మీరు డయాబెటిసా? అయితే మీ జీవన శైలిలో ఈ మార్పులు చేసుకోండి!

By: Mallikarjuna
Subscribe to Boldsky

ప్రస్తుతం మన దేశాన్ని పట్టి పీడిస్తున్న ప్రాణాంతక వ్యాధుల్లో డయాబెటిస్ ఒకటి. వాస్తవంగా చెప్పాలంటే ప్రతి సంవత్సరం డయాబెటిస్ వల్ల మరణాల రేటు రోజురోజుకు పెరుగుతోంది.

మీకు తెలుసా ఈ ప్రపంచంలోనే డయాబెటిస్ కు 'రాజధాని’గా మన ఇండియా మారింది?ఆశ్చర్యంగా ఉంది కదూ?ఆశ్చర్యం అనిపించినా ఇది వాస్తవం, ప్రపంచంలోనే ఇండియా డయాబెటిక్ హోం అయింది.

డయాబెటిస్ కు ముఖ్య కారణం మన శరీరంలోని ఇన్సులిన్ ప్రభావం, ఇది మనం తీసుకునే ఆహారం ద్వారా షుగర్ రూపంలోకి మారి ఎనర్జీని అందిస్తుంది. ఇది తక్కువ హార్మోన్ల ఉత్పత్తికి కారణం అవుతుంది లేదా శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీకి కారణం అవుతుంది.

how to prevent diabetes

డయాబెటిస్ చాలా వరకూ జీవనశైలికి సంబంధించినది, ఇన్సులిన్ గురించి మంచి అవగాహన ఉంటే చాలు డయాబెటిస్ రాకుండా నివారించుకోవచ్చు. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఊబకాయానికి కారణం అవుతున్నది. అంతే కాదు, ఇది వంశపారం పర్యంగా వ్రుద్ది చెందుతున్నది. ఇది కుంటుంబంలో ఒకరికి వస్తే చాలు, మగిలిన జనరేషన్ మొత్తాన్ని బాధిస్తున్నది.

డయాబెటిస్ ఒక సైలెంట్ కిల్లర్. ఇది వ్యాధి ఆలస్యంగా బాడీ మొత్తం వ్యాప్తి చెందుతుంది. డయాబెటిస్ కు, గుండెజబ్బులకు చాలా దగ్గరి సంబంధం ఉంది. హై బ్లడ్ ప్రెజర్ ను పెంచడంలో కూడా దీన్ని పాత్ర ఉండి. అంతే కాదు, డయాబెటిస్ వల్ల స్ట్రోక్ (పక్షవాతం)వచ్చే అవకాశం కూడా ఉంది.

డయాబెిస్ రెటీనోపతికి కారణమయ్యే కంటిచూపును పోగొడుతుంది. డయాబెటిస్ వారిలో ఇది ఒక సాధారణ సమస్య. ఇంకా అధిక రక్తపోటు వల్ల కిడ్నీపనితీరు మీద ప్రభావం చూపుతుంది.

అందువల్ల, శరీరంలో మరింత డ్యామేజ్ అవ్వకముందే డయాబెటిస్ ను నివారించుకోవడానికి తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

డయాబెటిక్ పేషంట్స్ క్రమం తప్పకుండా ఒంట్లో బ్లడ్ షుగర్ లెవల్స్ ను చెక్ చేసుకుంటుండాలి. లేదంటే ఇన్సులిన్ ఇంజక్షన్స్ ను వాడాల్సి ఉంటుంది. ఇతరులు లైఫ్ స్టైల్ మార్చుకోవడం వల్ల డయాబెటిస్ రాకుండా మ్యానేజ్ చేసుకోవచ్చు. హెల్తీ లైఫ్ స్టైల్ మరియు డయాబెటిస్ ను మ్యానేజ్ చేయడానికి కొన్ని విలువైన పాయింట్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి..

1) ప్రొసెస్డ్ ఫుడ్స్ తినకూడదు:

1) ప్రొసెస్డ్ ఫుడ్స్ తినకూడదు:

ప్రొసెస్ చేసిన ఆహారాల్లో న్యూట్రీషియన్ విలువలు మొత్తం పోయింటాయి. వాటిలో ఏ మాత్రం విటమిన్స్, మినిరల్స్ మరియు ఫైబర్ వంటివేవి ఉండవు. అవి సులభంగా జీర్ణం అయిపోవడం వల్ల సడెన్ గా బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతాయి. కాబట్టి, ప్రొసెస్ చేసిన ఆహారాలు ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది.

2) రోజూ వ్యాయామం:

2) రోజూ వ్యాయామం:

రోజూ వ్యాయామం చేయడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది. ఇది శరీరంలోని గ్లూకోజ్ ను ఉపయోగించుకోవడానికి సహాయపడుతుంది. దాంతో హెల్తీ వెయిట్ ను మెయింటైన్ చేయవచ్చు. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటిని పెంచుకోవచ్చు. దాంతో గుండెజబ్బులకు దూరంగా ఉండవచ్చు.

3) స్ట్రెస్ తగ్గించుకోవాలి:

3) స్ట్రెస్ తగ్గించుకోవాలి:

ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎక్కువగా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకొనేలా చేస్తాయి, ఇది డయాబెటిస్ పేషంట్స్ కు మంచిది కాదు. ఒత్తిడిలో ఉన్నప్పుడు శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. ఎప్పుడూ స్ట్రెస్ తో ఉండటంవ ల్ల హార్ట్ మరియు, అంతర్గత అవయవాల మీద తీవ్ర ప్రభావం చూపుతాయి. ప్రమాదకర స్థితి ఏర్పడుతుంది. స్ట్రెస్ తో ఉన్నప్పుడు,సమయానికి మందులు వేసుకోవాలన్న ఆలోచన ఉండదు, మర్చిపోవడం జరుగుతుంది. దాంతో డయాబెటిస్ ను మ్యానేజ్ చేయడం కష్టం అవుతుంది.

4) హెల్తీ డైట్ :

4) హెల్తీ డైట్ :

రెగ్యులర్ వ్యాయామం మరియు హెల్తీ డైట్ వల్ల డయాబెటిస్ ను మ్యానేజ్ చేయవచ్చు. హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల వెయిట్ కంట్రోల్లో ఉంటుంది, బ్లడ్ షుగర్ లెవల్స్ స్థిరంగా ఉంటాయి. హెల్తీ మీల్స్ తినడం వల్ల పొట్ట నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది, యాక్టివ్ గా ఉంటాయి. మరియు బాడీ ఇన్సులిన్ సెన్సిటివిటి పెరుగుతుంది.

5) ఎక్కువ సమయం కూర్చోవడం నివారించాలి:

5) ఎక్కువ సమయం కూర్చోవడం నివారించాలి:

రీసెంట్ స్టడీస్ ప్రకారం ఎక్కువ సమయం ఒకే చోట కూర్చొని పనిచేయడం వల్ల డయాబెటిస్, కార్డియో వాస్క్యులర్ వ్యాధులు వస్తాయని పరిశోధనల్లో నిర్ధారించారు. డయాబెటిస్ వారి రక్తంలో గ్లూకోజ్ అధికంగా ఉండటం వల్ల అది ఎనర్జీ గా మారదు. ఈ గ్లూకోజ్ ఇంటర్నల్ ఆర్గాన్స్ ను దెబ్బతీస్తుంది. కాబట్టి ఒకేచోట కూర్చోవడాన్ని నివారించండి.

6) ఎక్కువ నీళ్ళు తాగడం:

6) ఎక్కువ నీళ్ళు తాగడం:

రోజుకు సరిపడా అప్పుడప్పుడు నీళ్ళు తాగడం వల్ల హైబ్లడ్ షుగర్ లెవల్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. శరీరం డీహైడ్రేషన్ లో ఉన్నప్పుడు వాసోప్రెషన్ అనే హార్మోను పెరుగుతుంది. ఈ హార్మోన్ కాలేయం నీటిని నిల్వచేసుకుని, ఎక్కువ బ్లడ్ షుగర్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఒత్తిడి కారణం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటి తగ్గుతుంది.

7)రెగ్యులర్ చెకప్స్:

7)రెగ్యులర్ చెకప్స్:

డయాబెటిస్ ను మ్యానేజ్ చేయాలంటే రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవడం ఉత్తమం. రెగ్యులర్ చెకప్స్ వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ ను కనుగొనవచ్చు. దాంతో మీ డైట్ ను మీరు అడ్జెస్ట్ చేసుకోవచ్చు. డయాబెటిస్ వల్ల ఇంటర్నల్ ఆర్గాన్స్ కు డ్యామేజ్ కలగకుండా రెగ్యులర్ చెకప్స్ సహాయపడుతాయి.

8) ఆల్కహాల్ మరియు స్మోకింగ్ నిలిపి వేయాలి:

8) ఆల్కహాల్ మరియు స్మోకింగ్ నిలిపి వేయాలి:

డయాబెటిస్ ఉండి హార్ట్ డిసీజ్ తో బాధపడే వారు స్మోకింగ్, ఆల్కహాల్ సమస్యను మరింత ఎక్కువ చేస్తుంది. ఎక్సెస్ బ్లడ్ షుగర్ లెవల్స్, స్మోకింగ్ ధమనులను డ్యామేజ్ చేసి, బ్లడ్ కణాలకు డ్యామేజ్ చేస్తుంది. హార్ట్ అటాక్ రిస్క్ ను పెంచుతుంది. ఆల్కహాల్ డ్రింక్స్ ఎక్కువ క్యాలరీలుండటం వల్ల బరువు పెంచుతుంది. ఇవి కిడ్నీల మీద ప్రభావం చూపుతుంది. కిడ్నీ ఫెయిల్యూర్ కు కారణం అవుతుంది.

9) బాగా నిద్రపోవాలి:

9) బాగా నిద్రపోవాలి:

మంచి నిద్ర వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ క్రమబద్దం అవుతాయి. నిద్ర లేమి సమస్యల వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటికి కారణం అవుతుంది. రాత్రుల్లో బాగా నిద్రపోవడం వల్ల రోజంతా యాక్టివ్ గా ఉండవచ్చు. ఆకలిని దూరం చేసుకోవచచు.

10)వెయిట్ ను మెయింటైన్ చేయాలి:

10)వెయిట్ ను మెయింటైన్ చేయాలి:

ఎక్సెస్ వెయిట్ డయాబెటిస్ కు పూర్తి వ్యతిరేఖం, ఎక్సట్రా క్యాలరీలు తీసుకున్నప్పుడు, కాలేయం మీద ఒత్తిడి పెరుగుతుంది. దాంతో ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి కారణంగా ఎక్సెస్ షుగర్ గ్లూకోజ్ గా మారుతుంది. ఇది నిధానంగా ఇన్సులిన్ సెన్సిటివిటిని పెంచి డయాబెటిస్ రిస్క్ ను పెంచుతుంది. అందువల్ల ఎక్సెస్ వెయిట్ కూడా డయాబెటిస్ కు మూలకారణం అని గుర్తుంచుకోండి.

English summary

Lifestyle Changes You Need To Make If You Have Diabetes

There are certain lifestyle changes that you need to make in order to prevent diabetes. Know about a few of them here on Boldsky.
Subscribe Newsletter