For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇలా చేస్తే దంతాలు తెల్లగా మిలమిల మెరిసిపోతాయి

ప్రతి ఒక్కరూ అందంగా కనపడాలంటే వారి దంతాలు కూడా అందంగా ఉండాలి. దంతాలు పసుపు రంగులో ఉంటె, వారితో మాట్లాడటానికి కూడా ఇతరులు విముఖత చూపుతారు. దంతాలు తెల్లగా మెరవాలంటే, దంతాలు మిళమిళ మెరవాలి. దంతాలు.పండ్లు

|

ప్రతి ఒక్కరూ అందంగా కనపడాలంటే వారి దంతాలు కూడా అందంగా ఉండాలి. దంతాలు పసుపు రంగులో ఉంటె, వారితో మాట్లాడటానికి కూడా ఇతరులు విముఖత చూపుతారు.

స్వీట్లు, జంక్‌ ఫుడ్‌, ఇత‌ర కొన్ని ఆహార ప‌దార్థాల కారణంగా దంతాల మ‌ధ్య కావిటీలు వ‌చ్చి దంతాలు పుచ్చిపోతాయి. దంతాల‌కు రంధ్రాలు ప‌డ‌తాయి. దీంతోపాటు చిగుళ్ల స‌మ‌స్య‌లు కూడా బాధిస్తాయి. దీంతోపాటు కొంద‌రికి ప‌లు కార‌ణాల వ‌ల్ల దంతాల‌పై గార ప‌ట్ట‌డ‌మో, పాచి ఎక్కువ‌గా పేరుకోవ‌డ‌మో జ‌రుగుతుంది.

అయితే దంతాల‌కు చెందిన ఇలాంటి స‌మ‌స్య‌లు ఏవి ఉన్నా వాటిని మ‌న ఇంట్లో ఉండే స‌హ‌జ సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే దూరం చేసుకోవ‌చ్చు. దీంతో ఆ స‌మ‌స్య‌లు పోవ‌డ‌మే కాదు, దంతాలు కూడా తెల్ల‌గా త‌ళ‌త‌ళ మెరుస్తాయి.

సరిగ్గా బ్రెష్ చేసుకోవాలి

సరిగ్గా బ్రెష్ చేసుకోవాలి

మీ పళ్ళను రోజూ సరిగ్గా బ్రెష్ చేసుకోవాలి. పళ్ళని రోజు లో రెండు సార్లు తోమండి. కాఫీ, టీ, కొలాస్ వంటి ద్రావణాలు పల్లకి అతుక్క పోయి, పళ్ళ తెల్లదనాన్ని పోగొడతాయి. మీ పల్లకి అతుక్కపోయే చల్లటి శీతల పానీయాలని తాగకండి. ఒకవేళ వాటిని తాగాల్సి వస్తే వాటిని పళ్ళకి తగలకుండా చూసుకోండి. శీతల పానీయాలని తాగేటప్పుడు స్ట్రా వాడండి. లేదంటే కూల్ డ్రింక్స్ తాగాక నీటితో నోటిని పుకిలించండి.

నారింజ

నారింజ

నారింజ పండ్లలో సిట్రస్ ఆసిడ్ ఉండటం వల్ల ఇవి పళ్ళ పైన ఉండే ఎనామిల్ పొరని తెల్లగా మార్చి దంతాలు తెల్లగా కనపడేలా చేస్తుంది. ఎక్కువ సిట్రస్ తీసుకోవటం వలన దంతాల పైన ఉండే ఎనామిల్ పొర కుడా తొలగిపోతుంది. ఎక్కువ సిట్రస్ తీసుకోవడం వల్ల పళ్లకు కాస్త హానికరం. కావున నారింజ పండ్ల రసాన్ని రోజుకి ఒక సారి తాగటం మంచిది.

పాలు

పాలు

పాలు దంతాలకు చాలా మేలు చేస్తాయి. పాలలో ఎక్కువ కాల్షియంని ఉంటుంది. దీంతో దంతాలకు బలం సమకూరుతుంది. ఎనామిల్ పొర ఆరోగ్యగంగా ఉంటుంది. అయితే పాలు తాగిన వెంటనే దంతాలను బ్రెష్ తో శుభ్రం చేసుకోవాలి.

తినే సోడా లేదా బేకింగ్ సోడా

తినే సోడా లేదా బేకింగ్ సోడా

తినే సోడా లేదా బేకింగ్ సోడా కూడా పళ్లను తెల్లగా మార్చుతుంది. చిటికెడు ఉప్పు లేదా బేకింగ్ సోడాని తీసుకొండి. అందులో కాస్త నీటిని కలపండి. దాంతో పళ్లని తోముకోండి. అయితే ఇలా రెగ్యులర్ గా చేయకూడదు. రోజూ మీరు మీ పేస్ట్ తో బ్రష్ చేసుకుంటూ రెండు వారాలకి ఒకసారి ఇలా తోముకోవాలి.

స్ట్రాబెర్రీ

స్ట్రాబెర్రీ

దంతాలకి తెల్లగా మార్చు మాలిక్ ఆసిడ్, స్ట్రాబెర్రీలో పుష్కలంగా ఉంటుంది. రోజులో ఒకసారి స్ట్రాబెర్రీని దంతాలకి రాయటం వలన తెలుపుని పొందవచ్చు. స్ట్రాబెర్రీని పళ్లకి రాసిన తరువాత బ్రెష్ చేయటం చాలా మంచిది. స్ట్రా‌బెర్రీలను పేస్టులా చేసి దానిలో చిటికెడు తినేసోడా వేయాలి. ఈ మిశ్రమంతో పళ్లను రుద్దుకోవాలి. స్ట్రా‌బెర్రీలో ఉండే విటమిన్‌-సి, యాసిడ్‌లు పళ్లకు తెల్లటి రంగు రావడానికి ఉపయోగపడతాయి.

ఆపిల్

ఆపిల్

ఆపిల్ కూడా మన పళ్లని తెల్లగా చేస్తుంది. ఆపిల్ ముక్కలని దంతాలకి రాయటం వలన పైన ఉండే ఎనామిల్ పొర తెల్లగా మారుతుంది.

తులసి ఆకులు

తులసి ఆకులు

తులసి ఆకుల్ని ఎండబెట్టి పొడిచేసి దాంతో పళ్లు తోముకున్నా దంతాలు ఆరోగ్యంగా మెరుస్తాయి. చిగుళ్ల నుంచి రక్తం కారేవారికి కూడా ఇది మంచి మందు.

జామ

జామ

జామ, యాపిల్‌, క్యారెట్‌, చెరకు, దోస... ఇవన్నీ కూడా సహజ వైట్‌నర్లు. వీటిని తరచుగా తింటుంటే వాటిలో ఉండే రసాయనాలు పంటిపై ఉండే మరకల్ని తొలగిస్తాయి.

వేప,నల్ల తుమ్ము

వేప,నల్ల తుమ్ము

వేప, నల్ల తుమ్మ పుల్లలతో తోముకున్నా కూడా దంతాల మీది మరకలు త్వరగా పోతాయి. వేపలో ఉండే యాస్ట్రింజెంట్లు, యాంటీ సెప్టిక్‌ గుణాలు పంటికి రక్షణ కల్పించి, దుర్వాసనను పోగొడతాయి.

టమాట, ఉసిరి

టమాట, ఉసిరి

టమాట, ఉసిరిలతో పళ్లపై రుద్దినా మంచి ఫలితం లభిస్తుంది. రాత్రిపూట పడుకోబోయే ముందు నారింజ తొక్కతో పళ్లు రుద్దుకుంటే అందులోని సి విటమిన్‌ రాత్రంతా సూక్ష్మజీవులతో పోరాడుతుంది.

హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌

హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌

అర చెంచాడు బేకింగ్‌ సోడాలో రెండుచుక్కల హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ వేసి కలిపి, ఆ మిశ్రమంతో వారానికి రెండుసార్లు తోముకుంటే క్రమంగా పళ్లు తెల్లగా అవుతాయి.

వినెగర్‌, చిటికెడు ఉప్పు కలిపి

వినెగర్‌, చిటికెడు ఉప్పు కలిపి

అర టేబుల్‌స్పూన్‌ బేకింగ్‌ సోడాలో అంతే పరిమాణంలో వినెగర్‌, చిటికెడు ఉప్పు కలిపి తోముకుంటే పళ్ల పచ్చదనం పోయి తెల్లగా అవుతాయి. అక్కడ బ్యాక్టీరియా కూడా నిల్వ ఉండలేదు.

బ్ర‌కోలి...

బ్ర‌కోలి...

విదేశీయులు బ్ర‌కోలిగా పిలుచుకునే కాలీఫ్లవర్ లో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది. ఇది దంతాల‌ను తెల్ల‌గా మార్చేందుకు, దంతాల‌ను దృఢంగా చేసేందుకు ఎంత‌గానో ఉప‌యోగ‌పడుతుంది.

క్యారెట్స్‌...

క్యారెట్స్‌...

క్యారెట్ల‌లో దంతాల‌ను తెల్ల‌గా చేసే గుణాలు ఉన్నాయి. వీటిని త‌ర‌చూ తింటుంటే చాలు దంత స‌మ‌స్య‌లు పోతాయి. చిగుళ్లు దృఢంగా మారుతాయి.

చీజ్‌...

చీజ్‌...

చీజ్‌ లో కాల్షియం ఎక్కువ‌గా ఉంటుంది. ఇది దంతాల‌ను దృఢంగా చేయ‌డ‌మే కాదు, దంతాల‌ను తెల్ల‌గా మారుస్తుంది. దంతాల పైన ఉండే ఎనామిల్ పొర పోకుండా చూస్తుంది.

న‌ట్స్‌...

న‌ట్స్‌...

బాదం ప‌ప్పు, జీడి ప‌ప్పు, వాల్‌నట్స్ లో దంతాల‌ను తెల్ల‌గా చేసే ఔష‌ధ గుణాలు ఉన్నాయి. పాచి ప‌ళ్లు ఉన్న‌వారు న‌ట్స్ ను త‌ర‌చూ తింటుంటే మంచిది. దీంతో దంతాల‌ను తెల్ల‌గా మార్చుకోవ‌చ్చు.

ఉల్లిపాయ‌లు...

ఉల్లిపాయ‌లు...

ఉల్లిపాయ‌ల‌తో ఒక‌టే స‌మ‌స్య‌. ఉల్లిపాయ‌ల‌ను తింటే నోరంతా వాస‌న వ‌స్తుంది. కానీ నిజానికి ఉల్లిపాయ‌ల వ‌ల్ల మ‌న దంతాల‌కు మేలే జ‌రుగుతుంది. వాటిని ప‌చ్చిగా తింటుంటే వాటిలో ఉండే స‌ల్ఫ‌ర్ నోటి స‌మ‌స్య‌ల‌ను పోగొడుతుంది. దంతాల‌ను తెల్ల‌గా మారుస్తుంది.

పైనాపిల్స్‌...

పైనాపిల్స్‌...

బ్రొమిలీన్ అనే ర‌సాయ‌నం పైనాపిల్స్ లో పుష్క‌లంగా ఉంటుంది. ఇది దంతాల‌కు ప‌ట్టిన పాచి, గార వంటి వాటిని తొల‌గించి దంతాల‌ను తెల్ల‌గా, దృఢంగా మారుస్తుంది. దంతాల మ‌ధ్య పేరుకుపోయిన వ్య‌ర్థాలు, బ్యాక్టీరియాను తొలగిస్తుంది.

లవంగాలు

లవంగాలు

లవంగాలను పొడిచేసి దానితో పళ్లు రుద్దుకోవాలి. ఇలా చేయడంవల్ల పళ్లు తళతళా మెరవడమే కాకుండా బలంగా కూడా ఉంటాయి.

తులసి ఆకులు

తులసి ఆకులు

తులసి ఆకుల్నిఎండబెట్టి పొడి చేసి దీనితో ప్రతిరోజూ బ్రష్‌ చేస్తే పళ్లపై వచ్చే పసుపు మరకలు తొలగిపోతాయి. అంతేకాకుండా పళ్లకు సంబంధించిన ఇతర సమస్యలు కూడా పోతాయి.

English summary

25 simple ways to naturally whiten your teeth at home

25 simple ways to naturally whiten your teeth at home
Story first published:Monday, May 21, 2018, 16:17 [IST]
Desktop Bottom Promotion