For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుండె ఆరోగ్యాన్ని సంరక్షించునేందుకు కార్డియాలజిస్ట్ లు తెలిపిన 8 చిట్కాలు

గుండె ఆరోగ్యాన్ని సంరక్షించునేందుకు కార్డియాలజిస్ట్ లు తెలిపిన 8 చిట్కాలు

|

గుండె ఆరోగ్యంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉన్నట్టేనన్న చైనీస్ సూక్తిని మనం తప్పక గుర్తుంచుకోవాలి.

గుండె అనేది శరీరంలోని ముఖ్యమైన అవయవం. గుండె పనితీరు సజావుగా ఉంటే శరీరంలోని అన్ని అవయవాల పనితీరు మెరుగ్గా ఉంటుంది. గుండె పనితీరు సరిగ్గా లేదంటే ఆ ప్రభావం ఇతర అవయవాలపై పడుతుంది.

గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, లివర్ మరియు బ్రెయిన్ లు శరీరంలోని ముఖ్య అవయవాలు. ఈ సంగతి మనకు తెలిసిందే.

వీటిలో, గుండెకున్న ప్రాముఖ్యతని మనం గుర్తించాలి. రక్తాన్ని ఫిల్టర్ చేసి శరీరంలోని ప్రతి భాగానికి అక్షిజెనెటేడ్ రక్తాన్ని ఆర్టెరీస్ ద్వారా సరఫరా చేయడంలో గుండె ప్రధాన పాత్ర పోషిస్తుంది.

8 Secret Tips For A Healthy Heart As Told By Cardiologists!

కాబట్టి, కొన్ని వ్యాధుల వలన లేదా కొన్ని ఇంజ్యూరీల వలన గుండె సరిగ్గా పనిచేయకపోతే శరీరంలోని ఇతర అవయవాలకు రక్త సరఫరాలో ఆటంకాలు ఏర్పడవచ్చు. తద్వారా, వాటి పనితీరు కూడా దెబ్బతింటుంది.

కాబట్టి, గుండె ఆరోగ్యంపై కాస్తంత అవగాహనను పెంచుకోవడం ముఖ్యం. తద్వారా, గుండె ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి మనవంతు ప్రయత్నాలు మనం చేయగలం.

ఈ ఆర్టికల్ లో గుండె ఆరోగ్యాన్ని సంరక్షించుకునేందుకు కార్డియాలజిస్ట్ లు అందించిన సలహాలను పరిశీలిద్దాం.

1. సన్నగానున్న వారు కూడా గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంది:

1. సన్నగానున్న వారు కూడా గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంది:

కేవలం అధికబరువు లేదా ఒబెసిటీ బారిన పడ్డ వారిలో మాత్రమే గుండె జబ్బుల సమస్య కనిపిస్తుందన్న అపోహ ఉంది. ఫ్యాట్ పెర్సెంటేజ్ అలాగే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారిలో గుండె జబ్బులు సాధారణమని ఒక భావన ఉంది. అయితే, ఇది అపోహ మాత్రమే. బరువుతో సంబంధం లేకుండా సన్నగా ఉన్న వారిలో కూడా ఈ సమస్య ఎదురవుతుందని కార్డియోలాజిస్ట్ లు స్పష్టం చేస్తున్నారు. అనారోగ్యకరమైన లైఫ్ స్టయిల్, హెరిడిటరీ ఫ్యాక్టర్స్ లేదా పుట్టుకతో వచ్చిన గుండె జబ్బుల వలన సన్నగా ఉండే వారిలో కూడా గుండె సమస్యలు కనిపించవచ్చు. కాబట్టి, ఎప్పుడు గుండె ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం ముఖ్యం.

2. షుగర్ అనేది గుండెకు అతిపెద్ద శత్రువు:

2. షుగర్ అనేది గుండెకు అతిపెద్ద శత్రువు:

గుండె వ్యాధుల బారిన పడే ప్రమాద స్థాయిలను పెంచేందుకు ఫ్యాట్ కంటెంట్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని చాలా మంది అభిప్రాయం. శరీరంలోని అధిక కొవ్వు వలన కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి గుండె జబ్బులు తలెత్తుతాయని అభిప్రాయపడుతారు. అయితే, చక్కెరని అధికంగా తీసుకోవడం వలన శరీరంలోని ఇన్సులిన్ హార్మోన్ స్థాయిలు ఆరోగ్యకరంగా ఉండవని తద్వారా కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బులు ఎదురయ్యే ప్రమాదం తలెత్తుతుందని నిపుణులంటున్నారు.

3. మల్టీవిటమిన్స్ గుండెను సంరక్షించలేవు:

3. మల్టీవిటమిన్స్ గుండెను సంరక్షించలేవు:

మల్టీవిటమిన్ సప్లిమెంట్స్ ను పిల్స్ రూపంలో గాని లేదా సిరప్స్ రూపంలో గాని తీసుకుంటే శరీరానికి తగినంత పోషణ అంది ఆరోగ్యంగా ఉంటారని సలహా అందుతూ ఉంటుంది. ఎందుకంటే, గుండె జబ్బుల వంటి కొన్ని ఆరోగ్య సమస్యలను మల్టీవిటమిన్స్ అరికట్టగలవని వారి అభిప్రాయం. అయితే, ఇది కేవలం అపోహ మాత్రమే. మల్టీవిటమిన్స్ ని తీసుకోవడం వలన వ్యాధులు అరికట్టబడవు. లైఫ్ స్టయిల్ లో ఆరోగ్యకరమైన మార్పులను చేర్చడం ద్వారానే ఆరోగ్యాన్ని సంరక్షించుకోగలుగుతాము. ఈ విషయాన్ని గుర్తిస్తే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాము.

4. రిస్కీ ప్రెగ్నెన్సీ వలన గుండె జబ్బులు తలెత్తవచ్చు:

4. రిస్కీ ప్రెగ్నెన్సీ వలన గుండె జబ్బులు తలెత్తవచ్చు:

ప్రెగ్నెన్సీలో లేదా చైల్డ్ బర్త్ సమయంలో ఏవైనా కాంప్లికేషన్స్ ఎదురైతే దాని ప్రభావం గుండె పైన ఉంటుందని కార్డియాలజిస్ట్ లు చెబుతున్నారు. బ్లడ్ వెజిల్స్ పనితీరులో ఇబ్బందులను ఈ కాంప్లికేషన్స్ పెంచుతాయని తద్వారా గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువవుతుందని వారంటున్నారు. కాబట్టి, ఎప్పటి కప్పుడు గుండె ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం మంచిది.

5. రెడ్ వైన్ తో గుండె వ్యాధులను అరికట్టలేము:

5. రెడ్ వైన్ తో గుండె వ్యాధులను అరికట్టలేము:

రెండు గ్లాసుల రెడ్ వైన్ ను రోజూ తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుందని గుండె వ్యాధులు దరిచేరవని చాలా మంది నమ్ముతారు. అయితే, ఇది నిజం కాదు. రెడ్ వైన్ అనేది తగు మోతాదులో తీసుకుంటే గుండెకి మంచి చేస్తుందేమో గాని ఎక్కువగా దీనిని తాగడం వలన గుండె వ్యాధుల బారిన ప్రమాద స్థాయి పెరిగే అవకాశం లేకపోలేదు. కేవలం, రెడ్ వైన్ ను నమ్ముకుని గుండె ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటున్నామని అనుకుంటే చేజేతులా గుండె ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నవారవుతారు.

6. స్మోకింగ్ ను క్విట్ చేయండి:

6. స్మోకింగ్ ను క్విట్ చేయండి:

కార్డియాలజిస్ట్ లు స్మోకింగ్ కు దూరంగా ఉండమని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే, స్మోకింగ్ వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. గుండె జబ్బులు పెరుగుతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఆర్టెరీస్ బ్లాక్ అవుతాయి. కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుంది. కాబట్టి, ఈ అలవాటుకు దూరంగా ఉండటం మంచిది.

7. ఒత్తిడిని నియంత్రించుకోండి:

7. ఒత్తిడిని నియంత్రించుకోండి:

గుండె జబ్బులు తలెత్తేందుకు ఒత్తిడి అనేది ప్రధాన కారణంగా వ్యవహరిస్తుందని ప్రపంచవ్యాప్తంగా కార్డియాలజిస్ట్ లు స్పష్టం చేస్తున్నారు. ఆరోగ్యకరమైన లైఫ్ స్టయిల్ ను పాటించే వాళ్ళలో కూడా ఒత్తిడి వలన గుండె జబ్బుల సమస్య కనిపించే అవకాశం ఉందని వారు వెల్లడిస్తున్నారు. కాబట్టి, ఒత్తిడిని మేనేజ్ చేసుకునే విధానాలను తెలుసుకోవాలి. యోగా లేదా మెడిటేషన్ ను సాధన చేయాలి. ఆ విధంగా క్రానిక్ స్ట్రెస్ నుంచి ఉపశమనం పొందవచ్చు. తద్వారా, ప్రాణాంతకమైన గుండె జబ్బుల నుంచి రక్షణ పొందవచ్చు.

8. చిగుళ్ల ఆరోగ్యం ముఖ్యం:

8. చిగుళ్ల ఆరోగ్యం ముఖ్యం:

జెనెరల్ చెక్ అప్ కోసం కార్డియాలజిస్ట్ ను సంప్రదించినప్పుడు వారు మీ ఓరల్ హెల్త్ ను ఎక్జామిన్ చేస్తారు. ఎందుకంటే ఇంఫ్లేమేషన్ తో పాటు చిగుళ్లలో బ్లీడింగ్ అనేది గుండె వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని పెంచుతుంది. చిగుళ్ల వద్దనున్న బ్లడ్ వెజిల్స్ గుండెతో డైరెక్ట్ గా కనెక్ట్ అయి ఉంటాయి. ఈ విషయాన్ని గమనించి ఓరల్ హెల్త్ ను సంరక్షించుకోవాలి.

English summary

8 Secret Tips For A Healthy Heart As Told By Cardiologists!

The heart is one of the most important vital organs of the human body. If the heart does not function well, the other organs can suffer too and it could also be fatal. Cardiologists reveal that even thin people are prone to heart ailments, you must strike out sugary foods, avoid smoking, excess drinking and stress from your diet.
Desktop Bottom Promotion