Latest Updates
-
దీని ముందు బిర్యానీ కూడా దిగదుడుపే.. కుక్కర్లో ఈజీగా ఘుఘుమలాడే గోంగూర పులావ్.! -
కేరళ స్టైల్ రొయ్యల వేపుడు.. మసాలా ఇలా దట్టించారంటే కారం నషాళానికి అంటాల్సిందే.! -
గజకేసరి రాజయోగంతో కనక వర్షం.. ఈ మూడు రాశుల వారికి తిరుగే లేదు.! -
ఉదయం నిద్ర లేవగానే షుగర్ ఉన్నవారిని వేధించే అతిపెద్ద ప్రశ్న..ఈరోజు టిఫిన్ ఏం తినాలి?. -
ఒకే రాశిలో సూర్య కేతువులు.. వీరికి ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు.. లేదంటే.! -
విడివిడిగా కాదు.. ఒకే గిన్నెలో క్రీమీ ముద్దపప్పు ఆవకాయ అన్నం..స్వర్గానికి నిచ్చెన వేసే అద్భుతమైన రెసిపీ! -
హైదరాబాద్ నుంచి ఒక్క రోజులో విజిట్ చేసే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్.. ఒక్కో వీకెండ్‌కి ఒక్కో ఎక్స్పీరియన్స్ -
బొటనవేలుపై ఈ గుర్తు ఉన్నోళ్లు ప్రపంచాన్ని జయించగలరు! -
ముక్కల్లేకుండా బిర్యానీ మజా.. అచ్చం రెస్టారెంట్ స్టైల్ కుష్కా ఇంట్లోనే ఈజీగా ఇలా చేయండి! -
అరటిపండు తినడానికి సరైన సమయం ఏది? ఈ నిజాలు మీరు తెలుసుకోవాల్సిందే!
తేనెను ఎలా తీసుకోవాలో తెలుసా? మద్యంలో కలిపి తాగొచ్చా? తేనె వయాగ్రా కన్నా పవర్ ఫుల్
తేనె వల్ల చాలా లాభాలున్నాయి. తేనే ప్రకృతి సిద్దం గా దొరికే అపురూపమైన ఔషధము . తేనే లో విటమిన్స్, రోగ నిరోధక శక్తి, నిమ్మ రసం, తేనె లాభాలు, తేనె ప్రయోజనాలు, తేనెతో సెక్స్ సామర్థ్యం.
తేనె వల్ల చాలా లాభాలున్నాయి. తేనే ప్రకృతి సిద్దం గా దొరికే అపురూపమైన ఔషధము . తేనెటీగలు రకరకాల పుల మకరందాలను పోగు చేసి తేనే రూపము లో మనకి (వాటికోసమే అనుకోండి) అందిస్తున్నాయి. రోజు వారిగా గాని, ఇతర పదార్థాలతో గాని సేవిస్తూ ఉంటే ఆరోగ్య పరంగా ఎంతో మేలు.

బరువు తగ్గుతారు
రోజూ 1/4 గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో రెండు చెంచాల తేనే కలుపుకు తాగితే బరువు తగ్గుతారు. రాత్రి వేళల్లో పాలు తేనే కలుపుకొని తాగితే చక్కటి నిద్ర వస్తుంది.నిమ్మ రసం లో తేనే కలుపుకొని తీసుకుంటే కడుపు ఉబ్బరం , ఆయాసం తగ్గిపోతుంది. తేనే లో కొంచెం మిరియాలపొడి కలుపుకొని తీసుకుంటే జలుబు తగ్గుతుంది .

వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుంది
తేనే లో ఉన్న విటమిన్స్... శరీర వ్యాధి నిరోధక శక్తిని పెంపొందుతుంది. నిమ్మ రసము తో కలిపి సేవిస్తే దగ్గు , గొంతు నొప్పులకు బాగా పని చేస్తుంది. యాంటీ బ్యాక్టరీయా, యాంటి సెప్టిక్ గుణాలున్నందున చర్మము పై పూస్తే గాయాలు మానుతాయి.

శనగపిండిని కలుపుకుని
రెండు చెంచాల తేనే లో కోడిగుడ్డు లోని తెల్లనిసోన , కొంచెంశనగపిండి కలుపుకొని ముఖానికి మర్దన చేసుకుంటే చర్మం కాంతి పెరుగుతుంది . తేనే లో పసుపు , వేపాకు పొడి కలిపి రాస్తే పుల్లు మానుతాయి .

శుద్ది చేయకుండా వాడకూడదు
తేనేను శుద్ది చేయకుండా వాడకూడదు . దీనిలో అనేక సుక్ష్మ జీవులు ఉంటాయి . తేనే లో ఉండే 'బొటులినియం ఎన్దోసపొర్స్" చిన్నపిల్లలకు హాని చేస్తాయి. ఒక సంవత్సరం లోపు పిల్లలకు వాడకూడదు. తుతిన్ అనేది విషపదార్దము శరీరానికి మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు.

మొటిమలు
తేనె (15 భాగాలు), దాల్చిన చెక్క పొడి (1 భాగం)... ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ రాత్రి పూట 2 వారాలపాటు మొటిమలపై మర్దన చేస్తే తగ్గుతాయి.

కీళ్ల నొప్పి
రెండు చెంచాలు తేనెను కప్పు దాల్చిన చెక్క కషాయానికి కలిపి సేవిస్తే కీళ్లనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. 1 లీటరు వేడి నీళ్లకు 1 కప్పు తేనెను, అరకప్పు నిమ్మ రసాన్ని చేర్చి నూలు గుడ్డను ముంచి నొప్పి, వాపు ఉన్నచోట కీలుమీద రాస్తే

జలుబు, దగ్గు, గొంతునొప్పి
తేనె (4 భాగాలు), పిప్పళ్ల పొడి (1 భాగం), మిరియం పొడి, లవంగాల పొడి, జీలకర్ర పొడి కలిపి గొంతు తగిలేలా పుక్కిట పడితే గొంతునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

పెదవుల పగుళ్లు
రెండు భాగాల తేనెకు 1 భాగం మీగడను, నాలుగైదు చుక్కలు రోజ్ వాటర్‌ని కలిపి పెదవుల మీద ప్రయోగిస్తే పెదవుల పగుళ్లు తగ్గి నున్నగా తయారవుతాయి.

పిల్లల్లో విరేచనాలు
పిల్లల్లో అతిగా విరేచనాలు అవుతుంటే తేనెకు జాజికాయ పొడిని కలిపి తాగిస్తే తగ్గిపోతాయి.

జుట్టు ప్యాచ్‌లాగా ఊడిపోతే
తేనె(3 భాగాలు), దాల్చిన పొడి (1 భాగం), ఆలివ్ నూనె (తగినంత)... ఈ నిష్పత్తిలో కలిపి తలమీద ప్రయోగించి పావుగంట తరువాత శుభ్రపరుచుకోవాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే ఎలోపీషియా (ఇంద్రలుప్తం)లో చక్కని ప్రయోజనం కనిపిస్తుంది.

వ్యాధి నిరోధకశక్తి పెరగడానికి
మూడు భాగాల తేనెకు 1 భాగం దాల్చిన చెక్క పొడిని కలిపి పుచ్చుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

స్థూలకాయం
చెంచాడు దాల్చిన చెక్క పొడిని 2 గ్లాసుల నీళ్లకు చేర్చి అరగ్లాసు కషాయం మిగిలేంత వరకూ మరిగించాలి. దీనికి మూడు టీస్పూన్లు తేనెను కలిపి ఆహారానికి అరగంట ముందు రెండు పూటలా సేవిస్తే స్థూలకాయంలో మంచి ఫలితం కనిపిస్తుంది.

ముఖంమీద మంగు మచ్చలు
తేనెకు తగినంత పాల పొడి కలిపి ఫేస్‌మాస్క్ మాదిరిగా పెట్టుకుంటుంటే ముఖం కాంతివంతంగా తయారవుతుంది.

చర్మం పగుళ్లు
మోచేతులు, పాదాల వంటి భాగాల్లో చర్మం పగిలి ఇబ్బందిని కలిగిస్తుంటే తేనె, నిమ్మరసం ఆలివ్ నూనె కలిపి పేస్టులా చేసి పెట్టుకోవాలి. ఇలా చేస్తే చర్మంపై వచ్చే పగుళ్లు తగ్గిపోతాయి.

రక్తహీనత
ఎర్ర రక్తకణాలు తక్కువగా ఉన్నవారు, హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉన్నవారు తేనెను వాడి ప్రయోజనం పొందవచ్చు. తాజా ఆకుకూరల మీద తేనెను పరిచి తీసుకుంటుంటే బాగుంటుంది. రక్తహీనత క్రమంగా దూరమవుతుంది.

నోటి దుర్వాసన
ఒక బాటిల్లో మూడువంతులు సిడర్ వెనిగార్‌ని నింపి, కప్పు తేనెను కలపాలి. బాగా గిలకొట్టాలి. దీనిని ఆహారం తర్వాత మౌత్‌వాష్‌గా పుక్కిట పట్టాలి. చివరగా నీళ్లతో పుక్కిలించాలి. దీంతో నోటి దుర్వాసన దూరమవుతుంది.

పొడి దగ్గు
చెంచాడు అల్లం రసానికి చెంచాడు తేనెను కలిపి మూడు పూటలా తాగుతుంటే దగ్గునుంచి ఉపశమనం లభిస్తుంది.

కాలిన గాయాలు
స్టౌవద్ద కాలిన గాయాలకు, వేడి నీళ్లుపడటం వల్ల కాలిన గాయాలకు తేనెను నేరుగా ప్రయోగించవచ్చు. గాటుపడకుండా గాయం మానుతుంది.

తేనె వాడకూడని సందర్భాలు
మధుమేహ వ్యాధిగ్రస్తులు యథేచ్ఛగా తేనెను వాడకూడదు. ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే తేనెను వాడాలి. తేనెను వేడి పదార్థాలతో కలిపి వాడకూడదు. అలాగే పిప్పళ్లు, మిరియాలు వంటి వాటితో కలిపి నేరుగా వాడకూడదు.

మరిగించకూడదు
తేనెను మరిగించకూడదు. తేనె ఉష్ణ వీర్య పదార్థం కాబట్టి తేనెను నేరుగా మంటపైన వేడిచేయకూడదు. తేనెను వేడి వాతావరణంలోనూ, ఎండాకాలంలో పరిమితంగానే వాడాలి. (తేనెలో రకరకాల పువ్వుల మకరందాలుంటాయి. వీటిల్లో విష పుష్పాలు సైతం ఉంటాయి).

మద్యంలో తేనెను కలుపుకోని తాగకూడదు
మసాలా పదార్థాలతోనూ, మద్యంతోనూ, ఆవనూనె వంటి పదార్థాలతోనూ కలపకూడదు.తేనెను వర్షం నీళ్లతో కలిపి వాడకూడదు.

ఫ్రిజ్ లో ఉంచకూడదు
తేనెను ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఫ్రిజ్‌లో ఉంచితే పంచదార స్పటికాలు తయారవుతాయి. అలాంటి సందర్భాల్లో ఎండలో ఉంచితే సరిపోతుంది. లేదా తేనె సీసాను వేడి నీళ్లలో పెట్టి పరోక్షంగా వేడిచేస్తే తేనె స్పటికాలు కరిగి తిరిగి తేనె తయారవుతుంది.

శారీరక వాంఛలు తగ్గుతున్నాయి
ఇక ప్రస్తుతం మగవారిలో రోజురోజుకి శారీరక వాంఛలు మందగించే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ కాసింత సేపు కూడా విశ్రాంతి లేకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. శరీరానికి, మనస్సుకి కాసింత కూడా విశ్రాంతి ఇవ్వడం లేదు. దీంతో వారి దాంపత్య జీవితాన్ని సరిగ్గా అనుభవించలేకపోతున్నారు.

శృంగార సామర్థ్యం తగ్గిపోతుంది
ఒకప్పటితో పోల్చుకుంటే ప్రస్తుతం ఉన్న మగవారిలో శృంగార సామర్థ్యం తగ్గిపోతుంది. భారతదేశంలో ఇలాంటి సమస్య ఎక్కువగా ఉంది. మగవారిలో లైంగిక సామర్థ్యం తగ్గి సంతాన సమస్యలు కూడా తలెత్తున్నాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే మగవారు శారీరక శక్తిని పెంచే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి.

టెస్టోస్టిరాన్ స్థాయి
తేనెకు టెస్టోస్టిరాన్ స్థాయిలను పెంచే గుణం ఉంది. దీనిలో బోరోన్ అనే మినరల్ మగవారిలో చక్కగా అంగస్తంభన జరిగేట్లు ఉపయోగపడుతుంది. మీరు రోజూ తేనెను తీసుకుంటే అది మీలో సెక్స్ సామర్థ్యం పెంచుతుంది. తేనెను తాగితే వయాగ్రా కన్నా ఎక్కువ శక్తినే మగవారు పొందుతారు.



Click it and Unblock the Notifications