చిన్న పిల్లల్లో ఈ 9 లక్షణాలు గనుక ఉంటే ఎముకల క్యాన్సర్ వచ్చిందని అర్ధం

Written By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

ప్రవంచవ్యాప్తంగా ప్రజలను పట్టి పీడిస్తున్న అతి ప్రాణాంతకమైన వ్యాధుల్లో క్యాన్సర్ కూడా ఒకటి. కణాలు ఇంత అసాధారణ రీతిలో ఎందుకు పెరుగుతాయి అనే విషయానికి సంబంధించి నిర్దిష్టమైన కారణం ఎవ్వరు కనుక్కోలేకపోయారు.

ఒకవేళ ఈ వ్యాధిని ప్రారంభదశలోనే గనుక గుర్తించగలిగితే, కీమో తెరఫీ మరియు మిగతా చికిత్సలను ఉపయోగించి క్యాన్సర్ కణాలను నాశనం చేయవచ్చు. కానీ, తర్వాత దశల్లో గుర్తించగలిగినట్లైతే చావు ఒక్కటే మార్గం.

పెద్దల్లోనే కాకుండా చాలామంది పిల్లలు కూడా ఈ మధ్య కాలంలో క్యాన్సర్ బాధితులుగా మారుతున్నారు. చిన్నపిల్లలను పట్టిపీడిస్తున్న క్యాన్సర్ వ్యాధుల్లో అతిముఖ్యమైనది ఎముకల క్యాన్సర్. ఈ క్యాన్సర్ గనుక సోకినట్లైతే ప్రాంతకమైన క్యాన్సర్ కణితి మృదులాస్థి కణాలు మరియు యముకల దగ్గర పెరుగుతుంది, అంతేకాకుండా వాటి చుట్టుపక్కల ఉన్న కణజాలాల్ని నాశనం చేస్తుంది.

9 Signs Of Bone Cancer Or Osteosarcoma In Children

కాబట్టి మీ పిల్లల్లో ఎముకల క్యాన్సర్ కు సంబంధించిన లక్షణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని, ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండటం ముఖ్యం. మీ పిల్లల్లో ఎప్పుడైతే క్యాన్సర్ కణితి, ఎముకల్లో పెరుగుతుందో దానినే ఎముకల క్యాన్సర్ అంటారు.

ఇది చాలా అరుదుగా వచ్చే క్యాన్సర్ మరియు క్యాన్సర్ కాకుండా ఉండే కణితులు ఎలా ఉంటాయో ఇంచుమించు అలంటి లక్షణాల్నే ఈ ఎముకల క్యాన్సర్ కలిగి ఉంటుంది. కాబట్టి ఎముకల క్యాన్సర్ కు సంబంధించిన లక్షణం ఏదైనా కనబడినట్లైతే, ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించి ఈ వ్యాధిని గుర్తించడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల మీ పిల్లలను ఆరోగ్యంగా ఉంచుకోగలరు.

పిల్లలు సాధారణంగా రెండు రకాల ఎముకల క్యాన్సర్ తో బాధపడుతూ ఉంటారు.

ఓస్టెయోసార్సోమా మరియు ఈవింగ్ సార్కోమా. పిల్లల లో వచ్చే ఎముకల క్యాన్సర్ రకాల గురించి ఈ క్రింద సవివరంగా చెప్పబడింది.

9 Signs Of Bone Cancer Or Osteosarcoma In Children

1. ఓస్టెయోసర్కోమా :

ఈ రకమైన ఎముకల క్యాన్సర్, చాలా సాధారణంగా సోకే క్యాన్సర్. ఇది ముఖ్యంగా యుక్త వయస్సులో పెరుగుతున్న వ్యక్తుల పై విపరీతమైన ప్రభావం చూపుతుంది మరియు అలాంటి వ్యక్తులకే ఎక్కువగా సోకే అవకాశాలు ఉన్నాయి. ఎముకల క్యాన్సర్ సోకిన పిల్లల్లో దాదాపు సగం శాతం మంది ఓస్టెయోసర్కోమా బాధితులే అని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఎప్పుడైతే ఎముకలు పెద్దవిగా పెరుగుతుంటాయో, అటువంటి సమయంలో ఓస్టెయోసర్కోమా అనేది టిబియా అనే ప్రాంతంలో వృద్ధి చెందుతుంది. మోచిప్ప ప్రక్కన ఉండే చర్మపు ఎముకను టిబియా అంటారు, ఫెమర్, మోచిప్ప ప్రక్కన ఉండే తొడ ఎముక భాగాన్ని ఈ పేరుతొ పిలవడం జరుగుతుంది లేదా హుమెర్స్, భుజానికి పై భాగంలో పక్కన ఉండే ప్రాంతంలో ఇది పెరిగే అవకాశం ఉంది.

2. ఈవింగ్ సర్కోమా :

ఓస్టెయోసర్కోమా తర్వాత, పిల్లలో వచ్చే ఎముకల క్యాన్సర్ లలో రెండవ అతిభయంకరమైన క్యాన్సర్ రూపం ఈవింగ్ సార్కోమా. ఈ ప్రాంతకమైన క్యాన్సర్ కణితి, ఎముకలు పెరిగే మధ్య భాగంలో అయినా పెరుగుతుంది లేదా పుర్రె, వెన్నుముక, ఛాతి ఎముక, కాలర్ ఎముక, కాఫ్ ఎముక, కటి ఎముక మరియు పక్కటెముకలు ఉండే ప్రాంతంలో ఇది పెరుగుతుంది. ఈ ఈవింగ్ సర్కోమా అనేది ఎముకల్లో కాకుండా మృదువైన కణజాలాల్లో ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది.

పిల్లలు పెద్దల్లా, వారు పడే నొప్పిని, అనుభవిస్తున్న బాధను బయటకు చెప్పలేరు. అందుచేత మనం పిల్లలకు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించాలి మరియు వారి యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.

మీ పిల్లలకు అనూహ్యంగా ఏదైనా కణితి ఏర్పడటం ప్రారంభం అయితే, వెనువెంటనే దగ్గరలో ఉన్న వైద్యుని దగ్గరకు వెళ్లి పరీక్షలు చేయించండి. పిల్లల్లో వచ్చే ఎముకల క్యాన్సర్ కు సంబంధించిన లక్షణాలు మరియు సంజ్ఞలు ఎముక ఎముకకు విభిన్నంగా ఉంటుంది.

అయితే ఇందుకు సంబంధించిన లక్షణాలు ప్రారంభ దశలోనే మనకు కనిపిస్తాయి. చివరి దశ వరకు వేచి ఉండాల్సిన అవసరంలేదు. ఈ లక్షణాలను గుర్తించి అర్ధం చేసుకొని అందుకు అనుగుణంగా వ్యవహరించాల్సిన బాధ్యత మీ పైనే ఉంది. ఏదైనా చిన్న దెబ్బ తగిలిన లేదా చిన్నతనంలో కోట్లటలో భాగంగా వాచిపోయి ఉండి ఉండవచ్చు అని అనిపించవచ్చు. కానీ, అందుకు మించిన అర్ధం ఉందని గుర్తించాలి. పిల్లల్లో వచ్చే ఎముకల క్యాన్సర్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని ఈ వ్యాసంలో తెలుసుకోబోతున్నాం.

1. నొప్పి :

1. నొప్పి :

పిల్లలు ఏ రకమైన ఎముకల క్యాన్సర్ తో బాధపడుతున్నప్పటికీ కూడా, వారిని విపరీతంగా నొప్పి వేధిస్తూ ఉంటుంది. ఇదే విషయమై వారు ఫిర్యాదులు కూడా చేస్తుంటారు. ఎముకల్లో క్యాన్సర్ కు సంబంధించిన కణితి పెరుగుతూ ఉంటుంది అని తెలియజేసే అతిముఖ్యమైన లక్షణాల్లో ఇది కూడా ఒకటి. ఎముకలో ఏ భాగంలో అయితే ఇది మొదలవుతుందో, అక్కడ మొదట నొప్పి ప్రారంభం అవుతుంది లేదా ఆ ఎముకకు దగ్గర్లో ఉన్న ప్రాంతంలో అయినా నొప్పి మొదలవుతుంది. మీ పిల్లలు కాళ్లల్లో నొప్పి ఉంది అని పిర్యాదు చేస్తే, ఆటల్లో తగిన దెబ్బ అయి ఉంటుంది అని అనుకోని అశ్రద్ధ చేయకండి. ఒకవేళ నిజంగానే ఆటల్లో దెబ్బ తగిలి ఉంటే అది కొద్దిరోజుల్లోనే నయం అవుతుంది. కానీ, కణితి వల్ల వచ్చే నొప్పి రోజు రోజుకు పెరుగుతుంది తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది.

రోజులు పెరుగుతున్న కొద్దీ నొప్పి కూడా విపరీతంగా పెరుగుతుంది మరియు ఇలాంటి సందర్భంలో ఏదైనా ఆయింట్మెంట్ లేదా పెయిన్ కిల్లర్ వాడితే ఆ నొప్పిని అది కుత్రిమముగా మాత్రమే తగ్గించగలవు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో, ఈ నొప్పి అతి భయంకరంగా ఉంటుంది. ఒకవేళ మీ పిల్లవాడు గనుక ఏదైనా శారీరిక పనుల్లో గనుక పాల్గొన్నట్లైతే అటువంటి సమయాల్లో నొప్పి మరింతగా పెరుగుతుంది. ఉదాహరణకు, కణితి గానుగ కాళ్లల్లో ఉంటే, గనుక పిల్లవాడి యొక్క కాలు రోజులు గడుస్తున్నా కొద్దీ నిర్జీవంగా మారిపోతాయి.

2. ఉబ్బిపోవడం లేదా బొడుపు ఏర్పడటం :

2. ఉబ్బిపోవడం లేదా బొడుపు ఏర్పడటం :

ఎముకల క్యాన్సర్ ని గుర్తించే ప్రక్రియలో అతి ముఖ్యమైన రెండవ లక్షణం ఇది. ఈ క్యాన్సర్ సోకిన ప్రాంతంల మొద్దుబారినట్లు ఉంటుంది లేదా ఉబ్బిపోయినట్లు ఉంటుంది. ఎప్పుడైతే ఈ వ్యాధి భారిన పడిన ప్రాంతం ఉబ్బిపోయి ఉంటుందో, అటువంటి సందర్భంలో ఆ ప్రాంతంలో కణితి ఏర్పడబోతోంది అనే విషయం అందరికి అర్ధం అవుతుంది. ఈ కణితిని గనుక కాళ్ళు లేదా చేతుల పై వస్తే వెంటనే మనకు కనపడుతుంది. కానీ, ఛాతి భాగంలో లేదా కటి ఎముక భాగంలో వస్తే మాత్రం బాగా పెద్దది అయ్యేవరకు మనకు కనబడదు.

3.కుంటుకుంటూ :

3.కుంటుకుంటూ :

ఒకవేళ కాలిలో గనుక ఈ క్యాన్సర్ కణితి ఏర్పడినట్లైతే, నడవటం బాగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇటువంటి సమయంలో కుంటుకుంటూ కూడా నడవాల్సి రావొచ్చు. ఇటువంటి సమయంలో పిల్లలకు నడవటానికి విపరీతంగా ఇబ్బందిగా ఉంటుంది మరియు రోజులు గడుస్తున్నాన్న కొద్దీ కళల్లో కాళ్లల్లో చలనం తగ్గిపోతుంది మరియు నిర్జీవంగా మారిపోతాయి.

4. కదిలించడానికి కష్టతరంగా ఉంటుంది :

4. కదిలించడానికి కష్టతరంగా ఉంటుంది :

మీ పిల్లలు గనుక చేయి లేదా కాలుని కదిలించడానికి ఇబ్బంది పడుతుంటే, ఆ సమయంలో ఖచ్చితంగా వైద్యుడిని కలవాలి అనే విషయం మరచిపోకండి. ఆటల్లో ఆడుతున్న దెబ్బ వల్ల కూడా ఈ పరిస్థితి ఏర్పడవచ్చు. కానీ, నొప్పి గనుక అలానే చాలా కాలం కొనసాగుతున్నట్లైతే, ఎముకల క్యాన్సర్ ప్రారంభ దశలో ఉందని అర్ధం.

5. బలహీనమైన ఎముకలు :

5. బలహీనమైన ఎముకలు :

ఎప్పుడైతే ప్రాంతకమైన క్యాన్సర్ కణితి, ఎముకలు మరియు దానికి దగ్గరలో ఉన్న మృదువైన కణజాల పై ఏర్పడుతుందో, అటువంటి సమయంలో ఎముకలు చాలా బలహీనంగా మారిపోతాయి. ఎటువంటి కారణం లేకపోయినప్పటికీ కూడా ఎముకల్లో గనుక పగుళ్లు వస్తే, మీ పిల్లలు చిన్నతంలో వచ్చే ఎముకల క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు అర్ధం. ఈ క్యాన్సర్ యొక్క ప్రభావం వల్ల ఎముకలు చాలా బలహీనంగా మారిపోతాయి మరియు పిల్లవాడు ఏ చిన్న శారీరిక పనిచేసిన కూడా ఎముకలు విరిగిపోతాయి. అటువంటి సమయంలో అనూహ్యంగా ఎముకలు విరిగిపోవచ్చు లేదా విపరీతమైన బాధని అనుభవించాల్సి వస్తుంది.

6. జ్వరం :

6. జ్వరం :

సంవత్సరంలో కాలాలు మారుతున్న సమయంలో, సాధారణముగా చిన్నపిల్లలు వీటికి బానిసలుగా మారుతుంటారు మరియు ముఖ్యంగా జ్వరం వేధిస్తూ ఉంటుంది. జ్వరం రావడానికి ఎటువంటి కారణం లేకపోయినప్పటికీ వచ్చిందంటే ఆ స్థితి చాలా భయానకం అయినదని అర్ధం. వ్యక్తులు ఎవరైతే క్యాన్సర్ వల్ల జ్వరం వచ్చి బాధపడుతుంటారో, అటువంటి సమయంలో క్యాన్సర్ కణాలు శరీరంలో ఒక ప్రాంతం పై ప్రభావం చూపిస్తుందని అర్ధం. ఇది ప్రారంభదశ కాదు. కానీ, ఇది ఒక భయానకమైన దశ.

 7. అలసట :

7. అలసట :

మీ పిల్లలు గనుక సరైన మోతాదులో పోషకాహారం తీసుకున్నప్పటికీ కూడా విపరీతమైన అలసటతో ఉంటారో లేదా శక్తిహీనంగా అనిపిస్తారో అటువంటి సమయంలో త్వరగా వైద్యుని సలహా తీసుకోవడం మంచిది. ఎందుకంటే, ఈ అలసట అనే లక్షానికి క్యాన్సర్ కి సంబంధం ఉందని గతంలోను రుజువుఅయ్యింది. ఇలానే ఎందుకు జరుగుతుందంటే, క్యాన్సర్ కణాలు మనకు ఆహారం నుండి వచ్చే శక్తిని అంతా అవి తీసుకుంటాయి. దీని వల్ల శరీరం చాలా బలహీనంగా ఉంటుంది.

8. బరువు తగ్గటం :

8. బరువు తగ్గటం :

ఒకవేళ మీ పిల్లలు గనుక అనూహ్యంగా బరువు తగ్గిపోయినట్లైతే, అటువంటి సమయంలో వైద్యుని సలహా తీసుకోండి. క్యాన్సర్ బాధితులుగా మారిన చాలామంది వ్యక్తులు అనూహ్యంగా తమ బరువుని కోల్పోతూ ఉంటారు. మీ పిల్లల్లో కూడా ఇలాంటి లక్షణాలు లేదా వీటికి దగ్గరగా ఉండే లక్షణాలు కనపడినట్లైతే, మీ శరీరంలో ఎముకల క్యాన్సర్ ప్రవేశించబోతుంది అని అర్ధం.

9. రక్తహీనత :

9. రక్తహీనత :

శరీరంలో క్యాన్సర్ కణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి అనే విషయాన్ని చెప్పే లక్షణాల్లో రక్త హీనత కూడా ఒకటి. ఇలా ఎందుకు జరుగుతుందంటే, క్యాన్సర్ కణాలు శరీర లోపల ఉండే కణజాలాలను విపరీతమైన ఇబ్బంది పెడతాయి. కొన్ని సందర్భాల్లో లోపల ఉండే కణజాలాల్లో రక్తం కూడా కారుతుంది. ఒకవేళ మీ పిల్లల శరీరంలో హిమో గ్లోబిన్ స్థాయిలు తక్కువగా గనుక ఉన్నట్లయితే, మీ పిల్లల పై అది చాలా ప్రతికూల ప్రభావం చూపుతుందని మరియు చాలా భయానకమైన పరిస్థితులలోకి అడుగుపెడుతున్నారని తెలియజేస్తుంది.

ఓస్టెయోసర్కోమా అనే ఈ వ్యాధి తక్కువలో తక్కువ కనీసం 5% మందికి సోకుతుందట. అంతేకాకుండా, మోకాలికి పక్కన ఉండే ఎముకల్లో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. మరో వైపు ఈవింగ్ సర్కోమా తక్కువలో తక్కువ 4% మందిలో కనపడుతుంది. అంతేకాకుండా, అమ్మాయిల కంటే కూడా అబ్బాయిల్లో బాల్యంలో వచ్చే క్యాన్సర్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఎముకల క్యాన్సర్ కి సంబంధించి పైన చెప్పబడినటువంటి లక్షణాలు ఏమైనా, మీ పిల్లల్లో కనపడినట్లైతే వెనువెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఎప్పుడుగాని వ్యాధులు వచ్చిన తర్వాత నయం చేసుకోవడం కంటే కూడా, రాకుండా నిరోధించడం ఉత్తమం.

ఒకవేళ ఎవరికైనా ఓస్టెయోసర్కోమా సోకినట్లైతే అటువంటి వారికీ మల్టీ ఏజెంట్ కీమో థెరఫీ మరియు శస్త్ర చికిత్స ద్వారా చికిత్స చేయడం జరుగుతుంది . ఈవింగ్ సర్కోమా సోకిన వారికి రేడియేషన్ లేదా మల్టీ ఏజెంట్ కీమో థెరఫీ మరియు శస్త్ర చికిత్స ద్వారా వీలైతే నయం చేయవచ్చు.

English summary

9 Signs Of Bone Cancer Or Osteosarcoma In Children

Studies reveal that osteosarcoma affecting a minimum of 5% children mostly occurs in the bone near the knee. While, on the other hand, Ewing sarcoma claims for 4% of childhood cancer and the probability is higher in boys than girls. So, once you see any of the symptoms of bone cancer, rush to the nearest oncologist for a better opinion.