For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హాంగోవర్ తగ్గించుకోవడానికి గల ఉత్తమ మార్గాలు

|

ఒక్కోసారి భీకరమైన తలనొప్పితో నిద్రలేవడం జరుగుతుంటుంది. అంతేకాకుండా నోటిలో భరించలేని దుర్వాసన కూడుకుని, నోటిలో ఏదో చచ్చిపడి ఉన్న అనుభూతికి లోనవడం జరుగుతుంటుంది. ఒకరకంగా చెప్పాలంటే, దీనినే హాంగోవర్ అంటారు.

అంతేకాకుండా, అనియంత్రిత ధోరణితో ప్రతి 10-15 నిమిషాల వ్యవధిలో మలమూత్రవిసర్జనగావించడం లేదా సెన్సేషన్ లోనవడం మరియు కడుపులో విషతుల్యాలు పేర్కొన్న అనుభూతికి గురవడం వంటి దుర్భర పరిస్తితులను తరచూ ఎదుర్కోవడం కూడా జరుగుతుంటుంది. మీరు కూడా ఈ పరిస్థితులకు గురవుతున్నారా?

How to Get Rid of a Hangover: The Ultimate Guide

అయితే ఒకరకంగా ఈ పేజీలోకి అడుగుపెట్టడం మీ అదృష్టమనే చెప్పాలి. ఇటువంటి దుర్భర పరిస్థితులకు ప్రధాన కారణంగా ఉండే, హాంగోవర్ సమస్యను దూరంచేసేందుకు ఈవ్యాసం మీకు ఎంతగానో ఉపకరిస్తుందని చెప్పగలం.

ఈవ్యాసంలో హాంగోవర్ దూరంచేసే క్రమంలో ఆచరించదగిన గృహచిట్కాలు, లేదా సులువుగా కిరాణా దుకాణాలలో దొరికే సామాగ్రితోనే పాటించగల పద్దతులను పొందుపరచడం జరిగింది.

ఒకవేళ మీరు తరచుగా హాంగోవర్ గురవుతున్నట్లైతే, మరోసారి సమస్యతో పోరాడేందుకు ఆయుధాలను సిద్దంచేసుకోండి మరి.

# 1 అధికంగా నీటిని తీసుకోండి :

# 1 అధికంగా నీటిని తీసుకోండి :

ఇదేముందిలే అని తేలికగా కొట్టేయకండి. హాంగోవర్ సమస్యకు ఉత్తమ నివారణగా ఈ చిట్కా ఉంటుంది. మద్యం మీ శరీరాన్ని బలహీనపరుస్తుంది, క్రమంగా శరీరంలోని జీవక్రియలు తగ్గడం విషపదార్ధాలు పేర్కొనిపోవడం, వంటి సమస్యలు అధికమవుతాయి. ఇటువంటి అనేక కారకాల పర్యావసానంగానే ఈ హాంగోవర్ సమస్య తలెత్తుతుంది.

నీటిని అధికంగా తీసుకోవడం మూలంగా శరీరంలో పేరుకొన్న ఈ విషతుల్య పదార్ధాలను విసర్జించడంలో ఉత్తమంగా సహాయపడుతుంది. క్రమంగా మీ తలనొప్పి కొన్ని గంటలలోనే తగ్గుముఖం పట్టడం గమనించవచ్చు.

# 2 అరటి పండును తినండి :

# 2 అరటి పండును తినండి :

ఆల్కహాల్ కేవలం మీ శరీరాన్ని నిర్జలీకరణం చేయడమే కాకుండా మీ కాలేయంలో ఎలేక్ట్రోలైట్లను కూడా తగ్గిస్తుంది. వాస్తవానికి కాలేయానికి, వ్యర్ధాలను వడపోసి విసర్జించడంలో ఎలక్ట్రోలైట్స్ సహాయం చేస్తాయి. కావున మద్యం కారణంగా కోల్పోయిన వీటిని, అరటి పండు ద్వారా అందించండి.

కేవలం నీరు మాత్రమే కాకుండా, అరటి పండు తీసుకోవడానికి గల మరొక కారణం అందులోని పొటాషియం నిల్వలు కూడా.

# 3 కొబ్బరినీటిని తాగడం:

# 3 కొబ్బరినీటిని తాగడం:

ఇక్కడ మేము, దేవుడికి తరచుగా ఉపయోగించే గోధుమ వర్ణపు టెంకాయని సూచించడం లేదు. కొబ్బరి నీళ్ళు అంటే కొబ్బరి బోండాలను వినియోగించమని అర్ధం.

ఎందుకనగా ఈ తాజా కొబ్బరి నీళ్ళలో అధిక మొత్తాలలో ఎలక్ట్రోలైట్స్ మరియు మెగ్నీషియం నిల్వలు ఉంటాయి. ఇది హ్యాంగోవర్ నివారణలో, నీళ్ళు + అరటి పండుకు పరిపూర్ణ ప్రత్యామ్నాయంగా ఉంటుంది.

# 4 నిమ్మరసం తీసుకోవడం :

# 4 నిమ్మరసం తీసుకోవడం :

నిమ్మరసం మీ కాలేయం నుండి విషాన్ని వేరుచేయడానికి సూచించదగిన ఉత్తమమైన పదార్ధంగా ఉంటుంది. కావున తరచుగా హాంగోవర్ సమస్యలకు గురవుతున్నవారు, తమ ప్రిడ్జిలో నిమ్మకాయలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవలసి ఉంటుంది. ఎప్పుడైనా అటువంటి కిల్లర్ హాంగోవర్ సమస్యకు గురైనప్పుడు, ఒక గ్లాసుడు నీళ్ళను తీసుకుని గోరు వెచ్చగా వేడిచేసి, అందులో సగం నిమ్మకాయను పిండి, చిటికెడు ఉప్పు, ఒక టీ స్పూన్ తేనెను కలిపి తీసుకోవడం ద్వారా, అది ఉత్తమ డిటాక్స్ వలె పనిచేస్తుందని చెప్పబడింది.

# 5 అల్లం టీ లేదా జింజర్ ఆలే తీసుకోండి :

# 5 అల్లం టీ లేదా జింజర్ ఆలే తీసుకోండి :

అల్లం, వికారం నుండి ఉపశమనం అందించగలిగే ఉత్తమ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా, వాంతి కలుగుతున్న అనుభూతిని, క్రమంగా తలనొప్పిని కూడా దూరం చేయగలదు.

దీనికి మీరు చేయవలసినదల్లా, మీరు తీసుకునే టీ లలో కొంచెం తురిమిన అల్లాన్ని జోడించడమే. కొందరైతే ఏకంగా అల్లం రసాన్ని కలుపుకుని స్వీకరిస్తారు.

ఒకవేళ మీకు టీ అలవాటు లేని ఎడల, నారింజ రసం లేదా లెమనాయిడ్లలో జోడించి జింజర్ ఆలె తయారుచేసుకుని స్వీకరించవచ్చు.

# 6 పాక్షిక ఘన ఆహారాన్ని రోజు మొత్తం స్వీకరించండి :

# 6 పాక్షిక ఘన ఆహారాన్ని రోజు మొత్తం స్వీకరించండి :

మద్యం మీ కడుపు, మరియు కాలేయ విధులకు ఆటంకాన్ని కలిగిస్తుంది. తిరిగి జీవక్రియలను పూర్తిస్థాయిలో సంతరించుకునేలా ఆహార ప్రణాళికలో జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. క్రమంగా సూప్స్, గంజి, జావ, ఓట్స్ వంటి పదార్ధాలను తీసుకోవలసినదిగా సిఫార్సు చేస్తున్నాము.

ఎందుకనగా, అధిక మద్యపానం స్వీకరించిన తర్వాత రోజు, మీ శరీరంలోని శక్తి మొత్తం కాలేయానికి మళ్ళించే ప్రయత్నం చేస్తుంది. క్రమంగా తిరిగి జీవక్రియలు పునరుద్దరించేలా చర్యలు తీసుకుంటుంది. కానీ, అధికంగా లేదా ఘన ఆహారాన్ని తరచుగా తీసుకోవడం మూలంగా ఆహారాన్ని జీర్ణం చేయడానికి కూడా అధిక శక్తి అవసరమవుతుంది. కావున వీలైనంత తక్కువగా, పైన చెప్పినట్లు పాక్షిక ఘన ఆహార పదార్ధాలను స్వీకరించేలా చర్యలు తీసుకోవలసి ఉంటుంది.

#7 టమోటా రసం లేదా సూప్ :

#7 టమోటా రసం లేదా సూప్ :

నిమ్మకాయ వలెనే, టమోటా కూడా మీ శరీరం నుండి విషాన్ని బయటకు తీయడంలో సహాయపడే డీటాక్స్ లక్షణాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, అధిక మోతాదులో విటమిన్ సి కలిగి ఉంటుంది.

కావున టమోటా సూప్ లేదా జ్యూస్ తీసుకోవడం కూడా ఉత్తమ నివారణా చర్యలలో ఒకటిగా ఉండగలదని చెప్పబడింది.ప్రత్యామ్నాయంగా, దీనిలో నిమ్మరసం, పుదీనా ఆకులు, కొన్ని తాజా టమోటాలు మరియు కొద్దిగా ఉప్పుకలిపి, బ్లెండర్లో జ్యూస్ వలె చేయవచ్చు. ఈ పానీయాన్ని రోజులో అప్పుడప్పుడు తీసుకోవడం ద్వారా ఎంతో మేలు చేకూరుతుంది.

అంతేకాకుండా, అనవసర సంభాషణలు, మీడియా మొదలైన వాటికి కొంత దూరంగా ఉండేలా ప్రయత్నించండి.

# 8 పండు మరియు కూరగాయలతో కూడిన స్మూతీ :

# 8 పండు మరియు కూరగాయలతో కూడిన స్మూతీ :

మీ హ్యాంగోవర్ వదిలించుకోవడానికి సూచించదగిన మరొక గొప్ప మార్గంగా స్మూతీ ఉంటుంది. కూరగాయలు లేదా పండ్లలో ఒకదాన్ని ఎంచుకుని ముక్కలుగా కోసి బ్లెండ్ చేసి, తీసుకోండి. పండ్ల రసం కూడా సహాయం చేస్తుంది, అయినా బ్లెండ్ చేసి స్మూతీలా తీసుకోవడం మరికొంత ఎక్కువ ప్రయోజనాన్ని అందిస్తుంది.

క్రమంగా మీరు మీ శరీరానికి ఎంతో అవసరమైన ఎలెక్ట్రోలైట్స్, ఫైబర్ మరియు నీటిని పూర్తిస్థాయిలో అందివ్వగలుగుతారు.

# 9 మీరు మద్యం స్వీకరించే ముందు, ఎక్కువ భోజనం చేయండి :

# 9 మీరు మద్యం స్వీకరించే ముందు, ఎక్కువ భోజనం చేయండి :

నిజానికి హాంగోవర్ తగ్గించడానికి సూచించదగిన మార్గం ఇది కాదు, మేము కూడా అంగీకరిస్తున్నాము. కానీ, హ్యాంగోవర్ తీవ్రతను నివారించడానికి ఈ పరిహారం వెనుకగల సూత్రం బలమైనదిగా ఉంటుంది.

మీరు ఒక పెద్ద భోజనం తీసుకున్న ఎడల, ముఖ్యంగా అధిక ప్రోటీన్లతో కూడిన ఆహారాన్ని తీసుకున్న పక్షంలో, ఇది మీ జీర్ణ ప్రక్రియను నెమ్మదిస్తుంది. క్రమంగా మీరు ఆల్కహాల్ తీసుకునేటప్పుడు, మీ రక్తంలో ఆల్కహాల్ అధికంగా చేరడం నివారించబడుతుంది. హ్యాంగోవర్ యొక్క తీవ్ర ప్రభావాల నుండి మిమ్మల్ని రక్షించే చిట్కాగా ఉండగలదు. అంతేకాకుండా, మీరు కడుపు నిండిన అనుభూతికి లోనవడం కారణంగా, అధికంగా ఆల్కహాల్ తీసుకోకుండా కూడా నివారించగలుగుతుంది,

#10 మద్యం త్రాగడానికి కొన్ని గంటల ముందు ప్రిక్లీ పియర్ తీసుకోండి :

#10 మద్యం త్రాగడానికి కొన్ని గంటల ముందు ప్రిక్లీ పియర్ తీసుకోండి :

ఇది కూడా నివారణ ఉపాయమైతే కాదు కాని, ముందు చిట్కా వలనే ముందు జాగ్రత్త చర్యగా ఉంటుంది. ఇది అద్భుతంగా పనిచేస్తుంది కూడా.

వాస్తవానికి, ప్రిక్లీ పియర్ కాక్టస్ యొక్క సారాన్ని తీసుకోవడం ద్వారా, మద్యం వలన కలిగే వాపును తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుందని చెప్పబడింది. అంతేకాకుండా, హాంగోవర్ యొక్క ప్రభావాన్ని తగ్గించడం లేదా పూర్తిగా నిరోధించేలా చేయడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుందని అధ్యయనాల్లో నిరూపించబడినది కూడా.

# 11 క్లియర్ ఆల్కహాల్ తీసుకోండి :

# 11 క్లియర్ ఆల్కహాల్ తీసుకోండి :

డార్క్ ఆల్కహాల్స్ అయిన రెగ్యులర్ రమ్, విస్కీ మరియు టకీలా వంటి వాటిని, క్లియర్ ఆల్కహాల్స్ అయిన వోడ్కా, జిన్ మరియు వైట్ రమ్ వంటి వాటితో పోల్చి చూసినప్పుడు అధిక ప్రభావాలను చూపుతుంటాయి.

కావున, మీకు విస్కీ అలవాటు ఉంటే, బాడ్ లక్ అనే చెప్పాలి. జిన్, టానిక్ వంటివి తీసుకునే మీ స్నేహితుడు హాంగోవర్ సమస్యలకు పెద్దగా ప్రభావం కాకపోవడాన్ని మీరు గమనించవచ్చు కూడా.

# 12 మద్యపానం స్వీకరించేటప్పుడు, ధూమపానానికి దూరంగా ఉండండి :

# 12 మద్యపానం స్వీకరించేటప్పుడు, ధూమపానానికి దూరంగా ఉండండి :

ఏదైనా ఒక ఫ్రైడే నైట్ మీరు పబ్ వెళ్ళినప్పుడు, ఆక్సిజన్ స్థాయిలు గణనీయంగా పడిపోవడం మీరు గమనించవచ్చు. దీనికి కారణం, మీరు పరోక్ష ధూమపానానికి (పాసివ్ స్మోకింగ్) గురవడమే. దురదృష్టవశాత్తు, ఈ పరోక్ష ధూమపానం మీ హ్యాంగోవర్లను కూడా కొంత మేరకు ప్రభావితం చేస్తుంది. అదే నేరుగా ప్రత్యక్ష ధూమపానాన్ని అనుసరిస్తే, ఇక చెప్పనవసరం లేదు. హాంగోవర్ తీవ్రత, దాని విశ్వరూపాన్ని చూపిస్తుంది.

దీనికి ప్రధాన కారణం ధూమపానం మీ నిద్రాభంగానికి కారకంగా ఉంటుంది. అంతేకాకుండా మెదడులో ఒత్తిడి స్థాయిలను పెంచుతుంది.

ఇటువంటి హాంగోవర్ల కు గురైనప్పుడు తరచుగా ఆస్ప్రిన్ వంటివాటికి అలవాటు పడుతూ ఉంటారు. పర్యవసానంగా అనేక ఇతర దుష్ప్రభావాల బారిన పడడం కూడా పరిపాటిగా ఉంటుంది. కావున, వీలైనంత వరకు పైనచెప్పిన సహజ సిద్దమైన చిట్కాలను, రెమిడీలను అనుసరిస్తూ హాంగోవర్లను తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఏదిఏమైనా శరీరానికి ఏమాత్రం ఉపయోగపడని పదార్ధం ఆల్కహాల్. దీనిని అదిపనిగా ఎక్కించి మరీ మనకు మనమే శరీరాన్ని నాశనం చేసుకోవడం సరికాదు. కావున మద్యపానానికి వీలైనంత దూరంగా ఉండడం లేదా, తగ్గించడం మంచిది. మద్యపానం అధికమైతే, క్రమంగా జీవక్రియలు మందగించి అనేక ఇతర ఆరోగ్య పరిస్థితులకు దారితీసి ప్రాణాంతకంగా కూడా మారవచ్చునని మనకు తెలియనిదికాదు.

English summary

How to Get Rid of a Hangover: The Ultimate Guide

Lucky for you, you landed on this page. And though we don't know if it was because of divine intervention or just some article-ninja tactics, we do know that this article can help you get rid of your hangover with some easy remedies right from the comfort of your home (or the closest grocery store).So read on (if you are even reading the introduction) and get ready to beat back your hangover with these solid remedies.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more