వృషణాలకు సంబంధించిన క్యాన్సర్ లక్షణాలివే!

Posted By: Bharath
Subscribe to Boldsky

టెస్టికులర్ క్యాన్సర్ అనేది కేవలం మగవారికే వస్తుంది. ఇది వృషణాలకు సంబంధించిన క్యాన్సర్. అయితే ఈ వ్యాధి బారిన మీరు పడుతున్నారనే విషయాన్ని ప్రారంభ దశలో తెలుసుకుంటే దీన్ని చికిత్స ద్వారా నివారించొచ్చు. వృషణాల దగ్గర ఒక చిన్న ఏర్పడి అది పెద్దగా మారడం, వృషణాల్లో వాపు రావడం, వాటిని ముట్టుకుంటే నొప్పి కలగడం వంటి సమస్యలు ఏర్పడుతుంటాయి. ఇలాంటి వాటికి మీరు గురవుతుంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.

వృషణాలకు సంబంధించిన క్యాన్సర్ అనేది చాలా ప్రమాదకరం. దాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం. అయితే ఇలాంటి కేన్సర్ 1.2% మాత్రమే ఉంది. ఈ క్యాన్సర్ రెండు వృషణాలకు సోకుతుంటుంది. వృషణాలకు సంబంధించిన క్యాన్సర్ లక్షణాలను తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి.

1. వెన్నునొప్పి, కడుపు నొప్పి

1. వెన్నునొప్పి, కడుపు నొప్పి

మీరు వెన్నునొప్పి లేదా కడుపునొప్పితో బాధపడుతున్నట్లయితే మీరు టెస్టిక్యూలర్ క్యాన్సర్ (వృషణాలకు సంబంధించిన క్యాన్సర్) తో బాధపడుతున్నారని సూచన. లింప్ నోడ్స్ కాస్త వాపునకు గురైనా మీరు డాక్టర్ని సంప్రదించడం మంచిది. కొందరిలో వృషణాలు వాపునకు గురికావడంతో ఆ ప్రభావం లివర్ పై పడుుతంది. దీంతో కాలేయ నొప్పి వస్తుంటుంది. ఇవన్నీ కూడా క్యాన్సర్ కు సూచనలని మీరు గుర్తించుకుని జాగ్రత్తపడాలి.

2. వృషణాల దగ్గర ఒక చిన్న గడ్డ ఏర్పడడం

2. వృషణాల దగ్గర ఒక చిన్న గడ్డ ఏర్పడడం

కొందరిలో వృషణాల దగ్గర ఒక చిన్న గడ్డ ఏర్పడుతుంది. దీనివల్ల ఎలాంటి నొప్పి ఉండదు. మొదట చిన్న బఠాణీగింజ పరిమాణంలో ఇది ఏర్పడుతుంది. తర్వాత కాస్త పెద్దగా మారుతుంది. అయితే ఇది అస్సలు నొప్పి కలిగించదు. కానీ మీకు ఇలాంటి గడ్డ ఏర్పడితే మాత్రం వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ఎందుకంటే అది క్యాన్సర్ కు కారణం కావొచ్చు.

3. స్క్రోటం పెరిగిపోవండం

3. స్క్రోటం పెరిగిపోవండం

కొందరిలో స్క్రోటం పెరిగిపోతుంది. ఇది టెస్టిక్యూలర్ క్యాన్సర్ కు కారణం కావొచ్చు. అక్కడ బాగా నొప్పి ఏర్పడితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. వృషణాలకు సంబంధించిన క్యాన్సర్ కు బారిన మీరు పడుతున్నారని అనడానికి ఇది సూచన. అందువల్ల వెంటనే జాగ్రత్తపడండి

4. ఫ్లూయిడ్స్ రావడం

4. ఫ్లూయిడ్స్ రావడం

స్క్రోటం లో జిగుటుగా ఉండే ద్రావణం వస్తుంటే మీరు జాగ్రత్తపడాలి. వారం రోజుల పాటు ఇలా జరుగుతుంటే మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఎందుకంటే మీరు టెస్టిక్యూలర్ ట్యూమర్ బారిన పడుతున్నారనడానికి ఇది సూచన.

5. నిపుల్స్ లో మార్పు వస్తుంది

5. నిపుల్స్ లో మార్పు వస్తుంది

వృషణాలకు సంబంధించిన క్యాన్సర్ లక్షణాలను నిపుల్స్ ద్వారా కూడా తెలుసుకోవొచ్చు. మీ చనుమొనలు కాస్త పెరగడం టెస్టిక్యూలర్ క్యాన్సర్ కు సూచన. వృషణాల్లో సంబంధించిన వ్యాధుల వల్ల చనుమొనల్లో మార్పు వస్తూ ఉంటుంది.

6. టెస్టికిల్స్ (వృషణాలు) ఆకృతి మారుతుంది

6. టెస్టికిల్స్ (వృషణాలు) ఆకృతి మారుతుంది

వృషణాలకు సంబంధించిన క్యాన్సర్ బారిన మీరు పడుతున్నారంటే మొదట మీ వృషణాల ఆకృతిలో మార్పు వస్తూ ఉంటుంది. అవి బాగా ఉబ్బిపోవడం లేదా వాపునకు గురికావడం జరుగుతుంది. ఇలాంటి మార్పులు మీలో వస్తే మీరు వెంనటే డాక్టర్ని సంప్రదించాలి.

7. రక్తం గడ్డకట్టడం

7. రక్తం గడ్డకట్టడం

శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడడం, కాళ్లు వాపునకు గురికావడం వంటివి రక్తం గడ్డకట్టడం వల్ల ఏర్పడుతుంటాయి. సిరల్లో రక్తం గడ్డకట్టడాన్ని డీవీటీ అంటారు. కొంతమంది ఇలాంటి వ్యాధికి గురవుతుంటారు. వృషణాలకు సంబంధించిన క్యాన్సర్ బారిన మీరు పడే అవకాశం ఉందనడానికి ఇది సంకేతం. అందువల్ల డీవీటీలాంటి వ్యాధులకు మీరు గురికాకుండా జాగ్రత్తపడాలి.

8.ఇన్ఫెక్షన్

8.ఇన్ఫెక్షన్

వృషణాల సంబంధించిన ఇన్ఫెక్షన్ ను ఆర్కిటిస్ అని పిలుస్తారు. వృషణాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ తో మీరు బాధపడుతున్నట్లయితే మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.

English summary

here are the early symptoms of testicular cancer

Testicular cancer is a deadly disease that is curable even if it is metastatic.This cancer often develops in either one of the two testicles.Read further to find out about the signs of testicular cancer.
Story first published: Monday, November 27, 2017, 11:00 [IST]
Subscribe Newsletter