Latest Updates
-
ప్రతి ఇంట్లో తులసి ఎందుకు ఉండాలి? ఈ 12 ప్రయోజనాలు తెలిస్తే వెంటనే నాటేస్తారు! -
మీ లవర్ లో ఈ 5 అవలక్షణాలు ఉంటే.. మీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే! -
సోషల్ మీడియాని ఊపేస్తున్న చిల్లీ ఎగ్స్ కర్రీ.. మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసెయ్యండి.. -
మిక్సీతో పనేలేదు, మసాలా నూరక్కర్లేదు..10 నిమిషాల్లోనే సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలంటే.. -
మీరు తీసుకునే నిర్ణయాలు మీవేనా? లేక ఇతరుల మాయలో పడుతున్నారా? మానిప్యులేటర్లను ఇలా గుర్తించండి! -
బజ్జీ, సమోసాలకు గుడ్ బై: సాయంత్రం వేళ ఈ కరకరలాడే బీరకాయ టిక్కీ ట్రై చేయండి! -
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే! -
కెమికల్స్ ఉన్న కూరగాయలను ఎలా గుర్తించాలి?
పాలకూరతో లైంగిక పటుత్వంతో పాటు మరెన్నో అద్భుతప్రయోజనాలు.. తెలిస్తే ప్రతి ఒక్కరూ రోజూ తింటారు
ఎలాగైనా సరే ప్రతిరోజూ తినే ఆహార పదార్థాలలో పాలకూరను భాగం చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక పచ్చి పాలకూర జ్యూస్ తాగితే వీర్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. పాలకూర ప్రయోజనాలు, పాలకూర ఉపయోగాలు, పాలకూర
ఆకుకూరల్లో పోషక విలువల గురించి చెప్పనక్కర్లేదు. ప్రతి రోజు ఏదో ఒక రూపంలో తాజా ఆకుకూరలను తినడం అలవాటు చేసుకోవాలి. ఆకుకూర అనగానే దాన్ని ఏ పప్పులోనో, కూరల్లోనో వేసుకుని మాత్రమే తినకూడదు. ఒట్టి ఆకుకూరలతో రకరకాల కూరల్ని వండుకుతినాలి.
అన్నిటికంటే పాలకూరలో విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తుంది. వారంలో కనీసం రెండుసార్లు పాలకూరను తింటే ఎంతో లాభం. దీంతోపాటు మార్కెట్‌లో దొరికితే బ్రకోలిని కూడా తీసుకోండి.
పాలకూర వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాలకూరను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పాలకూర వల్ల క్లోరిన్, ప్రోటీన్లు, విటమిన్ ఏ, సిలు, ఖనిజ లవణాలు, కాల్షియంలు లభిస్తాయి.

రక్తహీనతకు చెక్
పాలకూర తినడం వల్ల రక్తహీనతకు చెక్ పడుతుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. దాంతో పాటు అధిక రక్తపోటును తగ్గించి, శ్వాస సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.పాలకూర రసాన్ని తాగడం వల్ల జుట్టు అందంగా ఉంటుంది. జుట్టు ధృడంగా, పొడవుగా పెరుగుతుంది. వెంట్రుకలకు అవసరమైన పోషకాలు ఇందులో లభిస్తాయి.

మతిమరుపు దూరం
పాలకూర శరీరానికి అవసరమైన ఐరన్‌ను పుష్కలంగా అందిస్తుంది. కాల్షియం ఎముకలను బలంగా ఉంచుతుంది.పాలకూరలోని ఫ్లేవనాయిడ్స్ వయసుతోపాటు వచ్చే మతిమరుపును దూరం చేస్తాయి. 13 రకాల యాంటీ ఆక్సిడెంట్స్ పాలకూరలో ఉన్నాయి. ఇవి యాంటీ క్యాన్సర్ ఏజెంట్లుగా పనిచేస్తాయి.

ప్రోటీన్లు పుష్కలం
విటమిన్ కె, విటమిన్ సి, ఎ, మెగ్నిషియం, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, సోడియం, క్లోరిన్, పాస్ఫరస్, ఐరన్, ప్రోటీన్లు, బీటాకెరోటిన్, బి కాంప్లెక్స్ విటమిన్లు తదితర పోషకాలు ఇందులో సమృద్ధిగా దొరుకుతాయి.

గుండె జబ్బులను నిరోధిస్తుంది
పలు రకాల క్యాన్సర్‌లు రాకుండా అడ్డుకుంటుంది. గుండె జబ్బులను నిరోధిస్తుంది. పాలకూరను ఆహారంలో ఎక్కువగా తినే మహిళలకు అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

శరీర దృఢత్వానికి
శరీర పెరుగుదలకు, దృఢత్వానికి పాలకూర ఉపయోగపడుతుంది. 100 గ్రాముల పాలకూరలో ఉండే పోషకాలు ఈ విధంగా ఉంటాయి. పిండి పదార్థాలు - 3.6 గ్రా. చక్కెరలు - 0.4 గ్రా. పీచు పదార్థాలు - 2.2 గ్రా. కొవ్వు పదార్థాలు - 0.4 గ్రా. మాంసకృత్తులు - 2.2 గ్రా. విటమిన్ ఎ - 52 శాతం. ఫోలేట్ (విటమిన్ బి9) - 49 శాతం. విటమిన్ సి - 47 శాతం. విటమిన్ ఇ- 13 శాతం. విటమిన్ కె - 46 శాతం.
కాల్షియం - 10 శాతం. ఐరన్ - 22 శాతం

క్యాన్సర్‌ను నివారించటంలో
పాలకూరలో లభించే విటమిన్ సీ, ఏ, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్లు క్యాన్సర్‌ను నివారించటంలో తోడ్పడతాయి. ఊపిరితిత్తులు, బ్రెస్ట్ క్యాన్సర్‌ను అదుపు చేయటంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటాయి.

శ్వాస సంబంధిత రోగాలు
పాలకూరను ఆహారంలో ఎక్కువగా తీసుకునే వారికి ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. జ్వరం, పిత్త, వాయు శ్వాస సంబంధిత రోగాలను కూడా పాలకూర దూరం చేస్తుంది. పాలకూర సౌందర్యానికి కూడా ఎంతగానో తోడ్పడుతుంది.

వెజిటబుల్ సూప్‌లో
పాలకూరను వెజిటబుల్ సూప్‌లోనూ, చపాతీలు చేసుకునే పిండిలోనూ, పకోడీల పిండిలోనూ, పన్నీర్‌తో కలిపి వండే కూరల్లోనూ.. అనేక రకాలుగా వాడుకోవచ్చు. ఇతర ఆకుకూరల్లాగా పాలకూరను కూరలాగా, వేపుడు చేసుకుని కూడా తినవచ్చు.

ఒమేగా 3
ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలతో నిండిన చేపలను తినలేనివారు చింతించాల్సిన పనిలేదు. అక్రోట్లు (వాల్‌నట్స్), పచ్చ గోబీ (బ్రకోలీ), పాలకూర వంటివి తీసుకున్నా చాలు. వీటితోనూ ఒమేగా కొవ్వులు లభిస్తాయి.

గుండె కణజాలాన్ని పెంచవచ్చు
పాలకూరతో మానవ గుండె కణజాలాన్ని పెంచవచ్చు. ఈ విషయాన్ని అమెరికాలోని వోసెస్టర్ పాలిటెక్నిక్ ఇనిస్టిట్యూట్ పరిశోధకులు స్వయంగా వెల్లడించారు. వారు పాలకూర ఆకులను తీసుకొని వాటి నాళాల్లోని మొక్క కణజాలాన్ని డెటర్జెంట్ ద్రావకాన్ని ఉపయోగించి తొలగించారు. అనంతరం మానవ గుండె కణాలను ఆకుల నాళాల్లోకి పంపించారు.

రక్తాన్ని ప్రవహింప చేశాయి
ఐదు రోజుల తర్వాత ఆ కణజాలం అభివద్ధి చెంది ఆకుల నాళాల గుండా రక్తాన్ని ప్రవహింప చేశాయి. ఇలా పాలకూర ఆకులను తీసుకొని గుండె పొరలను తయారు చేయవచ్చని, ఈ పొరలను ఉపయోగించి రానున్న రోజుల్లో గుండె జబ్బు రోగులకు వైద్యం చేయవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

ఆరోగ్యానికి చాలా మంచిది
ఎలాగైనా సరే ప్రతిరోజూ తినే ఆహార పదార్థాలలో పాలకూరను భాగం చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఇక పచ్చి పాలకూర జ్యూస్ తాగితే వీర్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. లైంగిక పటుత్వం బాగా పెరుగుతుంది. పచ్చి పాలకూరను జ్యూస్ గా చేసుకుని తాగినా లేదంటే పాలకూరతో వివిధ రకాల వంటలు తయారు చేసుకుని తిన్నా మంచి ఫలితాలుంటాయి.



Click it and Unblock the Notifications