For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మందారం మగవారి వీర్యశక్తిని పెంచడంలో బంగారం, మందారంతో చాలా ప్రయోజనాలు

వీర్య కణాల సమస్యతో బాధపడేవారు ఈ మందార పొడిని రెండు స్పూన్లు నోట్లో వేసుకుని గ్లాసు పాలు తాగడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. మందార ఆకు, మందారం పువ్వు, మందారం, మందారం వీర్యం.

|

మందారం పూలు గురించి పాఠశాల పుస్తకాల్లో చదివే ఉంటారు. ఇది కేవలం చూడటానికి అందంగానే కాకుండా మనిషి ఆరోగ్యానికి కూడా ఉపయోగపుడుతుంది. దీనిని హైబిస్కస్ అని కూడా అంటారు. దీనిని ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటారు. అలాగే మందులుగా కూడా ఉపయోగించొచ్చు, దీంతో మనిషి ఆరోగ్యంగా వుంటాడంటున్నారు ఆరోగ్య నిపుణులు.

యూనాని మందులలో

యూనాని మందులలో

ముఖ్యంగా యూనాని మందులలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీంతో శరీరంలోని కొలెస్ట్రాల్, మధుమేహం, రక్తపోటు, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధి, గొంతుకు సంబంధించిన వ్యాధులు తదితర జబ్బులకు మంచి ఔషధంలా పనిచేస్తుందంటున్నారు వైద్యులు.

శరీరం ఆరోగ్యంగా ఉంటుంది

శరీరం ఆరోగ్యంగా ఉంటుంది

ఇందులో విటమిన్ సి, క్యాల్షియం, పీచుపదార్థం (ఫైబర్), ఐరన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, టెటరిక్, ఆక్సీలిక్ యాసిడ్, ఫ్లేవోనైడ్ గ్లైకోసైడ్స్ తగు మోతాదులో లభిస్తాయి. వీటివలన శరీరం ఆరోగ్యంగా ఉంటుందంటున్నారు వైద్యులు.

హైబిస్కస్ హెర్బల్ టీ

హైబిస్కస్ హెర్బల్ టీ

మందారపువ్వును హెర్బల్ టీ, కాక్టేల్ రూపాలలోను సేవించవచ్చు. పూలను ఎండబెట్టి హెర్బల్ టీగా తీసుకోవచ్చు. దీనిని ఎలా తయారు చేయాలంటే... నీటిని ఉడకబెట్టిన తర్వాత ఎండిన మందార పువ్వులను అందులో వేయండి. అందులో చక్కెర, కాస్త టీపొడి కలుపుకుని టీలాగా తయారు చేసుకోండి. దీంతో హైబిస్కస్ హెర్బల్ టీ తయారవుతుంది. ప్రతి రోజు దీనిని సేవిస్తుంటే ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు వైద్యులు.

కాక్టేల్ టీ

కాక్టేల్ టీ

అలాగే కాక్టేల్ టీ కొరకు దీనిని చల్లగా చేసి అందులో కొన్ని ఐసు ముక్కలు వేసుకుని తాగితే అదే కాక్టేల్ టీ. ఇలా ప్రతి రోజు తీసుకుటుంటే ఆరోగ్యంగా ఉంటారంటున్నారు ఆరోగ్య నిపుణులు. కేశ సౌందర్యానికి సహజసిధ్ధంగా మేలుచేసే ఔషధం మందారం. మందారం పవిత్ర ఆచార పూజా కార్యక్రమాలలో వాడటం జరుగుతుంది. అంతేకాక మందారం చేసే మేలులెన్నో ఉన్నాయి.

జుట్టుకు కండిషనర్

జుట్టుకు కండిషనర్

మందార ఆకులు, పువ్వు రేకులను పేస్ట్ చేసి జుట్టుకు ఒక సహజ కండీషనర్ వలె ఉపయోగిస్తారు. జుట్టు ముదురు రంగులో మారటానికి మరియు చుండ్రు తగ్గించడానికి సహాయపడుతుంది.

చర్మ సంరక్షణ

చర్మ సంరక్షణ

దీనిలో కాస్మెటిక్ చర్మ సంరక్షణకు ఉపయోగించే గుణాలను కలిగి ఉంది. ముడుతలు వంటి అనేక చర్మ పరిస్థితులకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.

కిడ్నీ సమస్యలు

కిడ్నీ సమస్యలు

వివిధ దేశాలలో మందార ఆకులతో తయారు చేసిన టీ ని ఔషధ ప్రయోజనాల కొరకు వినియోగిస్తున్నారు. కిడ్నీ సమస్యలు ఉన్నవారికి సహజ మూత్రవిసర్జన ప్రేరకంగా సహాయం కొరకు చక్కెర లేకుండా వినియోగిస్తారు.

రక్తపోటు తగ్గించడానికి

రక్తపోటు తగ్గించడానికి

రక్తపోటును తగ్గించటానికి సహాయం కొన్ని అధ్యయనాల ప్రకారం అధిక రక్తపోటుతో బాధపడుతున్న అనేకమంది ప్రజలు మందార ఆకు టీ సేవించడం వలన రక్తపోటు తగ్గిందని నిరూపించటం జరిగింది. అందువల్ల దీనిని రక్తపోటు తగ్గించడానికి సాధారణ ఆహార వినియోగం కొరకు సిఫార్సు చేయబడింది.

గాయాల చికిత్సకు

గాయాల చికిత్సకు

గాయాల చికిత్సకు మందార నూనె బాగా ఉపయోగపడుతుంది. ఓపెన్ గాయాలు, క్యాన్సర్ కారణంగా వచ్చే గాయాలకు రాయటం కొరకు దీన్ని ఉపయోగిస్తారు.ఇది క్యాన్సర్ ప్రారంభ దశల్లో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఓపెన్ గాయాలను వేగంగా నయం చేయటంలో సహాయపడుతుంది.

కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో

కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో

మందార ఆకు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. దాని కంటెంట్ ధమనుల లోపలి భాగంలో పొరలు ఏర్పడకుండా నివారించడంలో సహాయపడుతుంది. తద్వారా మీ కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.

జలుబు, దగ్గు నివారణకు

జలుబు, దగ్గు నివారణకు

మందార ఆకులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. మందార ఆకు టీ, ఇతర పదార్దాల రూపంలో సేవించటం వలన రోగనిరోధక శక్తి పెరిగి తద్వారా జలుబు, దగ్గు తగ్గటానికి సహాయపడుతుంది. మీకు జలుబు చాల త్వరగా తగ్గటానికి సహాయపడుతుంది.

బరువు తగ్గటానికి

బరువు తగ్గటానికి

బరువు క్షీణత, జీర్ణక్రియ సహజ ఆకలిని తగ్గించి పథ్యసంబంధమైన బరువు తగ్గటానికి సహాయం చేస్తుంది. మందార ఆకు టీ తాగటం వలన మీ శరీరంలో అనవసరమైన కొవ్వు తగ్గుతుంది. అంతేకాక ఆహార జీర్ణక్రియకు మరింత సమర్ధవంతంగా సహాయపడుతుంది.

యాంటీ వృద్ధాప్యం

యాంటీ వృద్ధాప్యం

మందార ఆకులలో అనేక యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. మీ శరీరంలో ఫ్రీ రాడికల్స్ తొలగించటానికి సహాయం చేయుట వలన వృద్ధాప్య ప్రక్రియ మందగిస్తుంది. అంతేకాక కొన్ని సందర్భాలలో జీవితం కొనసాగింపు జరుగుతుంది.

ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గించడంలో

ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గించడంలో

రెగ్యులర్ ఋతు చక్రం మందార ఆకు టీ రెగ్యులర్ గా వినియోగించుట వలన శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గించడంలో మహిళలకు సహాయపడుతుంది.శరీరంలో సరైన ఋతు చక్రం నియంత్రించటంలో సహాయం, సమతుల్య హార్మోన్ల స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది.

వీర్యకణాల సంఖ్య పెంచడానికి

వీర్యకణాల సంఖ్య పెంచడానికి

మందారాలను బాగా ఎండబెట్టి మెత్తని పొడిలా చేయాలి. ఈ పొడి ఆయుర్వేద షాపుల్లో కూడా దొరుకుతుంది. వీర్య కణాల సమస్యతో బాధపడేవారు ఈ మందార పొడిని రెండు స్పూన్లు నోట్లో వేసుకుని గ్లాసు పాలు తాగడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. ఇలా క్రమం తప్పకుండా నలబై రోజుల పాటు తీసుకుంటే వీర్యకణాల సంఖ్య పెరిగి ఆరోగ్యవంతమైన సంతానాన్ని పొందవచ్చు.

English summary

hibiscus an amazing herb for men

hibiscus an amazing herb for men
Desktop Bottom Promotion