For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉసిరికాయలను తేనెలో నానబెట్టి తింటే వీర్యం బాగా వృద్ధి చెందుతుంది.. ఇంకా చాలా ప్రయోజనాలు

తేనెలో ఉసిరికాయలను నానబెట్టి తినడం వల్ల కూడా చాలా ప్రయోజనాలున్నాయి. ఒక జార్ తీసుకుని అందులో సగం వరకు తేనెతో నింపాలి. దాంట్లో బాగా కడిగి నీడలో ఆరబెట్టిన ఉసిరికాయలను వేయాలి. తేనె ఉసిరి, తేనెలో ఉసిరికాయ.

|

ఉసిరి కాయల్లో, తేనెలో ఎలాంటి పోషకాలు ఉంటాయో అందరికీ తెలిసిందే. యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఫంగల్ వంటి గుణాలతోపాటు శరీర వ్యాధినిరోధక వ్యవస్థను పటిష్టం చేసే ఎన్నో గుణాలు ఈ రెండింటిలోనూ ఉన్నాయి. అయితే వీటిని కలిపి మిశ్రమంగా తీసుకుంటే మనకు కలిగే పలు అనారోగ్య సమస్యలను సులభంగా దూరం చేసుకోవచ్చు.

ఒక టేబుల్ స్పూన్ ఉసిరికాయ జ్యూస్‌లో ఒక టీస్పూన్ తేనెను కలిపి ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. ఉసిరి జ్యూస్‌, తేనె మిశ్రమం వల్ల ఊపిరితిత్తుల్లో ఉండే బాక్టీరియా పోతుంది. జలుబు, దగ్గు, ఫ్లూ జ్వరం త్వరగా తగ్గుతుంది. వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి.

మలబద్దకం నుంచి ఉపశమనం

మలబద్దకం నుంచి ఉపశమనం

అసిడిటీ, గ్యాస్‌, అజీర్ణం వంటివి తగ్గిపోతాయి. మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. సైనస్‌, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. దృష్టి సంబంధ సమస్యలు దూరమవుతాయి. జుట్టుకు మేలు జరుగుతుంది. వెంట్రుకలు దృఢంగా పెరుగుతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది. చర్మానికి మృదుత్వం చేకూరుతుంది.

తేనెలో ఉసిరికాయలను నానబెట్టి తింటే..

తేనెలో ఉసిరికాయలను నానబెట్టి తింటే..

ఇక తేనెలో ఉసిరికాయలను నానబెట్టి తినడం వల్ల కూడా చాలా ప్రయోజనాలున్నాయి. ఒక జార్ తీసుకుని అందులో సగం వరకు తేనెతో నింపాలి. దాంట్లో బాగా కడిగి నీడలో ఆరబెట్టిన ఉసిరికాయలను వేయాలి. అనంతరం మూత బిగించి పక్కకు పెట్టాలి. కొద్ది రోజులకు ఉసిరికాయలు పండ్ల జామ్‌లా మారుతాయి. అనంతరం వాటిని తీసి రోజుకొకటి చొప్పున అదే జార్‌లోని తేనెతో కలిపి ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. ఇలా చేస్తే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.

లివర్ సమస్యలకు

లివర్ సమస్యలకు

తేనె, ఉసిరికాయ మిశ్రమాన్ని తయారు చేసి తీసుకోవడం వల్ల లివర్ సమస్యలన్నీ దూరమవుతాయి. లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. జాండిస్ వంటి వ్యాధులు ఉంటే అవి త్వరగా నయం అవుతాయి. శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటికి పంపడంలో లివర్ మరింత చురుగ్గా పనిచేస్తుంది.

చర్మంపై వచ్చే ముడతలకు

చర్మంపై వచ్చే ముడతలకు

వయస్సు మీద పడడం వల్ల చర్మం ముడతలుగా తయారవుతుంటుంది. అయితే పైన చెప్పిన తేనె, ఉసిరి మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటుంటే దాంతో ఆ ముడతలు తగ్గిపోతాయి. దీని వల్ల చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. కాంతివంతంగా కూడా మారుతుంది.

ఆస్తమాకు

ఆస్తమాకు

ఆస్తమా అనేది చాలా మందిని ఇబ్బందులు పెడుతుంది. సరిగ్గా శ్వాస కూడా తీసుకోలేరు. అయితే తేనె, ఉసిరి మిశ్రమాన్ని తీసుకుంటే దాంతో ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే తేనె, ఉసిరి మిశ్రమంలో ఉండే సహజ సిద్ధమైన పోషకాలు ఆస్తమాను దూరం చేస్తాయి. శ్వాస కోశ సమస్యలు రాకుండా చూస్తాయి.

దగ్గు, జలుబు, గొంతు ఇన్‌ఫెక్షన్లకు

దగ్గు, జలుబు, గొంతు ఇన్‌ఫెక్షన్లకు

తేనెలో సహజ సిద్ధమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు, ఉసిరిలో యాంటీ బయోటిక్ గుణాలు ఉన్నాయి. దీంతో ఈ మిశ్రమం వైరస్‌లు, బాక్టీరియాలపై సమర్థవంతంగా పోరాటం చేస్తుంది. ఈ క్రమంలో చలికాలంలో మనకు కలిగే దగ్గు, జలుబు, గొంతు ఇన్‌ఫెక్షన్ వంటి వ్యాధులు నయమవుతాయి.

జీర్ణాశయ సమస్యలకు

జీర్ణాశయ సమస్యలకు

చాలామందికి జీర్ణశక్తి చాలా తక్కువగా ఉంటుంది. తిన్నది ఓ పట్టాన జీర్ణం కాదు. అయితే తేనె, ఉసిరి మిశ్రమాన్ని తీసుకుంటే ఆ సమస్య ఉండదు. ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అంతేకాదు గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు దూరమవుతాయి. ఆకలి మందగించిన వారు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే చాలా మంచిది. దీంతో ఆకలి పెరుగుతుంది. అంతేకాదు, మలబద్దకం, పైల్స్ వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

వ్యర్థ పదార్థాలకు

వ్యర్థ పదార్థాలకు

తేనె, ఉసిరి మిశ్రమాన్ని క్రమం తప్పకుండా సేవిస్తుంటే శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. రక్తం శుద్ధి అవుతుంది. దీంతో గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయి.

అధిక బరువుకు

అధిక బరువుకు

తేనె, ఉసిరి మిశ్రమం వల్ల శరీరంలో ఉన్న కొవ్వు అంతా కరిగిపోతుంది. దీని వల్ల అధికంగా ఉన్న బరువు తగ్గుతారు. ఇది స్థూలకాయం ఉన్న వారికి ఎంతగానో మేలు చేస్తుంది.

వీర్య నాణ్యత పెరుగుతుంది

వీర్య నాణ్యత పెరుగుతుంది

తేనె, ఉసిరి మిశ్రమాన్ని తీసుకుంటే స్త్రీలలో రుతు సంబంధ సమస్యలు తగ్గుతాయి. దీని వల్ల రుతుక్రమం సరిగ్గా అవుతుంది. పిల్లలు కలిగేందుకు అవకాశాలు పెరుగుతాయి. అదే మగవారిలో అయితే వీర్య నాణ్యత పెరుగుతుంది. లైంగిక పటుత్వం కలుగుతుంది.

వెంట్రుకల సంరక్షణకు

వెంట్రుకల సంరక్షణకు

తేనె, ఉసిరి మిశ్రమాన్ని సేవిస్తే వెంట్రుకలు కూడా సంరక్షింపబడతాయి. జుట్టు ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది. ప్రకాశవంతంగా కూడా మారుతుంది.

కొవ్వుని కరిగిస్తుంది

కొవ్వుని కరిగిస్తుంది

ఇక ఉసిరి బరువు తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది అదెలాగ అంటే ఉసిరిలో అధికంగా ఉండే విటమిన్ సి మన సరిరంలోని అధిక కొవ్వుని కరిగించే శక్తిని పెంచుతుంది దానినే మనం మెటాబాలిజం అని కూడా అంటాము,అందుకే ఇప్పుడు ఈ డ్రింక్ తయారీ విధానం ఇప్పుడు చూద్దాం.

ఇలా తయారు చేసుకోవాలి

ఇలా తయారు చేసుకోవాలి

కావాల్సిన పదార్ధాలు : ఉసిరికాయలు-4, తేనే--4 స్పూన్లు, మంచి నీరు--2 గ్లాసులు, ముందుగా

రెండు గ్లాసుల(చిన్న గ్లాసులు) నీళ్ళు బాగా మరిగించాలి. తరువాత ఉసిరికాయలను కట్ చేసుకుని మరుగుతున్న నీళ్ళల్లో వేసేయాలి. ఒక 10 నిమిషాలు ఉడికించి కొద్దిగా నీళ్ళా రంగు మారిన తరువాత వడకట్టి.. ఒక గ్లాస్ లో తీసుకుని తేనే కలుపుకుని తాగాలి.

ఎప్పుడు తాగాలి

ఎప్పుడు తాగాలి

మరీ ఎక్కువ తీసుకోకుండా ఒక చిన్న కాఫీ లేదా టీ గ్లాస్ అంత తీసుకోవాలి,అలాగే ఇది టిఫిన్ తిన్న గంట తరువాత తీసుకోవాలి ఇది ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది.అంటే ఒక రెండు స్పూన్లు తాగిన కూడా దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది

అందం కూడా పెరుగుతుంది

అందం కూడా పెరుగుతుంది

ఉసిరిలో ఆరోగ్యం కాదు.. అందమూ దాగివుందని వైద్యులు అంటున్నారు. ఉసిరి వాడడం వల్ల చర్మ ఆరోగ్యం, జుట్టు మెరుగుపడుతుందిన. జుట్టు, చర్మ ఉత్పత్తులలో ఉసిరిని ఎక్కువగా వాడుతున్నారు. అంతేగాకుండా.. ఉసిరి వాడకం వలన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఒక ఉసిరి తినడం ఒక యాపిల్‌తో సమానం.

సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడానికి

సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడానికి

ఉసిరి వైద్యానికి మాత్రమే కాకుండా సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడానికి కూడా వాడుతున్నారు. ఉసిరి సహజ ఔషదంగా చెప్పవచ్చు. ఉసిరితో చేసిన చాలా రకాల సౌందర్య ఉత్పత్తులు మనకు లభిస్తున్నాయి. ఉసిరి, జుట్టును వత్తుగా, పొడవుగా మెరిసేలా చేస్తుంది.

గుండె సంబంధిత వ్యాధుల నివారణకు

గుండె సంబంధిత వ్యాధుల నివారణకు

ఉసిరికి, కొవ్వు పదార్థాలను తగ్గించే గుణం ఉంది. ఉసిరిని తినటం వలన రక్తనాళాలలో ఉండే కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గించి, గుండె సంబంధిత వ్యాధులను కలగకుండా చేస్తుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరచటంలో ఉసిరి ప్రధానపాత్ర పోషిస్తుంది. ఉసిరిపొడిలో కొంచెం పెరుగు, కోడిగుడ్డు తెల్లసొన కలిపి ఈ మిశ్రమాన్నిప్యాక్‌లా వేసుకుంటే ముఖంపై ఉన్న ముడతలు పోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. ఇలాక్రమం తప్పకుండా చేయడం ద్వారా ముడతలు తగ్గుముఖం పడుతుంది.

తలకు పట్టిస్తే

తలకు పట్టిస్తే

ఉసిరిపొడిలో కొంచెం మజ్జిగ, కోడిగుడ్డు తెల్లసొన, కొంచెం బాదం కలిపి 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య నుండి నివారణ లభిస్తుంది. ఉసిరి వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలుగ చేయటమే కాకుండా, వివిధ రకాల వ్యాధి కారకాలతో పోరాడుతుంది.

రోజుకొక ఉసిరి

రోజుకొక ఉసిరి

రోజుకు ఒక ఉసిరి చొప్పున తింటే శరీర రోగ నిరోధక వ్యవస్థను పెంచి, జలుబు , దగ్గు వంటి సాధారణ జబ్బులను నయం చేస్తుంది. అల్సర్‍తో బాధపడుతున్న వారు కొంచెం ఉసిరి రసాన్ని నీటిలో కలిపి పుకిలిస్తే అల్సర్ తగ్గుతుంది. ఉసిరి రసం రోజుకు ఒక గ్లాస్ తీసుకున్నట్లయితే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు అంటున్నారు. ఉసిరిరసం మరియు తేనే కలిపి పరగడుపున తీసుకుంటే రక్తాన్నిసుద్ది చేస్తుంది. ఉసిరి చేసే మేలు ఎన్నో ఎన్నెన్నో.

English summary

amazing health benefits of amla soaked in honey

amazing health benefits of amla soaked in honey
Story first published:Friday, May 18, 2018, 17:41 [IST]
Desktop Bottom Promotion