For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  వీర్యం గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు.. పిల్లల్ని పుట్టించడానికే కాదు చాలా వాటికి ఉపయోగపడుతుంది

  |

  సాధారణంగా మనిషికి ఎన్నో రకాల సందేహాలుంటాయి. అందులో సెక్స్ సమస్యలైతే మరీనూ. యువకులలో రకరకాల సందేహాలు పుట్టుకొస్తుంటాయి.

  Eight things you didn’t know you could do with human sperm

  అలాంటి సందేహాలలో వీర్యం అంటే ఏమిటి అనేదానిపై సందేహానికి సమాధానం.శుక్ర కణాలను వీర్య కణాలని కూడా అంటారు. వీర్యం అనేది శక్తి, మలరహితం, పవిత్రమైంది. కాబట్టే దీనిని వీర్యం అంటారు. ఈ వీర్యం వలన ఓ కొత్త శరీరం పుడుతుంది. అందువల్లే దీనికి ఈ పేరు వచ్చింది.

  ద్రవరూపంలో ఉంటుంది

  ద్రవరూపంలో ఉంటుంది

  శుక్రకణాలు మూత్రనాళంలో తయారవుతాయి. ఇది ద్రవరూపంలో ఉంటుంది. ఈ ద్రవమే స్ఖలనం సమయంలో అంగం నుంచి బయట పడుతుంది. ఏ విధంగానైతే పాలల్లో నెయ్యి, చెరకులో రసం దాగివుంటుందో అలాగే మనిషి శరీరంలో శుక్ర ధాతువులు దాగివుంటాయి. పురుషత్వం దీనిపైనే ఆధారపడివుంటుంది.

  ఏడు ధాతువులుంటాయి

  ఏడు ధాతువులుంటాయి

  మానవ శరీరంలో ఏడు ధాతువులుంటాయి. ఈ ధాతువులలో ఏడవది శుక్ర ధాతువు. ఇది పరమ శ్రేష్టమైంది. రక్తం, మాంసం, మేదం, శుక్ర తదితర ధాతువులతో శరీరనిర్మాణం ఏర్పడుతుంది. మనిషి పిండరూపంలో ఉంటే ఆహారం ఈ శుక్రధాతువుద్వారానే లభిస్తుంది.

  MOST READ:ఈ మహానుభావుల ఐడియాలు చూశారా? చూస్తే మీ జన్మ ధన్యమే !

  వీర్యం నాణ్యత దెబ్బతింటుంది

  వీర్యం నాణ్యత దెబ్బతింటుంది

  ఇక నిద్ర మరీ తగ్గినా, మరీ ఎక్కువైనా పురుషుల్లో వీర్యం నాణ్యత దెబ్బతింటున్నట్టు చైనా పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనంలో భాగంగా కొందరికి 6 గంటలు, అంతకన్నా తక్కువసేపు.. మరికొందరికి 7-8 గంటల సేపు.. ఇంకొందరికి 9 గంటలు, అంతకన్నా ఎక్కువసేపు నిద్రపోవాలని సూచించారు.

  విశ్రాంతి లేకపోవటం వల్ల

  విశ్రాంతి లేకపోవటం వల్ల

  అనంతరం వీర్యకణాల సంఖ్య, రూపు, కదలికలను పరిశీలించారు. వీరందరిలో కెల్లా 7-8 గంటల సేపు నిద్రపోయినవారిలో వీర్యం నాణ్యత బాగా ఉంటున్నట్టు తేలింది. 6 గంటల కన్నా తక్కువ, 9 గంటల కన్నా ఎక్కువసేపు పడుకునేవారిలో వీర్యం నాణ్యత బాగా పడిపోవటం గమనార్హం. ఆలస్యంగా నిద్రపోవటం, తగినంత విశ్రాంతి లేకపోవటం చాలా హానికరం.

  తగినంత సేపు నిద్రలేకపోవడమే కారణం

  తగినంత సేపు నిద్రలేకపోవడమే కారణం

  ఎందుకంటే వీరిలో ఆరోగ్యకరమైన వీర్యకణాలను దెబ్బతీసే ప్రోటీన్‌ (యాంటీస్పెర్మ్‌ యాంటీబాడీ) స్థాయులు చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల సంతాన సమస్యలతో బాధపడే పురుషులు రాత్రిపూట తగినంత సేపు నిద్రపోవటం, అదీ త్వరగానే పడుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

  MOST READ:మీరు ఆ రేంజ్ లో సెక్స్ చేయాలనుకుంటున్నారా? మీకు సెక్స్ ఊహాలు బాగా ఉన్నాయా? అయితే మీరు ఆ టైపే

  గోరువెచ్చటి నీటితో స్నానం చేయటం

  గోరువెచ్చటి నీటితో స్నానం చేయటం

  కాబట్టి పడుకోవటానికి కనీసం 2 గంటల ముందే భోజనం చేయటం.. టీవీలు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌ ఫోన్ల వంటివి కనీసం 45 నిమిషాల ముందే కట్టేయటం.. నిద్ర పోవటానికి ముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేయటం.. గదిలో ప్రకాశవంతమైన లైట్లు లేకుండా చూసుకోవటం.. మనసుకు నచ్చిన సంగీతాన్ని వినటం.. వదులుగా ఉండే దుస్తులు ధరించటం..వంటి వాటితో నిద్ర బాగా పట్టేలా చూసుకోవచ్చు.

  వీర్యంతో ఫేషియల్‌ చేసుకుంటే

  వీర్యంతో ఫేషియల్‌ చేసుకుంటే

  ఇక పురుషులు ఉత్పత్తి చేసే వీర్యానికి స్త్రీని గర్భవతిని చేసే శక్తి మాత్రమే ఉందని అందరికీ తెలుసు. అయితే దీని వల్ల ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయని గతంలో తేలింది. వీర్యంతో ఫేషియల్‌ చేసుకుంటే ముఖం మెరిసిపోతుందని లండన్‌కు చెందిన ఓ మోడల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, స్టేట్‌ యూనివర్సిటీ ఆఫ్‌ న్యూయార్క్‌ పరిశోధకులు చేసిన ప్రయోగంలో వీర్యానికి డిప్రెషన్‌ తగ్గించే సామర్థ్యం కూడా ఉందని తేలిందట.

  కండోమ్‌తో సెక్స్‌లో పాల్గొంటే

  కండోమ్‌తో సెక్స్‌లో పాల్గొంటే

  ఈ మేరకు వీరు కొంతమందిపై ఓ ప్రయోగం నిర్వహించారు. 293 జంటలను ఆహ్వానించి వారిలో కొంతమందిని కండోమ్‌లతోనూ, మరికొంత మందిని కండోమ్స్‌ లేకుండానూ శృంగారంలో పాల్గొనాలని సూచించారు. నెల రోజుల పాటు తాము సూచించిన విధంగా సెక్స్‌ చేయమన్నారు. అనంతరం కండోమ్‌ లేకుండా సెక్స్‌ చేసిన వారితో పోల్చుకుంటే.. కండోమ్‌తో సెక్స్‌లో పాల్గొన్నవారిలోనే డిప్రెషన్‌ తాలూకు లక్షణాలు ఎక్కువగా కనబడ్డాయట.

  ఒత్తిడిని నివారిస్తుంది

  ఒత్తిడిని నివారిస్తుంది

  సెమెన్‌ (వీర్యం)కు డిప్రెషన్‌ సింప్టమ్స్‌ను ప్రతిఘటించే శక్తి ఉంది. వీర్యంలో ఉండే పోషకాలను శోషించుకునే శక్తి స్త్రీ జననాంగానికి ఎక్కువగా ఉంటుంది. అవి రక్త ప్రవాహంలో కలిసి డిప్రెషన్‌పై దాడి చేస్తాయని పరిశోధకులు తెలిపారు. అయితే కండోమ్‌ లేకుండా సెక్స్‌లో పాల్గొనాలని చెప్పడం తమ ఉద్దేశం కాదని, వీర్యం వల్ల కలిగే లాభాలను చెప్పడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. వీర్యం పిల్లల్ని పుట్టించడానికే కాకుండా అందానికి, ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి ఇలా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది.

  English summary

  Eight things you didn’t know you could do with human sperm

  Eight things you didn’t know you could do with human sperm
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more