాగాలి. రోజూ క్రమం తప్పకుండా తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేసుకోవచ్చు.

ఇందులో ఏముంది ?

ఇందులో ఏముంది ?

బిట్టర్ గార్డ్ లేదా కాకరకాయలో క్యారెటిన్ మరియు మొమొర్సిడిన్ వంటి యాంటీహైపర్ గ్లిజమిక్స్ , మధుమేహగ్రస్తుల్లో బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది.

కాకరకాయ తింటే 10 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు!

కాకరకాయ టీ ప్రయత్నించండి:

కాకరకాయ టీ ప్రయత్నించండి:

మార్కెట్లో కొన్ని స్టోర్స్ లో కాకరకాయను డ్రైగా మార్చినవి అమ్ముతుంటారు. ఇంట్లోనే మీరు స్వయంగా డ్రైగా మార్చుకోచ్చు. అలాగే ఒక గ్లాసు నీళ్ళు చిన్న కాకరకాయ ముక్కను వేసి మరిగించి టీగా కూడా కాచుకోవచ్చు. కారకాయను ఉడికించిన తర్వాత, ఈ నీటిని వడగట్టి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి.

విత్తనాలు ఎలా పనిచేస్తాయి :

విత్తనాలు ఎలా పనిచేస్తాయి :

కాకరకాయ విత్తనాల్లో పాలిపెప్టైడ్ పి అనే కంటెంట్ ఇన్సులిన్ మీద పనిచేసి బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది.

రిసిపి ట్రై చేయండి:

రిసిపి ట్రై చేయండి:

కాకరకాయతో వివిధ రకాల వంటలను వండుతారు. కాకరకాయ చేదు అనుకునే వారు కొంచెం స్పైసీ రిసిపిని ప్రయత్నించవచ్చు. కొద్దిగా కారంగా చేసుకోవడం వల్ల చేదు తెలియకుండా ఉంటుంది.

కాకరకాయ చేదును ఇష్టపడని వారు ఏం చేయాలి?

కాకరకాయ చేదును ఇష్టపడని వారు ఏం చేయాలి?

డాక్టర్ ను కలిసి, బిట్టర్ గార్డ్ సప్లిమెంట్ ను తీసుకోవచ్చు, డాక్టర్లు షుగర్ లెవల్స్ ను చెక్ చేసి, ఎంత డోసేజ్ అవసరం అవుతుందో సూచిస్తారు.

English summary

Does Karela Lower Blood Sugar?

Does Karela Lower Blood Sugar?,Does karela lower blood sugar? Karela is the Indian name of bitter gourd. Well, most of us never prefer this vegetable because of its bitter taste.