బ్రాసైజ్ కరెక్ట్స్ గా లేకపోతే..శరీరంలో జరిగే డేంజరస్ మార్పులు

Posted By: Lekhaka
Subscribe to Boldsky

సాధారణంగా మహిళలు ఎంపిక చేసుకునే దుస్తుల్లో విశేష ప్రాధాన్యత కలిగింది 'బ్రా'నే...ఇది కేవలం అందాలకు... ఆకర్షణకు మాత్రమే పరిమితం కాదని...ఛాతి ఆకృతిని కప్పి ఉంచడంతో పాటు ఆరోగ్యాన్ని... ఆత్మ విశ్వాసాన్ని కలుగ చేస్తాయని...సరైన జాగ్రత్తలు తీసుకుని వీటిని కొనుగోలు చేసుకోకుంటే... ఇబ్బంది తప్పదంటున్నారు నిపుణులు మగాళ్ల మనసుల్ని దోచేలా ముగువలున్నారంటే... వారి అందమొక్కటే కాదు... అనేక అంశాలు అందుకు ప్రాధాన్యలుంటాయి. వీటిలో చెప్పుకోదగ్గ వాటిలో వారు ధరించే బ్రా ప్రధాన భూమిక పోషిస్తుందనటంలో సందేహంలేదు. మరి ఇంతలా అందర్నీ కట్టిపడేస్తున్న బ్రా కధాకమామిషేంటని ఓసారి పరిశీలిస్తే...

Wearing Wrong Size Bra Can Be Dangerous; Know The Reasons

ఈ మోడ్రన్ యుగంలో కూడా చాలామంది మహిళలు తమ బ్రా కొనుగోలు చేయాలంటే ఇబ్బంది పడుతున్నారు. పురుషులు సేల్స్ మెన్ లుగా ఉండే షాపుల్లో అయితే పరిస్ధితి మరీ దారుణం. బ్రాలను అడిగి, పరిశీలించి కొనుగోలు చేయాలన్నా సిగ్గుపడుతూ, చేతికి అందిన దాన్ని తీసుకుని తిరుగుముఖం పడుతున్నారు. తీరా ఇంటికి వచ్చిన తర్వాత వేసి చూసుకుంటే అది వదులుగానో, బిగుతుగానో ఉండటాన్ని గ్రహించి దానిని బయటకు చెప్పుకోలేక అలానే వేసేసుకుంటూంటారు. బ్రా అంటే కేవలం అందం కోసమేనని అందరూ అనుకుంటారు. కానీ, అది ఆరోగ్యానికి కూడా పలు రకాలుగా మేలు చేస్తుందన్న విషయాన్ని వారు విస్మరిస్తున్నారు. సరైన సైజు బ్రాలు వాడితే మెడనొప్పి, వెన్నునొప్పి, తలనొప్పి వంటి వాటికి దూరంగా ఉండవచ్చు.

అంతేకాదు, బ్రా ఎంపిక లొపాలే రొమ్ము కేన్సర్ కు పలు సందర్భాలలో కారణమవుతుందని కూడా నిపుణులు అంటున్నారు. మీరు ఎన్నుకొనే బ్రా కొంచెం కూడా స్తన భాగం బయటకు రాకుండా ఉండేవిధంగా ఉండాలి. కప్ సైజ్ బ్రాను కొనుగోలు చేయడంలో ఉన్న ఆసక్తిని, స్ట్రాప్ ఎంపికలోనూ చూపాలి. వెడల్పు తక్కువగా ఉండే స్ట్రాప్ లు వక్షోజాలను సరైన రీతిలో ఉంచలేవు. అలాగే ముందువైపు హుక్కులు ఉండే బ్రాల కంటే కూడా వెనుక హుక్కులు ఉండే బ్రాలు బాగా పట్టి ఉంచుతాయి. బ్రాలను వాడకపోతే వక్షోజాలు వదులుగా, జారిపోయినట్లగా ఉంటాయి. పాలు పట్టే పిల్లల తల్లులైతే డబుల్ కప్ టైప్ బ్రా తొడుక్కోవడం ఎంతైనా అవసరం. వ్యాయామం చేసేటపుడు కూడా బ్రా ను ఖచ్చితంగా వేసుకోవాలి. ఎటువంటి కాలంలోనైనా కాటన్ బ్రాలు తొడుక్కోవడం మంచిది.

బ్రా అన్నది కేవలం అందం కోసమే కాదు ఆరోగ్యాన్ని కూడా కాపాడేది అన్నది చాలా తక్కువమందికి తెలుసు. అయితే ఏదో ఓ బ్రా కొనేసుకున్నాం. వేసేసుకున్నాం అన్న తీరులో పోతే, వెన్ను నొప్పి, తలనొ ప్పి, మెడనొప్పితో పాటు రొమ్ము క్యాన్సర్‌ వచ్చే ఆస్కారం కూడా ఉందన్నది వైద్య నిపుణుల హెచ్చరిక. బ్రా సరిలేకుంటే... అంతే...శరీరాన్ని బిగుతుగా పట్టి ఉంచేలా ఉండే దుస్తులకు ఎక్కువగా నేటి యువత ఆకర్షింపబడుతున్న క్రమంలో బ్రా ఎంపిక కూడా చాలా జాగ్రత్తగా జరగాల ని... శరీరాకృతిని మార్పు చేసేలా బ్రాలుంటాయన్న విషయాన్ని పరిగణన లోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. అలా సరైన బ్రాను ఎంపిక చేసుకోకపోతే కొన్ని ప్రమాధకరమైన ఆరోగ్యసమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. అవేంటో ఒక సారి పరిశీలించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి...

మహిళలు వేసుకునే బ్రా సైజ్ కరెక్ట్ గా ఉండాలి. లేదంటే సరైన బ్రా సైజ్ వేసుకోకంటే, ఈ క్రింద సమస్యలు ఎదుర్కోక తప్పదు..

స్కిన్ రాషెస్ :

స్కిన్ రాషెస్ :

బ్రా సైజ్ కరెక్ట్ గా ఉంటే, ఎలాంటి సమస్య ఉండదు. అయితే తప్పైతే స్కిన్ రాషెస్ ఎదుర్కోక తప్పదు. ముఖ్యంగా స్ట్ర్రాప్స్ మీద నిర్లక్ష్యం చేస్తే ఇన్ఫెక్షన్స్ కు కారణమవుతుంది.

 జీర్ణశక్తి మీద ప్రభావం చూపుతుంది:

జీర్ణశక్తి మీద ప్రభావం చూపుతుంది:

కరెక్ట్ సైజ్ బ్రా వేసుకోవడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు. అదే తప్పైతే మాత్రం అది జీర్ణశక్తి మీద కూడా ప్రభావం చూపుతుంది.

లిఫ్యాటిక్ నరాల మీద ప్రభావం చూపుతుంది:

లిఫ్యాటిక్ నరాల మీద ప్రభావం చూపుతుంది:

బ్రా సైజ్ తప్పుతై ముఖ్యంగా రైట్ సైడ్ టైట్ గా ఉన్నట్లైతే లింపాటిక్ నరాలు దెబ్బతింటాయి. లింపాటిక్ నరాలు కంప్రెస్ అయితే, శరీరంలో టాక్సిన్ తొలగించడం కష్టం అవుతుంది. ఈ విషయం రీసెంట్ గా పరిశోధనల్లో నిర్ధారించారు.

బ్రెస్ట్ క్యాన్సర్:

బ్రెస్ట్ క్యాన్సర్:

టైట్ బ్రా వేసుకోవడం వల్ల బ్రెస్ట్ లో రక్త ప్రసరణ సరిగా జరగదు. ఇది దీర్ఘకాలం పాటు కొనసాగితే బ్రెస్ట్ క్యాన్సర్ కు కారణమవుతుంది.

క్రోనిక్ బ్యాక్ & నెక్ పెయిన్ :

క్రోనిక్ బ్యాక్ & నెక్ పెయిన్ :

టైట్ బ్రా వేసుకోవడం వల్ల భుజాల మీద షోల్డర్ మీద ప్రభావం చూపుతుంది. ఈ ప్రెజర్ నిధానంగా మెడ మీద భుజాల మీద పడుతుంది.రిబ్ కేజ్ మీద ప్రభావం చూపుతుంది.

బ్రీతింగ్ డిఫకల్టీస్:

బ్రీతింగ్ డిఫకల్టీస్:

శ్వాసలో ఇబ్బందులు: సరిగా ఫిట్ కాని బ్రా వేసుకోవడం వల్ల బోన్స్ మీద ప్రెజర్ లేదా స్ట్రెస్ కు దారితీస్తుంది. ఇలా వేసుకోవడం వల్ల శ్వాసలో ఇబ్బంది కలుగుతుంది. సెడన్ గా శ్వాస కోల్పోవల్సి వస్తుంది..

మెమరీ గ్లాండ్ టిష్యు దెబ్బతింటుంది:

మెమరీ గ్లాండ్ టిష్యు దెబ్బతింటుంది:

బ్రా మరీ టైట్ గా వేసుకోవడం వల్ల ఇది మెమరీ గ్లాండ్స్ మీద ప్రభావం చూపుతుంది. రిబ్స్ మీద కంటిన్యుగా ప్రెజర్ పడితే టాక్సిన్ విడుదల చేయడం లో విఫలం అవుతుంది. ఇది మెమరీ గ్లాండ్స్ మీద ప్రభావం చూపుతుంది.అది బ్రెస్ట్ క్యాన్సర్ కు దారితీస్తుంది.

English summary

Wearing Wrong Size Bra Can Be Dangerous; Know The Reasons

Women, you might get lured by the colourful and fancy bras in the market and you quickly pick them up. Though it might be tight for you but since you bought it you tend to wear it without any second thought
Story first published: Saturday, March 18, 2017, 14:00 [IST]