బాగా నిద్ర పోతే... భార్యతో రాత్రి గడిపినదానికంటే ఎక్కువే లాభం

Written By:
Subscribe to Boldsky

కంటినిండా కునుకు ఉంటే రోజంతా ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండొచ్చని అంటుంటారు. అయితే రాత్రిపూట ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల షుగర్‌ లెవల్స్‌ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం తగ్గి...ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అబ్బుతాయని యూకేలోని కింగ్స్‌ కాలేజీ లండన్‌ పరిశోధకులు చెబుతున్నారు. దీని ద్వారా ఊబకాయం, హృద్రోగాలు వచ్చే ప్రమాదం తగ్గుతుందంటున్నారు. 42మంది నిద్ర సమయాల్లో మార్పులు చేసి పరిశోధకులు ఈ విషయాన్ని కనుగొన్నారు.

రోజంతా పడిన కష్టానికి ప్రతిఫలం నిద్ర. నిద్రతో వచ్చే లాభాలు అనేకం. మనుషులకు వచ్చే పలురకాల అనారోగ్యాలకు మూలం తగినంత నిద్ర లేకపోవడమే. నిద్రమానసిక ప్రశాంతతను తెస్తుంది. శరీరానికి తగినంత నిద్రను కల్పిస్తే చక్కని అందం వస్తుంది.

కళ్ళలో వెలుగు వుండదు

కళ్ళలో వెలుగు వుండదు

నిద్ర సరిగా పోనివారి కళ్ళలో వెలుగు వుండదు. అలసట కనిపిస్తుంది. నిద్రపోయేటప్పుడు లోపలి భాగాలు అన్నీతమంత తాముగా సరిదిద్దుకుంటాయి. పగటి పూట పనులతో, ఆలోచనలతో ఒత్తిడికి గురైన శరీరం, మెదడు రెండూ తమ బాధను మరచిపోయి కొత్త శక్తిని పొందుతాయి. శరీరానికి హాయిని కల్గించే హార్మోన్ సెరటోనిన్. తగినంత నిద్ర వున్నప్పుడే ఇది ఉత్పత్తి అయి దాని పనితీరు మెరుగవుతుంది.

సెక్స్ చేసేటప్పుడు

సెక్స్ చేసేటప్పుడు

ఇక మీరు భార్య సెక్స్ చేసేటప్పుడు మీ బాడీ నుంచి ఆక్సిటోసిన్ అనే హార్మోన్ వెలువడి మిమ్మల్ని హాయిగా ఉంచుతుంది. అలాగే మీరు బాగా గాఢనిద్రపోతే ఆ హార్మోన్ విడుదలై మీ బాడీని సుఖంగా ఉంచుతుంది. నిద్రలో మీ శరీరం మంచి సుఖాన్ని పొందుతుంది.

నిద్రకు ముందు.. ఒత్తిడి లేకుండా

నిద్రకు ముందు.. ఒత్తిడి లేకుండా

ఇక నిద్రపోయేముందు పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి. ఇంతకీ అవేంటంటే.. మన పడకగది ఎంత ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉంటే అంత హాయిగా పడుకోగలం. అంటే.. మన పడకగదిలో ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు లేకుండా చూసుకోవాలి. ఆ గది వెలుతురు కూడా ఎంత తక్కువగా ఉంటే.. అంత మంచిది.

ఒత్తిడి లేకుండా

ఒత్తిడి లేకుండా

రోజంతా మనం చేసిన పనులు, రకరకాల ఆలోచనలు ఎంతో ఒత్తిడికి గురిచేస్తాయి. ఆ ప్రభావంతోనూ ఓ పట్టాన నిద్ర పట్టదు. మీ సమస్య కూడా ఇదే అయితే.. రాత్రి పడుకునే ముందు కాసేపయినా పదబంధాల్ని పూర్తి చేయండి. ఇది అనవసర ఆలోచనల్ని దూరం చేసి, మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.

స్నానం చెయ్యాలి

స్నానం చెయ్యాలి

అలసిన శరీరానికి విశ్రాంతి అంది, హాయిగా నిద్రపట్టాలంటే.. గోరువెచ్చని నీటితో స్నానం చేయడానికి మించిన పరిష్కారం లేదంటారు నిపుణులు. అలాగే కప్పు గ్రీన్‌ టీ తాగినా కూడా మార్పు కనిపిస్తుంది. ఫోను అసలు వాడకపోవడం, కాసేపు ధ్యానం చేయడం కూడా ఎంతో మార్పు తీసుకొస్తాయి.

ముందు రోజు పనులు పూర్తి చేసుకోండి

ముందు రోజు పనులు పూర్తి చేసుకోండి

మర్నాటి దినచర్య సజావుగా సాగాలంటే.. మర్నాడు చేయాల్సిన పనుల్లో కొన్నింటిని ఇప్పుడు పూర్తిచేసుకోవాలి. అంటే దుస్తులు సిద్ధంగా పెట్టుకోవడం, కూరగాయలు కోసుకోవడం, చేయాల్సిన పనుల జాబితా రాసుకోవడం.. వంటివన్నీ మీకెంతో ఉపయోగపడతాయి. ఒత్తిడినీ దూరం చేస్తాయి.

పుస్తకాలు చదవండి

పుస్తకాలు చదవండి

కంప్యూటరు, టీవీ చూడటం కాకుండా కాసేపయినా పుస్తకాన్ని చదివేందుకు ప్రయత్నించండి. నిద్రపోయేందుకు కనీసం గంటముందు కంప్యూటరు లేదా టీవీ చూడటం మానేయాలి. కనీస ఇరవై నిమిషాలు పుస్తకాన్ని చదివినా చాలు.

శ్వాస వ్యాయామం

శ్వాస వ్యాయామం

పడుకునేందుకు కనీసం అరగంట ముందు.. దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలే వ్యాయామాలు చేయాలి. ఒత్తిడి తగ్గడమే కాదు.. హాయిగా నిద్ర కూడా పడుతుంది. మనసు కూడా ప్రశాంతంగా మారుతుంది.

గ్రీన్ టీ

గ్రీన్ టీ

రాత్రి పూట నిద్రించ‌డానికి క‌నీసం గంట ముందు గ్రీన్ టీ తాగితే దాంతో కొన్ని ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎఫెక్టివ్‌గా దూరం చేసుకోవ‌చ్చు. దీంతో శ‌రీర మెటబాలిజం బాగా పెరుగుతుంది. దీంతో నిద్ర పోతున్నా కూడా శ‌రీరంలో ఉన్న కొవ్వు వేగంగా క‌రిగిపోతుంది. దీని వ‌ల్ల బ‌రువు త‌గ్గుతారు. అలాగే నిద్ర‌కు ముందు గ్రీన్ టీని తాగ‌డం వ‌ల్ల ఫ్లూ, జ‌లుబు, ద‌గ్గు వంటి శ్వాస కోశ స‌మ‌స్య‌లు చాలా వ‌ర‌కు దూరం అవుతాయ‌ని ఇటీవ‌ల చేసిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది.

రిలాక్స్

రిలాక్స్

నిద్రతో శ‌రీరం రిలాక్స్ అవుతుంది. మ‌న‌సంతా ప్ర‌శాంతంగా మారుతుంది. అంతేకాదు, మ‌రుస‌టి రోజు లేచే స‌రికి ఉల్లాసం, ఉత్తేజం క‌లుగుతాయి. నిద్రలేకపోతే చాలా కష్టాలు పడాల్సివస్తుంది. కాబట్టి ఉచితంగా లభించే ఔషధమైన నిద్రను హాయిగా వాడుకోవాల్సిన అవసరం ఉంది.

English summary

15 surprising health benefits of sleep

15 surprising health benefits of sleep