Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
ప్రేగుల్లోని కొన్ని రకాల వైరస్ లు డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయి!
పరిశోధకుల ప్రకారం, మీ పిల్లల ప్రేగుల్లో ఉండే వైరస్ రకాలను బట్టి టైప్ 1 డయాబెటిస్ వచ్చే అవకాశాలు మారతాయి.
టైప్ 1 డయాబెటిస్ ఒక దీర్ఘకాలిక ఆటోఇమ్యూన్ వ్యాధి. ఇందులో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించాల్సిన కణాలను స్వంత శరీర కణాలే నాశనం చేస్తాయి. అందుకని ప్రతిరోజూ ఇన్సులిన్ ఇంజక్షన్లు, పర్యవేక్షణ అవసరం.
ఈ అధ్యయనం ప్రకారం ప్రేగుల్లో తక్కువ వైరస్ రకాలున్న పిల్లల్లో, స్వంత శరీరానికి హానికరమైన యాంటీబాడీస్ ఉత్పత్తి చేసి, టైప్ 1 డయాబెటిస్ కి దారితీయవచ్చు.

ఇంకా, సిర్కోవిరిడే కుటుంబానికి చెందిన ప్రత్యేక వైరస్ ఉన్న పిల్లల్లో మిగతావారికన్నా డయాబెటిస్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది.
మరోవైపు, మనుషుల కణాలపై కాకుండా ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియాపై దాడిచేసే బ్యాక్టీరియోఫేజెస్ అనే వైరస్ ల రకాల్లో కూడా తేడా కన్పించింది.
ప్రేగుల్లో ఎక్కువగా కన్పించే బ్యాక్టీరియోడ్స్ జాతులపై దాడిచేసే బ్యాక్టీరియోఫేజెస్ ఉన్న పిల్లలు మెల్లిగా డయాబెటిస్ వైపు అడుగులు వేస్తున్నారని పరిశోధకులు తెలిపారు.
వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన హెర్బర్ట్ 'స్కిప్' వర్జిన్ 4 అనే ప్రొఫెసర్ మాట్లాడుతూ " మేము ఈ రిస్క్ ను తగ్గించే ఒక వైరస్ ను కనుగొన్నాం అలాగే పిల్లల స్వంత కణాలపైనే పోరాడే యాంటీబాడీస్ ను పెంచే ప్రమాదం ఉన్న వైరస్ ల గ్రూప్ లను కూడా కనుగొన్నాం."

నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వారి జర్నల్ లో ప్రచురితమైన అధ్యయనంలో ఈ బృందం 22 మంది పిల్లల్లో డయాబెటిస్ రాగల ప్రమాదం వున్న వైరస్ లను విశ్లేషించింది.
ఫలితాల ప్రకారం డయాబెటిస్ ప్రమాదం ఉన్న పిల్లల్లో, రిస్క్ లేని పిల్లల్లో కన్నా కొన్ని వైరస్ రకాలు ఉన్నాయి.
వర్జిన్ మాట్లాడుతూ, " అనేక ఆటోఇమ్యూన్ వ్యాధులు ఈరోజుల్లో సాధారణం అయ్యాయి. అయితే మనలో సరైన వైరస్ లను ఉంచుకోకుండా మనల్ని మనం అనారోగ్యం పాలు చేసుకున్నాం," అని అన్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications