Latest Updates
-
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
సెక్స్ లో కంటే హస్త ప్రయోగంలోనే ఎక్కువ సంతృప్తి ఉంటుందా? అమ్మాయిలను చూస్తే తట్టుకోలేకపోతున్నా
నా సమస్యను నా స్నేహితుడికి చెబితే నువ్వు భవిష్యత్తులో సెక్స్ కు పనికిరావని చెప్పాడు. నిజంగానే నేను భవిష్యతులో సెక్స్ కు పనికిరానా? దయజేసి నా సమస్యకు పరిష్కారం సూచించండి. అలాగే సెక్స్ లో కలిగే తృప్తే హ
ప్రశ్న : నాకు యుక్త వయస్సు వచ్చినప్పటి నుంచి హస్త ప్రయోగం చేసుకునే అలవాటు ఉంది. నాకు సెక్స్ కోరికలు చాలా ఎక్కువ. అందుకే రోజూ హస్త ప్రయోగం చేసుకుంటూ ఉంటాను. దీని ద్వారా నేను చాలా తృప్తి పొందుతాను.
అయితే మొదట్లో నేను వారానికి ఒకసారి చేసుకునేవాణ్ని. ఈ మధ్య మరీ ఎక్కువగా చేసుకుంటున్నాను. ఏ అమ్మాయిని చూసినా కూడా వెంటనే బాత్రూమ్ లోకి వెళ్లి కొట్టుకుంటున్నాను.

తట్టుకోలేక
టెంప్ట్ అయిపోతున్నాను. తట్టుకోలేక విపరీతంగా హస్త ప్రయోగం చేసుకుంటున్నాను. దీంతో ఒళ్లంతా నొప్పులు వచ్చేస్తున్నాయి. శరీరం కూడా నీరసంగా మారిపోతుంది. ఇంత వరకు నేను డైరెక్ట్ గా ఒక్కసారి కూడా సెక్స్ లో పాల్గొనలేదు.
సెక్స్ కు పనికిరావని చెప్పాడు
నా సమస్యను నా స్నేహితుడికి చెబితే నువ్వు భవిష్యత్తులో సెక్స్ కు పనికిరావని చెప్పాడు. నిజంగానే నేను భవిష్యతులో సెక్స్ కు పనికిరానా? దయజేసి నా సమస్యకు పరిష్కారం సూచించండి. అలాగే సెక్స్ లో కలిగే తృప్తే హస్త ప్రయోగంలో లభిస్తుందా?

సమాధానం : హస్త ప్రయోగం చేసుకోవడం అనారోగ్యం కాదు. యుక్త వయస్సు వచ్చినప్పటి నుంచి సాధారణంగా లైంగిక కోరికలు కలగడం సహజం. అందువల్ల స్వయం తృప్తి పొందడం తప్పేమీ కాదు.

మరీ ఎక్కువగా చేసుకోవడం
అయితే మీరు మరీ ఎక్కువగా చేసుకుంటున్నాని చెప్పారు. అలా అతిగా చేసుకోవడం మంచిది కాదు. ఒక లిమిట్ లో ఉండండి. ఎందులోనైనా సరే అతి అనేది మంచిది కాదు.

టెంప్ట్ అయిపోవడం
మీరు ఏ అమ్మాయిని చూసినా టెంప్ట్ అయిపోతున్నాని చెప్పారు. అది కూడా మంచిది కాదు. సెక్స్ కోరికలు ఉండడం తప్పు కాదు. కానీ అవి అపరిమితంగా ఉండడం మంచిది కాదు. ప్రతి ఒక్కరినీ అలాంటి ఉద్దేశంతోనూ చూడడం సరికాదు.

ఊరికే ఉంటే అలాంటి ఆలోచనలే
వీరు వెంటనే సైకాలిజిస్ట్ ను కలవండి. ధ్యానం, యోగాలాంటివి చేయండి. మంచి బుక్స్ చదవండి. ఎప్పుడూ బిజీగా ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఊరికే ఉంటే అలాంటి ఆలోచనలే వస్తుంటాయి.

శరీరం నీరిసించి పోతుంది
సరైన ఆహారం తీసుకోకుండా విపరీతంగా హస్త ప్రయోగం చేసుకుంటే శరీరం నీరిసించి పోతుంది.
అందువల్ల మీరు తరుచూ పౌష్టికాహారం తీసుకుంటూ ఉండండి. పెళ్లికి ముందు సెక్స్ లో పాల్గొనగకుండా హస్త ప్రయోగం చేసుకోవడం మంచిదే కానీ లిమిట్ లో ఉండండి.

సెక్స్ కు పనికిరాను అనే సందేహం వీడండి
ఇక హస్త ప్రయోగం వల్ల భవిష్యత్తులో సెక్స్ కు పనికిరాను అనే సందేహాన్ని మీరు వీడండి. హస్త ప్రయోగం చేసుకున్నంత మాత్రానా మీరు అందుకు పనికిరాకుండా పోరు. హస్త ప్రయోగం వల్ల మీ సెక్స్ లైఫ్ కు ఎలాంటి ఇబ్బంది లేదు.
సెక్స్ వల్ల కలిగే తృప్తితో పోల్చితే
అయితే సెక్స్ వల్ల కలిగే తృప్తితో పోల్చితే హస్త ప్రయోగం వల్ల కలిగే సంతృప్తి ఎక్కువే ఉంటుంది.
అందులో రెండు శరీరాల కలయిక ఉంటుంది. దాంతో శారీరకంగా, మానసికంగా ఎంతో ఆనందించగలుగుతారు. కానీ పెళ్లికి ముందు సెక్స్ కంటే హస్త ప్రయోగమే చాలా మేలు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
