For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అన్ని సమయాలలో నిపుల్స్ ఎందుకు దురదపెడుతుంటాయో 10 కారణాలు ఇవిగో

గత కొద్దికాలంగా మీ నిపుల్స్ మీకు సమస్యగా మారుతుంటే, మీరొక్కరే ఒంటరి అనుకోకండి. ఇవి చాలాకాలం నుండి అందరికీ ఎప్పుడో అప్పుడు మన దృష్టిని వాటిపై మళ్ళించేందుకు ఇలా చేస్తూనే ఉన్నాయి.

|

గత కొద్దికాలంగా మీ నిపుల్స్ మీకు సమస్యగా మారుతుంటే, మీరొక్కరే ఒంటరి అనుకోకండి. ఇవి చాలాకాలం నుండి అందరికీ ఎప్పుడో అప్పుడు మన దృష్టిని వాటిపై మళ్ళించేందుకు ఇలా చేస్తూనే ఉన్నాయి.

అయితే, అన్ని సమయాలలో నిపుల్స్ ఎందుకు దురదపెడుతుంటాయో 10 కారణాలు చదవండి.

#1 వాతావరణం పొడిగా ఉంది

#1 వాతావరణం పొడిగా ఉంది

వాతావరణం పొడిగా ఉండి, మీ పెదవులు, చర్మం పగుళ్ళు ఇస్తుంటే, మీ నిపుల్స్ దురద పెట్టటంలో కూడా ఆశ్చర్యం ఏమీ లేదు. వాటికి కూడా కొంచెం తేమ కావాలని ఘోషిస్తున్నాయి, వినండి!

తేమను తిరిగితెచ్చి, దురదలను దూరంగా ఉంచాలంటే కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి;

మీ నిపుల్స్ ను శరీరానికి వాడే నూనె లేదా మాయిశ్చరైజర్ తో రుద్దండి.

10 నిమిషాల కన్నా ఎక్కువ స్నానం చేయవద్దు.

ఇంట్లో తేమకారిని వినియోగించి గాలిలో మాయిశ్చర్ ను పెంచండి.

#2 మీకు ఎక్జెమా ఉండవచ్చు

#2 మీకు ఎక్జెమా ఉండవచ్చు

మీకు ఇదివరకే చర్మవ్యాధైన ఎక్జిమా ఉన్న చరిత్ర ఉంటే, నిపుల్స్ పై చర్మం ఎండిపోయి పొరలుగా, ముక్కలుగా ఊడివస్తుంటే, దురద మరియు ఏమైనా స్రావాలు బయటకి వస్తుంటే, ఆ సమస్యకి సంబంధించిన స్టెరాయిడ్స్ ను వాడి మీకు త్వరలో రాబోయే ఆటోఇమ్యూన్ సమస్యనుండి నివారణ పొందవచ్చు. కానీ పగుళ్ళు మరియు స్రావాలు మరీ భయపెడుతుంటే, ఏ మందులు వేసుకోటానికి ముందైనా డాక్టర్ ను తప్పక సంప్రదించండి. ఎందుకంటే స్రవిస్తున్న, నొప్పిపెడుతున్న నిపుల్స్ ఎక్జిమా కంటే హానికరమైన ఆరోగ్య సమస్యకి లక్షణం కావచ్చు.

#3 మీరు కొత్త సబ్బు లేదా బాడీ వాష్ ను వాడుతున్నారు

#3 మీరు కొత్త సబ్బు లేదా బాడీ వాష్ ను వాడుతున్నారు

రసాయనాలు మరియు ఇతర మూలకాల వలన కాంటాక్ట్ డెర్మటైటిస్ అనగా చర్మంపై అలర్జీలు కలుగుతాయి. అందుకని మీరు కొత్త సబ్బు లేదా బాడీవాష్ మార్చినప్పటి నుండి నిపుల్స్ పై దురద వస్తే, ర్యాషెస్ వస్తే దానికి మూలం ఈ కొత్త ఉత్పత్తే కావచ్చు.

ఈ ఉత్పత్తిని వాడటం మానేస్తే ర్యాషెస్ తగ్గుతాయేమో చూడండి.

#4 మీ బ్రా మొదటిసారి వేసుకునేముందు దాన్ని ఉతకలేదు

#4 మీ బ్రా మొదటిసారి వేసుకునేముందు దాన్ని ఉతకలేదు

మీ సరికొత్త బ్రాండెడ్ బ్రా శుభ్రంగానే కన్పించవచ్చు, కానీ అది నిజం కాదు. నిజానికి లోదుస్తులు, ఇతర బట్టలలాగానే పెద్దసంఖ్యలో ఉత్పత్తి అవుతాయి, ప్యాక్ అయి, స్టోర్లకి పంపబడే ముందు ఫ్యాక్టరీలలో ఇతర మురికిగా ఉన్న పరికరాలకి,నేలకి అవి తగిలితీరుతాయి.

అందుకని, మీరు ఎప్పుడూ కొత్త బ్రా లేదా లోదుస్తులు ఉతకకుండా మొదటిసారైనా కూడా వేసుకోకూడదు. ఎందుకంటే అది ఇన్ఫెక్షన్ కలిగించవచ్చు లేదా చెత్త పరిస్థితిలో పరాన్నజీవుల బారిన పడి, మీ నిపుల్స్ కి తీవ్రంగా దురద కలిగిస్తాయి.

#5 మీ బ్రా లోపలివైపు చాలా కఠినంగా ఉంటుంది

#5 మీ బ్రా లోపలివైపు చాలా కఠినంగా ఉంటుంది

నిపుల్ పై పొర ఎండిపోయి,ఊడిపోవడం వంటి సమస్యకి పరిష్కారం అక్కడి సున్నితమైన చర్మంపై పెట్రోలియం జెల్లీ రాసి తర్వాత బ్రా వేసుకోండి. కానీ మీ బ్రా వేసుకునే స్థితిలో లేకపోతే, మంచి పరిష్కారం కొత్తది కొనుక్కోటమే.

#6 మీరు గర్భవతి కావచ్చు

#6 మీరు గర్భవతి కావచ్చు

పొద్దున్నే వికారం మరియు పాదాలు వాచటం చాలదా? దురదృష్టవశాత్తూ, మీరు గర్భవతిగా ఉన్నప్పుడు నిపుల్స్ దురదపెట్టడం మీకున్న సమస్యలలో ఆఖరిది కావాలి. అందుకని దానివల్ల ఏ ఆరోగ్య సమస్య అయినా వచ్చేముందే దానితో ఎలా జీవించాలో, అధిగమించాలో సమయంతో పాటు నేర్చుకుంటారు.

#7 మీరింకా పాలిస్తున్న తల్లి కావచ్చు

#7 మీరింకా పాలిస్తున్న తల్లి కావచ్చు

తల్లిపాలివ్వటం బయటకి చాలా సులభంగానే కన్పించవచ్చు కానీ మీ బిడ్డ నిపుల్ ను పీల్చడానికి ఇబ్బందికరంగా కష్టపడుతూ (మీరు సరిగా తనకి ఎలా నిపుల్ ను అందుకోవాలో చూపేవరకు), సడెన్ గా నిపుల్ ను పట్టుకుని మీ సున్నితమైన స్తనాన్ని లాగగానే, మీ ఎముకల నుంచి మజ్జను లాగినంత అనుభూతి కలిగి, పాలివ్వటం అంత సులభమైన విషయం కాదని అర్థమవుతుంది.

అందుకని మీ నిపుల్స్ నొప్పిగా, దురదగా అన్పిస్తే, మీరు నిపుల్ బటర్ ను కొనుక్కుని తల్లిపాలిచ్చే దశకి శరీరానికి కొంచెం సులువు చేయండి.

#8 మీకు ఫంగస్ ఇన్ఫెక్షన్ ఉండవచ్చు

#8 మీకు ఫంగస్ ఇన్ఫెక్షన్ ఉండవచ్చు

థ్రష్ అనే ఫంగస్ ఇన్ఫెక్షన్ రకం శరీరంలో తడిభాగాలలో సోకుతుంది, ముఖ్యంగా పరిశుభ్రత లేకపోతే నాలుకపై సోకుతుంది. అందుకని మీ స్తనం నొప్పిగా, దానిపై తెల్ల ర్యాషెస్ ముట్టుకోగానే పొరలుగా ఊడిపోతున్నా, నిపుల్స్ దురద పెడుతున్నా అవన్నీ ఫంగస్ ఇన్ఫెక్షన్ వలనే కావచ్చు.

మీ సొంతంగా మందులు వేసుకోవద్దు. వెళ్ళి డాక్టర్ సలహా తీసుకోవడం ఈ స్థితికి మంచిది.

#9 మీరు మెనోపాజ్ దశలో ఉండవచ్చు

#9 మీరు మెనోపాజ్ దశలో ఉండవచ్చు

మెనోపాజ్ వలన మీ చర్మం ఎండిపోయి, దురదపెడుతుంది. అందుకని మీకు వేడిగా అన్పిస్తున్నా మరియు నిపుల్స్ దురద పెడుతున్నా, మీ కొత్త స్నేహితుడు మెనోపాజ్ వలన అని అర్థం చేసుకోండి.

#10 మీ స్తనంలో కణితి ఉండవచ్చు

#10 మీ స్తనంలో కణితి ఉండవచ్చు

నిపుల్స్ దురదగా, గట్టిగా ఉండటం బ్రెస్ట్ క్యాన్సర్ కి మొదటి స్టేజి లక్షణంగా చెప్పుకోవచ్చు. కానీ మీరు వెంటనే ఆందోళన పడకుండా గైనకాలజిస్టును వెంటనే సంప్రదించండి. కేవలం శిక్షణ పొందిన నిపుణుడు మాత్రమే ఈ స్థితిని పరీక్షించగలరు. మనం కాదు.

Read more about: health wellness
English summary

10 Reasons Why Your Nipples Itch All The Time

Here are the reasons why your nipples itch a lot. It can be because the weather is extremely dry, you have eczema or an infection, are pregnant or breastfeeding a child, are allergic to the new soap or body wash, or are developing breast cancer..
Story first published:Wednesday, February 21, 2018, 18:24 [IST]
Desktop Bottom Promotion