For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దానిమ్మ తింటే రసికరాజులవుతారు.. ఇంకా చాలా ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ గ్లాస్ దానిమ్మ జ్యూస్ తాగండి

లైంగిక సామర్థ్యాన్ని పెంచేందుకు దానిమ్మ బాగా ఉపయోగపడుతుంది. సంతాన సాఫల్యతను పెంచే శక్తి దీనికి ఉంది. గ్లాసు దానిమ్మ రసం, దానిమ్మ జ్యూస్, దానిమ్మ గింజలు, దానిమ్మ పండు.

|

సీజన్లతో సంబంధం లేకుండా మనకు దానిమ్మ పండ్లు ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ లభిస్తాయి. అవి ధర కూడా తక్కువే ఉంటాయి. కనుక వాటిని ఎవరైనా నిత్యం తమ ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. అయితే దానిమ్మ పండ్లతో తీసిన రసాన్ని రోజూ తాగడం వల్ల కూడా అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

దానిమ్మ పండ్ల రసాన్ని రోజూ తాగడం వల్ల క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. క్యాన్సర్ కణతులు వృద్ధి చెందవు. క్యాన్సర్ కణాల ఉత్పత్తిని తగ్గించే గుణాలు దానిమ్మ పండ్లలో ఉంటాయి. దీంతోపాటు శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

హార్ట్ ఎటాక్ ముప్పు ఉన్న వారు

హార్ట్ ఎటాక్ ముప్పు ఉన్న వారు

దానిమ్మ పండు రసాన్ని రోజూ తాగితే గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది. రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. హార్ట్ ఎటాక్స్ రాకుండా ఉంటాయి. హార్ట్ ఎటాక్ ముప్పు ఉన్న వారు రోజూ దానిమ్మ పండ్ల రసాన్ని తాగితే ఆ ముప్పు బారి నుంచి తప్పించుకోవచ్చు.

డయాబెటిస్ అదుపులో

డయాబెటిస్ అదుపులో

దానిమ్మ పండ్లలో ఉండే ఔషధ గుణాలు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. జీర్ణ సమస్యలు పోతాయి. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం బాధించవు. దానిమ్మ పండ్ల రసాన్ని రోజూ తాగితే రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. రక్తం బాగా తయారవుతుంది.

మొటిమలు పోతాయి

మొటిమలు పోతాయి

దానిమ్మ పండ్లలో పుష్కలంగా ఉండే విటమిన్ సి చర్మాన్ని సంరక్షిస్తుంది. చర్మంపై ఉండే మచ్చలు, మొటిమలు పోతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది. అలాగే శిరోజాలు సంరక్షింపబడతాయి. దంతాలు దృఢంగా మారుతాయి. చిగుళ్ల సమస్యలు పోతాయి.

యవ్వనంగా ఉండేలా చేస్తాయి

యవ్వనంగా ఉండేలా చేస్తాయి

దానిమ్మ పండులో విటమిన్‌-ఎ, సి, ఇ, బి-5లు పుష్కలంగా ఉంటాయి. అత్యంత శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు దానిమ్మలో ఎక్కువ. ఇవి కణాల విధ్వంసానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌ పని పట్టి యవ్వనంగా ఉండేలా చేస్తాయి. దానిమ్మ సహజ యాస్పిరిన్‌. రక్తసరఫరాను తగినంతగా వేగవంతం చేస్తుంది. పావు కప్పు రసం రోజూ తాగితే మీ గుండె ఎంచక్కా భద్రంగా ఉన్నట్టే.

చర్మ సౌందర్యానికి..

చర్మ సౌందర్యానికి..

దానిమ్మతో అందం మెరుగుపడుతుంది. దానిమ్మ రుచికరమైన పండు మాత్రమే కాకుండా, చర్మ ఆరోగ్యాన్ని వృద్ధి చేసి, చర్మ సమస్యలను తగ్గించి అందాన్ని మెరుగుపరుస్తుంది. దానిమ్మలో ఉండే నూనెలు, ఎపిడేర్మల్‌ కణాలకు శక్తిని అందించి, వయసు మీరిన కొలది చర్మంపై కలిగే ముడతలను ఆలస్యంగా కలుగజేస్తాయి.

యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు

యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు

దానిమ్మ, పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలను కలిగి ఉంటుంది. పండు బాహ్య పొర, చర్మంలోని ఎపిడేర్మల్‌లో (శరీరంపై ఉన్న బాహ్య చర్మం) రక్త ప్రసరణను అధికం చేసి, ప్రమాదానికి గురైన కణాలను తొలగించి, నూతన కణాల పునరుత్పత్తిని ప్రోత్సహిస్తుంది.

మచ్చలను తగ్గిస్తుంది

మచ్చలను తగ్గిస్తుంది

అకాల వృద్ధాప్యాన్ని ఆపే ఆహార పదార్థాలలో ఇది ముఖ్యమైన దిగా చెప్పవచ్చు. సూర్యకిరణాలకు బహి ర్గతం అవటం వలన కేలిగే ప్రమాదాలను, ముడతలను దానిమ్మ పండు తగ్గించి వేస్తుంది. ‘హెపెర్పిగ్మెం టేషన్‌' వయసు మీరిన కొలది కలిగే మచ్చలను ఈ పండు తినటం ద్వారా తగ్గించుకోవచ్చు . దానిమ్మ పండులో ఉన్న ప్యూనిక్‌ ఆసిడ్‌ ఒమేగా-3 ఫాటీ ఆసిడ్‌ లు హైడ్రేట్‌, తేమను కోల్పోవటాన్ని నివారిస్తుంది.

జిడ్డు చర్మం

జిడ్డు చర్మం

దానిమ్మ పండు పొడి చర్మానికి ఉపయోగపడిన విధంగానే, జిడ్డు చర్మానికి లేదా ఎక్కువ ఆయిల్‌ కలిగిన చర్మానికి కూడా ఉపయోగపడు తుంది. జిడ్డు చర్మంపై కలిగే మొటి మలను, చర్మ పగుళ్ళను, మచ్చలు, దురదలను శక్తివంతంగా తగ్గించి వేస్తుంది

మృదువైన చర్మం

మృదువైన చర్మం

దానిమ్మ పండు, చర్మంలోని కొల్లాజన్‌ మరియు స్థితిస్తాపకతను కలుగుచేసి చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. ఈ పండు నుండి తయారు చేసిన రసం చర్మ కణాలలో ఫైబ్రోబ్లాస్ట్‌'లను వృద్ధి పరచి, చర్మ మృదుత్వాన్ని అధికం చేస్తుంది. అంతేకాకుండా, దానిమ్మ పండులో ఉండే ‘ప్యూనిక్‌ ఆసిడ్‌', చర్మ కణాలలో ఉండే బ్యాక్టీ రియా మరియు మలిన పదార్థాలను తొల గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

సూర్యకాంతి నుంచి రక్షణ

సూర్యకాంతి నుంచి రక్షణ

సూర్య కాంతి వలన కలిగే ప్రమాదాలను దానిమ్మ పండు ద్వారా తగ్గించుకోవచ్చు. సూర్య కాంతి వలన కలిగే ప్రమాదాలను, ఫ్రీ రాడికల్‌'ల వలన చర్మంపై కలిగే నష్టా లను మరియు చర్మ క్యాన్సర్‌ వంటి ప్రమాదకర వ్యాధులను కూడా తగ్గించి వేస్తుంది. ‘ఎల్లాజిక్‌ ఆసిడ్‌' ‘పాలీఫినాల్‌ యాంటీ ఆక్సిడెంట్‌'లు దానిమ్మ పండులో ఉంటాయి, ఇవి చర్మంలో ఏర్పడే, క్యాన్సర్‌ ట్యూమర్‌ ఏర్పాటును అడ్డుకుంటాయి.

స్కిన్‌ ఇన్ఫమేషన్‌

స్కిన్‌ ఇన్ఫమేషన్‌

దానిమ్మ పండులో పుష్కంలంగా పాలీఫినాల్‌, యాంటీ- ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగినందు వలన, ఇవి చర్మం పై ఏర్పడిన మంటలను, వాపులను శక్తివంతంగా తగ్గిస్తాయి. చర్మంపై ఏర్పడిన చిన్న చిన్న తెగుళ్ళను, మచ్చలను తగ్గించుటకు, దానిమ్మ గింజల నుంచి తయారు చేసిన నూనెలను వాడమని సౌందర్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

రక్త సరఫరా వేగవంతం

రక్త సరఫరా వేగవంతం

దానిమ్మలో సహజ యాస్పిరిన్ గుణాలు ఉన్నాయి. రక్త సరఫరాను వేగవంతం చేయడంలో దానిమ్మ మెరుగ్గా పనిచేస్తుంది. పావు కప్పు రసం రోజూ తాగితే గుండె భద్రంగా ఉంటుంది. ఎముకల ఆరోగ్యానికి దానిమ్మ చాలా మేలు చేస్తుంది. ఆస్టియో ఆర్థరైటిస్‌తో బాధపడే వారికి అత్యంత దివ్యమైన ఔషధం దానిమ్మ.

లైంగిక సామర్థ్యాన్ని పెంచేందుకు

లైంగిక సామర్థ్యాన్ని పెంచేందుకు

లైంగిక సామర్థ్యాన్ని పెంచేందుకు దానిమ్మ బాగా ఉపయోగపడుతుంది. సంతాన సాఫల్యతను పెంచే శక్తి దీనికి ఉంది. గ్లాసు దానిమ్మ రసంలో గ్రీన్‌టీ, బ్లూబెర్రీ, రెడ్‌వైన్‌ల కన్నా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇక దానిమ్మ గింజలు శృంగారంపైనా ఆసక్తిని ప్రేరేపించటానికీ దోహదం చేస్తాయి. రోజుకి ఒకగ్లాసు చొప్పున పదిహేను రోజుల పాటు దానిమ్మరసం తాగినవారిలో సెక్స్ హార్మోనైన టెస్టోస్టీరాన్ మోతాదులు 16-30% పెరుగుతాయి.

శృంగార ఆసక్తి కూడా పెరుగుతుంది

శృంగార ఆసక్తి కూడా పెరుగుతుంది

దానిమ్మ రసం తాగిన స్త్రీ, పురుషులిద్దరిలోనూ టెస్టోస్టీరాన్ స్థాయిలు పుంజుకోవటమే కాదు.. రక్తపోటు తగ్గుతుండటమూ విశేషం. భయం, విచారం, అపరాధభావం, సిగ్గుపడటం వంటివి తగ్గుతూ.. ధైర్యం, ఆత్మవిశ్వాసం వంటి సానుకూల అంశాలు అధికమవుతాయి. టెస్టోస్టీరాన్ మూలంగా పురుషుల్లో గడ్డం, మీసాలు రావటం.. గొంతు మారటంతో పాటు శృంగార ఆసక్తి కూడా పెరుగుతుంది.

శృంగార వాంఛను పెంచటంతో

శృంగార వాంఛను పెంచటంతో

ఈ హార్మోన్ మగవారిలో ఎక్కువ మోతాదులో ఉన్నప్పటికీ.. స్త్రీలల్లోనూ అడ్రినల్ గ్రంథులు, అండాశయాల నుంచి విడుదలవుతుంది. ఇది స్త్రీలల్లో శృంగార వాంఛను పెంచటంతో పాటు ఎముకలు, కండరాల బలోపేతానికి తోడ్పడుతుంది. టెస్టోస్టీరాన్ మోతాదు పెరగటమనేది మూడ్, జ్ఞాపకశక్తి మెరుగుపడటానికీ, ఒత్తిడి దూరం కావటానికీ దోహదం చేస్తుంది.

శృంగార పేరితంగా పనిచేస్తుంది

శృంగార పేరితంగా పనిచేస్తుంది

రుతుస్రావ సమయంలో ఉండే ఇబ్బంది, ఒత్తిడి వంటి సమస్యలకు దానిమ్మ రసం విరుగుడుగా పనిచేస్తుంది. దానిమ్మ రసం అంగస్తంభన సమస్యలను కూడా తొలగిస్తుంది. శృంగార పేరితంగా పనిచేస్తుంది. గుండెకు మేలు చేస్తుంది. దానిమ్మ రసంలోని రసాయనాలు కొలెస్ట్రాల్ వల్ల జరిగే ప్రమాదాలను తగ్గిస్తాయి. రక్తపోటును తగ్గించే గుణం దీనికి ఉంది. రక్తనాళాలు మూసుకుపోకుండా చూస్తుంది.

ఫోలిక్ యాసిడ్

ఫోలిక్ యాసిడ్

గర్భస్థ శిశువుల పెరుగుదలకు అవసరమైన ఫోలిక్ యాసిడ్ ఈ పండులో పుష్కలంగా లభిస్తుంది. గర్భిణీ మహిళలు రోజూ ఒక గ్లాస్ దానిమ్మ రసం తీసుకుంటే ఎంతో మంచిది. దీని వల్ల నెలలు నిండకుండానే ప్రసవం అయ్యే ముప్పు తప్పుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

దంతాల చిగుళ్లను బలపరుస్తాయి

దంతాల చిగుళ్లను బలపరుస్తాయి

దానిమ్మ రసం నీళ్ల విరేచనాలతో బాధ పడేవారికి ఇది మంచి మందు. ఇందులోని యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు నోటి పూత నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. అల్సర్లను నివారిస్తాయి, దంతాల చిగుళ్లను బలపరుస్తాయి.

గాయాలకు ఔషధంగా

గాయాలకు ఔషధంగా

క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. మూత్ర పిండాల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. దానిమ్మ రసాన్ని శరీరం మీద రాస్తే అలర్జీలు, కీటకాలు కుట్టడం వల్ల వచ్చిన పొక్కులు మానిపోతాయి. దానిమ్మ పండు తొక్క గాయాలకు ఔషధంగా పనిచేస్తుంది. వాపును అరికడుతుంది. దానిమ్మ ఆకుల నూనె రాసుకుని వాపు ఉన్న చోట కడితే కాళ్ల వాపులు తగ్గుతాయి.

వాపునూ తగ్గిస్తాయి

వాపునూ తగ్గిస్తాయి

దానిమ్మగింజల్లో ఎ, ఈ, సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇక వీటిల్లోని ఇనుము శరీరానికి ఆక్సిజన్ సరఫరా బాగా జరిగేలా చేస్తే.. ఫాలీఫెనాల్స్ క్యాన్సర్ కారకాల పని పడతాయి. టానిన్లు రక్తపోటు తగ్గటానికి, రోగనిరోధక శక్తి పుంజుకోవటానికి తోడ్పడతాయి. యాంతోసైయానిన్లు రక్తనాళాలను కాపాడతాయి. వాపునూ తగ్గిస్తాయి. అందువల్ల దానిమ్మను ఆహారంలో భాగంగా చేసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

గుండె చక్కగా పనిచేస్తుంది

గుండె చక్కగా పనిచేస్తుంది

దానిమ్మ గింజల రసాన్ని రోజుకో గ్లాసు చొప్పున తాగితే గుండె చక్కగా పనిచేస్తుంది. అలాగే జుట్టు రాలే సమస్య నుంచి బయటపడాలంటే దానిమ్మ గింజల రసాన్ని మించింది లేదు. జుట్టు కుదుళ్లకు బలాన్నిచ్చి, మందంగా ఉంచి, ఆరోగ్యంగా కనిపించేలా చేస్తుంది దానిమ్మ రసం. హార్మోన్ల అసమతుల్యత యాక్నె సమస్యకి కారణం. దానిమ్మ గింజలు యాక్నెను నివారించడంలో ముఖ్య భూమిక వహిస్తాయి.

యవ్వనంతో మెరిసిపోవడం

యవ్వనంతో మెరిసిపోవడం

ఈ పండులో అధిక మొత్తంలో ఐరన్‌ ఉంటుంది. ఐరన్‌ ఆక్సిజన్‌ రవాణాకి సాయపడుతుంది. ఆక్సిజన్‌ రవాణా సరిగా జరిగిందంటే చర్మం యవ్వనంతో మెరిసిపోవడం ఖాయం. దానిమ్మరసాన్ని ముఖానికి రాసుకుంటే అది మంచి టోనర్‌లా పనిచేస్తుంది. చర్మంపై ఏర్పడే మచ్చలు, బ్లెమిషెస్‌ను తగ్గిస్తుంది దానిమ్మ. చర్మంపై ఉండే మృతకణాలను తొలగించాలంటే దానిమ్మే బెస్ట్‌.

దానిమ్మను ఇలా ఒలచి తినాలి

దానిమ్మను ఇలా ఒలచి తినాలి

ఒక గ్లాసు దానిమ్మ రసాన్ని ప్రతిరోజూ తాగితే రక్త సరఫరా బాగా జరుగుతుంది. దానివల్ల గుండె మీద ఒత్తిడి తగ్గుతుంది. రక్తం గడ్డలు కట్టకుండా చేసే గుణం దానిమ్మకు ఉంది. దానిమ్మపండును అడ్డంగా కోయాలి. ఇలా చేసేటప్పుడు చాకుని దానిమ్మ పండులోకి మరీ లోతుకు పోనివ్వద్దు. గింజలకు చాకు తగిలితే రసం బయటకు వచ్చేస్తుంది. అందుకని గింజల వరకు వెళ్లకుండా పైపైన కోయాలి. దానిమ్మపండు చుట్టూరా చాకుతో కోశాక చేతులతో రెండు భాగాలు చేయాలి. ఒక సగాన్ని బోర్లించినట్టు పట్టుకుని తొక్కమీద గరిటెతో కొడుతుంటే పళ్లెంలోకి గింజలు వాన జల్లులా పడతాయి.

English summary

30 incredible benefits of pomegranates

30 incredible benefits of pomegranates
Story first published:Thursday, May 3, 2018, 12:19 [IST]
Desktop Bottom Promotion