For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  లైంగిక అనాసక్తికి గల ఎనిమిది కారణాలు ఇవే !

  |

  మనుషులకు మిగిలిన ఇతర జీవుల వలె, ఆరోగ్యంగా మరియు సంతోషంగా ఉండే క్రమంలో భాగంగా ఎప్పటికప్పుడు సంతృప్తి చెందవలసిన అనేక ప్రాధమిక అంశాలు సమయానుసారం అవసరమైన వనరులుగా ఉన్నాయి.

  ఉదాహరణకు, మనకు దాహం అనుభూతి ఉన్నప్పుడు త్రాగడానికి నీరు ఉండాలి మరియు ఆకలితో ఉన్నప్పుడు కడుపు నిండుటకు ఆహారం ఉండాలి. ఈ అవసరాలను సమయానుసారం తీర్చకపోతే, అది నిర్జలీకరణ(డీ హైడ్రేషన్) మరియు పోషకాహార సమస్యల వంటి అనేక సమస్యలకు దారి తీస్తుంది! అవునా?

  8 Reasons Why You May Not Want To Have Sex

  అదేవిధంగా, లైంగిక సంపర్కంలో పాలుపంచుకునే స్వభావం కూడా ప్రకృతి ద్వారా రూపొందించబడిన ప్రాధమిక అంశం.

  అయితే, లైంగిక సంపర్కం చాలా ఆనందకరమైన అంశంగా ఉండటం వలన, పునరుత్పత్తి అవసరం లేకపోయినా లైంగిక సంపర్కం పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. కేవలం సంతోషం కోసమే కాదు, భాగస్వాముల మద్య ప్రేమను పెంచుటలో కూడా ఎంతో కీలక పాత్రను పోషిస్తుంది.

  ఇప్పుడు, దీర్ఘకాలం పాటు ఒక వ్యక్తి ఆకలి లేకుండా ఉన్నాడు అంటే, ఇది ఖచ్చితంగా ఆందోళన కలిగించే అంశమే అవుతుంది మరియు తద్వారా ఆరోగ్య సమస్యలను పరిష్కరించే క్రమంలో భాగంగా వైద్యులను సంప్రదించవలసి వస్తుందికూడా. అవునా?

  అదేవిధంగా, ఒక వ్యక్తి తక్కువ లైంగికాసక్తిని ప్రదర్శిస్తున్నట్లయితే, ఈ సమస్య వెనుక ఖచ్చితంగా అనేక వైద్య సంబంధిత కారణాలు ఉండవచ్చు.

  ఈ వ్యాసంలో ఆ వైద్య సంబంధిత సమస్యల గురించిన విషయాలను మీముందు ఉంచబోతున్నాం.

  1. యోని పొడిగా మారడం :

  అనేక మంది సెక్సాలజిస్టుల కథనం ప్రకారం, లైంగిక సంపర్కంలో లేదా ఫోర్ప్లేలో భాగంగా నొప్పిలేకుండా, సులభరీతిన సంభోగం జరుగుటకు మరియు మహిళలకు అసౌకర్యం లేకుండా ఉండుటకై, వారి యోని ప్రాంతం ద్రవాలతో తడిగా ఉండవలసిన అవసరం ఉంది. అలా లేకపోతే, ఘర్షణ తోడై నొప్పి మరియు మండే అనుభూతిని కలిగించవచ్చు. తద్వారా స్త్రీ అసౌకర్యానికి, భాధకు లోనవుతుంది. ముఖ్యంగా అనారోగ్యాలు, హార్మోన్ల అసమతౌల్యం, మెనోపాజ్ మొదలైన అనేక కారణాల వలన స్త్రీ యోని పొడిబారే అవకాశాలు ఉంటాయి.

  2. తక్కువ టెస్టోస్టీరాన్ :

  శరీరంలో టెస్టోస్టెరోన్ హార్మోన్ స్థాయిలు తక్కువగా ఉంటే, ముఖ్యంగా పురుషులు ఎక్కువగా ప్రభావితమవుతారు. తద్వారా వంద్యత్వ సమస్యలకు లైంగిక అనాసక్తికి దారితీస్తుంది. ఈ హార్మోన్ పురుషులలో లైంగిక వాంఛను ప్రోత్సహించటం, ఎరెక్షన్ మరియు పునరుత్పత్తిని కూడా ప్రోత్సహించే ఒక తాళం వంటిది. కాబట్టి, మీరు లైంగిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే మీ టెస్టోస్టెరాన్ స్థాయిలను పరీక్షించడం ముఖ్యం.

  3. తప్పుదోవ పట్టిన లైంగిక విలువలు :

  ఇది ఒక మానసిక కారకంగా చెప్పవచ్చు. ఇది ఒక వ్యక్తి సంభోగం పట్ల విముఖత లేదా భయం కలగడానికి కారణం. కొంతమంది తాము పెరిగే వాతావరణంలో సంబంధం, సంభోగం వంటి చర్యలను తప్పుగా, చెత్తగా, సిగ్గు చేటు చర్యలుగా భావించేలా పెరుగుతారు. తద్వారా వారు, మానసికంగా అత్యంత ప్రభావానికి లోనవడం కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది. మానసిక చికిత్స మరియు సెక్స్ గురించిన పూర్తి అవగాహన కలిగించడం ద్వారా ఇలాంటి పరిస్థితి నుండి బయటపడగలరు.

  4. డిప్రెషన్ :

  ఇది ప్రజలలో లైంగిక అనాసక్తి కలిగి ఉండడానికి గల మరొక మానసిక కారణం. డిప్రెషన్ ఒక తీవ్రమైన మానసిక అనారోగ్యం. ఇందులో వ్యక్తి యొక్క సెరోటోనిన్ మరియు డోపమైన్ హార్మోన్ స్థాయిలలో అస్తవ్యస్త మార్పుల కారణంగా అనేక ప్రతికూల లక్షణాలకు కారణభూతమవుతుంది. ఈ హార్మోన్ల యొక్క హెచ్చుతగ్గుల కారణంగా, లైంగికాసక్తి కూడా నాటకీయంగా తగ్గిపోతుంది. డిప్రెషన్ చికిత్సలో వైద్య మరియు మానసిక సంబంధిత చికిత్సలు అవసరం. ఈ డిప్రెషన్ స్థాయిల లక్షణాలు తగ్గినప్పుడు, ప్రజలు వారి లిబిడోను తిరిగి పొందుతారు.

  5. థైరాయిడ్ వ్యాధి:

  థైరాయిడ్ హార్మోన్లు శరీరంలో హెచ్చుతగ్గులకు గురైనప్పుడు, అది రెండు రకాల వైద్య పరిస్థితులకు దారితీస్తుంది. థైరాయిడ్ హార్మోన్ల తక్కువ ఉత్పత్తి జరిగినప్పుడు హైపో థైరాయిడిజం మరియు థైరాయిడ్ హార్మోన్ల అదనపు ఉత్పత్తి వలన హైపర్ థైరాయిడిజం కలుగుతుంది. ఈ వ్యాధులు రెండూ వ్యక్తిలోని లైంగికాసక్తిని ప్రభావితం చేస్తాయి. క్రమంగా సెక్స్ పట్ల కోరికను తగ్గిస్తాయి. రక్త పరీక్షల ద్వారా థైరాయిడ్ వ్యాధుల ఉనికిని గుర్తించవచ్చు. క్రమం తప్పకుండా మందులు వాడడం మూలంగా వారి లైంగికాసక్తిని పునరుద్ధరించడానికి సహాయపడుతుంది.

  6. రుతువిరతి(మెనోపాజ్)

  రుతువిరతి అనేది ప్రతి మహిళ జీవితంలో ఖచ్చితంగా అనుభవించాల్సిన ఒక సహజ ప్రక్రియ. 45-50 సంవత్సరాల తరువాత హార్మోన్ల మార్పులు కారణంగా, వారి ఋతు చక్రం నిలిపివేయబడుతుంది. మరియు వారు పునరుత్పత్తి అవకాశాన్ని కోల్పోతారు కూడా. రుతువిరతి వలన, హార్మోన్ల అసహజ మార్పుల వల్ల మహిళలలో అనేకులు లైంగిక సంబంధం పట్ల ఆసక్తిని కోల్పోతారు. యోని పొడబారడం, మెనోపాజ్ సమయంలో సాధారణంగా కలిగే సమస్య. తద్వారా సంభోగం బాధాకరంగా ఉంటుంది. కొన్ని హార్మోన్ల చికిత్సలు ఈ సమస్యను పరిష్కరించడానికి సహాయపడతాయి.

  7. గుర్తించబడని లైంగికవ్యాదులు :

  వ్యక్తి ఏదైనా లైంగిక వ్యాధులకు గురైనప్పుడు,ఒక్కోసారి అవి గుర్తించడానికి ఎక్కువ సమయం పట్టవచ్చ్చు. తద్వారా అతను / ఆమె లైంగిక అనాసక్తిని కూడా అనుభవించవచ్చు. హెర్పిస్, గనేరియా, సిఫిలిస్ వంటి కొన్ని లైంగిక వ్యాధుల కారణంగా జరిగే హార్మోన్ల అసమానతలు సంభోగం సమయంలో జననేంద్రియ ప్రాంతాల్లో నొప్పిని కలిగిస్తాయి. తద్వారా సంబంధం పట్ల విముఖత ఏర్పడుతుంది. ఒకవేళ అసహజ సంబంధాలను లేదా అనైతిక సంబంధాలను కలిగి ఉన్నట్లయితే, ఒక్కసారి ఈ లైంగిక వ్యాధుల గురించిన పరీక్షలు చేయించుకోవడం మంచిది.

  8. లైంగికదాడులు :

  ఈనాడు పసిపిల్లల నుండి, వృద్దుల దాకా చిన్న, పెద్ద తేడా లేకుండా లైంగిక దాడులు జరుగుతున్నాయి. తెలిసీ తెలియని వయసులో ఉన్న పసిపిల్లల పైన జరుగుతున్న లైంగిక దాడులు, వారి మానసిక స్థితిపై పెను ప్రభావాన్ని చూపుతాయి. తద్వారా వారు పెరిగి పెద్దయ్యాక, సంబంధం అంటేనే భయపడే దారుణమైన స్థాయికి చేరుకుంటున్నారు. ఇక్కడ స్త్రీపురుషుల తేడా లేకుండా ప్రతి ఒక్కరి మీదా దాడులు జరుగుతున్నాయి. తెలిసిన వాళ్ళే ఎక్కువగా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అనేక నివేదికలు కూడా తేల్చాయి. మరియు మహిళల పట్ల ఆకతాయిల ఆగడాలు రోజు రోజుకీ హెచ్చు మీరుతున్నాయి. తద్వారా వారు పెళ్లి, సంబంధం అంటేనే అనాసక్తిని ప్రదర్శిస్తున్నారు. కొందరు ఆత్మన్యూనతకు, డిప్రెషన్ కు లోనై ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఇలాంటి సమస్యలను ఎదుర్కున్న వారి మానసిక స్థాయిలు ఎలా ఉంటాయో వేరే చెప్పనవసరం లేదు. కానీ వీరికి మానసిక మరియు ఆలోచన సంబంధిత చికిత్సలు అందించడం ద్వారా ఈ సమస్యను తగ్గించవచ్చు.

  English summary

  8 Reasons Why You May Not Want To Have Sex

  As humans, just like every other living being, we have a number of basic instincts which need to be satisfied from time to time, in order for us to remain healthy and happy, right? For instance, we must drink water when we feel thirsty and we must consume food when we are hungry, etc. If these needs are not met, when we feel the urge, it could lead to a number of problems like dehydration and malnutrition
  Story first published: Monday, May 21, 2018, 8:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more