ఆడవారికన్నా మగవారికే ఎక్కువగా హార్ట్ ఎటాక్‌ వస్తోంది.. అందుకే ఈ ఆహారాలు తీసుకోవాలి

Written By:
Subscribe to Boldsky

నేటి తరం ఎక్కువగా బాధపడే ఆరోగ్య సమస్యల్లో గుండె సమస్య ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. నిత్యం తీసుకునే ఆహార అలవాట్లలో వస్తున్న మార్పులే దీనికి కారణం. ముంచుకొస్తున్న ముప్పు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నా ఎవరికీ పట్టడంలేదు. పాశ్చాత్య పోకడల వైపు పరుగెడుతున్న నేటి యువతరం తమ అలవాట్ల కారణంగా గుండె జబ్బు బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మగవారికే గుండె జబ్బులు

మగవారికే గుండె జబ్బులు

ఆడవారికన్నా ఎక్కువగా మగవారే గుండె జబ్బుల బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెప్పడమే కాదు సర్వేలు కూడా కుండబద్దలు కొడుతున్నాయి. ఇందుకు కారణం గతంతో పోల్చితే మగవారికి శారీరక శ్రమ తగ్గిపోవడమే. మారుతున్న కాలంలో ఎక్కువ మంది మగవారు శారీరక శ్రమ లేకుండా తమ శరీరాన్ని సున్నితంగా పెంచేకోవడంతో పాటు ప్రమాదకరమైన గుండె సంబంధిత వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. సాధారణంగా కరోనరీ ఆర్టరీ డిసీజ్ వల్ల గుండె సంబంధ వ్యాధులు, హార్ట్‌ఎటాక్ సమస్యలు వస్తాయి.

గుండెలోని ఒక భాగానికి రక్తం సరఫరా కాకుండా బ్లాక్

గుండెలోని ఒక భాగానికి రక్తం సరఫరా కాకుండా బ్లాక్

50 శాతం హార్ట్ ఎటాక్‌లు అనుకోకుండా వచ్చేవే. ఎలాంటి వార్నింగ్ సంకేతం ఇవ్వకుండా ఈ ఎటాక్ వస్తుంది. గుండెలోని ఒక భాగానికి రక్తం సరఫరా కాకుండా బ్లాక్ అయినప్పుడు హార్ట్ ఎటాక్ వస్తుంది. అయితే ఈ హార్ట్ ఎటాక్‌ను కూడా కొన్ని పద్ధతుల ద్వారా నియంత్రించవచ్చు. కొన్ని అలవాట్లవల్ల హార్ట్ ఎటాక్ రిస్క్‌కి దూరంగా ఉండవచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

రిస్క్ తగ్గించేందుకు

రిస్క్ తగ్గించేందుకు

డైట్‌లో, లైఫ్‌ స్టైల్‌లో మార్పులు చేసుకోవడం వల్ల ప్రాణాంతకమైన హార్ట్ ఎటాక్‌ని అడ్డుకోవచ్చు. అంతేకాదు ఈ అలవాట్లు దాదాపు 80 శాతం హార్ట్ ఎటాక్ ముప్పుని అడ్డుకుంటాయని నిపుణులు చెప్తున్నారు. మరి హఠాత్తుగా వచ్చే హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో చూద్దాం..

నడుము చుట్టుకొలత 95 సెంటీమీటర్లు

నడుము చుట్టుకొలత 95 సెంటీమీటర్లు

ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు, రోజుకు 40 నిమిషాలు వాకింగ్ లేదా వ్యాయామం, వారానికి కనీసం గంటసేపు వ్యాయామం. నడుము చుట్టుకొలత 95 సెంటీమీటర్లు దాటకుండా జాగ్రత్తపడటం. ఆల్కహాల్ తీసుకోవడం గణనీయంగా తగ్గించడం. పొగతాగే అలవాటుకు పూర్తిగా స్వస్తిచెప్పడం వంటివి చేయాలి.

ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు

ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు

టాన్సీఫ్యాట్ గురించి, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ గురించి చాలామందికి తెలియదు. ఇవి శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ కంటే చాలా డేంజరస్. ఆరోగ్యకరమైన శ్యాచురేటెడ్ ఫ్యాట్ కంటే లో ఫ్యాట్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. రిఫైన్డ్ షుగర్, ప్రాసెస్డ్ ప్రక్టోజ్‌లలో హానికారక ట్రాన్సీ ఫ్యాట్స్ ఉంటాయి. దీనివల్ల ఒబెసిటీ, గుండె సంబధిత వ్యాధిగ్రస్తులు పెరిగిపోతారు.

ఎక్కువ పండ్లు తీసుకోవాలి

ఎక్కువ పండ్లు తీసుకోవాలి

రెగ్యులర్‌గా పండ్లు తినేవాల్లలో 40 శాతం గుండె సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఎక్కువ మినరల్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు ఉండే పండ్లు తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు.

డయాబెటిస్ డ్రగ్స్ ప్రభావం

డయాబెటిస్ డ్రగ్స్ ప్రభావం

కొన్ని రకాల డయాబెటిస్ మందులు థైరాయిడ్ గ్రంధిపై ప్రభావం చూపుతాయి. దీనివల్ల అనేక తీవ్రమైన అనారోగ్య సమస్యలు, గుండె సంబంధిత వ్యాధుల రిస్క్ పెరుగుతుంది. అలాగే టైప్ 2 డయాబెటిస్ నివారించడానికి తీసుకునే మందులు గుండె వ్యాధులు వచ్చే రిస్క్‌ను పెంచుతాయి.

హార్ట్‌ఎటాక్ రిస్క్ తగ్గించవచ్చు

హార్ట్‌ఎటాక్ రిస్క్ తగ్గించవచ్చు

రెగ్యులర్‌గా వ్యాయామం చేయాలి. వీలైనప్పుడల్లా చెప్పులు లేకుండా నడవాలి. బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించే మందులకు దూరంగా ఉండాలి. వీటివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. విటమిన్ సీ సరిగా అందేలా జాగ్రత్తపడాలి. రోజుకు మూడు గంటల కంటే ఎక్కువ సేపు కూర్చోకూడదు.

ఎలాంటి డైట్ తీసుకోవాలి

ఎలాంటి డైట్ తీసుకోవాలి

ప్రాసెస్ చేయబడిన ఆహారం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోరాదు. హార్ట్ ఎటాక్ ముప్పు తగ్గించుకోవాలంటే రెస్టారెంట్ ఫుడ్ తీసుకోరాదు. షుగర్, ప్రాసెస్డ్ గ్రెయిన్స్, ప్రక్టోజ్‌కి దూరంగా ఉండాలి. పచ్చి ఆహార పదార్థాలు ఆర్గానిక్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ మొత్తంలో పండ్లు, కూరగాయలు, మాంసం తీసుకోవాలి.

హెల్తీ ఫ్యాట్‌ను ఎలా పొందాలి

హెల్తీ ఫ్యాట్‌ను ఎలా పొందాలి

కొబ్బరి, కొబ్బరి నూనె, అవకాడో, గుడ్డులోని పచ్చసొన, వెన్న, నట్స్, మాంసం, బాదం, పచ్చి పాల ఉత్పత్తుల ద్వారా హెల్తీ ఫ్యాట్ పొందవచ్చు. కాబట్టి వీటిలో ఏదో ఒకటి రోజువారీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

చేపలు

చేపలు

చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో ఉండే చెడు కొలస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. కనుక చేపలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాల్సి ఉంటుంది.

ఓట్స్

ఓట్స్

ఓట్స్‌లో ఉండే ఫైబర్ మన శరీరంలో కొలెస్ట్రాల్ నుంచి తయారయ్యే ప్రమాదకర బైల్ యాసిడ్స్‌ను శరీరం నుంచి బయటకు పంపుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కనుక ఓట్స్‌ను తరచూ తీసుకుంటే గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు.

నట్స్

నట్స్

జీడిపప్పు, బాదం, పిస్తా పప్పులను రోజూ గుప్పెడు మోతాదులో తింటూ ఉంటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. వాటిల్లో ఉండే అన్‌శాచురేటెడ్ ఫ్యాట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. రక్తనాళాలు వాపుకు గురి కాకుండా చూస్తాయి. దీంతో గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.

పెసలు

పెసలు

రక్తంలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించివేయడంలో పెసలు అమోఘమైన పాత్ర పోషిస్తాయి. నిత్యం పెసలను నానబెట్టుకుని మొలకెత్తించి లేదా ఉడకబెట్టి గుగ్గిళ్ల రూపంలో తింటుంటే కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.

అవిసెలు

అవిసెలు

అవిసె గింజల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. దీంతోపాటు వీటిలో ఫైబర్, ఫైటోఈస్టోజెన్లు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. నీటిలో నానబెట్టుకుని లేదా పొడి చేసుకుని అవిసె గింజలను రోజూ తింటుంటే గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు.

వెల్లుల్లి

వెల్లుల్లి

నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున రెండు నుంచి నాలుగు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను న‌లిపి అలాగే తినేయాలి. ఘాటుగా ఉన్నాయ‌నుకుంటే తేనెతో క‌లిపి తిన‌వ‌చ్చు. వెల్లుల్లిని తీసుకుంటే ర‌క్త నాళాల్లో పేరుకుపోయే కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి.

English summary

15 foods that can save your heart

15 foods that can save your heart
Story first published: Wednesday, May 9, 2018, 17:00 [IST]