For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాకర కాయ జ్యూస్ తాగండి.. వంద రోగాలను తరిమికొట్టండి

కాకరకాయ జ్యూస్‌ను రోజూ ఉదయాన్నే పరగడుపునే తాగితే అధిక బరువు తగ్గుతారు. శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. కాకరకాయ ప్రయోజనాలు, కాకర కాయ లాభాలు, కాకర జ్యూస్.

|

కాకర కాయ రసం చేదుగా ఉన్నా.. ఈ చేదే ఎన్నో ఔషాధాల సమ్మేళనం అని వైద్యులు నొక్కి వక్కాణిస్తున్నారు. ఎన్నో ఔషధ ప్రయోజనాలు దాగి ఉన్న కాకరకాయను పండు వలే సేవించమని సలహా ఇస్తున్నారు.

కాకరకాయ జ్యూస్‌ను రోజూ తాగితే డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చని తెలిసిందే. కాకరకాయ జ్యూస్‌ను రోజూ ఉదయాన్నే పరగడుపునే తాగడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్ అవుతాయి. కాకరకాయ జ్యూస్‌లో ఉండే ఔషధ గుణాలు ఇన్సులిన్‌లా పనిచేస్తాయి. అందువల్ల షుగర్ స్థాయిలు అదుపులో ఉంటాయి.

అనారోగ్య సమస్యలను తగ్గించడంలో

అనారోగ్య సమస్యలను తగ్గించడంలో

అయితే కేవలం షుగర్‌నే కాదు, పలు ఇతర అనారోగ్య సమస్యలను తగ్గించడంలోనూ కాకరకాయ జ్యూస్ ఉత్తమంగా పనిచేస్తుంది. ఈ క్రమంలో కాకర జ్యూస్‌ను రోజూ తాగడం వల్ల ఇంకా ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పరగడుపునే తాగితే

పరగడుపునే తాగితే

కాకరకాయ జ్యూస్‌ను రోజూ ఉదయాన్నే పరగడుపునే తాగితే అధిక బరువు తగ్గుతారు. శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణాశయం, పేగులు శుభ్రమవుతాయి. కాకరకాయల్లో సమృద్ధిగా ఉండే ఫైబర్ మలబద్దక సమస్యను పోగొడుతుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం ఉండవు.

శరీరాన్ని శుభ్రం చేస్తాయి

శరీరాన్ని శుభ్రం చేస్తాయి

కాకరకాయలో ఉండే ఔషధ పదార్థాలు శరీరంలోని విష, వ్యర్థ పదార్థాలను బయటకు పంపి శరీరాన్ని శుభ్రం చేస్తాయి. చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. శిరోజాలు దృఢంగా మారుతాయి. కాకరకాయ జ్యూస్‌ను రోజూ తాగడం వల్ల శరరీంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె సమస్యలు రావు.

రోగ నిరోధక శక్తి పెరిగి

రోగ నిరోధక శక్తి పెరిగి

శరీర రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు కాకరకాయల్లో ఉంటాయి. కాకరకాయ జ్యూస్‌ను రోజూ తాగితే శరీర రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. కాకర జ్యూస్‌ను రోజూ ఒక గ్లాస్ తీసుకుంటూ వస్తే రక్తపోటు, హైబీపీ, అలర్జీలను దూరం చేసుకోవచ్చు. అలాగే రెండు స్పూన్ల కాకర రసంతో కాసింత నిమ్మరసం చేర్చి మూడు నుంచి ఆరు నెలల పాటు తీసుకుంటే రక్త సంబంధిత రోగాలకు చెక్ పెట్టవచ్చు.

కలరాను దూరం చేస్తుంది

కలరాను దూరం చేస్తుంది

ఇంకా కాకర ప్రారంభ దశలో ఉన్న కలరాను దూరం చేస్తుంది. ఇంకా కలరాతో ఏర్పడే వాంతులకు కూడా కాకర కళ్లెం వేస్తుంది. అలాగే కాకర డయాబెటిస్‌కు చెక్ పెడుతుంది. పండిన కాకర రక్తం, మూత్రంలో కలిసిన చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. ఎందుకంటే కాకర చెట్లలో ఇన్సులిన్ దాగివుండటంతో మధుమేహానికి చెక్ పెడుతుంది.

కంటి సమస్యలు దూరం

కంటి సమస్యలు దూరం

ఇకపోతే కంటి సమస్యలనుకూడా కాకర నయం చేస్తుంది. కాకర జ్యూస్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటూ వస్తే కంటి సమస్యలు, దృష్టిలోపాలను దూరం చేసుకోవచ్చు. కాకర పండును తీసుకుంటే కంటి చూపు మెరుగుపడుతుంది. ఇంకా కాలేయ వ్యాధికి కూడా కాకర చెక్ పెడుతుంది.

మధుమేహానికి కళ్లెం

మధుమేహానికి కళ్లెం

ఇంకా అలెర్జీ, చర్మ వ్యాధులు, సోరియాసిస్ వంటి వ్యాధుల్ని కూడా కాకర నయం చేస్తుంది. అలాగే శ్వాస సంబంధిత సమస్యలకు సైతం కాకర దివ్యౌషధంగా పనిచేస్తుంది. కాకర మూత్రంలో కలిసిన చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది.. కాకర చెట్లలో ఇన్సులిన్ దాగివుండటంతో మధుమేహానికి కళ్లెం వేస్తుంది..

క్యాల్షియం వుంటుంది

క్యాల్షియం వుంటుంది

కాకర కాయలో 80 శాతం నుంచి 90శాతం వరకు తేమ వుంటుంది. బి1, బి2, బి3, బి4,బి5,బి6, సి విటమిన్ల్ తో పాటు పొటాషియం, మేగ్సీషియం, సోడియం, ఫాస్పరస్ వంటి ధాతువులు ఉన్నాయి. మన తినే ఆకు కూరల్లో ఉన్న క్యాల్షియం కంటే కాకరలో రెండింతలు అధికంగా క్యాల్షియం వుంటుంది.. 100 గ్రాముల కాకరలో ఇవి ఉంటాయి. కొవ్వు- 0.17 గ్రాములు, పీచు - 2.80 గ్రాములు, నియాసిన్ - 0.400 మి. గ్రాములు, క్యాల్షియం- 10. మి.గ్రాములు, సోడియం - 5 మి. గ్రాములు, పొటాషియం- 296 మి.గ్రాములు.

క్యాన్సర్ దరి చేరదు

క్యాన్సర్ దరి చేరదు

ఆహారంలో అప్పుడప్పుడు కాకర కాయ ను లేదా జ్యూస్ ను చేర్చుకోవడం ద్వారా అలెర్జీ, ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్ వంటివి దరిచేరవు.. కాకర కాయను నెలకు మూడు సార్లో అయిన లేదా వారానికి ఒక సారి అయిన తీసుకోవాలి. అయితే గర్భిణీ మహిళలు, పిల్లలకు పాలుపట్టే మహిళలు కాకర కాయను మితంగానే తీసుకోవాలి.

కీళ్లనొప్పుల నివారణకు

కీళ్లనొప్పుల నివారణకు

కీళ్ళనొప్పులు తగ్గించే గుణం కాకరకుంది.కాకర వంటకాలు తిని ఆ లాభం పొందగలరు. కాకరరసాన్ని బాధిస్తున్న కీలుమీద రాసి నెమ్మదిగా మర్దన చేయాలి. కాలేయం ఆరోగ్యానికి కాకర ఎంతగానో ఉపకరిస్తుంది. కాలేయం చెడిపోకుండా లేదా దాని సామర్థ్యం తగ్గకుండా కాపాడే శక్తి కాకరకు వుంది.రోజుకు రెండుసార్లు చొప్పున కాకరరసం ఒకటి లేదా రెండు నెలలపాటు తాగితే ఈ వ్యాది నయమవుంతుంది.

రోజుకు ఒక స్పూన్‌ రసం తీసుకుంటే

రోజుకు ఒక స్పూన్‌ రసం తీసుకుంటే

షుగర్‌ వ్యాది గలవారు రెండు మూడు నెలలపాటు వరుసగా కాకరరసం తీసుకోవాలి. కాకరను ఆహారంగా తీసుకున్నా, షుగర్‌ స్థాయి మారుతుంది. కడుపులో పరాన్నజీవులు చేరటంవల్ల పలురకాల ఇబ్బందులు, అనారోగ్యాలు వస్తాయి. ఆ అనారోగ్యకారక పరాన్నజీవులను కాకరపసరు తొలగిస్తుంది. రోజుకు ఒక స్పూన్‌ రసం తీసుకుంటే చాలు.

మలబద్దకాన్ని వదిలించుకునేందుకు

మలబద్దకాన్ని వదిలించుకునేందుకు

మలబద్దకాన్ని వదిలించుకునేందుకు రోజుకు రెండు సార్లు అరస్పూన్‌ చొప్పున తీసుకుంటే చాలు. తాజాగా తీసిన కాకర పసరును, నీళ్ళతో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటే కామెర్ల వ్యాధి తగ్గుతుంది. కామెర్ల వ్యాధి వచ్చినప్పుడు కళ్ళు పచ్చగా వుంటాయి. అటువంటి పచ్చదనం కళ్ళలో మాయమవగానే దీనిని తీసుకోవటం మానివేయాలి. కాకరకాయలను గర్బిణీలు తినకూడదు.కాకర చేదు ఆ సమయంలో మంచిది కాదు.

పండిన కాకరకాయను ఎవరూ తినకూడదు.

ఫైబర్ ఉంటుంది

ఫైబర్ ఉంటుంది

కాకరకాయలో ఇనుము, మెగ్నీషియం, పోటాషియం, విటమిన్ సి వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీని రసంలో సైతం ఆహారాన్ని జీర్ణం చేసే ఫైబర్ ఉంది. ఒక్క కాకర కాయలో బచ్చలికూరలో ఉండే కాల్షియం, ఒక అరటి పండులో ఉండే పొటాషియం ఉంది. కాకార కాయ రసం చేదుగా ఉండకుండా ఉండాలంటే తేనె లేదా బెల్లం కలపండి. లేదా ఆపిల్ లేదా బెర్రీ వంటి పండ్లను కూడా జతచేయవచ్చు. ఇంకా చేదు తగ్గాలంటే కొంచెం నిమ్మరసం కూడా కలుపుకుని తాగితే మంచిది. నల్ల మిరియాలు, అల్లం చిటెకెడు కలుపుకుంటే మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

టైప్ 2 మధుమేహంతో బాధపడేవారు

టైప్ 2 మధుమేహంతో బాధపడేవారు

కాకరకాయ రసం తాగటం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఎలాంటి నియంత్రణలో ఉంటుందో క్లినికల్ ట్రయల్ నిర్వహించారు. నాలుగు వారాల పరిశీలన తరువాత రెండు వేల మిల్లీ గ్రాముల రక్తంలో గ్లూకోజ్ స్థాయిని గణనీయంగా తగ్గిస్తే టైప్ 2 మధుమేహంతో బాధపడుతున్న రోగులలో మరింత గణనీయంగా తగ్గింది. కాకరకాయ రసం టైప్ 1 మధుమేహంతో బాధపడే రోగులకు వారి రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని గణనీయంగా తగ్గించినట్లు సహయపడింది. జర్నల్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ బయాలజీలో ప్రచురితమైన మరొక నివేదికలోనూ ఇదే విషయాన్ని తేటతెల్లం చేసింది. కాబట్టి మధుమేహంతో బాధపడేవారు రోజువారీ చేదు కాకరకాయ రసాన్ని వినియోగిస్తే వైద్యుల పర్యవేక్షణలో ఈ మందుల మోతాదును వాడాల్సి ఉంటుంది.

చెడు కొవ్వు స్థాయిని తగ్గిస్తుంది

చెడు కొవ్వు స్థాయిని తగ్గిస్తుంది

కాకర రసం శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించటంలో దోహదపడుతుందని పౌష్టికాహార నిపుణులు డాక్టర్ అంజు సూద్ తెలియజేస్తున్నారు. గుండెపోటును, రక్తపోటును కూడా గణనీయంగా తగ్గిస్తుంది. శరీరంలోని అధిక సోడియంను గ్రహిస్తున్న పోటాషియంలో ఇది సమృద్ధిగా ఉన్నందున ఇది శరీర రక్తపోటును కూడా నియంత్రిస్తుంది. కాకర కాయ రసంలో ఇనుము, ఫోలిక్ ఆమ్లం సమృద్ధిగా ఉండటం వల్ల స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించి హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

జుట్టు ప్రకాశవంతంగా

జుట్టు ప్రకాశవంతంగా

కాకర కాయ గుజ్జులో విటమిన్ ఏ, సి తో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇది అకాల చర్మ వృద్ధాప్యాన్ని నిరోధిస్తుంది. శరీర ముడతలను పోగొడుతోంది. చర్మ సంబంధమైన రోగాలను తగ్గిస్తుంది. అలాగే హానికరమైన యు,వి కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుందని న్యూఢిల్లీలోని ఫోర్టిస్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ సిమ్రాన్ సైనీ సూచిస్తున్నారు.

నిగనిగలాడుతుంది

నిగనిగలాడుతుంది

విటమిన్ ఏ, సి, జింక్ చర్మానికి మెరుపును అందిస్తాయి. జుట్టుకు కాకర కాయ గుజ్జును రాసుకోవటం వల్ల నిగనిగలాడుతూ మెరుస్తుంది. చుండ్రు నివారణకు దోహదం చేస్తుంది. తల దురదను తగ్గిస్తుంది. ఈ రసం ఓ విధంగా కండీషనర్‌గా ఉపకరిస్తోంది. కాకర కాయ రసానికి పెరుగు, జీలకర్ర, స్పూన్ నిమ్మరసం కలిపి పేస్ట్ వలే తయారు చేసుకుని రాసుకుని 30 నిమిషాలు తలస్నానం చేస్తే కాంతివంతంగా ఉంటుందని డాక్టర్ సైని చెబుతున్నారు.

కాలేయాన్ని శుభ్రం చేస్తుంది

కాలేయాన్ని శుభ్రం చేస్తుంది

మద్యం సేవించేవారు ఈ కాకార కాయ రసాన్ని సేవిస్తే కాలేయంలో పేరుకుపోయిన ఆల్కాహాల్‌ను పూర్తిగా శుభ్రం చేస్తుంది. కాలేయ సమస్యలను నివారిస్తుంది. కాలేయ ఎంజైమ్ల యాంటీ ఆక్సిడెంట్ పటిష్టత ద్వారా కాలేయ వైఫల్య సమస్యలను అధిగమించవచ్చు. మూత్రాశయం పనితీరు కూడా బాగుంటుంది.

బరువును తగ్గిస్తుంది

బరువును తగ్గిస్తుంది

కొవ్వు కణాల తొలగించటంలో చక్కగా ఉపకరిస్తుంది. కాకారకాయలో కొవ్వు, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఈ రసాన్ని సేవిస్తే సులభంగా బరువు తగ్గవచ్చు. కొత్తగా కొవ్వు కణాలు ఏర్పడకుండా అడ్డుకుంటుంది. ఉబకాయంతో బాధపడేవారికి మంచి చికిత్స.

రోగ నిరోధక వ్యవస్థ మెరుగు

రోగ నిరోధక వ్యవస్థ మెరుగు

శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలెర్జీలు దరి చేరవు. వైరస్, బాక్టీరియాపై పోరాడుతోంది. ఇందులోని అనామ్లజనకాలు అనారోగ్యానికి వ్యతిరేకంగా శక్తివంతమైన రక్షణ కేంద్రాలుగా పనిచేస్తాయి. వివిధ రకాలైన క్యాన్సర్లకు కారణమయ్యే కణితిలు ఏర్పడకుండా పనిచేస్తుంది. ముఖ్యంగా మహిళలో వచ్చే గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

 అతిసారం, మధుమేహం

అతిసారం, మధుమేహం

కాకర కంటి శుక్లం, దృష్టి లోపం సమస్యల నివారిణిగా పనిచేస్తుంది. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్ ఏ కళ్ల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఇంకా అతిసారం, మధుమేహం, నులిపురుగులు, గజ్జి, తామర వంటి చర్మవ్యాధులకు కాకర కాయలు ఔషధంగా ఉపయోగపడతాయి. కాకర యాంటి బయోటిక్‌గా పనిచేస్తుందని వైద్యులంటున్నారు.

English summary

amazing health benefits of bitter gourd juice

amazing health benefits of bitter gourd juice
Story first published:Thursday, May 3, 2018, 13:18 [IST]
Desktop Bottom Promotion