TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
పూర్తిగా డ్యామేజ్ అయిన జుట్టుకు నివారణ మార్గాలు
జుట్టు దెబ్బతినడం అనేది అనేక కారణాల వల్ల జరగవచ్చు, వేడి శైలి వల్ల లేదా జుట్టుపట్ల శ్రద్ధ తీసుకోనపుడు. మీకు నిజంగా దెబ్బతిన్న జుట్టు ఉంటె, మేము మీకు కొన్ని చిట్కాలను ఇస్తాము.
దెబ్బతినడం అనేది ఎక్కువగా జుట్టు చివర్ల కనిపిస్తుంది, ఎందుకంటే మీరు మాడుకు పెట్టిన సహజమైన నూనె జుట్టు చివర్లకు చేరదు కాబట్టి. అందువల్లే జుట్టు చివర్లకు ఎక్కువ షాంపూ పెట్టడం మానుకోవడం మంచిది, ఎందుకంటే అవి అప్పటికే పొడిబారి ఉంటాయి కనుక.
కాబట్టి, మీ జుట్టు ఇకముందు దెబ్బతినకుండా ఉండేందుకు సహాయపడే కొన్ని చిట్కాల గురించి మేము చెప్తాము.
1.కండిషనింగ్:
మీ జుట్టుకు కండిషన్ చేసేటపుడు, జుట్టు చివర్లపై శ్రద్ధ పెట్టండి. మీ జుట్టు మొత్తానికి కండిషన్ పెడితే, మీ జుట్టు ఎక్కువ గ్రీజీగా లేదా బరువుతో కిందకు వంగుతుంది. జుట్టు దెబ్బతినకూడదు అనుకుంటే మీరు షాంపూ చేసిన ప్రతిసారీ, కండిషనింగ్ తప్పనిసరి.
2.షాంపూ:
మీజుట్టుకు షాంపూ పెట్టే ముందు, చిక్కు పోయేటట్టు మీ జుట్టును దువ్వుకోండి. షాంపూ పెట్టేటపుడు, కేవలం మీ జుట్టు పై మాత్రమే శ్రద్ధ పెట్టండి, చివర్లు కాదు.
3.ట్రిమ్స్:
చనిపోయిన, దెబ్బతిన్న జుట్టు చివరలను వదిలించుకోవడానికి క్రమబద్ధమైన ట్రిమ్స్ చేయించుకోండి. చివర్లు బాగా దెబ్బతింటే, ఇది నిజానికి మీ జుట్టు పెరగుదలను నివారి౦చవచ్చు.
4.వేడి నూనెతో మర్దనా:
మీకు దెబ్బతిన్న జుట్టు ఉంటే ఇలా చేయడం చాలా తేలికైన విషయం. మీకు ఇష్టమైన నూనె, కొబ్బరినూనె లేదా బాదాంనూనె లాంటివి వేడిచేసి, దాన్ని మీ మాడుపై మర్దనా చేయండి. ఇది మీ మాడులో రక్తప్రసరణను మెరుగుపరిచి, ఆరోగ్యకరమైన, కాంతివంతమైన జుట్టు పెరగడాన్ని పెంపొందిస్తుంది.
5.ఇంటి వద్దనే హెయిర్ స్పా:
ఇంటి వద్దనే హెయిర్ స్పా చేయండి. ఇది మీ డబ్బుని, సమయాన్ని మరింత ఆదా చేసి, ఏ సమయంలోనైనా జుట్టు తక్కువ దెబ్బతినేట్టు చేస్తుంది.