ఎండలో డీహైడ్రేషన్‌ కు గురైతే ఆ అవయవాలు దెబ్బతిని ప్రాణాలు పోతాయి.. వేసవిలో చాలా జాగ్రత్తగా ఉండండి

Written By:
Subscribe to Boldsky

విపరీతమైన ఎండ.. వేడి.. ఈ ఎండ వేడి వల్ల శరీరంలో ఉండవలసిన నీటి శాతం ఒక్కోసారి పడిపోతుంది. శరీరంలో ఉండవలసిన నీటి పరిమాణంలో 5 శాతం అంతకన్నా ఎక్కువగా నీరు తగ్గితే దానిని డీహైడ్రేషన్‌గా పరిగణిస్తారు. ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే..

నాలుక పిడచకట్టుక పోవడం కనిపిస్తుంది. కళ్లు తిరగడం, వికారం ఉంటుంది. చర్మం ఎర్రగా పొడిబారిపోతుంది. విపరీతమైన నీరసం ఆవహిస్తుంది. మూత్రవిసర్జన తగ్గడం, చిక్కబడటం, పసుపుగా అవడం వంటి లక్షణాలు కనబడతాయి.

పల్స్ రేట్ తగ్గిపోవడం

పల్స్ రేట్ తగ్గిపోవడం

శరీర ఉష్ణోగ్రత అతి ఎక్కువగా లేదా చల్లగా ఉంటుంది. తొందరగా చికాకు పడటం వంటి లక్షణం కనిపిస్తుంది. ఆకలి మందగించడం, పల్స్ రేటు తగ్గిపోవ‌డం జ‌రుగుతుంది. ఈ క్ర‌మంలో డీహైడ్రేష‌న్ వ‌ల్ల క‌నిపించే ఈ ల‌క్ష‌ణాలను పట్టించుకోకపోతే అది ప్రమాదకరంగా మారిపోయి వ్య‌క్తులు సొమ్మసిల్లి కోమాలోకి పోవడం కూడా జరుగుతుంది.

5 శాతం అంతకన్నా ఎక్కువగా నీరు తగ్గితే

5 శాతం అంతకన్నా ఎక్కువగా నీరు తగ్గితే

ఎండ వేడిమి వల్ల శరీరంలో ఉండవలసిన నీటి శాతం ఒక్కోసారి పడిపోతుంది. శరీరంలో ఉండవలసిన నీటి పరిమాణం కన్నా 5 శాతం అంతకన్నా ఎక్కువగా నీరు తగ్గితే దానిని డీహైడ్రేషన్‌గా పరిగణిస్తారు.

నీరు తాగిస్తూ ఉండాలి

నీరు తాగిస్తూ ఉండాలి

శరీరం నుంచి బయటకు పోయిన నీటిని తిరిగి భర్తీ చేస్తే డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉండ‌వ‌చ్చు. పిల్లలకు అవసరం లేదన్నా కొద్ది కొద్దిగానైనా నీరు తాగిస్తూ ఉండాలి. శరీరంలో ఎప్పుడూ ద్ర‌వాలు స‌మ‌తుల్యంలో ఉండేలా ఎప్పుడూ నీరు తాగుతూ ఉండాలి. లేత కొబ్బరి నీరు ఉపయోగకరంగా ప‌నిచేస్తుంది.

ఐస్ ముక్కలు చప్పరించడం

ఐస్ ముక్కలు చప్పరించడం

ఐస్ ముక్కలు చప్పరించడం లేదా ఒంటినిండా రాస్తే శ‌రీరం చల్లబడుతుంది. ఎండుద్రాక్ష, ఎండు ఖర్జూరం ఉదయం నీటిలో నానబెట్టి ఎండవేళ ఇవ్వాలి. ఇవి చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో మరింత ఉపయోగకరంగా ఉంటాయి. ఎండలో ప్రయాణించేటపుడు చల్లటి నీరు, గ్లూకోజ్‌ను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి. మజ్జిగ, పెరుగు, ఆపిల్, దానిమ్మ, బొప్పాయి, అరటి, క్యారెట్, బార్లీ నీళ్లు, చల్లటి గంజి, నిమ్మరసం, తాజా పళ్లను తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ బారిన ప‌డ‌కుండా చూసుకోవ‌చ్చు.

ఎండుద్రాక్ష

ఎండుద్రాక్ష

ఎండుద్రాక్ష, ఎండు ఖర్జూరం ఉదయం నీటిలో నానబెట్టి ఎండవేళ ఇవ్వాలి. ఇవి చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో మరింత ఉపయోగకరంగా ఉంటాయి. ఎండలో ప్రయాణించేటపుడు చల్లటి నీరు, గ్లూకోజ్‌ను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి. మజ్జిగ, పెరుగు, ఆపిల్, దానిమ్మ, బొప్పాయి, అరటి, క్యారెట్, బార్లీ నీళ్లు, చల్లటి గంజి, నిమ్మరసం, తాజా పళ్లను తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ దరిచేరకుండా అడ్డుకోవచ్చు

ప్రాణాపాయం

ప్రాణాపాయం

డీ హైడ్రేషన్‌కు తక్షణం స్పందించకపోతే నేరుగా ప్రాణాపాయం సంభవించే అవకాశంతో పాటు శరీరంలోని ప్రధాన అవయవాలు దెబ్బతిని తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. సకాలంలో వైద్యం అందకపోతే దీని ఫలితమూ మరణానికి దారితీయవచ్చు. డీ హైడ్రేషన్‌కు గురైన వారిలో కిడ్నీల్లోనూ, లివర్‌లోనూ రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంది.

కిడ్నీలు పనిచేయవు

కిడ్నీలు పనిచేయవు

కిడ్నీలో రక్తం గడ్డ కడితే యూరియా, క్రియాటిన్‌ స్థాయిలు పెరిగి కిడ్నీలు పనిచేయవు. సకాలంలో వైద్యం అందకపోతే రీనల్‌ ఫెయిల్యూర్‌ సంభవించి, చివరకు డయాలసిస్‌కు దారి తీస్తుంది. లివర్‌లో రక్తం గడ్డకడితే కామెర్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాళ్లల్లోనూ, ముఖంలోనూ నీరు చేరి వాపులు వస్తాయి.

లివర్‌ ఫెయిల్యూర్‌

లివర్‌ ఫెయిల్యూర్‌

ఈ క్రమం చివరకు లివర్‌ ఫెయిల్యూర్‌ వరకూ వెళ్లవచ్చు. తక్షణం సంబంధిత వైద్యం అందకపోతే లివర్‌ మార్పిడికి, కొన్ని సందర్భాలలో, మరణానికి దారితీయవచ్చు. వడదెబ్బ తగిలితే నీళ్లు తాగితే సరిపోతుంది అని తేలిగ్గా తీసుకోకుండా డీ హైడ్రేషన్‌కు గురికాకుండా నిత్యం జాగ్రత్తగా ఉండడం అవసరం. మధుమేహం ఉన్నవారు త్వరగా వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఉన్నందున, వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

రోగనిరోధక శక్తి తగ్గితే

రోగనిరోధక శక్తి తగ్గితే

ఇక వేడిని తట్టుకునేందుకుగాను నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి పోషక విలువలతో కూడిన ఆహారం సక్రమంగా అందదు. ఇలాంటి కారణాలన్నీ వెరసి రోగ నిరోధకశక్తి తగ్గుతుంది. రోగనిరోధక శక్తి ఎంత తగ్గితే డీ హైడ్రేషన్‌కు గురయ్యే అవకాశాలు అంతగా పెరుగుతాయి. ఈ పరిస్థితుల్లో డీ హైడ్రేషన్‌కు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

English summary

dehydration symptoms causes and treatments

dehydration symptoms causes and treatments
Story first published: Friday, May 4, 2018, 13:00 [IST]