కొబ్బరినీళ్లతో ప్రయోజనాలు ఇన్ని ఉన్నాయని తెలిస్తే రోజూ తాగుతారేమో

Written By:
Subscribe to Boldsky

చాలా మంది కొబ్బరి నీళ్లను ధారాళంగా వాడతుంటారు. దాహం తీర్చడమే గాక ఇందులో ఉండే మినరల్స్ శరీరానికి మేలు చేస్తాయి. అంతేగాకుండా కొబ్బరి నీళ్లలో శరీరానికి కావలసిన రోగ నిరోధక శక్తి పుష్కలంగా ఉంది. కొబ్బరి నీళ్లను తాగడం వల్ల అనేక రోగాలు దరికి రావు. వేసవిలో ఎండ వేడీ, డీహ్రైడేషన్‌కు ఇలా ఎన్నో ఉంటాయి. వాటిని తగ్గించుకుంటూనే బరువును అదుపులో ఉంచాలంటే ఇలా చేసి చూడండి.

పోషకాలు మెండుగా ఉంటాయి

పోషకాలు మెండుగా ఉంటాయి

వేసవిలో చల్లటి కొబ్బరినీళ్లను తీసుకోవాలి. ఇందులో మీ శరీరానికి శక్తిని అందించే పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా చేయడంతోపాటు కావాల్సినంత శక్తిని అందిస్తాయి. పరగడుపున ఈ నీటిని తాగడం వల్ల జీవక్రియ పనితీరు బాగుంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు కొబ్బరినీటిని తరచూ తీసుకుంటే మంచిది.

వాత, పిత్త గుణాలను...

వాత, పిత్త గుణాలను...

కొబ్బరి నీరు వాత, పిత్త గుణాలను హరింపజేస్తుంది. కొబ్బరి నీరు వేడిని తగ్గిస్తుంది. కొబ్బరి నీళ్లు విరేచనాలను అరికడతాయి. గుండె జబ్బులను తగ్గిస్తాయి. అన్నిటినీ మించి శరీరానికి శక్తిని, బలాన్ని అందిస్తాయి. కొబ్బరికాయలో ఉండే అమూల్యమైన గుణాలు ఎన్నో ఉన్నాయి. ఈ నీళ్ళలో విటమిన్లు, మినరల్సు, ఎలక్ట్రోలైట్స్, ఎంజైమ్‌లు, ఎమినో యాసిడ్లు, సైటోకిన్ అధికంగా ఉన్నాయి.

రోగ నిరోధక శక్తి

రోగ నిరోధక శక్తి

రోజూవారీగా ఓ కొబ్బరి బొండాంలోని నీరు తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే కొబ్బరి నీళ్లను తాగడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరగడంతో వ్యాధులు దరిచేరవు. పరగడుపున కొబ్బరి నీళ్లు తాగితే..? ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని పెద్దలు అంటూ వుంటారు.

ఉష్ణాన్ని కూడా తగ్గిస్తుంది

ఉష్ణాన్ని కూడా తగ్గిస్తుంది

ఉదయం అల్పాహారానికి తర్వాత మధ్యాహ్న భోజనానికి ముందు అంటే 12 గంటల ప్రాంతంలో కొబ్బరి బొండాం నీళ్లు తాగితే శరీరంలోని చక్కెర శాతం తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొబ్బరి బొండాం నీటిలోని కార్బొహైడ్రేడ్ చక్కెర శాతాన్ని, ఉష్ణాన్ని కూడా తగ్గిస్తుందని న్యూట్రీషన్లు చెబుతున్నారు.

వెంటనే శక్తి

వెంటనే శక్తి

క్రీడాకారులు, ఎక్సర్‌సైజ్ చేసిన తర్వాత కొబ్బరి నీళ్లు తాగితే వెంటనే శక్తి లభిస్తుంది. డైట్ ఫాలో చేసేవారు.. ఇంకా నీరసంగా ఉందనుకునేవారు కొబ్బరి నీటిని తాగితే ఉపశమనం లభిస్తుంది. రోజూ కొబ్బరి నీళ్లు తాగేవారు నిత్య యవ్వనులుగా కనిపిస్తారు.

గర్భిణులకు అవసరమైన పోషకాలు

గర్భిణులకు అవసరమైన పోషకాలు

దాహార్తిని తీర్చడానికి, శరీరానికి చలువ చేయడానికే కాదు.. కొబ్బరి నీళ్లలో గర్భిణులకు అవసరమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయని పరిశోధకులు చెప్పారు. కేరళలోని కొబ్బరి అభివృద్ధి బోర్డు (సిడిబి)కి చెందిన నిపుణులు ఈ విషయాన్ని వెల్లడిస్తూ, గర్భిణులు విరివిగా కొబ్బరి నీళ్లను తాగితే వారికి అవసరమైన ఫ్లూయిడ్స్, ఎలొక్ట్రలైట్స్ అందుతాయని పేర్కొన్నారు.

నీరసం, మలబద్ధకం తొలగిపోతాయి

నీరసం, మలబద్ధకం తొలగిపోతాయి

మెగ్నీషియం, కాల్షియం, విటమిన్-సి, క్లోరైడ్స్, ఎలొక్ట్రలైట్స్, రిబోఫ్లావిన్ వంటి పోషకాలు కొబ్బరి నీళ్లలో దండిగా లభిస్తాయి. శరీర వ్యవస్థకి కావాల్సిన సుగర్, సోడియం, ప్రోటీన్లు కోసం తరచూ కొబ్బరి నీళ్లను తాగడం మంచిదని పరిశోధకులు సూచించారు. ఉదయాన్నే కొబ్బరి నీళ్లను తాగితే నీరసం, మలబద్ధకం వంటి సమస్యలు తొలగిపోతాయి.

మూత్ర సంబంధ సమస్యలు

మూత్ర సంబంధ సమస్యలు

నిర్జలీకరణం (శరీరంలో నీరు లేకపోవడం), అలసట వంటి లక్షణాల నుంచి బయటపడేందుకు, రోగనిరోధక శక్తి పెరిగేందుకు కొబ్బరి నీళ్లు దోహదం చేస్తాయి. మూత్ర సంబంధ సమస్యలు, అధిక రక్తపోటు తొలగిపోయేందుకు గర్భిణులు కొబ్బరి నీళ్లను తాగడం ఉత్తమం.

అధిక కొవ్వు పదార్థాలను తగ్గించుకునేందుకు

అధిక కొవ్వు పదార్థాలను తగ్గించుకునేందుకు

కొబ్బరి నీరు వివిధ రుగ్మతలపై పోరాడటానికి సహాయపడుతుంది. పీహెచ్ స్థాయి సమతుల్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. శరీరంలో ఉండే అధిక కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గించుకోవడానికి కొబ్బరి నీరు బాగా ఉపయోగపడుతుంది.

బరువు తగ్గించుకోవాలనుకుంటే

బరువు తగ్గించుకోవాలనుకుంటే

బరువు తగ్గించుకోవాలనుకునే వారు, అధిక క్యాలోరీలు, కొవ్వు పదార్థాలను కలిగి ఉండే వాటికి బదులుగా కొబ్బరి నీటిని తాగండి. నిజానికి, కొవ్వు పదార్థాలను కలిగి ఉండకుండా, శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచి, నీటి గుణాన్ని కలిగి ఉంటాయి. కొబ్బరి నీటి ద్వారా సహజంగా శరీర బరువు తగ్గుతుంది.

జీవక్రియ రేటులో పెంపుదల

జీవక్రియ రేటులో పెంపుదల

కొబ్బరి నీరు శరీర జీవక్రియను రేటును నియంత్రించి, శరీరం అధికంగా డీహైడ్రేషన్ కు గురయ్యే ప్రక్రియను తగ్గించి వేస్తుంది. కొబ్బరి నీరు సాధారణ నీటి యొక్క స్వచ్చమైన మరియు సహజ రూపంగా చెప్పవచ్చు. కొబ్బరి నీరు శరీర జీవకియ రేటును పెంచి, ఈ రేటును తగ్గకుండా చూస్తుంది. కొబ్బరి నీటిలో ఉండే పొటాషియం, కండరాలలో కొవ్వు పదార్థాల వినియోగాన్ని పెంచుతుంది. ఈ విధంగా కండరాల ద్రవ్యరాశి పెరగటం వలన శరీర బరువు తగ్గి, శరీర జీవక్రియ రేటు ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించబడుతుంది.

కండరాల ఆకృతి

కండరాల ఆకృతి

కొబ్బరి నీరు మన శరీరానికి కావలిసిన విటమిన్ బీని పూర్తి స్థాయిలో అందిస్తుంది. కొబ్బరి నీరు జీవక్రియ స్థాయిలు పెంచటమే కాకుండా, కండరాలకు బలాన్ని చేకూర్చి, వాటిని మంచి ఆకృతిలో మారుస్తాయి. సహజ గ్లూకోస్ లేదా చక్కెరలను కలిగే ఉండే కొబ్బరి నీరు రక్తప్రవాహంలో గ్లూకోస్ గ్రహణ శక్తిని పెంచుతాయి. దీని వలన మధుమేహం వంటి వ్యాధులను నిరోదించటమే కాకుండా, తరుచుగా ఆకలిగా అనిపించే పరిస్థితిని అదుపులో ఉంచుతాయి.

కొవ్వు పదార్థాలుండవు

కొవ్వు పదార్థాలుండవు

కొవ్వు పదార్థాలు లేని ద్రావణంగా కొబ్బరి నీటిని చెప్పవచ్చు. ఒక కప్పు కొబ్బరి నీటిలో 46 క్యాలోరీలను కలిగి ఉంటుంది. కావున, బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది మంచి ద్రావణంగా చెప్పవచ్చు.

కొబ్బరి బొండంలో ఉండే కొబ్బరితో పోలిస్తే, కొబ్బరి నీరు చాలా గాడత కలిగి ఉంటుంది. కొబ్బరు నీరు, నిమ్మరసం తాగటం వలన జీవక్రియ పెరగటమే కాకుండా, జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.

తక్కువ స్థాయిలో చక్కెరలు

తక్కువ స్థాయిలో చక్కెరలు

కొబ్బరినీటిలో చక్కెరలు తక్కువ స్థాయిలో ఉంటాయి. మధుమేహ వ్యాధి గ్రస్తులు నిరభ్యంతరంగా ఈ నీటిని తాగవచ్చు పిల్లలలో మెదడు పనితీరును మెరుగుపరిచే సూపర్ బ్రెయిన్ ఫుడ్ లలో కొబ్బరి నీరు. మన మెదడు పనితీరు కొవ్వు పదార్థాలు కూడా అవసరం. కొబ్బరి నీరు కొవ్వు పదార్థాలను కలిగి ఉంటుంది. ఇవి జ్ఞాపక శక్తి, ఏకాగ్రతను పెంచుతాయి.

డిప్రెషన్ దూరం

డిప్రెషన్ దూరం

మానసిక అలసట, రక్తంలోని చెక్కర స్థాయిలను సమతుల్యపరచటంతో పాటూ ఉద్రేకత, డిప్రెషన్ లను కొబ్బరి నీరు దూరం చేస్తుంది. కొబ్బరి నీటిలో ఉండే కొవ్వు, అమైనోఆసిడ్ లు సెరొటోనిన్ వంటి హార్మోన్ లను స్థిరీకరించి, ఉద్రేకత, డిప్రెషన్ లను దూరం చేస్తాయి.

పోషక విలువలు

పోషక విలువలు

లేత కొబ్బరి నీళ్ళ విటమిన్లు, ఎలెక్ట్రోలైట్స్, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు, ఎంజైములు, పైటో హార్మోన్లు, సైటోకైనిన్స్ ఉంటాయి. కొబ్బరి నీళ్లలో నాలుగు అరటిపండ్ల కంటే ఎక్కువ పొటాషియం ఉంటుంది. .

కిడ్నీ లో రాళ్లను నిరోధిస్తుంది

కిడ్నీ లో రాళ్లను నిరోధిస్తుంది

కొబ్బరి నీరు మూత్రపిండ వ్యవస్థ (మూత్రపిండాలు, మూత్రాశయం, యుటేరస్& ఉరేత్రా) ను ఆరోగ్యగంగా ఉంచి, కిడ్నీ లో రాళ్ళు ఏర్పడుటను నిరోధిస్తుంది ఉంచుతుంది. శరీరం నుంచి యూరిక్ యాసిడ్, ఫాస్ఫేట్లు వంటి మలినాలను పంపి మూత్ర సమస్యలు నిరోధిస్తుంది. 300 ఎంఎల్ కొబ్బరి నీటిలో 60 కేలరీలు ఉంటాయి.

వృద్ధాప్యం బారిన పడకుండా

వృద్ధాప్యం బారిన పడకుండా

కొబ్బరి నీరు వయస్సు మీదపడిన ప్రక్రియ వేగాన్ని తగ్గిస్తుంది.

కొబ్బరి నీరు లోని కణాలు సెల్యులార్ స్థాయిలో వృద్ధాప్యం బారిన పడకుండా కాపాడుతాయి. చెమట ద్వారా నష్టపోయిన పోషకాలను కొబ్బరి నీరు ద్వారా తిరిగి పొందొచ్చు.

రక్తపోటును నియంత్రించుటకు

రక్తపోటును నియంత్రించుటకు

కొబ్బరి నీరు రక్తపోటును నియంత్రించుటకు సహాయపడుతుంది. కొబ్బరి నీటిలో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి నిండి ఉంటాయి. రక్తపోటు నియంత్రణకు కొబ్బరి నీరు ఉపయోగపడుతుంది. కొబ్బరి నీరు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. గుండెను కాపాడుతుంది. ధమనులలో కొవ్వు తగ్గిస్తుంది. రక్త ప్రసరణ ను పెంచుతుంది.

కొబ్బరి నీరు చర్మానికి మంచిది

కొబ్బరి నీరు చర్మానికి మంచిది

కొబ్బరి నీరు మొటిమలు నిరోధిస్తుంది. చర్మం సాగుటను తగ్గిస్తుంది. చర్మపు రంధ్రాల బిగుసు, మచ్చలు, ముడుతలు తగ్గిస్తుంది. కొబ్బరి నీరు సహజంగా అంటువ్యాధులను నిరోధిస్తుంది కొబ్బరి బొండాం నీటిని వారం క్రమం తప్పకుండా పరగడుపున తీసుకుంటే.. అద్భుతమైన ప్రయోజనాలుంటాయి. ఇలా చేస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో బ్యాక్టీరియాను బయటకు పంపి, యూరినరీ ఇన్ఫెక్షన్లు రాకుండా కొబ్బరి బొండాం తోడ్పడుతుంది.

ఇంతకు ముందు లేని ఉత్సాహం

ఇంతకు ముందు లేని ఉత్సాహం

కొబ్బరిబొండాన్ని వారం పాటు పరగడుపున తీసుకుంటే ఇంతకు ముందు లేని ఉత్సాహం వస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరంలో టాక్సిన్స్‌ తొలగడమే కాక కిడ్నీల్లో రాళ్లు కూడా క్రమేపి తగ్గుతాయి. శరీరానికి కావలసిన ఫైబర్‌ను కొబ్బరిబొండాంలోని నీళ్లు అందిస్తాయి.

తలనొప్పిని తగ్గించుకోవచ్చు

తలనొప్పిని తగ్గించుకోవచ్చు

వారం పరగడుపున రోజులు క్రమం తప్పకుండా కొబ్బరి బోండాం తాగితే కొవ్వు శాతం క్రమంగా తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు.

కొబ్బరినీళ్లు తాగితే.. డీహైడ్రేషన్‌ వల్ల వచ్చే తలనొప్పిని తగ్గించుకోవచ్చు. చర్మం నిర్జీవంగా మారి ఇబ్బంది పెడుతున్నప్పుడు కొబ్బరినీళ్లు వారం రోజులపాటు తాగితే చర్మకాంతి మెరుగుపడుతుంది.

శారీరక ఎదుగుదల

శారీరక ఎదుగుదల

తల్లి పాలలో ఉండే లాక్టిక్‌ యాసిడ్‌ కొబ్బరి బోండాం నీళ్లలో కూడా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి ఈ నీళ్లను పిల్లలు తాగితే మానసిక, శారీరక ఎదుగుదలకు చక్కగా పని చేస్తుంది.

గర్భిణీలు నిత్యం కొబ్బరి నీళ్లు తాగడం వల్ల గర్బాశయంలో ఉన్న సమస్యలు తగ్గి, బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.

English summary

20 reasons why you should start drinking coconut water daily

20 reasons why you should start drinking coconut water daily
Story first published: Saturday, May 5, 2018, 13:00 [IST]