Latest Updates
-
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో డయాబెటిస్ బాధితులకు ఇన్ఫెక్షన్ ముప్పు మరింత తీవ్రం.. కారణాలివే.! -
పచ్చి కొబ్బరి మసాలాతో అదిరిపోయే కర్ణాటక స్పెషల్ చిత్రాన్నం.. ఒక్కసారైనా రుచి చూడాల్సిందే.! -
గురు గ్రహం నక్షత్ర మార్పు: ఈ నాలుగు రాశుల వారికి చదువు, ఉద్యోగాల్లో మహర్దశ ప్రారంభం.! -
ఇంట్లోకి గబ్బిలం వస్తే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
చికెన్ కర్రీలోకి అదిరిపోయే కాంబినేషన్.. కేరళ మలబార్ పరోటా ఇలా చేస్తే పొరలు పొరలుగా వస్తుంది! -
అల్లం, పచ్చిమిర్చి ఘాటుతో కరకరలాడే పంచ్ మెల్ దాల్ పకోడా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు!
రోజూ బెల్లం ముక్క తింటే ఆ ఇబ్బందులేమీ ఉండవు, బెల్లం ఉపయోగాలు ఇవే, ఆ సమయంలో నొప్పి తగ్గించలగలదు
కొందరు ఐరన్ లోపంతో బాధపడుతుంటారు. అలాంటి వారు తరుచూ బెల్లం తీసుకోవడం మంచిది. రక్తం ఉత్పత్తి చేయడంలో కూడా బెల్లం బాగా పని చేస్తుంది. ఎర్రరక్త కణాలు తక్కువగా ఉంటే రోజూ బెల్లం తినండి.
చాలా మంది టీ, కాఫీలో పంచదారనే ఉపయోగిస్తారు. చాలా స్వీట్స్ తయారు చేయడానికి చక్కెరనే వాడుతారు. కానీ కొన్ని పదార్థాలను చక్కెర ప్లేస్ లో బెల్లం ఉపయోగించి చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.
అయితే బెల్లం అందరికీ ఇష్టం ఉండకపోవొచ్చు. కానీ బెల్లం వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి కాబట్టి దాన్ని అప్పుడప్పుడైనా తింటే మంచిది. రోజూ అన్నం తిన్న తర్వాత బెల్లం తింటే జీర్ణశక్తి బాగా పెరుగుతుంది.

శుద్దిపడాలంటే
శ్వాసనాళాలు, ఇతర నాళాలు శుద్దిపడాలంటే కూడా బెల్లం కచ్చితంగా తినాలి. రక్త ప్రసరణ కూడా మెరగవుతుంది. బెల్లం తింటే మీలోని నెగెటివ్ ఎనర్జీ బయటకు వెళ్తుంది. దగ్గు, జలుబును కూడా బెల్లం ఈజీగా దూరం చేయగలదు.

అనారోగ్యం బారిన పడతాం
చక్కెర ఎక్కువగా వాడితే చాలా అనారోగ్యం బారిన పడతాం. కానీ బెల్లం వల్ల ఎలాంటి అనారోగ్యాలు దరి చేరవు. శరీరంలోని మలినాలు మొత్తం బయటకు వెళ్లేలా చేయగల శక్తి బెల్లానికి ఉంటుంది. ఆర్గానిక్ బెల్లం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

కార్బోహైడ్రేట్స్ బాగా ఎక్కువ
బెల్లంలో కార్బోహైడ్రేట్స్ కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. దీంతో తక్షణ శక్తి లభిస్తుంది. మీరు బాగా ఎక్కువగా తిన్నారనుకో కాస్త బెల్లం ముక్కను నోట్లో వేసుకోండి చాలు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది.

ఐరన్ లోపంతో
కొందరు ఐరన్ లోపంతో బాధపడుతుంటారు. అలాంటి వారు తరుచూ బెల్లం తీసుకోవడం మంచిది. రక్తం ఉత్పత్తి చేయడంలో కూడా బెల్లం బాగా పని చేస్తుంది. ఎర్రరక్త కణాలు తక్కువగా ఉంటే రోజూ బెల్లం తినండి.

మచ్చలు తగ్గేందుకు
మొటిమలు రాకుండా ఉండేందుకు ముఖంపై మచ్చలు తగ్గేందుకు బెల్లం ఉపయోగపడుతుంది. చర్మానికి మంచి నిగారింపు వచ్చేలా బెల్లం సహాయపడుతుంది.

మినరల్స్
ఆడవారు రుతుక్రమ సమస్యలతో ఇబ్బందులుపడుతుంటారు. అయితే బెల్లంలో ఉండే మినరల్స్ మహిళలు రుతుక్రమం సమయంలో ఇబ్బందులుపడకుండా చేయగలవు. ఆ సమయంలో వచ్చే నొప్పిని బెల్లం తగ్గించగలదు.



Click it and Unblock the Notifications
