నిద్రించే ముందు ఈ డ్రింక్ తాగితే చాలు ఉదయానికి బాడీపెయిన్స్ మాయం..

Posted By: Lekhaka
Subscribe to Boldsky

సంతోషంగా నిద్రలేస్తే ఆ రోజంతా సంతోషంగా ఉంటారు. కొంత మంది నిద్రలేవడంతోనే బాడీ పెయిన్స్, బ్యాక్ పెయిన్ అంటూ నిద్రలేస్తూ ఇక ఆరోజంతా అదే మూడ్ తో ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇది ఒకటి రెండు రోజులైతే పర్వాలేదు కానీ, ఇది అలాగే కొనసాగితే మాత్రం చాలా ప్రమాదం, మరి బాడీ పెయిన్ ను ఎలా నివారించుకోవాలి?

ఈ సమస్యను మీరు కూడా ఎదుర్కొంటున్నట్లైతే ..తప్పకుండా ఈ ఆర్టికల్ మీకు సహాయపడుతుంది. బాడీ పెయిన్ ను ఎఫెక్టివ్ గా నివారించుకోవడానికి ఎఫెక్టివ్ హోం రెమెడీ ఉంది

 Drink This Hot Beverage Before Going To Bed & Get Rid Of Body Pain Instantly

బాడీ పెయిన్ కు వివిధ రకాల కారణాలు ఉండవచ్చు. సడెన్ పడిపోవడం, గాయాలవ్వడం, కూర్చొనే భంగిమ సరిగా లేకపోవడం లేదా రోజంతా ఎక్కువగా బరువులు మోయడం ఈ కారణాల వల్ల బ్యాక్ పెయిన్ బాధిస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో శరీరం ఎక్కువ ఒత్తిడికి గురైనప్పుడు, బాడీ పెయిన్స్ వస్తుంటాయి .

ఈ బాడీ పెయిన్స్ ఎక్కువ రోజులు అలాగే ఇబ్బందికి గురి చేస్తుంటే, పరిస్థితి మరింత ఎక్కువై మీ దినచర్యకే కష్టం అవుతుంది. నిద్రలేవడానికి కూడా కష్టంగా భావిస్తారు. కాబట్టి, బాడీ పెయిన్ నుండి వెంటనే ఉపశమనం కలిగించే ఒక సింపుల్ అండ్ ఎఫెక్టివ్ హోం రెమెడీ ఉంది. ఈ రెమెడీ ఉపయోగించిన తర్వాత కూడా బాడీ పెయిన్స్ తగ్గకపోతే, డాక్టర్ ను కలవాలి.

బాడీపెయిన్ తగ్గించే హోం రెమెడీ గురించి తెలుసుకుందాం..

పసుపు:

పసుపు:

ఒక టేబుల్ స్పూప్ పసుపు తీసుకుని,అందులో కొద్దిగా వాటర్ మిక్స్ చేయాలి. దీన్ని పేస్ట్ లా చేయాలి. పసుపులో ఉండే కుర్కుమిన్ కాంపౌండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుండటం వల్ల పెయిన్స్ తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

బ్లాక్ పెప్పర్ :

బ్లాక్ పెప్పర్ :

చిటికెడు బ్లాక్ పెప్పర్ తీసుకోవాలి. ఇందులో కూడా యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇది యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలుండటం వల్ల నొప్పి నుండి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది.

బాదం మిల్క్ - కోకనట్ మిల్క్ :

బాదం మిల్క్ - కోకనట్ మిల్క్ :

ఒక కప్పు బాదం మిల్క్,లేదా కోకనట్ మిల్క్, తీసుకోవాలి. బాదం మిల్క్ లో విటమిన్ సి, ఇ, ఐరన్, క్యాల్షియం, మరియు ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. కొబ్బరి పాలలో ఫైబర్, విటమిన్ సి, ఇ, ఐరన్ మరియు క్యాల్షియం అధికంగా ఉంటాయి .

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

ఒక టీస్పూన్ కొబ్బరి నూనె తీసుకోవాలి. కొబ్బరి నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ బెనిఫిట్స్ అధికంగా ఉంటాయి .

తేనె:

తేనె:

తేనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి కాబట్టి, ఒక టీస్పూన్ తేనె తీసుకోవాలి.

తయారీ:

తయారీ:

తేనె తప్ప మిగిలిన పదార్థాలన్ని సాస్ పాన్ లో వేసి వేడి చేాయలి. అయితే ఓవర్ బాయిల్ చేయకూడదు, వేడి చేస్తే చాలు. వేడి అయ్యాక క్రిందికి దింపి అందులో తేనె మిక్స్ చేయాలి. కొద్దిగా గోరువెచ్చగా ఉండగానే నిద్రించే ముందు ఈ పానియాన్ని తాగాలి. బాడీ పెయిన్స్ ను ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది.

English summary

Drink This Hot Beverage Before Going To Bed & Get Rid Of Body Pain Instantly

Body pain can be caused due to several reasons. If you have had a fall and sustained injuries then it causes pain, a bad seating position, or if you tried to lift something heavy, then you tend to hurt your back or sometimes when you strain your body too much you tend to get body pain.
Story first published: Saturday, April 8, 2017, 20:00 [IST]
Subscribe Newsletter