పార్కిన్ సన్స్ వ్యాధికి మెలనోమాకి సంబంధం ఉండి ఉండవచ్చు ; అధ్యయనం

By: Deepti
Subscribe to Boldsky

కదలికలకు వచ్చే రుగ్మత పార్కిన్ సన్స్ వ్యాధి ఉన్నవారికి చర్మ క్యాన్సర్ మెలనోమా వచ్చే అవకాశం, అలాగే చర్మక్యాన్సర్ ఉన్నవారికి పార్కిన్ సన్స్ వచ్చే అవకాశం మామూలు వారికన్నా నాలుగు శాతం ఎక్కువని అధ్యయనాల్లో తేలింది.

మాయో క్లినిక్ వారి పరిశోధనల ప్రకారం, ప్రచురితమైన అధ్యయనాల ప్రకారం, ఒక బృందం చేసిన పరిశోధనల్లో 2,922 మంది వ్యాధి లేని వారిలోకన్నా 974 పార్కిన్ సన్ రోగుల్లో మెలనోమా వచ్చే అవకాశం ఉన్నట్లు నిరూపితమైంది.

parkinsons

ఇదివరకు జరిగిన పరిశోధనల్లో, లెవడోపా- అనే పార్కిన్ సన్స్ వ్యాధికి చెందిన మందు కాన్సర్ కారక మెలనోమాకి దారితీయవచ్చేమో అని అనుమానించారు. కానీ ఇతరులు లెవడోపా చికిత్స జరిగినా లేకపోయినా ఈ రెండు వ్యాధుల మధ్య సంబంధం ఉందని పరిశోధించారు.

సీమ చింతకాయ సత్తా తెలిపే.. హెల్త్ బెన్ఫిట్స్

కొత్త ఫలితాల ప్రకారం, లెవడోపా కారణం కాదు కానీ, పార్కిన్ సన్స్, మెలనోమా మధ్య సంబంధం అయితే ఉన్నది.

రెండు స్థితులకు ఉమ్మడిగా పర్యావరణం, జన్యుపరం, రోగనిరోధక వ్యవస్థలో లోపాలు కన్పించినా, సరైన కారణాలు, చికిత్సలు నిర్ణయించటానికి మరింత పరిశోధన అవసరం అని శాస్త్రవేత్తలు తెలిపారు.

మాయో క్లినిక్ పరిశోధక రచయిత లారెన్ డాల్విన్ మాట్లాడుతూ, " పార్కిన్ సన్స్ కి మెలనోమాకి సంబంధం ఏంటో సరిగ్గా మనం అర్థం చేసుకోగలిగితే, రోగులకు, వారి కుటుంబాలకు మరో వ్యాధి వచ్చే అవకాశాన్ని ముందే తెలియచేసి సిద్ధం చేయగలం, " అని అన్నారు.

ఒక్క నెలలో డయాబెటిస్ లక్షణాలను తగ్గించే ఆయుర్వేదిక్ హోం రెమెడీ..

parkinsons

" భవిష్యత్ పరిశోధనలు రెండింటికి కల ఉమ్మడి జన్యువులు, రోగనిరోధక ప్రతిక్రియలు, రెండింటికీ సంబంధించిన పర్యావరణ కారణాలు వంటి వాటిపై జరిగితే మంచిది." అని జోడించారు.

ఇదిలా ఉంటే, పరిశోధకుల సలహా మేరకు, ఈ రెండింటిలో ఏదో ఒకదానితో బాధపడే వారిని అనుక్షణం పరిశీలిస్తూ ఉంటే, మరోటి తొందరగానే మొదట్లోనే గుర్తించి, చికిత్స మొదలుపెట్టవచ్చు. రోగులకు మరో వ్యాధి వచ్చే అవకాశంపై అవగాహన కల్పించటం ముఖ్యం.

With Inputs From IANS

English summary

Parkinson's may be linked to melanoma: Study

People suffering from movement disorder Parkinson's disease may also be at high risk of developing skin cancer melanoma and vice-a-versa.
Subscribe Newsletter