For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ద్రాక్ష ఆరోగ్యానికి రక్ష.. రోజూ కొన్ని ద్రాక్షపండ్లు తింటే ఎన్ని లాభాలో తెలుసా?

ద్రాక్షల్లో ఇనుము సమృద్ధిగా ఉండటం వల్ల రక్తవృద్ధి జరిగి అలసట, నీరసం లాంటివన్నీ మటుమాయం అవుతాయి. అయితే ద్రాక్షపండ్లను పండుగా తింటేనే మేలు. జ్యూస్ చేసుకుంటే ఇనుము మోతాదు తగ్గిపోతుంది. ద్రాక్ష లాభాలు.

|

వేసవి వచ్చేసింది.. ఈ సీజన్‌లో చల్ల చల్లగా.. కూల్ కూల్‌గా చేసే ద్రాక్ష పండ్ల వెనుక మరెన్నో లాభాలున్నాయి. సాధారణ అజీర్తి నుంచి కంటి సమస్యల దాకా ఎన్నో రకాల జబ్బుల నివారణలో కీలక పాత్ర వహిస్తాయి. అందుకే చక్కని రుచితో పాటు ఆరోగ్యాన్నీ అందించే ద్రాక్షలను వీలైనంత ఎక్కువగా తీసుకోవాలంటున్నారు పోషకాహార నిపుణులు. తెల్ల ద్రాక్ష, నల్ల ద్రాక్ష దాదాపుగా ఒకే విధమైన ప్రయోజనాలను చేకూరుస్తాయి.

విటమిన్ సి

విటమిన్ సి

ద్రాక్షలంటే విటమిన్ సి గుర్తు వస్తుంది. కానీ సి-విటమిన్‌తో పాటుగా విటమిన్ ఎ, బి6, ఫోలిక్ ఆమ్లం కూడా వీటిలో పుష్కలంగా ఉన్నాయి. పొటాషియం, కాల్షియం, ఇనుము, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సెలీనియం లాంటి ఎన్నో రకాల ఖనిజలవణాలు ద్రాక్షల్లో సమృద్ధిగా లభిస్తాయి. అంతేకాదు.. ఫ్లేవ‌నాయిడ్స్ లాంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఫ్రీ రాడికల్స్ బారి నుంచి రక్షిస్తాయి. వయస్సు మీద ప‌డ‌డం వల్ల కలిగే ముడతలను తగ్గిస్తాయి.

గుండెకు రక్ష

గుండెకు రక్ష

ద్రాక్షపండ్లలో టీరోస్టిల్‌బీన్ అనే పదార్థం ఉంటుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదును తగ్గిస్తుంది. ద్రాక్ష తొక్క‌లో ఉండే సెపోనిన్లు కొలెస్ట్రాల్‌కు అతుక్కుని దాన్ని శరీరం గ్రహించకుండా నివారిస్తాయి. అంతేకాకుండా ద్రాక్షపండ్లు రక్తంలో నైట్రిక్ ఆక్సైడ్ మోతాదును పెంచుతాయి. నైట్రిక్ ఆక్సైడ్ రక్తం గడ్డలుగా ఏర్పడకుండా ఇది నివారిస్తుంది. తద్వారా గుండెపోటు అవకాశం తగ్గుతుంది. ద్రాక్షలకు ఉన్న యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ ఆక్సీకరణ చర్యలను నివారించడంలో తోడ్పడుతాయి. దాని వల్ల రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడే అవకాశం తగ్గుతుంది.

మలబద్దకానికి

మలబద్దకానికి

ద్రాక్షల్లో కర్బన ఆమ్లాలు, సెల్యులోజ్ లాంటి చక్కెరలు ఎక్కువగా ఉండటం వల్ల ఇవి మంచి లాగ్జేటివ్స్‌గా పనిచేస్తాయి. కాబట్టి మలబద్దకంతో బాధపడుతున్నవారికి ద్రాక్షపండ్లు మంచి మందుగా పనిచేస్తాయి. అజీర్తి నుంచి బయటపడేయడానికి సహాయపడతాయి.

రక్తవృద్ధి

రక్తవృద్ధి

ద్రాక్షల్లో ఇనుము సమృద్ధిగా ఉండటం వల్ల రక్తవృద్ధి జరిగి అలసట, నీరసం లాంటివన్నీ మటుమాయం అవుతాయి. అయితే ద్రాక్షపండ్లను పండుగా తింటేనే మేలు. జ్యూస్ చేసుకుంటే ఇనుము మోతాదు తగ్గిపోతుంది. కానీ శరీరం శక్తిని మాత్రం పుంజుకుంటుంది. ద్రాక్షల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.

వ్యాధినిరోధక శక్తి

వ్యాధినిరోధక శక్తి

వ్యాధినిరోధక శక్తిని పెంచగల సత్తాయే కాదు కొన్ని రకాల బాక్టీరియా, వైరస్‌ ఇన్‌ఫెక్షన్లను నిరోధించడంలో కూడా ద్రాక్షలు కీలకపాత్ర వహిస్తాయి. ముఖ్యంగా పోలియో వైరస్, హెర్పస్ సింప్లెక్స్ వైరస్‌ల విషయంలో ఇవి మరింత శక్తిమంతమైనవి. ద్రాక్షలు యూరిక్ ఆమ్లం సాంద్రతను తగ్గిస్తాయి. తద్వారా ఆమ్లం మోతాదు తగ్గుతుంది. అందువల్ల కిడ్నీలపై పనిభారం కూడా తగ్గిపోతుంది. కాబట్టి ద్రాక్షలు తీసుకోవడం ద్వారా కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

క్యాన్సర్ మందు

క్యాన్సర్ మందు

నల్లద్రాక్షల రసం రొమ్ము క్యాన్సర్ నివారణకు ఉపయోగపడుతుందని ఇటీవలి అధ్యయనాలు తెలుపుతున్నాయి. క్షీరగ్రంథుల కణితుల పెరుగుదలపై దీని ప్రభావాన్ని ఎలుకలపై చేసిన ప్రయోగాలు నిర్ధారించాయి. ద్రాక్షరసం ఇచ్చిన తరువాత ఎలుకల క్షీరగ్రంథుల క్యాన్సర్ కణాలు గణనీయంగా తగ్గినట్లు ఈ అధ్యయనంలో గమనించారు. ద్రాక్షల్లోని రిస్‌వెరటాల్ చూపించే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ ప్రభావం అంతా ఇంతా కాదు.

క్యాన్సర్ కారకాల పెరుగుదలను నిరోధిస్తాయి

క్యాన్సర్ కారకాల పెరుగుదలను నిరోధిస్తాయి

పెద్దపేగు క్యాన్సర్‌తో పాటు ఇతర జీర్ణవ్యవస్థ సంబంధిత క్యాన్సర్లు, రొమ్ము క్యాన్సర్ల నివారణలో రిస్‌వెరటాల్ బాగా పనిచేస్తుంది. ఆంథ్రోసయనిన్లు, ప్రోఆంథ్రోసయనిన్లు యాంటీ ప్రొలిఫరేటివ్ లక్షణాలను కలిగి ఉంటాయి. అంటే క్యాన్సర్ కారక పదార్థాల పెరుగుదలను ఇవి నిరోధిస్తాయి. అందుకే ద్రాక్షరసం క్యాన్సర్‌ను అణిచివేయడమేకాదు.. క్యాన్సర్ కణాల వ్యాప్తిని కూడా అరికడుతుంది. ద్రాక్షలోని ఈ పదార్థాలు మొత్తం శరీర వ్యాధి నిరోధక వ్యవస్థనే బలోపేతం చేస్తాయి.

కంటి ఆరోగ్యానికి

కంటి ఆరోగ్యానికి

వయస్సు పెరిగినకొద్దీ దాడిచేసే వ్యాధుల్లో మాక్యులర్ డీజనరేషన్ ఒకటి. దీనివల్ల నెమ్మ‌దిగా దృష్టి సామర్థ్యం తగ్గిపోతుంది. కానీ ప్రతిరోజూ ద్రాక్షలు తీసుకుంటే మాక్యులర్ డీజనరేషన్ అవకాశం 36 శాతం తగ్గిపోతుంది. ద్రాక్షల్లో ఉండే ఫ్లేవ‌నాయిడ్లు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు. ఫ్రీరాడికల్స్ దాడిని ఎదుర్కోవడంలో ఇవి అత్యంత సమర్థవంతమైనవి. అందువల్ల క్యాన్సర్లు, గుండె, రక్తనాళాల సమస్యలు, వయస్సుతో పాటు వచ్చిపడే ఇతరత్రా జబ్బుల అవకాశాన్ని తగ్గిస్తాయి.

పెద్దవారిలో శుక్లాలు

పెద్దవారిలో శుక్లాలు

సర్వసాధారణం. కానీ రోజూ ద్రాక్షలు తీసుకుంటే కంటిలో శుక్లాలు ఏర్పడే అవకాశం చాలావరకు తగ్గిపోతుంది. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న వారిలో అమైలాయిడల్ బీటా పెప్టైడ్స్ మోతాదును తగ్గిస్తాయి. ద్రాక్షల్లో ఉండే రిస్‌వెరటాల్ అనే పాలీఫినాల్ ఇందుకు తోడ్పడుతుంది. మెదడు చురుకుదనాన్ని పెంచడంలో ద్రాక్షలు కీలకపాత్ర వహిస్తాయి. న్యూరోజనరేటివ్ వ్యాధుల నివారణకు ద్రాక్షలు బాగా పనిచేస్తాయని అధ్యయనాలు తెలుపుతున్నాయి.

చిట్కావైద్యం

చిట్కావైద్యం

ఎన్నోరకాల జబ్బుల నివారణలో ద్రాక్షపండ్లు ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇంట్లోనే చేసుకునే చిట్కావైద్యాలకు కూడా ఇవి బాగా పనిచేస్తాయి. బాగా పండిన ద్రాక్ష పండు పార్శ్వ‌పు తలనొప్పి (మైగ్రేన్)కి మంచి ఔషధంగా పనిచేస్తుంది.

మైగ్రేన్ నుంచి ఉపశమనం

మైగ్రేన్ నుంచి ఉపశమనం

ఉదయం లేవగానే పరగడపున నీళ్లు కలపకుండా చిక్కని ద్రాక్షరసం తాగితే మైగ్రేన్ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎండుద్రాక్షల్లో రెయిసిన్స్ ఉంటాయి. ఇవి మంచి పోషకపదార్థాలు. మలబద్దకం, అసిడోసిస్, రక్తహీనత, జ్వరాలు, లైంగిక సమస్యలను తగ్గించడంలో, నేత్ర ఆరోగ్య పరిరక్షణలో ఇవి సహకరిస్తాయి.

English summary

amazing benefits of grapes for health

amazing benefits of grapes for health
Story first published:Wednesday, May 9, 2018, 10:41 [IST]
Desktop Bottom Promotion