వక్షోజాల్లో వచ్చే మంటను తగ్గించేందుకు, సిగరెట్ మాన్పించేందుకు అదే దివ్య ఔషధం

Written By:
Subscribe to Boldsky

క్యాబేజీ రసాన్ని భోజనానికి ముందు తీసుకుంటే.. అల్సర్ దూరమవుతుంది. అలాగే పచ్చి క్యాబేజీ రసానికి అంతే మోతాదులో క్యారెట్ రసం తీసుకుంటే పెప్టిక్ అల్సర్ మాయమవుతుంది. మూడు మాసాల పాటు ఉదయం అల్పాహారానికి ముందు పచ్చి క్యాబేజీ సలాడ్ తీసుకుంటే శరీరం బరువు తగ్గిపోతుంది.

రక్తప్రసరణ

రక్తప్రసరణ

ఇతర ఆహార పదార్థాలతో పాటు క్యాబేజ్‌ను కూడా తీసుకుంటే, వృద్దుల్లో రక్తప్రసరణ సజావుగా జరుగుతుంది. కొన్ని క్యాబేజ్‌ రెమ్మల్ని దంచి, తెల్లని బట్టలో చుట్టి నిద్రా సమయంలో తలకు కడితే మైగ్రేన్‌ తగ్గుతుంది. ఇందుకు తాజా రెమ్మల్ని మాత్రమే వాడాలి.

నొప్పులను తగ్గించొచ్చు

నొప్పులను తగ్గించొచ్చు

మోకాళ్ల నొప్పులు, అధిక శ్రమ ద్వారా కలిగే నొప్పులను తగ్గించడంలో క్యాబేజీ ఆకులు సమర్థవంతంగా పనిచేస్తాయి. తలనొప్పిని తగ్గించడంలో ఇవి బాగా ఉపయోగపడతాయి. శరీరంలోని వ్యర్థపదార్థాలను బయటికి పంపించడంలో క్యాబేజీ బాగా పనిచేస్తుంది. తరచూ క్యాబేజీని తీసుకుంటే శరీర పనితీరు మెరుగవుతుంది. క్యాబేజీలో సల్ఫర్ సమృద్ధిగా ఉంటుంది.

దంతాలు మెరిసిపోతాయి

దంతాలు మెరిసిపోతాయి

ఇది చర్మానికి అందాన్నిస్తుంది. వెంట్రుకలను సంరక్షిస్తుంది. పలు రకాల క్యాన్సర్‌లకు వ్యతిరేకంగా పోరాడే గుణాలు క్యాబేజీలో ఉన్నాయి. క్యాబేజీ రక్తపోటును నియంత్రిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి క్యాబేజీ బాగా ఉపయోగపడుతుంది. పచ్చి క్యాబేజీ జ్యూస్ తాగితే ఒబిసిటీని దూరం చేసుకోవచ్చు. క్యాబేజీని తరచుగా ఆహారంలో చేర్చుకోవడం ద్వారా దంతాలు మెరిసిపోతాయి.

సిగరెట్స్ తాగేవారు

సిగరెట్స్ తాగేవారు

సిగరెట్స్ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది..భార్య ఏమి చెప్పినా వినే భర్త..సిగరెట్స్ మానమంటే మానడు..అంతగా చాలా మంది వీటికి అలవాటు పడి..జబ్బులకి లోనయ్యే వాళ్ళు చాలామందే ఉన్నారు. అంతేకాదు క్యాన్సర్ వంటి రోగాలతో ఎంతో మంది చనిపోతున్నారు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది కూడా. చివరికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సిగరెట్స్ త్రాగితే ఆరోగ్యానికి హానికరం అని హెచ్చరికలు ప్యాకేట్స్ మీద రాసినా కూడా పట్టించుకోరు.

క్యాబేజీ రసం తాగితే

క్యాబేజీ రసం తాగితే

ఇక క్యాబేజీ ర‌సం తాగినా లేకా క్యాబేజీ ఆకులు న‌మిలినా వాళ్లు ఇక సిగ‌రెట్లు మ‌ర్చిపోతార‌ట‌. క్యాబేజీకి పోష‌కాల గ‌ని అన్న పేరు ఉంది.క్యాబేజీలో పోష‌క విలువ‌లు స‌మృద్ధిగా ఉంటాయి. ఇది క్యాన్స‌ర్ నివారించ‌డంలో కూడా స‌మృద్ధిగా ప‌నిచేస్తుంది. క్యాబేజీ ద్వారా శరీరానికి అవసరమైన "ప్లేవనాయిడ్స్" సమృద్ధిగా అందుతాయనీ, తద్వారా "పాంక్రియాటిక్ గ్రంథి క్యాన్సర్" ప్రభావాన్ని తగ్గించవచ్చునని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.

వాపు ఉన్న ప్రాంతంలో

వాపు ఉన్న ప్రాంతంలో

శ‌రీరంలో ఏదైనా ప్ర‌దేశంలో వాపులు ఉంటే రాత్రి ప‌డుకునే ముందు అక్క‌డ కొన్ని క్యాబేజీ ఆకులు ఉంచితే తెల్లారేస‌రికి ఆ వాపులు త‌గ్గుముఖం ప‌డ‌తాయి. పాలిచ్చే తల్లులు ఒక్కోసారి వక్షోజాలు , నిప్పుల్స్ లో నొప్పి ,మంట కలుగుతాయి అప్పుడు ఈ క్యాబేజీ ఆకులని వాటి మీద ఉంచితే చాలు సమస్య పరిష్కారం అవుతుంది. క్యాబేజీ ర‌సం తాగ‌ల‌ని వాళ్లు, ఆకులు న‌మ‌ల‌లేని వాళ్లు చ‌క్కెర క‌లుపుకుని తాగినా స‌రిపోతుంద‌ట‌.

రెండు నెలలకు మర్చిపోతారు

రెండు నెలలకు మర్చిపోతారు

ఇలా గ‌ట్టిగా రెండు నెల‌లు చేస్తే ఆ త‌ర్వాత వాళ్లు సిగ‌రెట్ అన్న ప‌ద‌మే మ‌ర్చిపోతార‌ట‌. ఇక క్యాబేజీలో నొప్పులను నివారించే గుణాలు, శరీర అందాన్ని ఇనుమడింపజేసే ఔషధ కారకాలు కూడా ఉన్నాయి.సో ఇక సిగరెట్స్ మానని వాళ్ళకి మీరు ఈ క్యాబేజీ మన్పించే ప్రయత్నం చేయండి.

దగ్గుకు బాగా పని చేస్తుంది

దగ్గుకు బాగా పని చేస్తుంది

అలాగే క్యాబేజీ దగ్గుకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. క్యాబేజీ ఆకుల్ని నమిలినా లేదా క్యాబేజీ ఆకుల రసాన్ని తాగినా దగ్గు దూరమవుతుంది. అలాగే కీళ్ళ, మోకాళ్ల నొప్పులను దూరం చేసుకోవాలంటే క్యాబేజీ వారానికి రెండుసార్లైనా తినాలి. వాపుల్ని తగ్గించడంలో క్యాబేజీ బాగా పనిచేస్తుంది. శరీరంలో ఏదైనా ప్రదేశంలో వాపులుంటే రాత్రి పడుకునే ముందు వాటిపై కొన్ని క్యాబేజీ ఆకులను ఉంచితే సరిపోతుంది. తెల్లవారే సరికి వాపులు తగ్గుముఖం పడతాయి.

థైరాయిడ్

థైరాయిడ్

థైరాయిడ్ గ్రంథులు పనితీరు మెరుగు పడాలంటే రాత్రి పూట పడుకునే ముందు కొన్ని క్యాబేజీ ఆకులను గొంతుపై ఉంచితే సరిపోతుంది. పచ్చి క్యాబేజీ జ్యూస్ తాగితే ఆశించిన స్థాయిలో ఫలితాలు వస్తాయి. దీన్ని తరచూ తీసుకుంటే దంత సంబంధ వ్యాధులు కూడా తొలగిపోతాయి. బరువు తగ్గడం సులభమవుతుంది.

చాలా విటమిన్స్

చాలా విటమిన్స్

ఇక క్యాబేజీని మనం రోజు తీసుకుంటే రోగ నిరోధశక్తి పెరుుగుతుంది. క్యాబేజీలో మిటవిన్ సి, థయేసల్ఫేట్, ఇండోల్ 3 కార్బినాల్, జియాగ్జాంథిన్, సల్ఫరోఫేన్, ఐసోథయోసల్ఫేట్, వంటి శక్తివంతమైన రసాయనాలు ఉంటాయి. ఇవి ఆర్యోగానికి మేలు చేస్తాయి. రొమ్ము, పెద్దప్రేగు, ప్రొటెస్ట్ క్యాన్సర్లను నివారిస్తాయి.

ఎముకలు గట్టిపడతాయి

ఎముకలు గట్టిపడతాయి

క్యాబేజీలో మిటమిన్ బి కాంప్లెక్స్ చెందిన పాంటథోనిక్ యాసిడ్ ( మిటమిన్ బి5) ఉంటుంది. పైరిడాక్సిన్( మిటమిన్ బి6), థయామిన్( మిటమిన్ బి1) కూడా ఉంటాయి. క్యాబేజీలో కె మిటమిన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల గట్టిదనానికి ఉపయోగపడుతుంది.

English summary

amazing benefits of cabbage juice the new health tonic

amazing benefits of cabbage juice the new health tonic
Story first published: Friday, May 4, 2018, 11:00 [IST]