Latest Updates
-
విడివిడిగా కాదు.. ఒకే గిన్నెలో క్రీమీ ముద్దపప్పు ఆవకాయ అన్నం..స్వర్గానికి నిచ్చెన వేసే అద్భుతమైన రెసిపీ! -
హైదరాబాద్ నుంచి ఒక్క రోజులో విజిట్ చేసే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్.. ఒక్కో వీకెండ్కి ఒక్కో ఎక్స్పీరియన్స్ -
బొటనవేలుపై ఈ గుర్తు ఉన్నోళ్లు ప్రపంచాన్ని జయించగలరు! -
ముక్కల్లేకుండా బిర్యానీ మజా.. అచ్చం రెస్టారెంట్ స్టైల్ కుష్కా ఇంట్లోనే ఈజీగా ఇలా చేయండి! -
అరటిపండు తినడానికి సరైన సమయం ఏది? ఈ నిజాలు మీరు తెలుసుకోవాల్సిందే! -
నెల రోజులు పైనే నిల్వ..చికెన్ కారం పొడి ఇలా చేసి పెట్టుకుంటే టిఫిన్స్, అన్నంలోకి అదుర్స్! -
ఈ అలవాటు మానేస్తే తిన్నాక కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వదు! -
చికెన్ చాప్స్ ఇలా చేస్తే..ముక్క కూడా మిగల్చకుండా లాగించేస్తారు..టేస్ట్ కి అడిక్ట్ అయిపోతారు! -
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.!
రాత్రి ఉలువ చారు తాగి చూడండి, ఉలువలతో చాలా బెనిఫిట్స్, లెక్కలేనంత ఆరోగ్యం
చాలా మంది అల్సర్ తో ఇబ్బందులుపడుతుంటారు. అలాంటి వారు ఉలవల ద్వారా ఉపశమనం పొందొచ్చు. ఉలవలతో పాటు కాస్త వేడి చేసిన ఇంగువను, కాస్త అల్లం పేస్ట్ ను, కొద్దిగా అతి మధురం అనే వేరు పేస్ట్ ను మిక్స్ చేసుకోవాలి.
ఉలవల గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. వీటిని పశువులకు దాణాగా ఉపయోగిస్తుంటారు. ఎన్నో అద్భుత ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్న ఉలవలను రోజూ తింటే చాలా మంచిది.
ఉలవలలో కొన్ని వందల రకాల పోషకాలున్నాయి. ముఖ్యంగా మహిళలు నెలసరి సమయంలో ఉలవలతో తయారు చేసిన కషాయాన్ని తీసుకుంటే చాలా మంచిది. బాగా ఉపశమనం కలుగుతుంది.

ఎక్కిళ్లు
అలాగే కొందరికి ఆగకుండా ఎక్కిళ్లు వస్తాయి. అలాంటి వారు కూడా ఉలవ కషాయం తాగితే చాలా మంచిది. ఇక కొందరికి కంటిచూపు సమస్యలుంటాయి. వారు ఉలవలతో తయారు చేసిన కషాయం, లేదంటే ఉలవలతో తయారు చేసిన ఆహారపదార్థాలు తింటే మంచిది.

షుగర్ ఉన్నవారు
షుగర్ ఉన్నవారు రోజూ ఉలవలలతో తయారు చేసిన పదార్థాలు తింటే మంచిది. గుండె సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే కూడా ఉలవలతో తయారు చేసిన పదార్థాలు తినాలి.

పిల్లలకు రోజూ ఇస్తే
పిల్లలకు రోజూ ఉలవలతో తయారు చేసిన ఆహారపదార్థాలు అందిస్తే మంచిది. వాటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పిల్లలు బాగా ఎదుగుతారు. ఉలవల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది.

రక్తపోటు రాకుండా
అలాగే ఉలవల్లో ఉండే ఫైబర్ బ్లడ్లో గ్లూకోజ్ ను తగ్గించి రక్తపోటు రాకుండా చేస్తుంది. ఉలవలతో తయారు చేసిన పదార్థాలను రోజూ తింటే అధిక బరువు సమస్య కూడా ఉండదు. ఈజీగా బరువు తగ్గుతారు.

జావ తయారు చేసుకోవాలి
ఉలవలను, కొన్ని కొత్త బియ్యాన్ని కలిపి జావ తయారు చేసుకోవాలి. ఆ జావను రోజూ పరగడుపున తాగితే నెలరోజుల్లోనే ఒంట్లోని కొవ్వు మొత్తం కరిగిపోతుంది. ఒకవేళ జావ మరీ చప్పగా అనిపిస్తే కాస్త ఉప్పు వేసుకోండి.

ఒంటినొప్పులతో ..
కొందరు ఒంటినొప్పులతో అల్లాడిపోతుంటారు. అలాంటి వారు కొన్ని ఉలవలను తీసుకుని పెనంపై వేయించుకోండి. వాటిని కాస్త మందంగా ఉన్న గుడ్డలో ఉంచి నొప్పి ఉన్న చోట కాపుకోవాలి. ఇలా చేస్తే నొప్పి మటుమాయం అవుతుంది.

అల్సర్
చాలా మంది అల్సర్ తో ఇబ్బందులుపడుతుంటారు. అలాంటి వారు ఉలవల ద్వారా ఉపశమనం పొందొచ్చు. ఉలవలతో పాటు కాస్త వేడి చేసిన ఇంగువను, కాస్త అల్లం పేస్ట్ ను, కొద్దిగా అతి మధురం అనే వేరు పేస్ట్ ను మిక్స్ చేసుకోవాలి. వీటన్నింటినీ కాస్త నీటిలో కలుపుకుని, కొద్దిగా తేనే వేసుకోని తాగాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే కచ్చితంగా అల్సర్ సమస్య తగ్గిపోతుంది.

ఎముకలకు మంచి బలం
అలాగే రోజూ ఉలవల నూకలతో తయారు చేసిన జావను తాగితే కూడా హెల్త్ కు ఎంతో మంచిది. దీంతో ఎముకలకు మంచి బలం వస్తుంది.

కొవ్వు మొత్తం
ఉలవలతో తయారు చేసిన పదార్థాలను రోజూ తింటే పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు మొత్తం కరిగిపోతుంది.

శృంగార శక్తి
ఉలవల శృంగార శక్తిని కూడా పెంచుతాయి. కొన్ని ఉలవలు తీసుకోండి. అలాగే కొన్ని కొత్తం బియ్యం తీసుకోండి. ఆ రెండింటిని కలిపి జావ తయారు చేసుకోండి. ఆ జావను పాలలో కలుపుకుని రాత్రి తాగండి. శృంగార చేయాలనుకునే ముందు మగవారు ఇలాంటి జావను తాగితే మంచి సామర్థ్యం వస్తుంది. అందులో బాగా పాల్గొనగలుగుతారు.

మూత్రం పోస్తుంటేనొప్పి
కొందరికి మూత్రం పోస్తుంటేనొప్పిగా ఉంటుంది. అలాంటి వారు ఉలవ చారులో కాస్త కొబ్బరి నీళ్లు కలుపుకుని తాగితే మంచిది. దీంతో మూత్రంలో నొప్పి అనేది ఉండదు.



Click it and Unblock the Notifications