For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ఆహారాలు మలబద్దకానికి కారకాలు

|

భారతదేశంలో అనేక మంది ప్రజలు తరచుగా ఎదుర్కుంటున్న సమస్యలలో మలబద్దకం కూడా ఒకటి. కానీ దీని గురించి మాట్లాడుటకు కానీ, చర్చలు జరుపుటకు కానీ సిగ్గుని ప్రదర్శిస్తుంటారు. కానీ ఇది అందరికీ ఉన్న సహజ సమస్యే అన్న విషయాన్ని మాత్రం ఆలోచించరు. కావున ఈ వ్యాసంలో మలబద్దకాన్ని కలిగించే ఆహారాల గురించిన వివరణ ఇవ్వడం జరిగినది.

సమస్య జఠిలమై చివరకు ప్రాణాలను కూడా హరించేలా శరీరంలో పెను మార్పులను తీసుకు రాగలదు ఈ మలబద్దకం. కావున అనుమానం వచ్చిన వెంటనే దానిని తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలి. కొన్ని ప్రకటనలను చూసి మోసపోకుండా నలుగురిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. పరిస్తితి మెరుగవ్వని పక్షంలో లేదా ముందస్తు జాగ్రత్తతో అయినా డాక్టరుని సంప్రదించి సరైన పరీక్షలు చేసుకొని తగ్గించే మార్గాలపై దృష్టి సారించడం మేలు.

Foods That Cause Constipation

మలబద్దకం అనేది ఒక సాధారణ సమస్య, కడుపులో జీర్ణ క్రియలు సరిగ్గా లేక, లేదా ఏదైనా రోగాలకు గురవడం మూలంగా పెద్ద ప్రేవు సరిగ్గా పని చేయని పక్షంలో ఈ మలబద్దకం అనేది వస్తుంది. మన ఆహారపు అలవాట్లే ముఖ్యంగా ఈ మలబద్దకానికి కారణం అవుతాయని వేరే చెప్పనవసరం లేదు.

ఒక సర్వే నివేదిక ప్రకారం మనదేశంలో అత్యధికులు భాధ పడుతున్న సమస్యలుగా జలుబు, దగ్గు మరియు మలబద్దకం ఉన్నది.

సరైన ఆహార ప్రణాళికలు లేకుండా కడుపు నిండుటకు మరియు రుచికోసం మాత్రమే ఆహారం తీసుకునే వారిలోనే ఎక్కువగా ఈ సమస్యలు వస్తుంటాయి. ఈ మలబద్దకం కడుపు ఉబ్బరానికి, ఆపాన వాయువుల ప్రభావాలకు కూడా కారణం అవుతుంది. ఇవి మీకు చాలా అసౌకర్యాన్ని కలిగిస్తుంటాయి. ఈ క్రింది ఆహార పదార్ధాలు మలబద్దకానికి ప్రధాన కారకాలుగా చెప్పబడినవి. కావున వీటి విషయంలో జాగ్రత్త తప్పనిసరి.

పూర్తిగా పoడని అరటి పళ్ళు :

పూర్తిగా పoడని అరటి పళ్ళు :

ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ ఇది నిజం. ఇలా పూర్తిగా పoడని అరటి పండ్లలో పిండిపదార్ధాలు ఎక్కువగా ఉంటాయి, ఇవి సరిగ్గా అరుగుదల కాక మలబద్దకానికి కారణమయ్యే అవకాశం ఉంది. కావున బాగా పండిన అరటి పండ్లనే స్వీకరించాలి.

ఫాస్ట్ ఫుడ్ :

ఫాస్ట్ ఫుడ్ :

ఈ ఫాస్ట్ ప్రపంచంలో అధిక శాతం ఫాస్ట్ ఫుడ్ వైపే మొగ్గు చూపిస్తున్నారు. తద్వారా నిల్వ ఉంచిన, సరైన నియమాలు లేకుండా వండిన ఆహారపదార్ధాలను తెలీక తింటున్నారు. ఒక సర్వే ప్రకారం, దేశం లో అనేక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలోని ఆహార పదార్ధాలలో ఫికల్ (మలవ్యర్ధాల తో కూడిన) బాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. కొందరైతే ఒకో చేత్తో ఫోన్ పట్టుకుని మరో చేత్తో ఎటువంటి గ్లౌసులు లేకుండా వడ్డించేస్తుంటారు. తద్వారా ఇలాంటి బాక్టీరియా కణాలు ఎక్కువగా శరీరం లోకి తెలీకుండా చేరుతున్నాయని నివేదిక సారాంశం. మరియూ వీటిలో ఫైబర్ తక్కువగా, క్రొవ్వు అధికంగా మరియు ఉప్పుతో కూడిన ఆహార పదార్ధాలు ఉన్న కారణంగా సహజంగానే ఈ మలబద్దకానికి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కేర్ ఆఫ్ అడ్రెస్ అవుతున్నాయి. మరియు ఇళ్ళలో కూడా ఇంస్టెంట్ ఆహార పదార్ధాలను వంటకు వినియోగించడం చేస్తుంటారు. ఇది కూడా మంచి పద్దతి కాదు.

రెడ్ మీట్:

రెడ్ మీట్:

పంది మాంసం, బీఫ్, మరియు గొర్రె మాంసాలను రెడ్ మీట్ గా వ్యవహరిస్తారు. వీటిలో అధికమోతాదులో ఐరన్ ఉంటుంది. మీరు మీ ఆహారంలో ఎక్కువ మోతాదులో ఐరన్ తీసుకున్న పక్షంలో ఇది మీ స్టూల్స్ పై ప్రభావాన్ని చూపిస్తాయి. క్రమంగా మలబద్దకానికి దారి తీస్తుంది. కావున వీటిని అధికంగా తీసుకోవడం చేయరాదు . పైగా ఇందులో ఫైబర్ ఏ కోశానా కనపడదు. జీర్ణక్రియకు ఎంతగానో తోడ్పడే ఫైబర్ లేని కారణంగా ఇది మలబద్దకానికే దారితీస్తుంది. కావున ఎక్కువ పండ్లు కూడా మీ ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి.

నిల్వ ఉంచిన ఆహారాలు:

నిల్వ ఉంచిన ఆహారాలు:

ఇవి మలబద్దకానికి కారణమయ్యే లక్షణాలను అధికంగా కలిగి ఉంటాయి. వీటిలో ఉండే కృత్రిమ చక్కెరలు ఆరోగ్యానికి ఎంతమాత్రమూ మంచివి కావు. పైగా వీటిలో సహజంగానే ఫైబర్ తక్కువ మోతాదులో ఉంటుంది. కావున ఇలాంటి ఆహారాలు తీసుకునేటప్పుడు ఫైబర్ ఉన్న పండ్లు కూడా తీసుకోవడం మర్చిపోవద్దు.

కాఫీ:

కాఫీ:

ఉదయాన్నే తక్షణ శక్తికై కాఫీని మార్గంగా ఎంచుకుంటారు. మన దేశంలో కాఫీ ప్రియులు లేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. కానీ ఏది కూడా మితంగా తీసుకుంటే అమృతం, అధికమైతే విషమే అవుతుంది. డీహైడ్రేషన్ కు గురిచేసే కారకాలు కెఫీన్ లో అధిక స్థాయిలో ఉన్నందువలన, కాఫీ తక్కువ మోతాదులోనే తీసుకోవాలి, మరియు వీలైనన్ని నీళ్ళు ఎక్కువగా తాగుతూ ఉండాలి. జీర్ణక్రియలకు శరీరంలో నీటినిల్వలు అవసరం, కానీ కాఫీ అధికంగా తీసుకోవడం మూలంగా నీటినిల్వలపై ప్రభావం పడి, క్రమంగా మలబద్దకానికి దారితీస్తుంది.

 తెల్ల బియ్యం:

తెల్ల బియ్యం:

నిజం, పాలిష్ చేసిన బియ్యం లో సరైన పోషకాలు ఉండవు . పాలిష్ సమయంలో బ్రాన్ తొలగించబడితుంది, ఈ బ్రాన్ లోనే ఫైబర్ అధికంగా ఉంటుంది. కావున అధికంగా తెల్ల బియ్యం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు, మలబద్దకానికి కూడా కారణం అవుతుంది. అందువల్లనే, ఎక్కువ శాతం ఒకపూటే రైస్ తీసుకునేలా ఆహార ప్రణాళికలు ఏర్పరచుకుంటూ ఉంటారు.

మద్య పానం:

మద్య పానం:

ఎక్కువ మద్యపానం సేవించేవారికి సాధారణంగా ఉండే సమస్య మలబద్దకం. మద్యపానం డీహైడ్రేషన్ సమస్యలను పెంచుతుంది. తద్వారా శరీరానికి అవసరమైన నీటి నిల్వలు అందక జీర్ణ క్రియలు సరిగ్గా జరగక మలబద్దకం వస్తుంది. కొందరికి మద్యపానం తక్కువ ఎక్కువలతో సంబంధం లేకుండా కూడా మలబద్దకానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి . జీవక్రియలకు కావలసిన నీటి నిల్వలు అందక, నెమ్మదిగా అవయవాల పనితీరు మందగిస్తుంది. ముఖ్యంగా ఈ ప్రభావం పెద్ద ప్రేగులపై ఉంటుంది.

English summary

10 Foods That Cause Constipation

According to a survey, 22 percent of the country's adult population suffers from constipation. Constipation gives you a bloating feeling and you can feel your entire lower abdomen is cramping and feels gassy. The foods that cause constipation are unripe bananas, fast foods, red meat, refined flour, processed foods, coffee, etc.
Desktop Bottom Promotion