Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
వేసవిలోనూ డెంగీ వస్తుంది.. చచ్చిపోతారు.. జాగ్రత్తగా ఉండండి
dengue symptoms and treatment
ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవ్వరూ చెప్పలేరు. చివరకు ఒక దోమ కుడితే చచ్చిపోయే అవకాశం ఉంది. అపరిశుభ్రత వాతావరణం వల్లే దోమలు విజృంభించి, డెంగ్యూ ప్రబలుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వరుసగా వారం పాటు జ్వరం తగ్గకుంటే కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. వేసవిలో డెంగీ ఉందా అంటే ఉందనే అంటున్నారు డాక్టర్లు.

డెంగూవ్యాధి విస్తరిస్తుంది
ప్రధానంగా పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం వల్లే డెంగూవ్యాధి విస్తరిస్తుంది. అందువల్ల తప్పని సరిగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కచ్చితంగా వారంలో రెండు, మూడు రోజులు డ్రైడే పాటించాలి. పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.

వైద్యుడిని సంప్రదించాలి
వారం పది రోజుల పాటు జ్వరం ఉండడం, రెండు, మూడు రోజులకోసారి తగ్గుతూ వస్తుండడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడిని సంప్రదించాలి. ఐడీఎస్‌పీ సిబ్బంది రక్తనమూనాలను సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తారు.

లక్షణాలని బట్టి చికిత్స
కొంత మంది డెంగీ తీవ్రమై చనిపోతూ ఉంటారు. దీని నివారణకు వైద్యులు చాలా సలహాలు ఇస్తూనే ఉన్నారు. ఎందుకంటే డెంగీ వస్తే ప్రత్యేకమైన మందులు లేవు. లక్షణాలని బట్టి చికిత్స అందించాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. వేసవిలోనూ అపరిశుభ్ర పరిసరలాల్లో ఉండే దోమలు కుట్టడం వలన డెంగీ జ్వరం వ్యాప్తిస్తుంది.

తలనొప్పి, ఒళ్లునొప్పులు
డెంగీ లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. విపరీతమైన జ్వరం వస్తుంది. చలి, తీవ్రమైన తల నొప్పి, ఒళ్లునొప్పులు వస్తాయి.
శరీరంపై దద్దుర్లు వస్తాయి. విపరీతమైన దాహం వేస్తుంది. నోరు ఎక్కువగా ఆరిపోతుంది. వాంతులు అవుతాయి.
కళ్లలో నొప్పి వస్తుంది.

మాత్రలు వాడకూడదు
ఇక డెంగీ జ్వరం వచ్చిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల దగ్గరకు వెళ్లాలి. పరీక్షలు చేయించకుండా మామూలు జ్వరానికి వాడే యాస్ప్రిన్, బ్రఊఫిన్ మాత్రలు వాడకూడదు. జ్వరం వచ్చిన వెంటనే చల్లని నీళ్లతో శరీరాన్ని ఒక గుడ్డతో బాగా తుడవాలి. ఎక్కువగా జ్వరం వచ్చిన వారిని చల్లని ప్రదేశంలో పడుకోబెట్టాలి. అలాగే జ్వరం నుండి ఉపశమనం కొరకు పారాసెట్మాల్ మాత్రను మాత్రమే వెయ్యాలి.

ప్లేట్ లెట్స్ తగ్గుతాయి
డెంగీ రావడం వలన శరీరంలో ప్లేట్ లెట్స్ తగ్గుతాయి. ఇలా తగ్గడం వలన రక్తం గడ్డకట్టి ఆగిపోతుంది. ఇలాంటి సమయంలో నొప్పుల ఎక్కువగా ఉన్నాయి అని ఎన్ఎస్ ఏఐడి ఉన్న మాత్రలు వాడకూడదు. ఒకవేళ ఫ్లేట్ లెట్స్ తగ్గిపోయినప్పుడు వైద్యుల సలహా మేరకు మాత్రమే ఫ్లేట్ లెట్స్ ఎక్కించాలి.

బొప్పాయి ఆకు
డెంగీ వచ్చినప్పుడు పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉన్న ద్రవాలను రోగికి ఇవ్వాలి.క్యారెట్ జ్యూస్, చీనీ రసం, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగించాలి. బొప్పాయి ఆకును తుంచి బాగా కడిగి వాటిని కలకండతో కలిపి కొన్ని నీళ్లు పోసి మిక్సీ లో రుబ్బాలి. తరవాత వచ్చిన మిశ్రమాన్ని వడగట్టి గంటకో గ్లాస్ చొప్పున బాధితునికి తాగించాలి. ఇలా చేయడం వలన రోగి తొందరగా కోలుకోవడమే కాదు డెంగీ లక్షణాలు పూర్తిగా మాయం అవుతాయి.

డెంగ్యూ కేసులు
ప్రస్తుతం పలుచోట్ల డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. డెంగీ రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు ఎడిస్ దోమ కాటు వల్ల వస్తాయి. ఈ దోమలు ఎక్కువగా పగటిపూట కుడతాయి. ఈజిప్ట్ జాతికి చెందిన టైగర్ దోమ వల్ల డెంగీ వస్తూ ఉంటుంది. దోమ కుట్టిన ఐదు..ఎనిమిది రోజుల తరువాత వ్యాధి లక్షణాలు కనిపిస్తుంటాయి.

డెంగీ దోమలు పరిసరప్రాంతంలోకి రావు
టైర్లు, కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ డ్రమ్ములు, బోండాల్లో నీరు నిల్వ ఉంటే, అందు లో వృద్ధిచెందుతాయి. పరిసర ప్రాంతాల్లోని మురుగు కాలువల్లో నూ దోమలు పెరుగుతాయి.పరిసరాలను పరిశుభ్రముగ ఉంచుకొని ముఖ్యంగా దోమలు రాకుండా నివారించాలి. కాయిల్స్, లిక్విడ్ లాంటివి వాడాలి. దోమ తెరలను వాడితే ఇంకా మంచింది. నిమ్మకాయను రెండు భాగాలుగా కోసి ఒక్కొక్క భాగంలో 10-15 లవంగాలు అందులో గుచ్చాలి. దీని వలన డెంగీ దోమలు ఆ పరిసరప్రాంతంలోకి రావు.

దాహం కూడా అధికమౌతుంది
రాత్రి సమయంలో కొబ్బరి నూనె పాదాలకు నుంచి మోకాళ్ళ దాకా బాగా రాసుకోవాలి. ఇలా చేయుటం వలన డెంగీ దోమ దగ్గరికి రాదు ఎందుకంటే కొబ్బరి న నూనె యాంటీ బయోటిక్ గా పనిచేస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. నోరు ఎండిపోవడం జరుగుతుంది. దాహం కూడా అధికమౌతుంది. కండరాలు..కీళ్ల నొప్పులుంటాయి. వాంతి అవుతున్నట్లు అనిపిస్తుంటుంది. జ్వరం అధికంగా వస్తుంది.
తలనొప్పి కూడా అధికంగా ఉంటుంది.

దోమలు వృద్ధి చెందుతాయి
ఈ లక్షణాలు ఉంటే మాత్రం వెంటనే వైద్యుడిని సంప్రదించడం మేలు. వ్యాధి ఉందో..లేదో నిర్ధారణ చేసుకోవాలి. నీళ్లు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో దోమలు వృద్ధి చెందుతాయి. నీరు కనీసం వారం రోజుల పాటు నిల్వ ఉంటే ఈ రకమైన దోమలు వృద్ధి చెందుతాయి. ముఖ్యంగా తొట్టీలు..కుండీలు..ఖాళీ డ్రమ్ములు..బిల్డింగ్ లపై నిలిచిన వాన నీటిలో ఎక్కువగా పెరుగుతుంటాయి.

చాలా జాగ్రత్తలు పాటించాలి
డెంగ్యూ వ్యాధి రాకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. నీరు నిల్వకుండా చూసుకోవాలి. ఇళ్ల వెలుపల నీటి నిల్వలను పారేయాలి. నీటి ట్యాంకుకు మూత వేయాలి. నీటి నిల్వలు గల వాటిని వారానికి ఒకసారి ఖాళీ చేయించి, వారంలో ఒక రోజు డ్రైడే విధానాన్ని తప్పక పాటించాలి.

దోమ కాటు నుంచి కాపాడుకోవాలి
దోమతెరలు, నివారణ మందులు వాడి దోమ కాటు నుంచి కాపాడుకోవాలి. శరీరంలోని అన్ని భాగాలు రక్షణ కలిగే విధంగా వేసుకోవాలి. పిల్లలకు శరీర భాగాలు పూర్తిగా కప్పేటట్లు దుస్తులు వేయాలి. పొడుగు ప్యాంట్లు, పొడుగు చేతులు గల చొక్కాలు ధరించాలి. జ్వరం వచ్చినట్లు అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.



Click it and Unblock the Notifications