అంగస్తంభనను కాపాడుకోవడానికి 10 సులభమైన మార్గాలు

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

చాలా మంది యువకులు ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహిస్తుంటారు. తమకు ఏదైనా అయితే తప్ప జాగ్రత్త వహించారు. కొన్ని సార్లు మనం చేసే తప్పిదాల వల్ల అవి మన శరీరం పై తీవ్ర ప్రభావం చూపిస్తుంటాయి. అందులో ముఖ్యం గా పురుషాంగం పై ఆ ప్రభావం ప్రస్ఫుటంగా కనబడుతుంది.

చాలా మంది యువకులకు తాము పాటించే విధానం వల్లనే తమ ఆరోగ్యం పాడవుతోంది అనే విషయం స్పష్టంగా తెలుసు. కానీ, ఆ విషయమై అస్సలు పట్టించుకోరు. ఎప్పుడైతే అది శృంగార జీవితం పై ప్రభావం చూపించడం ప్రారంభిస్తుందో అప్పుడు విని పాటించడం మొదలుపెడతారు.

అంగస్తంభన మెరుగ్గా ఉంచే టాప్ 25 పవర్ ఫుడ్స్

మీ పురుషాంగం ఎలా పని చేయాలి అనే విషయం మీ పై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఈ క్రింద చెప్పబడిన 10 సులభమైన చిట్కాల ద్వారా మీ పురుషాంగాన్ని కాపాడుకోవచ్చు మరియు అంగస్తంభన సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.

1. మీ మందుల డబ్బాలో అనవసరమైన వాటిని ఏరి వేయండి :

1. మీ మందుల డబ్బాలో అనవసరమైన వాటిని ఏరి వేయండి :

కొన్ని మనోవ్యాకులతను పోగొట్టు పదార్థములను, రక్తపోటుకు సంబంధించిన మందులను, మత్తు కలిగించి నొప్పిని తగ్గించే మందులను మరియు ఎలర్జిని ఎదుర్కొనే మందులు వీటన్నింటిని వాడటం వల్ల అంగస్తంభనలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

ఇవే కాకుండా మీరు అతి సాధారణంగా వాడే మందులు కూడా మీకు అంగస్తంభనలో సమస్యలు సృష్టిస్తాయి. వాటిలో అతిముఖ్యమైనవి ఏవో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. మీకు ఏదైనా ఎలర్జీ లేదా దగ్గు మరియు జలుబు వచ్చినప్పుడు వేసుకునే మందులు కూడా మీకు అంగస్తంభన సమస్యలను సృష్టిస్తాయి.

ఇలా వివిధరకాలుగా మందులను వాడటం వల్ల శృంగార కోరికలు పూర్తిగా నశిస్తాయి లేదా వాటిలో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటాయి. దీంతో శృంగారపరంగా ప్రేరణ చెందక అంగస్తంభన సమస్యలు తలెత్తుతాయి అని పరిశోధకులు చెబుతున్నారు.

ఏ మందులనైనా కొనేటప్పుడు వాటిని వాడటం వల్ల వచ్చే దుష్ప్రభావాలు తెలుసుకోండి. ఒకవేల ఆయా మందుల వల్ల మీకు ఏమైనా నష్టం కలిగే అవకాశం ఉందని మీరు భావిస్తే, వాటి స్థానంలో వేరే మందులను వాడటానికి మీ డాక్టర్ ని సంప్రదించండి.

2. మీ నడుము యొక్క చుట్టుకొలతను అదుపులో ఉంచుకోండి :

2. మీ నడుము యొక్క చుట్టుకొలతను అదుపులో ఉంచుకోండి :

మీ నడుము యొక్క చుట్టుకొలత మరీ ఎక్కువగా పెరిగిపోతే అది మీ పురుషాంగాన్ని ప్రమాదంలోకి నెట్టేసే అవకాశం ఉంది. ఏ పురుషుడి యొక్క నడుము చుట్టుకొలత 39 ఇంచీలు లేదా అంతకు మించి ఉంటుందో అంటువంటి వ్యక్తులలో 35 ఇంచుల కంటే తక్కువ నడుము చుట్టుకొలత ఉన్నవారి కంటే , రెండు రేట్ల అధికంగా అంగస్తంభన సమస్యలు మొదలవుతాయి.

మీ నడుము చుట్టు కొలత మరీ ఎక్కువగా ఉంటే మీ శరీరంలో హాని కలిగించే అంతరాంగ కొవ్వు ఎక్కువగా ఉందని అర్ధం. ఈ హాని కలిగించే అంతరాంగ కొవ్వు వల్ల మీలో టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గిపోతాయి మరియు మంట కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రెండు అంశాలు మీ పురుషాంగం పై తీవ్ర ప్రభావం చూపి హాని కలిగిస్తాయి.

3. పొగత్రాగటాన్ని పూర్తిగా నిషేధించండి :

3. పొగత్రాగటాన్ని పూర్తిగా నిషేధించండి :

పొగత్రాగటం ఆరోగ్యానికి హానికరం అని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ చాలా మంది ప్రజలు పొగత్రాగే అలవాటుకి మరియు అంగస్తంభనకు సంబంధం ఉంది అనే విషయం చాలా కొద్ది మంది కి మాత్రమే తెలుసు. ఒకవేళ ఈ విషయం తెలిసినా అందువల్ల జరిగే దుష్ప్రభావాలను గుర్తించరు, ఆలోచించారు.

ఈ అలవాటు వల్ల రక్త నాళాలు బాగా దెబ్బ తింటాయి, ఇది పురుషాంగంలో ఉన్న అతి మైఖ్యమైన కండరాలపై ప్రభావం చూపుతుంది మరియు రక్త ప్రసరణ సరిగ్గా జరగకుండా అడ్డుకుంటుంది.

ఒక అధ్యయనం ప్రకారం పురుషుల్లో ఎవరికైతే పొగత్రాగే అలవాటు ఉందొ, అటువంటి వ్యక్తులు పొగత్రాగనివారి కంటే 51% అధికంగా అంగస్తంభన సమస్యలకు బాధితులుగా మారుతారని చెబుతున్నాయి.

ఈ అలవాటుని పూర్తిగా మాని వేయడం ఎందుకంత ముఖ్యం ? ఈ అలవాటు మానేసిన తర్వాత గతంలో పొగతాగే అలవాటున్న 25% మందిలో అంగస్తంభన విషయంలో మెరుగుదల కనిపించిందని నివేదికలు చెబుతున్నాయి. అదే సమయంలో పొగత్రాగుతున్న ఏ ఒక్కరు కానీ మాకు అంగస్తంభన మెరుగుపడింది అని చెప్పలేదని అధ్యయనాలు చెబుతున్నాయి.

4. మీ పనిని ఆఫీస్ లోనే వదిలేసి రండి :

4. మీ పనిని ఆఫీస్ లోనే వదిలేసి రండి :

పని వల్ల కలిగే ఒత్తిడి శృంగారపరమైన సమస్యలను సృష్టించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది మరియు పెద్ద సమస్యగా మారుతుంది. ఏ వ్యక్తులయితే 40 నుండి 50 సంవత్సరాల వయస్సులో ఉన్నారో వారు వృత్తిపరంగా ఎంతో ఎత్తుకు ఎదిగి ఉంటారు. కానీ, వారు చేస్తున్న వృత్తిలో తీవ్రమైన ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. ఇలాంటి వారిలో అంగస్తంభన సమస్యలు ఎక్కువగా కనపడతాయని నిపుణులు చెబుతున్నారు.

ఎందుకు ఇలా జరుగుతుందంటే ? పురుషులు వృత్తిపరంగా విపరీతమైన పని చేయవలసి వస్తుంది. అందువల్ల పనిని ఆఫీస్ లోనే వదిలేసి రాలేకపోతున్నారు. అంటే దానర్ధం వారిలో ఆ పనికి సంబంధించిన ఆతురత రోజంతా ఉంటుంది. అందువల్ల పడక గదిలో సంపూర్ణ శృంగారాన్ని చేయలేకపోతున్నారు మరియు రతి క్రీడను ఆస్వాదించలేకపోతున్నారు.

దీనికి తోడు ఏ వ్యక్తులైతే మరీ ఎక్కువగా పనిచేస్తుంటారో అటువంటి వ్యక్తులకు నిద్ర ఎక్కువగా ఉండదు మరియు శారీరిక వ్యాయామం చేయలేరు. ఈ రెండిటి వల్ల కూడా అంగస్తంభన సమస్యలు విపరీతంగా పెరిగిపోతాయి. ఆయా వ్యక్తులు శృంగారంలో వెనుకబడిపోతారు.

5. నాణ్యమైన సమయాన్ని నిద్రకు కేటాయించండి చేయండి :

5. నాణ్యమైన సమయాన్ని నిద్రకు కేటాయించండి చేయండి :

బాగా నిద్రించడం అనేది చాలా ముఖ్యమైన అంశం. కానీ కొన్ని కొన్ని సార్లు రాత్రిపూట ఎక్కువసేవు మేల్కొనడం వల్ల నిద్రాభంగం కలుగుతుంది. ఏ వ్యక్తులైతే 5 గంటలు లేదా అంతకంటే తక్కువ పడుకుంటారో అటువంటి వ్యక్తుల్లో నిద్ర అనేది టెస్టోస్టెరాన్ స్థాయిల పై ప్రభావం చూపుతోందని గుర్తించారు.

ప్రొటీన్లకు సంబంధం లేకుండా మరియు మీ శరీరం ఏదైతే చేయదలుచుకుంటుందో ఆ విషయాన్ని చేయడంతో పాటు, శృంగార కోరికలను మరియు సామర్ధ్యాన్ని పెంపొందించే విషయంలో ఎంతగానో తోడ్పడే ఉచిత టెస్టోస్టెరాన్ స్థాయిల పై నిద్ర అనేది ప్రభావం చూపుతుంది.

దీనికి తోడు నిద్ర అనేది మన మెదడులో ఉత్పత్తి అయ్యే డోపమైన్ మరియు సెరోటోనిన్ అనే హార్మన్ల పై ప్రభావం చూపుతుందని, నిద్ర వీటిని నియంత్రిస్తుందని చెబుతున్నారు.

యుక్త వయస్సు లో ఉన్న యువకులు మంచిగా నిద్రపోవడం అనేది చాలా అవసరం. ఎందుకంటే టెస్టోస్టెరాన్ అనేది వాళ్ళ జీవితంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా అంగస్తంభన విషయంలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తుంది. కాబట్టి మీ నిద్రకు భంగం కలిగించే విషయాలను దూరంపెట్టి హాయిగా నిద్రపోండి.

రోజుకు కనీసం 6 గంటలు రాత్రిపూట నిద్రపోవడం చాలా అవసరం. 7 లేదా 8 గంటలు నిద్రకు కేటాయించడం మంచిది అని చెబుతున్నారు నిపుణులు.

అంగస్తంభన బహిరంగ ప్రదేశాల్లో చోటు చేసుకుంటే ఎలా దాచుకోవాలి ?

6. మీరు మీ యొక్క దంతాలను శుభ్రంగా బ్రష్ చేసుకోండి :

6. మీరు మీ యొక్క దంతాలను శుభ్రంగా బ్రష్ చేసుకోండి :

ఏ వ్యక్తులకు అయితే అంగస్తంభన సమస్యలు ఉన్నాయో, అటువంటి వ్యక్తుల్లో అంగస్తంభన సమస్యలు లేనివారి కంటే మూడు రెట్లు అధికంగా చిగుళ్ళ సమస్యలు ఉన్నాయని ఒక అధ్యయనం చెబుతోంది .

అంతే కాకుండా ఏ వ్యక్తుల్లో అయితే నపుంసకత్వము ఉంటుందో అటువంటి వ్యక్తుల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందని చెబుతున్నారు. ఏ వ్యక్తులైతే విపరీతమైన అంగస్తంభన సమస్యలను ఎదుర్కుంటున్నారో అటువంటి ప్రతి ఐదుగురిలో నలుగురికి చిగుళ్ళకు సంబంధించిన వ్యాధులు విపరీతముగా వస్తున్నాయని విషయం స్పష్టమైంది.

ఎప్పుడు అయితే పళ్ళు పుచ్చిపోవడం మొదలవుతుందో , అప్పటి నుండి మీ నోట్లో ఉన్న వ్యాధికారక క్రిములపై రోగనిరోధక వ్యవస్థ దాడి చేయడం ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో ఆ క్రిములు రక్తంలోకి ప్రవేశిస్తాయి , రక్త ప్రసరణను విఘాతం కలిగిస్తాయి మరియు రక్త నాళాలను దెబ్బతీస్తాయి అని పరిశోధకులు చెబుతున్నాయి.

అదృష్టవశాత్తు, క్రమం తప్పకుండా మీ పళ్ళ మధ్య ఇరుక్కొని ఉన్న పదార్ధాలను తీసివేయడం ద్వారా మరియు రోజుకు రెండుసార్లు పళ్ళను తోముకోవడం ద్వారా మీకు ఎదురయ్యే చిగుళ్ళ సమస్యలను నివారించుకోడంతో పాటు అంతకు మించిన లాభాన్ని మీరు పొందుతారు.

7. మద్యపానాన్ని నియంత్రణలో ఉంచుకోండి :

7. మద్యపానాన్ని నియంత్రణలో ఉంచుకోండి :

మద్యం సేవించని పురుషుల కంటే కూడా, ఏ వ్యక్తులైతే మద్యాన్ని సేవిస్తారో అటువంటి వారిలో అంగస్తంభన సమస్యలు విపరీతంగా తలెత్తినట్లు గుర్తించాయి కొన్ని అధ్యయనాలు.

ఇప్పటికిప్పుడు పడక గదిలో మీ ప్రదర్శనలో ఎటువంటి సమస్యలు తలెత్తకపోయినా, విపరీతమైన తాగుడు వల్ల అది మీ శృంగార ప్రదర్శనపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. మామూలు మద్యపానం కంటే కూడా సంస్కరించబడిన మద్యాన్ని సేవించడం వల్ల అంగస్తంభన సమస్యలు మరింతగా పెరుగుతాయి అనే విషయాన్ని అధ్యయనాల్లో గుర్తించారు.

దీనికి తోడు మద్యం వల్ల వైరాగ్యం ఏర్పడుతుంది. అందువల్ల శృంగార కోరికలు విపరీతంగా తగ్గిపోతాయి. దీనికి అదనంగా విపరీతంగా అలసిపోతుంటారు. ఆ అలసట వల్ల ఏ పనిపై దృష్టి పెట్టలేరు, దానిని పూర్తి చేయడానికి కృషి చేయలేరు.

అందువలన మీరు తీసుకొనే మద్యం పై పూర్తిగా నియంత్రణ ఉంచుకోవడం చాలా అవసరం. అధిక మోతాదులో మద్యం సేవించడం, మీ పడక గది ప్రదర్శన పై ప్రభావం చూపుతుంది, సమస్యలను సృష్టిస్తుంది. అందుచేత మద్యాన్ని వీలయితే అస్సలు త్రాగకండి. ఒకవేళ త్రాగవలసి వస్తే పూర్తి నియంత్రణతో త్రాగండి.

8. చెమట చిందేలా పనిచేయండి :

8. చెమట చిందేలా పనిచేయండి :

అంగస్తంభన బాగా జరగడానికి శారీరిక వ్యాయామ అనేది చాలా అవసరం అని అందరికి తెలుసు కానీ ఎదో మాములుగా చేసామా అంటే చేసాము అన్నట్లు చేస్తే అందుకు తగ్గ ప్రతిఫలాలు మీకు లభించవు. మీరు వ్యాయామాన్ని తీవ్రంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ వ్యక్తుల్లో అయితే అధిక రక్తపోటు మరియు అంగస్తంభన సమస్యలు ఉన్నాయో, అటువంటి వ్యక్తులు సరైన వ్యాయామం చేయడం వల్ల అంగస్తంభన విషయంలో వ్యాయామం చేయని వారికంటే వాళ్ళ పరిస్థితి మెరుగ్గా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.

శారీరిక వ్యాయామాలు బాగా చేయడం ద్వారా శరీరంలో మంట తగ్గుతుంది. మరియు రక్త నాళాల పనితనం మరింత మెరుగవుతుంది. ఇందువల్ల అంగస్తంభనలో ఎటువంటి సమస్యలు తలెత్తవని పరిశోధకులు చెబుతున్నారు.

9. మరీ ఎక్కువగా ఆతురత పడకండి :

9. మరీ ఎక్కువగా ఆతురత పడకండి :

మీరు ఎప్పుడైతే ఎవరికైనా ద్రోహం చేస్తారో, అప్పుడు మీరు అపరాధం చేసినట్లు భావిస్తారు మరియు పశ్చాత్తాపపడతారు. మీలో ఉన్న అపరాధ భావన, మీలో ఆతురత పెరగడానికి కారణం అవుతుంది. ఆతురత పెరగడం వల్ల మీ మెదడులో కొన్ని రసాయన మార్పులు జరుగుతాయి. అవి మీ అంగస్తంభన సామర్ధ్యం పై దాడి చేస్తాయి.

ఆతురత అనేది మరీ ఎక్కువ స్థాయిలలో ఉండటం వల్ల, అది మీ నాడీ వ్యవస్థ పై ప్రభావం చూపి మిమ్మల్ని శృతి మించేలా చేస్తాయి. దీర్ఘకాలం మిమ్మల్ని పోరాడాలి లేదా తప్పుకోవాలి అనే స్థితిలో ఉంచేస్తాయి. ఇలాంటి స్థితి నుండి మీరు అంత త్వరగా సాధారణ స్థితికి చేరుకోలేరు. దీంతో మీలో శృంగార కోరికలు కూడా కలగవు.

ఆతురత నాడీ ప్రసారిణిని పనిచేయకుండా చేస్తుంది. ఇందువల్ల అంగస్తంభన అనేది జరగదు. ఎందుకంటే అంగస్తంభన కలిగేలా ప్రేరేపించడం లో నాడీ ప్రసారణి ముఖ్యపాత్ర పోషిస్తుంది.

10. మీ మూల స్థానం పై ల్యాప్ టాప్ ని పెట్టుకోకండి :

10. మీ మూల స్థానం పై ల్యాప్ టాప్ ని పెట్టుకోకండి :

ల్యాప్ టాప్ లు విపరీతమైన వేడిని ఉత్పత్తి చేస్తాయి. మీ వృషణాలకు వేడి తగలడం వల్ల వీర్య కణాల సంఖ్య తగ్గిపోతుంది అంతే కాకుండా టెస్టోస్టెరాన్ స్థాయిల పై ప్రభావం చూపుతుంది.

వృషణాల్లో ఉండే కణాలు ఉత్పత్తి చేసే వీర్యకణాలు మరియు హార్మోన్లు ఎక్కువ వేడికి తట్టుకోలేవు. అందుచేతనే, శరీరంకి వెలుపల ఈ వృషణములున్న సంచి ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత కంటే కూడా తక్కువ స్థాయి ఉష్ణోగ్రతలో వృషణాలు పనిచేస్తాయి. అలా ఉంటేనే పనిచేయగలవు.

మీ ల్యాప్ టాప్ ల ని మీ పురుషాంగం దగ్గర పెట్టుకోవడం వల్ల అది మీ టెస్టోస్టెరాన్ ఉత్పత్తి పై ప్రభావం చూపిస్తుంది. దీంతో మీకు అంగస్తంభన సమస్యలు తలెత్తుతాయి.

English summary

10 Simple Ways to Protect Your Erection Right Now

“A lot of guys know their lifestyle is harming their health, but it isn’t until it begins to affect their sex life that they start to listen,” says Charles Walker, M.D., assistant professor of urology and cofounder of the Cardiovascular and Sexual Health clinic at Yale University.
Please Wait while comments are loading...
Subscribe Newsletter