For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిగుళ్ళ సమస్యను తొలగించగలిగే సహజ సిద్దమైన పరిష్కారాలు ఇవే !

|

చిగుళ్ళ పరిణామం తగ్గడం కూడా పీరియోడోంటిటిస్ (చిగుళ్ళ వ్యాధి లేదా గం-డిసీజ్) సమస్యకు సంకేతంగా ఉండగలదు :

వాస్తవానికి అనేకమంది, చిగుళ్ళకు సంబంధించిన అవగాహన కలిగి ఉండని కారణంగా, వాటి పట్ల అశ్రద్దతో ఉంటారు. క్రమంగా సమస్య జఠిలం అయితే తప్ప గుర్తించని పరిస్థితి నెలకొంటుంది. దంతాల పొడవులో అసమానతలు అనేవి గమనించదగిన మొట్టమొదటి సూచనగా ఉంటుంది.(రూట్ ఎక్స్పోజర్ కారణంగా).

ఒకవేళ మీరు ఈ సమస్యను ఎదుర్కొంటున్న ఎడల, ఈవ్యాసం మీకు ఎంతగానో సహాయం చేయగలదు. ఎందుకంటే ఈవ్యాసంలో చిగుళ్ళ సమస్యను పరిష్కరించగల సహజసిద్దమైన ఔషధాలు మరియు చిట్కాల జాబితాను పొందుబరచబడినవి. ఇవి సులువుగా ఆచరించదగినవిగానూ మరియు అద్భుతమైన ప్రయోజనాలను అందించేవిగాను ఉంటాయి.

Check These Out! 13 Natural Remedies for Receding Gums

గమనిక : మీరు తీవ్రమైన పరిస్థితులలో ఉన్న ఎడల గృహనివారణా చిట్కాల కన్నా, దంతవైద్యుని సంప్రదించడమే వందరెట్లు మేలు. ఈ గృహనివారణా చిట్కాలు, సమస్య ప్రారంభదశలో ఉన్నప్పుడు ఉపశమనానికి, మరియు తగ్గుదలకు సహకరించగలవు. పరిస్థితి తీవ్రతను బట్టి, వైద్యాన్ని అనుసరించాలని మనందరికీ తెలియనిది కాదు.

#1 విటమిన్-సి తీసుకోవడం పెంచండి:

#1 విటమిన్-సి తీసుకోవడం పెంచండి:

మీ చిగుళ్ళ ఆరోగ్యాన్ని కాపాడటానికి విటమిన్-సి ముఖ్యమైనదిగా చెప్పబడుతుంది.

స్కర్వీ(విటమిన్-సి యొక్క లోపం) సమస్యను, నావికుల వ్యాధిగా పిలువడం జరుగుతుంది. ఎందుకంటే నావికులు తరచుగా, మరియు అధిక సమయాలలో సముద్రాలలో ఉంటారు. క్రమంగా వీరు విటమిన్-సి ని పొందడం తక్కువగా ఉంటుంది.

కావున మీరు ఈ చిగుళ్ళ సమస్యలో చిక్కుకున్నట్లయితే, మొట్టమొదటగా ఆచరించాల్సిన అంశం, మీ ఆహారంలో విటమిన్-సి ని పెంచడం. క్రమంగా, నారింజ, నిమ్మకాయలు మరియు బ్రోకలీ వంటి సిట్రస్ పండ్లు మరియు కూరగాయలు తీసుకోవడం, లేదా విటమిన్-సి సప్లిమెంట్స్ తీసుకోవడం మంచిదిగా సూచించబడుతుంది.

# 2 గ్రీన్-టీ తీసుకోండి:

# 2 గ్రీన్-టీ తీసుకోండి:

జపనీయుల పరిశోధకుల బృందం, మౌఖిక ఆరోగ్యం పట్ల గ్రీన్-టీ చూపే ప్రభావాల మీద అధ్యయనం చేసినపుడు, కొన్నివారాల పాటు క్రమంతప్పకుండా రోజూవారీ జీవనవిధానంలో భాగంగా ఒక కప్పు గ్రీన్-టీ తీసుకోవడం మూలంగా, పీరియోడోంటిటిస్ సమస్యను కూకటివేళ్ళతో సహా తొలగించి, దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపర్చగల సామర్థ్యం కలిగి ఉన్నదని తేల్చింది.

# 3 తరచుగా ప్లాసింగ్ చేయండి:

# 3 తరచుగా ప్లాసింగ్ చేయండి:

సమయానుసారం, కనీసం వారంలో రెండుమార్లు దంతాలను ఫ్లాసింగ్ చేయడం, ఎంతో సురక్షితం. క్రమంగా అభివృద్ధి చెందుతున్న బాక్టీరియా ఫలకాన్ని తొలగించడంలో మాత్రమే కాకుండా, చిగుళ్ళ సమస్య తలెత్తకుండా కూడా సహాయం చేయగలదు.

హానికరమైన నోటి బ్యాక్టీరియా ఫలకం, మరియు టార్టర్ హార్బర్స్, మీ చిగుళ్ళలో, ప్రతిచర్యలను కలిగించి గం-డిసీజ్ తలెత్తడానికి కారకాలుగా ఉంటాయి. తరచుగా ఫ్లాసింగ్ చేయడం ద్వారా(ముందు జాగ్రత్తగా) ఈ సమస్య తలెత్తకుండా చూసుకోవచ్చు. అంతేకాకుండా, ఇదివరకే సమస్య ఉన్న ఎడల ఉపశమనం కలిగించడంలో కూడా ఎంతగానో సహాయం చేస్తుంది. ఇంటర్నెట్లో ఫ్లాసింగ్ చేసే విధానాల గురించిన వీడియోలు అందుబాటులో ఉంటాయి.

Most Read: తాళి కట్టేటప్పుడు ఒక్కరూపాయి తక్కువైనా కట్టలేదు, శోభనం రోజు కక్కుర్తిపడుతూ నా మీదపడ్డాడు

# 4 ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండేలా ఆహార పదార్ధాలను తీసుకోండి:

# 4 ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండేలా ఆహార పదార్ధాలను తీసుకోండి:

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే, చేపలు, మాంసం, వాల్నట్, సోయాబీన్స్, మరియు గుడ్లను ఆహార ప్రణాళికలో భాగంగా తరచుగా తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇది మీ చిగుళ్ళను సంరక్షించడంలో సహాయం చేయగల లక్షణాలను కలిగి ఉంటాయి. అంతేకాకుండా, చిగుళ్ళ కుదింపును సైతం అడ్డుకుంటుంది.

వాస్తవానికి, ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్లను 3 వారాలపాటు రోజువారీ ప్రణాళికలో భాగంగా కనీసం 300 mg కలిగి ఉండటం ద్వారా, మీ చిగుళ్ళ ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తుందని ఒక అధ్యయనంలో నిరూపించబడింది కూడా.

# 5 ఆయిల్ పుల్లింగ్ :

# 5 ఆయిల్ పుల్లింగ్ :

ఆయిల్ పుల్లింగ్ అనేది చిగుళ్ళ సమస్యను తొలగించడానికి సూచించదగిన ఉత్తమ ఆయుర్వేద పరిష్కారంగా చెప్పవచ్చు. మరియు మీ దంతాలను ఫ్లాసింగ్ చేయడంలో సహాయపడడమే కాకుండా, దంత సంరక్షణకు మెరుగైన ఫలితాలను కలిగి ఉంటుంది.

ఆయిల్ పుల్లింగ్ కోసం కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెను ఉపయోగించడం జరుగుతుంది. ఈ నూనెలలో ఒకదాన్ని ఎంచుకుని, నోటిలోకి తీసుకుని 10 నుండి 20 నిముషాల వరకు పుక్కిలించి, ఆపై ఉమ్మివేయండి. కానీ, పొరపాటుగా కూడా మింగరాదని గుర్తుంచుకోండి.

ప్రతిరోజూ క్రమపద్దతిలో అనుసరించడం మూలంగా, మీరు మీ చిగుళ్ళ సమస్యను నెమ్మదిగా దూరం చేసుకోవచ్చు. మరియు మీ నోటిలో అభివృద్ధి చెందుతున్న కావిటీస్ సమస్యను, దుర్వాసనను పరిష్కరించవచ్చు.

#6 కొబ్బరి నూనె + హిమాలయన్ సీ-సాల్ట్ ఉపయోగించి రబ్ చేయండి :

#6 కొబ్బరి నూనె + హిమాలయన్ సీ-సాల్ట్ ఉపయోగించి రబ్ చేయండి :

ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను తీసుకుని, అందులో చిటికెడు పింక్ హిమాలయన్ సీ-సాల్ట్ జోడించండి. నూనెలో ఉప్పు కరిగిన తర్వాత, మీ చిగుళ్ళ మీద మసాజ్ చేయండి. కొన్ని నిమిషాలు అలాగే వదిలి, తాజా నీటితో శుభ్రం చేయండి. ఇది మీ చిగుళ్ళలోని ఎటువంటి వాపునైనా తగ్గిస్తుంది మరియు హానికరమైన బ్యాక్టీరియాను చంపేస్తుంది!

Most Read: నా కూతురు అలా చేస్తుందని ఊహించలేదు, చిత్ర హింసలు పెట్టింది, ఆస్తులన్నీ అమ్మించింది

# 7 అలోవేరా(కలబంద) జెల్ ఉపయోగించండి :

# 7 అలోవేరా(కలబంద) జెల్ ఉపయోగించండి :

భారతదేశంలో జరిపిన ఒక అధ్యయనంలో మీ చిగుళ్ళమీద అలోవేరా జెల్ అప్లై చేయడం ద్వారా, వాటి ఆరోగ్యం (పీరియోడోంటల్ హెల్త్) పెరుగుతున్నట్లుగా గుర్తించడం జరిగింది.

కావున క్రమంతప్పకుండా, ప్రతిరోజు 100 గ్రాముల కలబందగుజ్జుని వినియోగించడం ద్వారా, ఈ ప్రక్రియను వేగవంతం చేయవచ్చునని చెప్పబడింది.

# 8 ఆమ్లా వినియోగం :

# 8 ఆమ్లా వినియోగం :

ఆమ్లా (ఉసిరి లేదా గూస్బెర్రీ), దక్షిణ ఆసియా ఉపఖండంలో లభించే పుల్లని పండ్ల జాతులలో ఉత్తమమైంది. ఇది ఎక్కువగా విటమిన్-సి తో నిండి ఉన్నకారణంగా, మీ శరీరంలోని బంధన కణజాలాల పెరుగుదలను ప్రేరేపించడంలో ఎంతో సహాయాన్ని అందివ్వగలదు.

# 9 సెప్టిలిన్ మాత్రలను తీసుకోండి :

# 9 సెప్టిలిన్ మాత్రలను తీసుకోండి :

సెప్టిలిన్ అనేది ఆమ్లా, లికోరైస్, గుగ్గుళ్ళు, గుడుచీ మరియు ఇతర సమ్మేళనాలతో కూడిన ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్. ఇది మీ రోగనిరోధకతను పెంచడంతో పాటు, చిగుళ్ళ ఆరోగ్యానికి కూడా ఉత్తమంగా సహాయపడగలదు.

Most Read: చిగుళ్ళ సమస్యను తొలగించగలిగే సహజ సిద్దమైన పరిష్కారాలు ఇవే !

# 10 లవంగాలను నమలండి :

# 10 లవంగాలను నమలండి :

లవంగాలలో యూజినాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఒక శక్తివంతమైన పెయిన్ కిల్లర్ వలె పనిచేస్తుంది. కావున, లవంగాలను నమలడం చిగుళ్ళ నొప్పి మూల కారణాన్ని తొలగించలేకపోయినా, నొప్పి నుండి ఉపశమనాన్ని అందివ్వడంలో సహాయం చేస్తుంది.

మీ నోటిలో విడుదల చేయబడే లవంగాల నూనె, హానికరమైన బ్యాక్టీరియాను వదిలించడంలో మరియు మీ చిగుళ్ళ మంటను తగ్గించడంలో ఉత్తమంగా దోహదపడుతుంది. కావున, లవంగాలను తరచుగా నమలడం, లేదా చప్పరించడం మంచిదిగా సూచించబడుతుంది.

English summary

Check These Out! 13 Natural Remedies for Receding Gums

Receding gums are a sign of gum disease, a.k.a periodontitis, that is usually observed as an unnatural elongation of teeth (because of root exposure). And while moderate to severe forms of this disease need a dentist's intervention, a mild recession can easily be treated at home with natural remedies like chewing cloves, increasing vitamin C in your diet, and the Ayurvedic technique of oil pulling.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more